Gayathri Creations

నమస్కారం,
నా పేరు గాయత్రి దేవి. నా ఛానల్ పేరు గాయత్రి క్రియేషన్స్ . నేను ఉపాద్యాయ వృత్తిలో వుండే దాన్ని. ఇన్నేళ్ళ నా జీవితానుభవo లో నేను నేర్చు కున్న అనేక విషయాలను నలుగురితో పంచుకోవాలనే కోరికతో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. కథలు చదవడం అన్నా వ్రాయడం అన్నా నాకు చాల ఇష్టం . నేను నలబై కథల వరకు వ్రాశాను. ౩౦ కథలు కర్నూల్ రేడియోలో ప్రశారమైనా యి . ముఖ్యంగా చందమామ కథలు అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటి యువతకు చూడటం తప్ప చదివే అలవాటు తగ్గిపోయింది.అందువల్ల వినిపించే కథల రూపంలో చందమామ కథలు, మారి కొందరి కథలు, నా కథలు వినిపించే ప్రయత్నం చేస్తున్నాను.
అలాగే మన ఛానల్ లో వివిధ రకాల ఎన్నో రుచికరమైన శాఖాహరమైన వంటలను చూడవచ్చు మరియు నేర్చుకోవచ్చు.కొత్తగా వివాహం చేసుకున్న వారికి అలాగే గృహిణి లాకు బ్యాచులర్స్ కి వంట నేర్చుకోవాలను కునే వరెందరికో మన ఛానల్ ఒక చక్కటి మార్గం.
నా కథలను వింటూ వానలు చూస్తూ, నేర్చుకుంటూ నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ ........