నేడు మనిషి తినే ఆహారం విషతుల్యమై అనేక రోగాల బారిన పడుతున్నారు.మనం జీవిత కాలం సంపాదించిన సొమ్ము కొన్ని రోజులు హాస్పిటల్ లో ఉంటే ఖాళీ అవుతుంది. మనం సంపాదన దాదాపు మొత్తం మన రోగాలకే అయిపోతే ఎలా? దీనికి పరిష్కారం రసాయనాలు వాడకుండా పండించిన పంటలు. దీని ద్వారా మనదేశం యొక్క భూమి మరియు ప్రజలు ఆరోగ్యం గా ఉండగలము. మన భారత భూమి విషతుల్యం కాకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి దాని కొరకు ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం మరియు ప్రతి వ్యక్తి ప్రకృతి వ్యవసాయం లో పండించిన ధాన్యం,గో ఆధారిత ఉత్పత్తులు వాడాలి అనే ఉద్దేశం తో మేము ప్రకృతి వ్యవసాయం ప్రారంభం చేశాము.
మహామృత్యుంజయ మంత్రం లో "సుగంధిం పుష్టి వర్ధనం " అనే సిద్ధాంతాన్ని అనుసరించి చేస్తున్నాము. అగ్ని హోత్రం చేస్తూ వచ్చిన భస్మము ను కూడా భూమి ని సుపోషణ (positive) చేయుటకు వాడుతాము. ప్రతి రోజూ భూమాత కు నమస్కారం చేసి నిద్రలేచే మనం ఆ తల్లి కి విషం ఇవ్వడం ఎంత వరకు సమంజసం. అనే విషయం అందరం ఆలోచించాలి.
మేము చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆ భగవంతుని సహకారం కోరుతూ
మీ Vedageetam Natural farming