CREATIVE HACKS

"కొంతమంది చర్చిలో డిజైన్ చేసుకోవాలి అని stencils కావాలి అంటున్నారు ✝️🙏
ఇవి లేజర్ కటింగ్ షాప్‌లో సైజులు చెప్తే వెంటనే కట్ చేసి ఇస్తారు ✂️📐
ఎవరైనా ఉపయోగించుకోవడానికి కమ్యూనిటీలో ఇమేజ్‌లు అప్లోడ్ చేస్తున్నాను 📸⬆️
మీకు కావాల్సినట్లు చూసుకుని వాడుకోండి 🎨🕊️"

1 week ago | [YT] | 279

CREATIVE HACKS

నా "కళని " ఇప్పటివరకు నేర్చుకొని చేసి గౌరవం విలువ డబ్బు సంపాదించిన పెయింటర్లు నేను చేపట్టిన ''భరోసా కార్డులు ప్రాజెక్టు "గురించి మీ అభిప్రాయాన్ని చెప్పండి మనస్ఫూర్తిగా అడుగుతున్నాను... 🙏

1 week ago | [YT] | 42

CREATIVE HACKS

👉సిరిపురం-కావలి ప్రాంతంలోని మా పెయింటర్ స్నేహితులందరికీ నా ఆహ్వానం. భరోసా కార్డులు అందజేయడానికి నేను స్వయంగా వస్తున్నా. మీ పరిసరాల్లో ఉన్న painters అందరికీ చెప్పండి, వారందరూ రావచ్చు!అక్కడ మాట్లాడుకుందాం !🥰

1 week ago | [YT] | 120

CREATIVE HACKS

"అందరికీ నమస్కారం… నేను మీ Creative Hacks రహీమ్.
ఈ రోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

మన పెయింటర్స్ బ్రదర్స్ కోసం హెల్త్ & సేఫ్టీ భరోసా కార్డ్స్ ఇస్తున్నాం.
ఈ కార్డు వల్ల… ఏదైనా ప్రమాదవశాత్తూ జరిగితే…
Painter కి 15 లక్షల రూపాయల భీమా అందుతుంది.

ఇది నేను చేస్తున్న రెండవ ప్రాంతం.
మొదటి ప్రాంతం సంగారెడ్డి, ఇప్పుడు 7వ తేదీన కవాలి దగ్గర సిరిపురనీకి వస్తున్నాను.
అక్కడ సుమారు 100 మంది పెయింటర్స్ కి ఈ కార్డ్స్ అందజేస్తున్నాను.
నన్ను కలవాలనుకునే వాళ్లు… రావచ్చు.

ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతుంది…
తరువాత రాబోయేది మీ గ్రామం!

ప్రతి గ్రామంలో ఉన్న పెయింటర్స్…
50 మంది లేదా 100 మంది కలిసి ఒక చిన్న కమ్యూనిటీ టీం గా ఉండాలి.
మీ టీం లీడర్స్ స్క్రీన్ మీద ఉన్న నంబర్‌కి కాల్ చేసి వివరాలు ఇవ్వండి.

నేను ఈ పని ఫేమ్ కోసం గానీ… ఫాలోవర్స్ కోసం గానీ చేయడం లేదు.
నాకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు.
కానీ నా ఆశ, ఒకటే ! పెయింటర్ జీవితం మారాలి అన్నదే.

రోజూ కూలి చేసుకునే వాళ్ల జీవితం ఎంత కష్టమో…
ప్రమాదాల్లో కుటుంబాలు ఎలా రోడ్డున పడతాయో …
20 ఏళ్లుగా దగ్గరగా చూసాను.

కొంతమంది పెయింటర్స్ వ్యసనాలకు బానిస అవ్వడానికి కూడా కారణం అదే –
పని లేకపోవడం… డబ్బు లేకపోవడం… సమాజం నమ్మకపోవడం.
అన్ని ఒత్తిడులు కుటుంబం మీద పడటం.

ఈ వ్యవస్థ మారాలి.
మీ మీద మీకు నమ్మకం రావాలి.
మీరు ఇంకో 100 మందికి ఆదర్శం అవ్వాలి.

ఎందుకంటే…
ఏదైనా రోజు మీకు ఏమయినా జరిగితే… ఎవరూ రావకపోవచ్చు.
కానీ ఈ కార్డ్… ఈ పెయింటర్స్ కమ్యూనిటీ మాత్రం మీకు తోడుగా ఉంటుంది.

ప్రతి సమస్యకు 50 మంది ఒక చేయి వేస్తే…
మీ సమస్య ఛిన్నదే.

మన జీవితాలను మనమే మార్చుకోవాలి.
మీ ప్రయాణంలో నేను మీతో ఉంటాను.

7వ తేదీన సిరిపురనిలో కలుద్దాం!
మీ Creative Hacks రహీమ్."

2 weeks ago | [YT] | 70

CREATIVE HACKS

“పాస్టర్ శ్యామ్ గారి చర్చ్‌కు మేము చేసిన పెయింటింగ్ ఆయనకు చాలా నచ్చింది.
దానికి గుర్తుగా నిన్న మా ఫ్యామిలీకి చిన్న ట్రీట్ ఇచ్చారు.
అందరం కలిసి మంచి సమయం గడిపాం.
మీ ప్రేమకు, ప్రోత్సాహానికి హృదయపూర్వక ధన్యవాదాలు శ్యామ్ గారూ ❤️🙏

2 weeks ago | [YT] | 166

CREATIVE HACKS

ఈ క్రిస్మస్ గిఫ్ట్ గురించి మీ guess ఏంటి? కామెంట్‌లో చెప్పండి👇😍

3 weeks ago | [YT] | 306

CREATIVE HACKS

👇You all made this video 40% up! 🙏
What happened?: https://youtu.be/5ecZAQ93Na4

1 month ago | [YT] | 26

CREATIVE HACKS

🔥 Candle Trick for Ceiling Texture – Must Watch!”
Full video link: www.facebook.com/share/v/1J7YpMX7o1/

5 months ago | [YT] | 64

CREATIVE HACKS

Mermaid Wall Mural Transformation – Ocean Magic on Your Wall!
Full Video Link: www.facebook.com/share/v/16KbUduP5Q/

5 months ago | [YT] | 75

CREATIVE HACKS

Another Happy Customer! Beautiful Wall Design Completed ✅

6 months ago | [YT] | 161