తెలంగాణ భాష యాస సాన గొప్పది

జాన పదాలలో తెలుగు రాష్ట్రాలది ప్రత్యేక స్థానం... అందులో తెలంగాణ పల్లె పదాలు ఒక మహా సముద్రం . తవ్విన కొద్ది సెలిమలో నీరు ఊరినట్టు రాసిన కొలది మదిలో పదాలు పుడుతూనే ఉంటాయి.
పల్లె ముచ్చట్లు పదాలుగా రాగాలుగా గానాలుగా ఎనుకటి నుండి ఇయ్యాల్టి వరకు జనాలలో కొత్త కొత్తగా వస్తూనే ఉన్నాయి
తెలంగాణలో ఎంతో మంది వారి వారి స్థాయిలలో ఈ ప్రాంత యాషను, భాషను పాటల రూపంలో సమాజానికి అందిస్తూనే ఉన్నారు .
అందులో భాగంగా నా వంతుగా నేను రాస్తున్న ఈ పాటలు మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న చిన్న ప్రయత్నమే. ఈ YS tv.
ఇంత కాలం నుండి YS tv పాటలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, subscribers కి హృదయ పూర్వక అభినందనలు🌹
ఇకముందు కూడా ఇలాగే ఆదరించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ YS tv.

మీ
యేబూషి సతీష్