నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లలు మంచి ఆహారం, నిజమైన సరదాలు, సంప్రదాయాలు మరియు అలవాట్లకు కాస్త దూరం జరిగారనేది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం.. ఈ సందర్భంలో మా వంతుగా పిల్లలను వీలైనంతవరకు జంక్ ఫుడ్ కు దూరం చేస్తూ కాస్త సాంప్రదాయ మరియు ప్రాచుర్యం పొందిన చిరుతిళ్ళను పరిచయం చేయాలనుకుంటున్నాం. అందమైన పల్లెటూర్ల ద్వారా మన సాంప్రదాయాలను కల్మషం లేని సంబంధ బాంధవ్యాలను పరిచయం చేయబోతున్నాం. సరదా అంటే మొబైల్ ఫోన్ మాత్రమే అనే స్థితి నుండి పిల్లలను కాస్త దూరం చేయాలనేదే మా అభిలాష. ప్రస్తుత పిల్లలకు మనం తినే తిండి ఎక్కడి నుంచి వస్తుందో తెలియని స్థితి. వారికి వ్యవసాయం మీద ఎంతో కొంత మక్కువ ఏర్పరచడం మా ఉద్దేశం..!
ఈ విషయాలన్నీ పిల్లల ద్వారా మంచి వీడియోల రూపంలో అందించాలనేదే మా ఉద్దేశం.. ఆదరించండి-ఆచరించి చూడండి..!
In today's fast-paced life, children have become a bit distant from traditional food, real fun, and traditions. Our mission is to introduce them to beautiful villages, agriculture, fun, and good food as much as possible..!
Shared 2 weeks ago
5.6K views