ప్రజాస్వామ్యం లో ప్రజలే ప్రభువులు. మరి ప్రభువులైన ప్రజలు ఈ ప్రజాస్వామ్యాన్ని శాసిస్తున్నారా? ఐదేళ్లకు ఒకసారి ఓటు వేసి తరువాత ఐదేళ్ళూ అర్భకులుగా మిగిలి పోతున్నారు. ఓట్లకొరకు ఒకసారి ప్రజల దగ్గరికి రాజకీయ నాయకులు తిరుగుతారు. మిగిలిన ఐదేళ్ళూ ప్రజలు నాయకుల వద్దకు తిరుగుతారు. నిజానికి ప్రజాప్రతినిధులు ప్రజాసేవకులు. కానీ నిజంగా సేవ చేసే నాయకులు ఒక్క శాతం మాత్రమే వుంటారేమో . "యథారాజా తథాప్రజ" అన్నది ఆర్యోక్తి పాలకుడు ఎలా వుంటాడో ప్రజలు అలా వుంటారు అని దీని అర్థం. యుద్ధాల కాలం గతించి పోయింది. ఇప్పుడు అధికారం కొరకు జరుగుతున్నది "మేధోయుద్ధం". మనిషి మస్తిష్కం నుండి ఉద్భవించే ఈ రాజనీతి, కుట్రలు, కుయుక్తుల సమాహారం. తనను తాను హెచ్చించుకోవడానికి, ప్రత్యర్థిని తగ్గించడానికి రాజకీయం పన్నే వ్యూహాలే ఆధునిక యుద్ధం. సమాచార ప్రసార సాధనాలే నేడు ఆధునిక యుద్ధభూములుగా మారిపోయాయి. తొలినాళ్ళలో ప్రజా సమస్యల పై గళమెత్తిన మాధ్యమాలు కాలక్రమేణా రాజకీయ గొంతుకలుగా మారి పోయాయి. మరి సామాన్యుల పక్షాన నిలిచేదేవరు? వారి గళాన్ని వినిపించేదేవరు? ఆ ప్రజాగళాన్ని వినిపించడానికి చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నమే ఈ "సివిక్ వాయిస్" .