DevOps and Cloud with Siva

బాగా తెలిసిన స్నేహితుడు ఒకడు ఉండేవాడు..
IT లో ఉద్యోగం, అతని జీతం ఎంత అంటే,
ప్రభుత్వం వసూలు చేసే పన్ను 10 లక్షలు పైనే..
కాబట్టి అతని జీతం 35 లక్షలు వరకు
ఒక్క చెడు అలవాటు లేదు, కాఫీ టీ కూల్డ్రింక్స్ కూడా తాగడు..
జంక్ ఫుడ్ తినడు..
ఇంటి పట్టునే ఉంటూ ఇద్దరు బుడ్డి బుడ్డి పిల్లలు, భార్య తో సంతోషంగా ఉండేది అతని జీవితం..
నేను singapore కి refer చేస్తాను అన్నా కూడా వద్దు అన్నాడు..
రోజూ పాలు తాగడం అలవాటు చిన్నప్పటి నుండి, ఆ అలవాటు అలాగే కొనసాగింది..
ఒక్క రోజు సడన్ గ కాన్సర్ అని చెప్పారు..
స్టేజి 2 దాటి అప్పటికే స్టేజి 3 కి ఎంటర్ అయ్యింది..
సంవత్సరం పోరాడాడు, లాభం లేకపోయింది
చివరి వారంలో డాక్టర్ కాళ్ళు పట్టుకుని అడిగాడు ఉన్న డబ్బు అంత తీస్కుని ఒక్క 2 సంవత్సరాలు బతికించండి
భార్య బిడ్డలతో ఇంకొన్ని రోజులు బతకాలని ఉంది అని
మన దేశంలో మద్యపానం కంటే పాలు తాగడం ప్రమాదకరమా??

మన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా కూడా
తప్పు వ్యవస్థ దా లేకుంటే ప్రజలదా అని చర్చలు పెట్టుకునే వలయంలో చిక్కుకుని ఉన్నామా?
తప్పు ఎవరిది ఐతే ఏంటి ప్రజలు ప్రాణాలు పోతున్నాయి
బాధలు పడుతూ, సర్దుకు పోతూ బతికేస్తున్నామా ???

1 week ago | [YT] | 155