Little Science Experiments

పేద కుటుంబంలో పుట్టి, వెనక బెంచీలో విద్యాభ్యాసం కొనసాగిస్తూ కష్టపడి మెట్రిక్ లేషన్, ఇంటర్మీడియట్, బిఎస్సి, ఇంజనీరింగ్ పూర్తి చేసి అయితే సాధారణ వ్యక్తిగా ఇస్రో లో ఉద్యోగం ప్రారంభించి డిఆర్ డి వో లో అనేక స్థాయిలలో ఉద్యోగం చేస్తూ, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, పీపుల్స్ ప్రెసిడెంట్ గా, పద్మభూషణ్, పద్మ విభూషణ్, భారతరత్నగా కులం మతాలకు అతీతంగా, బ్రహ్మచారిగా, భారతదేశ అభివృద్ధికి ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీ మరియు రక్షణకు సంబంధించి అనేక ప్రయోగాలు చేసి విజయవంతం చేసిన భారత దేశ 11వ రాష్ట్రపతిగా పని చేసిన భారతదేశ ముద్దుబిడ్డ ఏపీజే కలాం. అనేక యూనివర్సిటీలలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పని చేస్తూ చివరి రోజు షిల్లాంగ్లో యువతను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో క్లాసులోనే కుప్పకూలి చనిపోయిన ప్రొఫెసర్ డాక్టర్ ఏపీజే కలాం.
ఈరోజు ఏపీజే కలాం జయంతి.
ఈయన జననము 1931 అక్టోబర్ 15వ తేదీ.
చనిపోయిన తేదీ 2015 జూలై 27.
సైన్స్ విద్యార్థులు మరియు శాస్త్రవేత్తలు అందరూ ఏపీజే కలాం ఆదర్శంగా తీసుకొని శాస్త్ర పరిశోధనలు నిమగ్నమవుతారు అని భావిస్తూ. మీ ....... విజ్ఞాన శాస్త్ర ప్రచారకుడు,
రాయపాటి శివ నాగేశ్వర రావు,
లిటిల్ సైన్స్ ఎక్సపెరిమెంట్స్ యూ ట్యూబ్ చానెల్, ఆంధ్రా ప్యారిస్ తెనాలి, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశం.

11 months ago | [YT] | 947