@APCBNTODAY

ఫ్యాక్షన్ నేపద్యం ఉన్నాళ్ళను సమర్ధిస్తే అందులో ముందు వరుసలో ఉండే నాయకుడు పరిటాల రవీంద్ర...

పార్టీ ఓడిపోతుందని, పార్టీ ఓడిపోతే చంపేస్తారని, వచ్చేది తనను వెంటాడే ప్రభుత్వం అని తెలుసు...

తాడిపత్రి నుంచి జేసీ కుటుంబం నుంచి ముప్పు ఉంది... అయినా ఎక్కడా వెనకడుగు వేయలేదు...

బయటకు రావొద్దు అని సన్నిహితులు చెప్పినా, గన్‌మెన్లను తొలగించినా, ఇంటికి భద్రత తగ్గించినా...

తుపాకులు ఉన్నాయని సోదాలు చేసి వెంటాడినా వెంకటాపురం కూడా దాటి బయటకు రాలేదు...

కారు బాంబు చూసాడు, అనుచరుల హత్యలు చూసాడు, అయినా వైఎస్‌ కుటుంబానికి ఎక్కడా తలవంచలేదు...

పార్టీ మారితే బ్రతికేవాడు అని అంటారు... పార్టీ మారలేదు... రవి ప్రకాష్‌తో ఇంటర్వ్యూలో చెప్పాడు కచ్చితంగా చంపుతారని...

తగరకుంట ప్రభాకర్, ఆర్కే ఇలా కొందరిని చంపేస్తున్న తర్వాత... తన అనుచరులను ఎక్కడెక్కడికో పంపి కాపాడుకున్నాడు...

తనకు అమెరికా నుంచి మిత్రులు అభిమానులు ఫోన్లు చేసి రమ్మని చెప్పినా సరే పారిపోలేదు, ఎమ్మెల్యేగా గెలిచాడు, మరో ఆరుగుర్ని గెలిపించాడు...

పార్టీ ఏదైనా సరే అనుచరులు మనల్ను చూసే మంచైనా చెడైనా చేస్తారు... అలాంటి వాళ్ళకు అండగా నిలబడ్డప్పుడే నాయకుడు...

ఈ రోజు నువ్వు అలా పిరికివాడిలా భయపడి పారిపోతే నిన్ను నమ్ముకున్న అనుచరులు, కార్యకర్తల పరిస్థితి ఏంటి...?

పరిటాల గురించి పూర్తిగా తెలియకుండా అభిమానిస్తాం అంటే ఆయన చూపిన తెగువ, ధైర్యం కారణం...

నేను 9 తరగతిలో ఉన్నప్పుడు జనవరిలో ఆయన్ను చంపారు... స్కూల్స్ కాలేజీలు అన్నీ మూసేసారు...

రవి పేరు వింటే వణికిపోయినాళ్ళున్నారంటే ఆయన ధైర్యమే... పులి అని ఫేస్‌బుక్‌లో రాయడం కాదు...

ఓడినా గెలిచినా పరిటాల రవీంద్రలా నిలబడ్డ వాడే ఫ్యాక్షన్ ప్రాంతంలో రాజకీయం చెయ్యాలి.🔥🐯🔥🔥🔥🐯‪@Paritalaravianna‬
‪@paritalasriram1‬ ‪@paritalaSriramAnna7777‬

3 months ago | [YT] | 6