EBC DIGITAL

పహల్గామ్ ఉగ్రదాడి ఘటన మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఏలూరులో జనసేన 3వ రోజు శాంతి నివాళి..

* *పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి..*
* *ఉగ్రవాదులతో భారతదేశ సమైక్యతను దెబ్బతీయలేరు..*
* *అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అమానుషం..*

* *జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం ఏలూరు పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల చేతిలో మృత్యువాత పడ్డ మృతులకు ఘన నివాళులర్పించి సంతాపం తెలియజేస్తూ మానవహారంగా ఏర్పడి నిరశన కార్యక్రమాన్ని చేపట్టిన జనసేన నేతలు...*

పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ, ఈ దుశ్చర్యలో మృతి చెందిన వారికి సంతాప సూచకంగా ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు కీర్తిశేషులు మాధవరావు గారికి జనసేన శ్రేణులు ఘన నివాళులు అర్పించి, పాత బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడి శుక్రవారం ఆర్టీసీ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారి ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరశన కార్యక్రమాన్ని చేపట్టారు.. ఈ దాడుల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.. యావత్తు ప్రపంచం ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు.. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ అమాయకులైన పర్యాటకుల ప్రాణాలు తీయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.. త్వరలోనే ఉగ్రవాదులను భారత ప్రభుత్వం ఏరి వేస్తుందన్నారు.. శాంతియుత భావంతో అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్న భారతదేశం ఇతర దేశాలకు ఆదర్శనీయమన్నారు.. అలాంటి మన దేశంలో ఉగ్రవాదుల చర్యలు దారుణమన్నారు.. ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.. పర్యాటకులపై దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు...ఉగ్రవాదుల దుశ్చర్యను పిరికిపందలు చేసిన అత్యంత హేయమైన చర్యగా భావిస్తున్నామని, భారతదేశంలో సమైక్యతను దెబ్బతీయాలన్న ఉగ్రవాదుల క్రూరమైన ఆలోచనతో జమ్మూ కాశ్మీర్‌లోని బైసారన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడంపై ఆయన తీవ్రంగా స్పందించారు.. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని ఎన్డీఏ ప్రభుత్వం ఉపేక్షించదని ఉగ్రవాదులు కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు.. ఈ ఘటనలో అమాయక ప్రజలు చనిపోవడం చాలా బాధ కల్గించిందన్నారు.. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.. కశ్మీర్‌లో ఇటీవల రికార్డు స్థాయిలో పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, శాంతిభద్రతలకు విఘాతం కలిగించి ఆ ప్రాంతాన్ని అస్థిరపరిచే కుట్రలు పన్నుతున్నారని అన్నారు.. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా సంఘవిద్రోహ శక్తులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఇలాంటి వాటిని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా లు ఉపేక్షించరన్నారు.. పహల్గామ్‌ ఘటనలో చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులు త్వరలో కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు..

ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, జిల్లా కార్యదర్శి కస్తూరి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ గుప్తా, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, 44 వ డివిజన్ కార్పోరేటర్ పొలిమేర దాసు, ప్రధాన కార్యదర్శులు సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, పల్లి విజయ్, మైనారిటీ నాయకులు ఫరీద్ ఖాసీం, నాయకులు ఎట్రించి ధర్మేంద్ర, కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు, అల్లు సాయి చరణ్, రెడ్డి గౌరీ శంకర్, వీరంకి పండు, బోండా రాము నాయుడు,జనసేన రవి,దోసపర్తి రాజు, నూకల సాయి ప్రసాద్, బుధ్ధా నాగేశ్వరరావు, కర్ర తవిటి రాజు, చిత్తిరి శివ, కోలా శివ, బొద్దాపు గోవింద్, వాసు, సాయి రాం సింగ్, కొనికి మహేష్, వాసా సాయి, వీర మహిళలు వెలగా గాయత్రి, కొసనం ప్రమీల, తుమ్మపాల ఉమాదుర్గ, యడ్లపల్లి మమతా,గుదే నాగమణి, దుర్గా బీబీ మరియు భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు పెద్ద ఎత్తున దీక్షలో పాల్గొన్నారు...

4 days ago | [YT] | 0