Bhakthi TV

7th October 2025
ఆశ్వియుజ పూర్ణిమ :
ఆశ్వీయుజ పూర్ణిమకే 'శరత్ పూర్ణిమ' అని పేరు. అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు. సాధారణంగా అందరూ దేవీ నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవీ ఉపాసకులు అమ్మవారి ఆరాధన ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు. ఏడాదిలో ఈ పూర్ణిమనాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువల్ల ఈరోజు చంద్రుడిని పూజిస్తే ఎంతో పుణ్యం. ఈ శరత్ పూర్ణిమ రోజున చంద్రకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. ఈ కిరణాలు శారీరక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. అందువల్ల చంద్రకాంతిలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణం చేయడం, ఆవుపాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి, ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. చంద్రకాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెబుతోంది. చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం చంద్రకిరణాలలో ఉన్న ఓషధీతత్త్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. మర్నాడు ఉదయం పరమాన్నాన్ని కుటుంబసభ్యులందరూ నైవేద్యంగా స్వీకరించాలి. శ్రీకృష్ణుడు పరిపూర్ణావతారం. ఆయనలో 16 కళలున్నాయి. అందుకే ఈ శరత్ పూర్ణిమను బృందావనంలో 'రాసపూర్ణిమ' అంటారు. శ్రీకృష్ణుడు ఈరోజే మహారాసలీల సలిపాడని అంటారు. కృష్ణుడి వేణుగానం విన్న గోపికలు, అన్నీ వదిలేసి ఆయన కోసం అడవిలో పరుగెత్తగా, కొన్ని వేలమంది కృష్ణులు వేలమంది గోపికలతో ఈ పున్నమి రాత్రి మొత్తం నాట్యం చేశారట. ఈ పూర్ణిమక కోశాగరి పూర్ణిమ అనే పేరు కూడా ఉంది. కోజాగరి పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు.

1 week ago | [YT] | 769



@mallikarjun7243

💐

4 days ago | 0

@saradagundepudi624

🙏

1 week ago | 1

@Lordshiva560

Valmiki jayanthi

1 week ago | 0

@Saikumarsnr2000

Already yesterday itself completed Gauri purnima@Aswayuja Purnima on October 6th, 2025. But you are uploading status on October 7th, 2025.

1 week ago | 1

@hkgoud5054

OM Sri Ganesh Deva Namah Ahkg Anl Ama Aas Am Avg Am

6 days ago | 0