"దక్షిణామూర్తి" విగ్రహాన్ని పరిశీలిస్తే "కుడిచెవి"కి "మకరకుండలం"... ఎడమ చెవికి "తాటంకం' అలంకారాలుగా కనిపిస్తాయి.
"మకరకుండలం" పురుషుల శ్రవణాలంకారం. "తాటంకం" స్త్రీల అలంకృతి... దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది "శివశక్తుల" సమైక్య రూపమేనని తెలియజేస్తాయి... ఈ రెండు అలంకారాలు.
సనకసనందనాదులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే... ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి.
అందుకే దక్షిణామూర్తి అయ్యరూపమే కాక, అమ్మమూర్తి కూడా.. ఈ విషయాన్నే "లలితాసహస్రం"లో దక్షిణామూర్తి రూపిణీ సనకాదిసమారాధ్యా శివజ్ఞాన ప్రదాయినీ" అని వివరిస్తోంది.
స్వామి ఉత్తరాభిముఖులై ఉంటారు. ఉత్తరం జ్ఞానదశ.... ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్నవారికి....
వెనుక భాగాన ( పృష్ట భాగాన ) దక్షిణ దిశ. అంటే యమ (మృత్యు) దిశ. దీని భావం ఎవరు దేవుని వైపు చూస్తారో... వారు యముని ( మృత్యువుని ) చూడరు.
యముని చూపు మనపై పడకుండా స్వామి చూపు 'నిఘా', వేస్తుంది.
ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి'
యముని సైతం శాసించిన మృత్యుంజయుడే దక్షిణామూర్తి
దక్షిణ' అంటే 'దాక్షిణ్య భావం'.
ఏ దయవలన దుఃఖం పూర్తిగా నిర్మూలనం అవుతుందో ఆ 'దయ'ను 'దాక్షిణ్యం' అంటారు.
ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి (దాక్షిణ్యం)... భగవంతునికి మాత్రమే ఉంది. ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే... "దక్షిణామూర్తి"
అన్ని దుఃఖాలకీ కారణం అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖ విమోచనం. ఆ అజ్ఞానాన్ని (అవిద్యను) తొలగించే...జ్ఞాన స్వరూపుని దాక్షిణ్య విగ్రహమే "దక్షిణామూర్తి"
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ:
"దక్షిణామూర్తి" సకల జగద్గురు మూర్తి కనుక స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది. ఐహికంగా బుద్ధి శక్తిని వృద్ధి చేసి విద్యలను ఆనుగ్రహించే ఈ స్వామి... పారమార్థికంగా తత్త్వ జ్ఞానాన్ని ప్రసాదించే దైవం. SUBSCRIBE & CLICK THE 🔔 ICON FOR DAILY & REGULAR UPDATES. @SNDEVOTIONAL18
‘పెరుమాళ్’ అన్న పదం శ్రీ మహా విష్ణువుకు సంబంధించినది. ప్రతి ఊరిలోనూ ఒక శివాలయం, ఒక విష్ణు ఆలయం ఉండడం మనం చూస్తుంటాము. శివపార్వతుల ఇద్దరి తేజస్సుతో ఉద్భవించిన సుబ్రహ్మణ్యుణ్ణి అరుణగిరినాథర్ ‘పెరుమాళే’ అని పిలవడం చాలా అద్భుతమైన విషయం.
తమిళనాడులో సుబ్రహ్మణ్యుణ్ణి సాధారణగా శ్రీ మహా విష్ణువు సంబంధంతో ‘మురుగన్’ అని పిలుస్తారు. ఎందుకంటే, సుబ్రహ్మణ్యుడు, శ్రీ మహా విష్ణువు చెల్లెలైన పార్వతీ దేవి కుమారుడు కాబట్టి. శ్రీ మహా విష్ణువుకు మేనల్లుడు అవుతాడు కాబట్టి ‘మాల్ - మురుగన్’ అని ప్రఖ్యాతి. ‘మరుమగన్’ అంటే అల్లుడు. పూర్వజన్మలో వల్లి మరియు దేవసేన విష్ణువు కుమార్తెలు. అందుకే మహావిష్ణువు సుబ్రహ్మణ్యుడికి మామ అవుతారు. ఆయన శివునికి పుత్రుడు, విష్ణువుకి అల్లుడు. అందుకే అరుణగిరినాథర్ సుబ్రహ్మణ్యుణ్ణి ‘మరుగోనె’ అని అంటాడు.
కాని ఉత్తర భారతంలో ఈ ‘అల్లుడి’ విషయం ఎప్పటికి ఒప్పుకోరు. అక్కడ సుబ్రహ్మణ్యుణ్ణి బ్రహ్మచారిగానే కొలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో సుబ్రహ్మణ్య ఆలయాలలోకి ఆడవారిని అనుమతించరు. ఈ విషయంలో వారు చాలా కఠినంగా ఉంటారు. అంతేకాక ఉత్తరాన ‘సుబ్రహ్మణ్య’ అన్న పేరుకంటే ‘కార్తికేయు’నిగా ఎక్కువ ప్రాచుర్యం. SUBSCRIBE & CLICK THE 🔔 ICON FOR DAILY & REGULAR UPDATES. @SNDEVOTIONAL18
ఆదౌ కర్మప్రసంగాత్కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం విణ్మూత్రామేధ్యమధ్యే క్వథయతి నితరాం జాఠరో జాతవేదాః । యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేన వక్తుం క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 1॥
బాల్యే దుఃఖాతిరేకో మలలులితవపుః స్తన్యపానే పిపాసా నో శక్తశ్చేంద్రియేభ్యో భవగుణజనితాః జంతవో మాం తుదంతి । నానారోగాదిదుఃఖాద్రుదనపరవశః శంకరం న స్మరామి క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 2॥
ప్రౌఢోఽహం యౌవనస్థో విషయవిషధరైః పంచభిర్మర్మసంధౌ దష్టో నష్టో వివేకః సుతధనయువతిస్వాదుసౌఖ్యే నిషణ్ణః । శైవీచింతావిహీనం మమ హృదయమహో మానగర్వాధిరూఢం క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 3॥
వార్ధక్యే చేంద్రియాణాం విగతగతిమతిశ్చాధిదైవాదితాపైః పాపై రోగైర్వియోగైస్త్వనవసితవపుః ప్రౌఢహీనం చ దీనమ్ । మిథ్యామోహాభిలాషైర్భ్రమతి మమ మనో ధూర్జటేర్ధ్యానశూన్యం క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 4॥
స్నాత్వా ప్రత్యూషకాలే స్నపనవిధివిధౌ నాహృతం గాంగతోయం పూజార్థం వా కదాచిద్బహుతరగహనాత్ఖండబిల్వీదలాని । నానీతా పద్మమాలా సరసి వికసితా గంధధూపైః త్వదర్థం క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 5॥
దుగ్ధైర్మధ్వాజ్యయుక్తైర్దధిసితసహితైః స్నాపితం నైవ లింగం నో లిప్తం చందనాద్యైః కనకవిరచితైః పూజితం న ప్రసూనైః । ధూపైః కర్పూరదీపైర్వివిధరసయుతైర్నైవ భక్ష్యోపహారైః క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 6॥
నో శక్యం స్మార్తకర్మ ప్రతిపదగహనప్రత్యవాయాకులాఖ్యం శ్రౌతే వార్తా కథం మే ద్విజకులవిహితే బ్రహ్మమార్గానుసారే । వర్ బ్రహ్మమార్గే సుసారే జ్ఞాతో ధర్మో విచారైః శ్రవణమననయోః కిం నిదిధ్యాసితవ్యం క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 7॥
ధ్యాత్వా చిత్తే శివాఖ్యం ప్రచురతరధనం నైవ దత్తం ద్విజేభ్యో హవ్యం తే లక్షసంఖ్యైర్హుతవహవదనే నార్పితం బీజమంత్రైః । నో తప్తం గాంగాతీరే వ్రతజపనియమైః రుద్రజాప్యైర్న వేదైః క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 8॥
నగ్నో నిఃసంగశుద్ధస్త్రిగుణవిరహితో ధ్వస్తమోహాంధకారో నాసాగ్రే న్యస్తదృష్టిర్విదితభవగుణో నైవ దృష్టః కదాచిత్ । ఉన్మన్యాఽవస్థయా త్వాం విగతకలిమలం శంకరం న స్మరామి క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 9॥
స్థిత్వా స్థానే సరోజే ప్రణవమయమరుత్కుంభకే (కుండలే) సూక్ష్మమార్గే శాంతే స్వాంతే ప్రలీనే ప్రకటితవిభవే జ్యోతిరూపేఽపరాఖ్యే । లింగజ్ఞే బ్రహ్మవాక్యే సకలతనుగతం శంకరం న స్మరామి క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 10॥
హృద్యం వేదాంతవేద్యం హృదయసరసిజే దీప్తముద్యత్ప్రకాశం సత్యం శాంతస్వరూపం సకలమునిమనఃపద్మషండైకవేద్యమ్ । జాగ్రత్స్వప్నే సుషుప్తౌ త్రిగుణవిరహితం శంకరం న స్మరామి క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 11॥
సూర్యరథానికి చిత్రరథమని పేరు. సూర్యుని రథానికి ఒకే ఒక చక్రం. సూర్యరథాన్ని సప్త అనే అశ్వం లాగుతుంది.
అది 'సప్తకాంచన సన్నిభం' అంటే ఏడు రంగుల కిరణాలను ప్రసరింపజేస్తుంది.
ఆ ఏడు రంగులు వ్యక్తి శరీరంలో ఉండే ఏడు ధాతువులు- మజ్జ, మాంసం, మేధస్సు, ఎముక, శుక్రం, శోణితం, చర్మం అనువాటిపై ప్రభావం కలిగివుంటాయి.
అనంత శక్తిమయమైన ఆ కిరణాలు వ్యక్తిపై ప్రసరిస్తే వాటివల్ల ఆయా ధాతువులపై ఉన్న రోగ లక్షణాలు నిర్మూలనమై ఆరోగ్యం లభిస్తుంది. అందుకే మనుస్మృతి 'ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్' అని కీర్తించింది.
సూర్యుని నుండి ప్రసరించే ఏడు కిరణాలు..!! 1. సుషుమ్నము..!! నాడీ మండలాన్ని ఉత్తేజపరస్తుంది.
విష్ణువు అలంకారప్రియడు కాగా శివుడు అభిషేకప్రియుడు. అభిషేకం అంటే శివలింగంపై పాలు, నీళ్లు పోయడం అని సాధారణ భావన.
‘మన మనసును యోగంతో లగ్నం చేయడమే నిజమైన అభిషేకం’ అంటారు పెద్దలు. అంటే సర్వ సమర్పణ అని అర్థం. ‘నీ దయతో సిద్ధించిన ఈ జన్మను చరితార్థం చేసుకునేందుకు యత్నించే దాసాను దాసుడను’ అనే భావనతో తనను తాను అంకితం చేసుకోవడం, శరణాగతి కోరడం.
నిజానికి.. జ్ఞానం, విచక్షణతో ఆలోచించడమే ‘అభిషేకం’ అని చెబుతారు. ఆత్మను పరమాత్మతో అనుసంధానించినపుడు ఆత్మప్రక్షాళన జరుగుతుంది.
భక్తజన సులభుడు శివుడు. భక్తుల ఉపాసన సౌలభ్యం నిమిత్తం లింగరూపంలో ఆవిర్భవించాడని, ఆ రూపంలో నిర్గుణ స్వభావాన్ని లోకానికి అందించాడని పురాణవాక్కు.
నిరాకారుడైన ఆయన తనకు తాను రూపాన్ని సృష్టించుకొన్నాడు. మరో కథనం ప్రకారం, తమలో ఎవరు అధికులమని బ్రహ్మ, విష్ణువుల మధ్య ఒకసారి వాగ్వాదం చోటుచేసుకొని, వాదన ముదిరి ప్రళయానికి దారితీసింది. ఈశ్వరుడు తేజోమూర్తిగా వారిద్దరి మధ్య ఉద్భవించి జ్ఞానోపదేశం చేశారు.
‘శివేతి చ శివం యస్యవాచిప్రవర్తతే కోటి జన్మార్జితం పాపం తస్యం నశ్యతి నిశ్చితమ్’..
మంగళప్రదమైన శివనామాన్ని నిత్యం స్మరించే వారి సమస్త పాపాలు హరిస్తాయి. ‘శివలింగాన్ని ఒక్కసారైనా పూజించిన వాడు అనేక కల్పాల వరకూ స్వర్గసుఖాలననుభవిస్తాడు. శివలింగార్చన వల్ల మానవులు పుత్ర, మిత్ర, కళత్ర, శ్రేష్ఠత్వ, జ్ఞానముక్తు లను పొందగలుగుతారు. శివ నామోచ్చరణతో దేహాన్ని త్యజించేవారు అనేక జన్మల పాపాల నుంచి మోక్షం పొందుతారు’ అని శ్రీకృష్ణభగవానుడు శంకరునితో అన్నట్లు బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది.
పరమేశ్వరుడు భక్తుల హృదయ దీపమై వెలిగే పరంజ్యోతి అని జగద్గురువు ఆదిశంకరులు స్తుతించారు. సర్వం దుఃఖమైన భౌతిక ప్రపంచంలో ముక్తి ఒక్కటే శాశ్వత ఆనందమని; భక్తి, ప్రపత్తి, శరణాగతి అనే మూడు మార్గాలను ప్రతిపాదించారు. శివాశ్రయం ద్వారానే ముక్తి సులభ సాధ్యమంటూ, ముక్తి మార్గానికి భక్తికి మించిన సాధనం లేదని విశ్వసించారు.
సామీప్య, సారూప్య, సాయుజ్యంతో శంకర కరుణకు పాత్రులు కావచ్చని ‘శివానంద లహరి’లో పేర్కొన్నారు. సకల దేవతా పూజా విధానాలను, స్తోత్రాలను లోకానికి అందించిన శంకరభగవ త్పాదులు ‘మానస పూజ’కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. సర్వం శివమయం అనే ఎరుకే ‘మానస పూజ’.
అంతటా అవరించి ఉన్న పూర్ణత్వానికి శివత్త్వం అని పేరు. అది అనంతం. శివస్తోత్రం వేదసారం. శివుడి త్రినేత్రాలను సూర్య చంద్రులు, అగ్నిగా వర్ణిస్తారు.
ప్రకృతి పురుషులు అభేదమని చెప్పేందుకే శివుడు అర్ధనారీశ్వరుడు అయ్యాడు. యోగ విద్యను మొదట పార్వతికి బోధించి స్త్రీలకు బ్రహ్మ విద్యోపదేశానికి మార్గదర్శి అయ్యాడు. యోగ సంప్రదాయంలో ఆయనను దేవుడిగా కంటే ఆదిగురువుగా అర్చిస్తారు.
విషయ వాంఛలను త్యజించి అతి సామాన్య జీవితాన్ని గడిపే మహనీయుడు. ఎంతో శాంతమూర్తో.. అంత ఉగ్రప్రకృతి కలవాడు. ఆయన కోపాగ్ని జ్వాలలు, త్రినేత్ర విశిఖ జ్వలాల్లో లోకాన్నే దహించే శక్తి ఉంది. అయినా దానిని వృథా చేయని భక్తులపాలిట కొంగు బంగారం… కల్పవృక్షం.
వేల సంవత్సరాలుగా శివరాత్రిని జరుపుకుంటూ, ఉపవాసాలు చేస్తూ, జాగరణ ఉంటూనే ఉన్నారు. ఆదిదేవుని అర్చిస్తున్న వారిలో ఆయనలా పరోపకార మనస్తత్వం ఎంత? అన్నది విజ్ఞుల ప్రశ్న. పరమ శివుడిని పూజిస్తేనే చాలదని,ఆయన లక్షణాలు స్ఫూర్తిగా సమాజం శక్తిమంతం కావడానికి పాటు పడాలని ఆచార్యులు సందేశమిస్తున్నారు. SUBSCRIBE & CLICK THE 🔔 ICON FOR DAILY & REGULAR UPDATES. @SNDEVOTIONAL18
‘భక్తుడు శయనించి కీర్తిస్తే కూర్చుని వింటాడు. కూర్చొని ఆలపిస్తే నిలబడి వింటాడు. నిల్చుని గానం చేస్తే ఆనంద తాండవం చేస్తాడు’ అని శంకర భగవత్పాదులు శివతత్త్నాన్ని ఆవిష్కరించారు.
భగవానుడికి భక్తుల పట్ల అంత వినయ విధేయతలు ఉంటే, ఆయన దయాలబ్ధులు దైవం పట్ల మరెంత వినయశీలురు కావాలో.. అన్నది అంతరార్థంగా చెబుతారు.
అచంచల భక్తితో శివ నామస్మరణ చేస్తే.. భవభయ బాధలన్నీ తొలగిపోతాయని శాస్త్రపురాణవాక్కు. ‘శివశివ శివ యనరాదా… భవభయ బాధలనణచుకోరాదా’ అని త్యాగరాజ స్వామి అన్నారు.
ముక్కోటి దేవతలలో సనాతనుడు. భక్తవశకంరుడు. భోళాశంకరుడు. భవరోగాలు నయం చేసే వైద్యుడు. సమస్త చరాచర జగత్తుకు విశ్వనాథుడు.
‘సర్వం శివమయం జగత్’… అంతా శివస్వరూపమే అన్నారు. శివుడు అందరివాడు. బ్రహ్మ విష్ణు దేవేంద్రాది దేవతలే కాదు… హిరణ్యకశిపు రావణ, బాణాసుర, బ్రహ్మాసుర దానవ శ్రేష్ఠులు, వాలి వంటి వానర ప్రముఖులు, సమస్త రుషులు, ఆదిశంకరాచార్యుల వంటి జగద్గురువులు, కన్నప్పలాంటి భక్తులు ఆయనను అర్చించి తరించిన వారే.
క్షీరసాగర మథన వేళ లోక సంరక్షణార్థం హాలాహల స్వీకరణతో గరళకంఠుడిగా ప్రశస్థి పొందిన పరమశివుడిని వేదాలు మహాదేవుడు, మహేశుడు, దేవదేవుడు, అశుతోషుడు అని కీర్తించాయి.
‘శం నిత్యం సుఖమానందమికారః పురుషః స్మృతః వకారః శక్తిరమృతం మేలనం శివ ఉచ్యుతే’
శకార, ఇకార, వకారాలు కలయిక శివుడు. ‘శ’ అంటే నిత్యం, సుఖం, ఆనందం. ‘ఇ’కారమంటే పరమ పురుషుడు. ‘వ’కారమంటే అమృతపరమైన శక్తి అని అర్థం. అమృత సమానమైన పరమానంద సుఖాన్ని, దివ్యశక్తిని ప్రసాదించే పురుషుడిని శివుడు అని వ్యవహరిస్తారు. సంసారమనే రోగానికి శివనామం పరమౌషధం.
శివుడే సత్యం, శివం, సుందరం అని వర్ణించారు జ్ఞానులు. ఆయన సత్య స్వరూపుడు, మంగళకారుడు, సుందరరూపుడు, శుభకరుడు, కల్యాణ కారకుడు.
ఆయనకు శంకరుడు, శంభుడు, త్రినేత్రుడు, రుద్రుడు, మహేశ్వరుడు, హరుడు, మహాదేవుడు, నటరాజు లాంటి సహస్రాధిక పేర్లున్నా, ‘శివ’ (శివయ్య) అనేది మహిమాన్వితం, భక్తకోటికి అత్యంత ప్రియమైనది.
‘విద్యలు అన్నిటిలో వేదం గొప్పది. వేదాలన్నిటిలోనూ సంహితకాండలోని నమక చమక మంత్రాలతో కూడిన రుద్రం, అందులోనూ ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మిన్న. దానిని పలుకలేకపోతే అందులోని రెండక్షరాలు ‘శివ’ మరింత గొప్పది’ అని శాస్త్ర వచనం. శివం అనే పదానికి మోక్షం, మంగళం, శుభం, శ్రేయస్సు, భద్రం,, కల్యాణం అనే అర్థాలు ఉన్నాయి.
‘మహాపాతక విచ్ఛింతై శివ ఇత్యక్షరద్వయం అలం నమస్క్రియా యుక్తోముక్తయే పరికల్పతే’…
శివ అనే రెండక్షరాలు మహా పాతకాలను నాశనం చేయగల సామర్థం కలిగినవి. శివ శబ్దానికి ‘నమః’ (నమః అంటే త్యాగం, ప్రణతి, శరణాగతి, సనాతం వంటి అర్థాలు ఉన్నాయి) అని జోడించి ఉచ్చరిస్తే అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది.
‘నమః శివాయ’ ప్రాణ పంచాక్షరీగా రుద్రాధ్యయం అభివర్ణించింది. పంచాక్షరి లోని బీజాక్షరాలను పంచభూతాలకు ప్రతీకలుగా చెబుతారు. మనసు, వాక్కు, కర్మ,బుద్ధి, చైతన్యాలకు ఇవి సంకేతాలు. నాదం, మంత్రం, శుభం, వాక్కు, యజ్ఞాల మేలుకలయిక శివపంచాక్షరీ వైభవం. SUBSCRIBE & CLICK THE 🔔 ICON FOR DAILY & REGULAR UPDATES. @SNDEVOTIONAL18
'సంసార సాగర సముత్తరణైక సేతో' అన్నట్లుగా - కుడి హస్తముతో తన పాదములను చూపుతూ, వీటిని శరణువేడితే చాలు, మీ సంసార సాగరాన్ని మోకాళ్ళ లోతు మాత్రమే చేసి సులభముగా దాటిస్తాననే అభయ హస్త సందేశం ఇస్తుండగా, ఎడమచేతితో నాభి క్రింద స్థానం చూపిస్తూ, ప్రాణవాయువును నాభి క్రింద నుండి ఊర్ధ్వముఖంగా తీసుకుపోయి సహస్రారంలో ఉన్న పరబ్రహ్మ యందు లయం చెయ్యమన్న సందేశముంది.
కుడి హస్తంతో, నా పాదాలను శరణువేడితే ఎడమ చేతితో నిను నా అక్కున చేర్చుకుంటానన్న సూచన ఉందని కూడా కొందరు పెద్దల విశ్లేషణ.
శంఖు నామ చక్రములు ద్వారా ఇస్తున్న సందేశం :-
శంఖం ద్వారా ఉద్భవించునది శబ్దం. శంఖారావం ద్వారా జనించే ధ్వనిలో రజో తమో గుణములను హరింపజేసి సత్వగుణమును పెంచే శక్తి ఉండడమే కాక, విశ్వచైతన్యమును ఎరుకలోనికి తెస్తుంది.
కుడి ప్రక్కగల నామము ను సూర్యనాడిగా, ఎడమ ప్రక్కగల నామమును చంద్రనాడిగా, మధ్యనగల నామమును బ్రహ్మనాడిగా చెప్తుంటారు.
చక్రము ద్వారా కర్మ అనే శత్రువును నశింపజేయమనే సందేశముంది. అంటే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఈశ్వారార్పితంతో కర్మలు చేయాలన్న సూచనకి గుర్తు చక్రం.
జ్ఞానమును పొందమని జ్ఞానచిహ్నముగా శంఖమును, మోక్షచిహ్నముగా నామమును, కర్మనాశనశక్తి చిహ్నముగా చక్రమును ధరించి, కర్తృత్వభావం లేకుండా జ్ఞామును పొంది, తద్వారా కుండలినీ జాగృతమొనర్చి మోక్షమును పొందవలేనన్న సందేశం ఈ శంఖు నామ చక్రములలో ఉంది. ప్రతిరోజూ జరిగే వేంకటేశ్వరుని కళ్యాణం కూడా ఇదే తెలియజేస్తుంది.
వేంకటేశ్వరుని కళ్యాణములో అంతరార్ధం :-
వేంకటేశ్వరుడు ఉన్నది ఏడుకొండలమీద. ఏడుకొండలు మానవశరీరంలో ఏడు చక్రాలు. సహస్రారం మీద ఉండే ఈశ్వరుడే వేంకటేశ్వరుడు.
ఇక పద్మావతి అమ్మవారు. ముందుగా ఈ తల్లీ జననం గమనిస్తే -
నారాయణపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న ఆకాశరాజు, ఓసారి యజ్ఞమును ఆచరింపదలచి ఆరణీనదీ తీరంలో బంగారునాగాలితో కర్షణం చేస్తూ, నవధాన్యములు చల్లుచుండగా పద్మశయ్యపై పరుండి బంగారుబొమ్మ వలె ఉన్నబాలిక కనబడగానే, అశరీరవాణి ఈ బిడ్డ నీదే, పెంచుకో అని పలికెను.
పద్మావతి అన్న పేరు పద్మమునందు జన్మించినందున వచ్చింది. అంతరంగమనే హృదయతీరంలో బంగారు నాగలి అనే శుద్ధ సంకల్ఫంతో ప్రాణాయామం ద్వారా సాధన చేస్తూ, నవవిధ భక్తిమార్గములను అనుచరించగా మూలాధారపద్మమునందు ఉన్న పద్మావతి సాక్షాత్కరిస్తుంది. అంటే -
మానవశరీరంలో జగన్మాత కుండలినీ రూపంలో మూలాధారంలో మూడున్నర చుట్టలు చుట్టుకుని ఉంటుంది. ఈ మూలాధార పద్మమునుండి ఉద్భవించిన కుండలినీశక్తియే పద్మావతీదేవి.
ఈ పారమార్ధిక అంతరార్ధ తత్త్వమును అందరూ గ్రహించలేరు కాబట్టి సర్వశక్తిమయి జగన్మాత అందరూ ఆరాధించడానికి అనువుగా దాల్చిన భౌతికరూపం పద్మావతి. ఇది సూచించడానికే ఇక్కడ కూడా అమ్మ ఏడుకొండలకు మూలంలో వెలిసింది.
ప్రాణాయామం అనే సాధన ద్వారా మూలాధార పద్మచక్రమందున్న పద్మావతి అంటే కుండలినీశక్తి జాగృతమై భక్తిమార్గంలో ఊర్ధ్వముఖంగా పయనిస్తూ, ఆ మార్గంలో ఉన్న మిగిలిన చక్రాలను (అన్ని చక్రాలు పద్మావతి స్థానములైన పద్మాలే) అధిరోహిస్తూ, సహస్రారం మీదున్న పరమాత్మ వెంకటేశ్వరునిని యందు లయించడమే కళ్యాణం. ప్రతినిత్యం తన కళ్యాణం ద్వారా ఇస్తున్న ఆత్మజ్ఞాన సందేశమిదే. SUBSCRIBE & CLICK THE 🔔 ICON FOR DAILY & REGULAR UPDATES. @SNDEVOTIONAL18
SN DEVOTIONAL
!! దక్షిణామూర్తి స్వరూపం !!
"దక్షిణామూర్తి" విగ్రహాన్ని పరిశీలిస్తే "కుడిచెవి"కి "మకరకుండలం"... ఎడమ చెవికి "తాటంకం' అలంకారాలుగా కనిపిస్తాయి.
"మకరకుండలం" పురుషుల శ్రవణాలంకారం. "తాటంకం" స్త్రీల అలంకృతి...
దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది "శివశక్తుల" సమైక్య రూపమేనని తెలియజేస్తాయి...
ఈ రెండు అలంకారాలు.
సనకసనందనాదులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే... ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి.
అందుకే దక్షిణామూర్తి అయ్యరూపమే కాక, అమ్మమూర్తి కూడా..
ఈ విషయాన్నే "లలితాసహస్రం"లో దక్షిణామూర్తి రూపిణీ సనకాదిసమారాధ్యా శివజ్ఞాన ప్రదాయినీ"
అని వివరిస్తోంది.
స్వామి ఉత్తరాభిముఖులై ఉంటారు.
ఉత్తరం జ్ఞానదశ.... ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్నవారికి....
వెనుక భాగాన ( పృష్ట భాగాన ) దక్షిణ దిశ.
అంటే యమ (మృత్యు) దిశ.
దీని భావం ఎవరు దేవుని వైపు చూస్తారో... వారు యముని ( మృత్యువుని ) చూడరు.
యముని చూపు మనపై పడకుండా స్వామి చూపు 'నిఘా', వేస్తుంది.
ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి'
యముని సైతం శాసించిన మృత్యుంజయుడే దక్షిణామూర్తి
దక్షిణ' అంటే 'దాక్షిణ్య భావం'.
ఏ దయవలన దుఃఖం పూర్తిగా నిర్మూలనం అవుతుందో ఆ 'దయ'ను 'దాక్షిణ్యం' అంటారు.
ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి (దాక్షిణ్యం)... భగవంతునికి మాత్రమే ఉంది.
ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే... "దక్షిణామూర్తి"
అన్ని దుఃఖాలకీ కారణం అజ్ఞానం.
అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖ విమోచనం.
ఆ అజ్ఞానాన్ని (అవిద్యను) తొలగించే...జ్ఞాన స్వరూపుని దాక్షిణ్య విగ్రహమే "దక్షిణామూర్తి"
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ:
"దక్షిణామూర్తి" సకల జగద్గురు మూర్తి కనుక స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది. ఐహికంగా బుద్ధి శక్తిని వృద్ధి చేసి విద్యలను ఆనుగ్రహించే ఈ స్వామి...
పారమార్థికంగా తత్త్వ జ్ఞానాన్ని ప్రసాదించే దైవం.
SUBSCRIBE & CLICK THE 🔔 ICON FOR DAILY & REGULAR UPDATES.
@SNDEVOTIONAL18
16 hours ago | [YT] | 293
View 2 replies
SN DEVOTIONAL
🙏మురుగన్ 🙏
‘పెరుమాళ్’ అన్న పదం శ్రీ మహా విష్ణువుకు సంబంధించినది. ప్రతి ఊరిలోనూ ఒక శివాలయం, ఒక విష్ణు ఆలయం ఉండడం మనం చూస్తుంటాము. శివపార్వతుల ఇద్దరి తేజస్సుతో ఉద్భవించిన సుబ్రహ్మణ్యుణ్ణి అరుణగిరినాథర్ ‘పెరుమాళే’ అని పిలవడం చాలా అద్భుతమైన విషయం.
తమిళనాడులో సుబ్రహ్మణ్యుణ్ణి సాధారణగా శ్రీ మహా విష్ణువు సంబంధంతో ‘మురుగన్’ అని పిలుస్తారు. ఎందుకంటే, సుబ్రహ్మణ్యుడు, శ్రీ మహా విష్ణువు చెల్లెలైన పార్వతీ దేవి కుమారుడు కాబట్టి. శ్రీ మహా విష్ణువుకు మేనల్లుడు అవుతాడు కాబట్టి ‘మాల్ - మురుగన్’ అని ప్రఖ్యాతి. ‘మరుమగన్’ అంటే అల్లుడు. పూర్వజన్మలో వల్లి మరియు దేవసేన విష్ణువు కుమార్తెలు. అందుకే మహావిష్ణువు సుబ్రహ్మణ్యుడికి మామ అవుతారు. ఆయన శివునికి పుత్రుడు, విష్ణువుకి అల్లుడు. అందుకే అరుణగిరినాథర్ సుబ్రహ్మణ్యుణ్ణి ‘మరుగోనె’ అని అంటాడు.
కాని ఉత్తర భారతంలో ఈ ‘అల్లుడి’ విషయం ఎప్పటికి ఒప్పుకోరు. అక్కడ సుబ్రహ్మణ్యుణ్ణి బ్రహ్మచారిగానే కొలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో సుబ్రహ్మణ్య ఆలయాలలోకి ఆడవారిని అనుమతించరు. ఈ విషయంలో వారు చాలా కఠినంగా ఉంటారు. అంతేకాక ఉత్తరాన ‘సుబ్రహ్మణ్య’ అన్న పేరుకంటే ‘కార్తికేయు’నిగా ఎక్కువ ప్రాచుర్యం.
SUBSCRIBE & CLICK THE 🔔 ICON FOR DAILY & REGULAR UPDATES.
@SNDEVOTIONAL18
2 days ago | [YT] | 599
View 0 replies
SN DEVOTIONAL
🙏ఓం నమః శివాయ 🙏
!! శివాపరాధ క్షమాపణ స్తోత్రం !!
ఆదౌ కర్మప్రసంగాత్కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం
విణ్మూత్రామేధ్యమధ్యే క్వథయతి నితరాం జాఠరో జాతవేదాః ।
యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేన వక్తుం
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 1॥
బాల్యే దుఃఖాతిరేకో మలలులితవపుః స్తన్యపానే పిపాసా
నో శక్తశ్చేంద్రియేభ్యో భవగుణజనితాః జంతవో మాం తుదంతి ।
నానారోగాదిదుఃఖాద్రుదనపరవశః శంకరం న స్మరామి
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 2॥
ప్రౌఢోఽహం యౌవనస్థో విషయవిషధరైః పంచభిర్మర్మసంధౌ
దష్టో నష్టో వివేకః సుతధనయువతిస్వాదుసౌఖ్యే నిషణ్ణః ।
శైవీచింతావిహీనం మమ హృదయమహో మానగర్వాధిరూఢం
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 3॥
వార్ధక్యే చేంద్రియాణాం విగతగతిమతిశ్చాధిదైవాదితాపైః
పాపై రోగైర్వియోగైస్త్వనవసితవపుః ప్రౌఢహీనం చ దీనమ్ ।
మిథ్యామోహాభిలాషైర్భ్రమతి మమ మనో ధూర్జటేర్ధ్యానశూన్యం
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 4॥
స్నాత్వా ప్రత్యూషకాలే స్నపనవిధివిధౌ నాహృతం గాంగతోయం
పూజార్థం వా కదాచిద్బహుతరగహనాత్ఖండబిల్వీదలాని ।
నానీతా పద్మమాలా సరసి వికసితా గంధధూపైః త్వదర్థం
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 5॥
దుగ్ధైర్మధ్వాజ్యయుక్తైర్దధిసితసహితైః స్నాపితం నైవ లింగం
నో లిప్తం చందనాద్యైః కనకవిరచితైః పూజితం న ప్రసూనైః ।
ధూపైః కర్పూరదీపైర్వివిధరసయుతైర్నైవ భక్ష్యోపహారైః
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 6॥
నో శక్యం స్మార్తకర్మ ప్రతిపదగహనప్రత్యవాయాకులాఖ్యం
శ్రౌతే వార్తా కథం మే ద్విజకులవిహితే బ్రహ్మమార్గానుసారే । వర్ బ్రహ్మమార్గే సుసారే
జ్ఞాతో ధర్మో విచారైః శ్రవణమననయోః కిం నిదిధ్యాసితవ్యం
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 7॥
ధ్యాత్వా చిత్తే శివాఖ్యం ప్రచురతరధనం నైవ దత్తం ద్విజేభ్యో
హవ్యం తే లక్షసంఖ్యైర్హుతవహవదనే నార్పితం బీజమంత్రైః ।
నో తప్తం గాంగాతీరే వ్రతజపనియమైః రుద్రజాప్యైర్న వేదైః
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 8॥
నగ్నో నిఃసంగశుద్ధస్త్రిగుణవిరహితో ధ్వస్తమోహాంధకారో
నాసాగ్రే న్యస్తదృష్టిర్విదితభవగుణో నైవ దృష్టః కదాచిత్ ।
ఉన్మన్యాఽవస్థయా త్వాం విగతకలిమలం శంకరం న స్మరామి
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 9॥
స్థిత్వా స్థానే సరోజే ప్రణవమయమరుత్కుంభకే (కుండలే) సూక్ష్మమార్గే
శాంతే స్వాంతే ప్రలీనే ప్రకటితవిభవే జ్యోతిరూపేఽపరాఖ్యే ।
లింగజ్ఞే బ్రహ్మవాక్యే సకలతనుగతం శంకరం న స్మరామి
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 10॥
హృద్యం వేదాంతవేద్యం హృదయసరసిజే దీప్తముద్యత్ప్రకాశం
సత్యం శాంతస్వరూపం సకలమునిమనఃపద్మషండైకవేద్యమ్ ।
జాగ్రత్స్వప్నే సుషుప్తౌ త్రిగుణవిరహితం శంకరం న స్మరామి
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 11॥
చంద్రోద్భాసితశేఖరే స్మరహరే గంగాధరే శంకరే
సర్పైర్భూషితకంఠకర్ణవివరే నేత్రోత్థవైశ్వానరే । యుగలే
దంతిత్వక్కృతసుందరాంబరధరే త్రైలోక్యసారే హరే
మోక్షార్థం కురు చిత్తవృత్తిమచలామన్యైస్తు కిం కర్మభిః ॥ 12॥
కిం వాఽనేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం
కిం వా పుత్రకలత్రమిత్రపశుభిర్దేహేన గేహేన కిమ్ ।
జ్ఞాత్వైతత్క్షణభంగురం సపది రే త్యాజ్యం మనో దూరతః
స్వాత్మార్థం గురువాక్యతో భజ మన శ్రీపార్వతీవల్లభమ్ ॥ 13॥
పౌరోహిత్యం రజనిచరితం గ్రామణీత్వం నియోగో
మాఠాపత్యం హ్యనృతవచనం సాక్షివాదః పరాన్నమ్ ।
బ్రహ్మద్వేషః ఖలజనరతిః ప్రాణినాం నిర్దయత్వం
మా భూదేవం మమ పశుపతే జన్మజన్మాంతరేషు ॥ 14॥
ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం
ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః ।
లక్ష్మీస్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం
తస్మాత్త్వాం శరణాగతం శరణద త్వం రక్ష రక్షాధునా ॥ 15॥ తస్మాన్మాం
వందే దేవముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిమ్ ।
వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ ॥16॥
గాత్రం భస్మసితం సితం చ హసితం హస్తే కపాలం సితం వర్ స్మితం చ
ఖట్వాంగం చ సితం సితశ్చ వృషభః కర్ణే సితే కుండలే ।
గంగా ఫేనసితా జటా పశుపతేశ్చంద్రః సితో మూర్ధని
సోఽయం సర్వసితో దదాతు విభవం పాపక్షయం సర్వదా ॥ 17॥
కరచరణకృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణనయనజం వా మానసం వాఽపరాధమ్ ।
విహితమవిహితం వా సర్వమేతత్క్ష్మస్వ
శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో ॥ 18॥
॥ ఇతి శ్రీమద్ శంకరాచార్యకృత శివాపరాధక్షమాపణస్తోత్రం సంపూర్ణమ్ ॥
SUBSCRIBE & CLICK THE 🔔 ICON FOR DAILY & REGULAR UPDATES.
@SNDEVOTIONAL18
4 days ago | [YT] | 565
View 2 replies
SN DEVOTIONAL
🙏ఓం నమో నారాయణాయ 🙏
!! అచ్యుతాష్టకం !!
అచ్యుతం కేశవం రామనారాయణం
కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్ ।
శ్రీధరం మాధవం గోపికా వల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే ॥ 1 ॥
అచ్యుతం కేశవం సత్యభామాధవం
మాధవం శ్రీధరం రాధికా రాధితమ్ ।
ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సందధే ॥ 2 ॥
[పల్లవి..]
విష్ణవే జిష్ణవే శంకనే చక్రిణే
రుక్మిణీ రాగిణే జానకీ జానయే ।
వల్లవీ వల్లభాయార్చితా యాత్మనే
కంస విధ్వంసినే వంశినే తే నమః ॥ 3 ॥
కృష్ణ గోవింద హే రామ నారాయణ
శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే ।
అచ్యుతానంత హే మాధవాధోక్షజ
ద్వారకానాయక ద్రౌపదీరక్షక ॥ 4 ॥
రాక్షస క్షోభితః సీతయా శోభితో
దండకారణ్యభూ పుణ్యతాకారణః ।
లక్ష్మణోనాన్వితో వానరైః సేవితో
అగస్త్య సంపూజితో రాఘవః పాతు మామ్ ॥ 5 ॥
[పల్లవి..]
ధేనుకారిష్టకోఽనిష్టకృద్ద్వేషిణాం
కేశిహా కంసహృద్వణ్శికావాదకః ।
పూతనాకోపకః సూరజాఖేలనో
బాలగోపాలకః పాతు మాం సర్వదా ॥ 6 ॥
విద్యుదుద్యోతవత్ప్రస్ఫురద్వాససం
ప్రావృడంభోదవత్ప్రోల్లసద్విగ్రహమ్ ।
వన్యయా మాలయా శోభితోరఃస్థలం
లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే ॥ 7॥
కుంచితైః కుంతలై భ్రాజమానాననం
రత్నమౌళిం లసత్-కుండలం గండయోః ।
హారకేయూరకం కంకణ ప్రోజ్జ్వలం
కింకిణీ మంజులం శ్యామలం తం భజే ॥ 8 ॥
[పల్లవి..]
అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం
ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్ ।
వృత్తతః సుందరం కర్తృ విశ్వంభరః
తస్య వశ్యో హరి ర్జాయతే సత్వరమ్ ॥
అచ్యుతం కేశవం రామనారాయణం
కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్ ।
శ్రీధరం మాధవం గోపికా వల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే ॥ 1 ।
॥ ఇతి శ్రీశంకరాచార్యవిరచితమచ్యుతాష్టకం సంపూర్ణమ్ ॥
SUBSCRIBE & CLICK THE 🔔 ICON FOR DAILY & REGULAR UPDATES.
@SNDEVOTIONAL18
6 days ago | [YT] | 559
View 6 replies
SN DEVOTIONAL
🙏 ఓం నమో నారాయణాయ 🙏
!! నారాయణ అష్టాక్షరీ స్తుతి !!
ఓం నమః ప్రణవార్థార్థ స్థూలసూక్ష్మ క్షరాక్షర
వ్యక్తావ్యక్త కళాతీత ఓంకారాయ నమో నమః ॥ 1 ॥
నమో దేవాదిదేవాయ దేహసంచారహేతవే
దైత్యసంఘవినాశాయ నకారాయ నమో నమః ॥ 2 ॥
మోహనం విశ్వరూపం చ శిష్టాచారసుపోషితం
మోహవిధ్వంసకం వందే మోకారాయ నమో నమః ॥ 3 ॥
నారాయణాయ నవ్యాయ నరసింహాయ నామినే
నాదాయ నాదినే తుభ్యం నాకారాయ నమో నమః ॥ 4 ॥
రామచంద్రం రఘుపతిం పిత్రాజ్ఞాపరిపాలకం
కౌసల్యాతనయం వందే రాకారాయ నమో నమః ॥ 5 ॥
యజ్ఞాయ యజ్ఞగమ్యాయ యజ్ఞరక్షాకరాయ చ
యజ్ఞాంగరూపిణే తుభ్యం యకారాయ నమో నమః ॥ 6 ॥
ణాకారం లోకవిఖ్యాతం నానాజన్మఫలప్రదం
నానాభీష్టప్రదం వందే ణాకారాయ నమో నమః ॥ 7 ॥
యజ్ఞకర్త్రే యజ్ఞభర్త్రే యజ్ఞరూపాయ తే నమః
సుజ్ఞానగోచరాయాఽస్తు యకారాయ నమో నమః ॥ 8 ॥
ఇతి శ్రీ నారాయణ అష్టాక్షరీ స్తుతిః ।
SUBSCRIBE & CLICK THE 🔔 ICON FOR DAILY & REGULAR UPDATES.
@SNDEVOTIONAL18
1 week ago | [YT] | 591
View 0 replies
SN DEVOTIONAL
సూర్యరథానికి చిత్రరథమని పేరు.
సూర్యుని రథానికి ఒకే ఒక చక్రం.
సూర్యరథాన్ని సప్త అనే అశ్వం లాగుతుంది.
అది 'సప్తకాంచన సన్నిభం' అంటే ఏడు రంగుల కిరణాలను ప్రసరింపజేస్తుంది.
ఆ ఏడు రంగులు వ్యక్తి శరీరంలో ఉండే ఏడు ధాతువులు- మజ్జ, మాంసం, మేధస్సు, ఎముక, శుక్రం, శోణితం, చర్మం అనువాటిపై ప్రభావం కలిగివుంటాయి.
అనంత శక్తిమయమైన ఆ కిరణాలు వ్యక్తిపై ప్రసరిస్తే వాటివల్ల ఆయా ధాతువులపై ఉన్న రోగ లక్షణాలు నిర్మూలనమై ఆరోగ్యం లభిస్తుంది.
అందుకే మనుస్మృతి 'ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్' అని కీర్తించింది.
సూర్యుని నుండి ప్రసరించే ఏడు కిరణాలు..!!
1. సుషుమ్నము..!!
నాడీ మండలాన్ని ఉత్తేజపరస్తుంది.
2. హరికేశము..!
గుండె జబ్బులను నివారిస్తుంది.
3. విశ్వకర్మము..!
రక్తహీతను, తత్సంబంధమైన వ్యాధులను నిర్మూలిస్తుంది.
4. విశ్వత్వచము..!
శ్వాసకోస సంబంధిత వ్యాధులను
తొలగిస్తుంది.
5. సంపద్వసుము..!
జననేంద్రియ వ్యవస్థను దృఢపరుస్తుంది
6. అర్వాగ్యాసుము..!
నరాల బలహీనతను నివారిస్తుంది.
7. స్వరాడ్యసుము..!
స్వరపేటికకు, మూత్రపిండాలను వ్యాధులను నివారిస్తుంది.
శ్రీ సూర్యారాధన గురించి రామాయణము, మహాభారత గ్రంథాలలో విస్తృతంగా చెప్పడం జరిగింది.
అగస్త్యుని ద్వారా ఆదిత్య హృదయము అను స్తోత్రాన్ని ఉపాసించి శ్రీరాముడు రావణ సంహారం చేసినట్లు, వనపర్వంలో ధర్మరాజు ఆదిత్యుని ఉపాసించి అక్షత పొందినట్లు కథలున్నాయి.
ఓం మిత్రాయ నమః.
SUBSCRIBE & CLICK THE 🔔 ICON FOR DAILY & REGULAR UPDATES.
@SNDEVOTIONAL18
1 week ago | [YT] | 480
View 4 replies
SN DEVOTIONAL
🙏ఓం నమః శివాయ 🙏
విష్ణువు అలంకారప్రియడు కాగా శివుడు అభిషేకప్రియుడు. అభిషేకం అంటే శివలింగంపై పాలు, నీళ్లు పోయడం అని సాధారణ భావన.
‘మన మనసును యోగంతో లగ్నం చేయడమే నిజమైన అభిషేకం’ అంటారు పెద్దలు. అంటే సర్వ సమర్పణ అని అర్థం. ‘నీ దయతో సిద్ధించిన ఈ జన్మను చరితార్థం చేసుకునేందుకు యత్నించే దాసాను దాసుడను’ అనే భావనతో తనను తాను అంకితం చేసుకోవడం, శరణాగతి కోరడం.
చెంబుడు శుద్ధో దకాన్ని లింగాకృతిపై పోసి, చిడికెడు భస్మాన్ని చల్లే సామాన్యులను, మహన్యాసపూర్వక నమక చమకాదులతో ఏకాదశ రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు నిర్వహించే అసామాన్యులను ఏకరీతిన కరుణిస్తాడని విశ్వాసం.
నిజానికి.. జ్ఞానం, విచక్షణతో ఆలోచించడమే ‘అభిషేకం’ అని చెబుతారు. ఆత్మను పరమాత్మతో అనుసంధానించినపుడు ఆత్మప్రక్షాళన జరుగుతుంది.
భక్తజన సులభుడు శివుడు. భక్తుల ఉపాసన సౌలభ్యం నిమిత్తం లింగరూపంలో ఆవిర్భవించాడని, ఆ రూపంలో నిర్గుణ స్వభావాన్ని లోకానికి అందించాడని పురాణవాక్కు.
నిరాకారుడైన ఆయన తనకు తాను రూపాన్ని సృష్టించుకొన్నాడు. మరో కథనం ప్రకారం, తమలో ఎవరు అధికులమని బ్రహ్మ, విష్ణువుల మధ్య ఒకసారి వాగ్వాదం చోటుచేసుకొని, వాదన ముదిరి ప్రళయానికి దారితీసింది. ఈశ్వరుడు తేజోమూర్తిగా వారిద్దరి మధ్య ఉద్భవించి జ్ఞానోపదేశం చేశారు.
‘శివేతి చ శివం యస్యవాచిప్రవర్తతే
కోటి జన్మార్జితం పాపం తస్యం నశ్యతి నిశ్చితమ్’..
మంగళప్రదమైన శివనామాన్ని నిత్యం స్మరించే వారి సమస్త పాపాలు హరిస్తాయి. ‘శివలింగాన్ని ఒక్కసారైనా పూజించిన వాడు అనేక కల్పాల వరకూ స్వర్గసుఖాలననుభవిస్తాడు. శివలింగార్చన వల్ల మానవులు పుత్ర, మిత్ర, కళత్ర, శ్రేష్ఠత్వ, జ్ఞానముక్తు లను పొందగలుగుతారు. శివ నామోచ్చరణతో దేహాన్ని త్యజించేవారు అనేక జన్మల పాపాల నుంచి మోక్షం పొందుతారు’ అని శ్రీకృష్ణభగవానుడు శంకరునితో అన్నట్లు బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది.
పరమేశ్వరుడు భక్తుల హృదయ దీపమై వెలిగే పరంజ్యోతి అని జగద్గురువు ఆదిశంకరులు స్తుతించారు. సర్వం దుఃఖమైన భౌతిక ప్రపంచంలో ముక్తి ఒక్కటే శాశ్వత ఆనందమని; భక్తి, ప్రపత్తి, శరణాగతి అనే మూడు మార్గాలను ప్రతిపాదించారు. శివాశ్రయం ద్వారానే ముక్తి సులభ సాధ్యమంటూ, ముక్తి మార్గానికి భక్తికి మించిన సాధనం లేదని విశ్వసించారు.
సామీప్య, సారూప్య, సాయుజ్యంతో శంకర కరుణకు పాత్రులు కావచ్చని ‘శివానంద లహరి’లో పేర్కొన్నారు. సకల దేవతా పూజా విధానాలను, స్తోత్రాలను లోకానికి అందించిన శంకరభగవ త్పాదులు ‘మానస పూజ’కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. సర్వం శివమయం అనే ఎరుకే ‘మానస పూజ’.
అంతటా అవరించి ఉన్న పూర్ణత్వానికి శివత్త్వం అని పేరు. అది అనంతం. శివస్తోత్రం వేదసారం. శివుడి త్రినేత్రాలను సూర్య చంద్రులు, అగ్నిగా వర్ణిస్తారు.
ప్రకృతి పురుషులు అభేదమని చెప్పేందుకే శివుడు అర్ధనారీశ్వరుడు అయ్యాడు. యోగ విద్యను మొదట పార్వతికి బోధించి స్త్రీలకు బ్రహ్మ విద్యోపదేశానికి మార్గదర్శి అయ్యాడు. యోగ సంప్రదాయంలో ఆయనను దేవుడిగా కంటే ఆదిగురువుగా అర్చిస్తారు.
లోక శ్రేయస్సుకోసం కష్టాలను ఇష్టంగా భరించడం, ఆనందంగా స్వీకరించడం శంకర తత్వం. క్షీరసాగర మథనవేళ ఆవిర్భవించిన హాలాహలాన్ని గరళంలో నిలపడమే అందుకు ప్రథమోదహరణ.
విషయ వాంఛలను త్యజించి అతి సామాన్య జీవితాన్ని గడిపే మహనీయుడు. ఎంతో శాంతమూర్తో.. అంత ఉగ్రప్రకృతి కలవాడు. ఆయన కోపాగ్ని జ్వాలలు, త్రినేత్ర విశిఖ జ్వలాల్లో లోకాన్నే దహించే శక్తి ఉంది. అయినా దానిని వృథా చేయని భక్తులపాలిట కొంగు బంగారం… కల్పవృక్షం.
వేల సంవత్సరాలుగా శివరాత్రిని జరుపుకుంటూ, ఉపవాసాలు చేస్తూ, జాగరణ ఉంటూనే ఉన్నారు. ఆదిదేవుని అర్చిస్తున్న వారిలో ఆయనలా పరోపకార మనస్తత్వం ఎంత? అన్నది విజ్ఞుల ప్రశ్న. పరమ శివుడిని పూజిస్తేనే చాలదని,ఆయన లక్షణాలు స్ఫూర్తిగా సమాజం శక్తిమంతం కావడానికి పాటు పడాలని ఆచార్యులు సందేశమిస్తున్నారు.
SUBSCRIBE & CLICK THE 🔔 ICON FOR DAILY & REGULAR UPDATES.
@SNDEVOTIONAL18
1 week ago | [YT] | 542
View 3 replies
SN DEVOTIONAL
🙏 ఓం నమః శివాయ 🙏
!! సదాశివా…! సదా స్మరామి !!
తలచినదే తడవుగా వశమయ్యే భక్తసులభుడు సదాశివుడు. సత్య స్వరూపుడు. వినయమూర్తి.
‘భక్తుడు శయనించి కీర్తిస్తే కూర్చుని వింటాడు. కూర్చొని ఆలపిస్తే నిలబడి వింటాడు. నిల్చుని గానం చేస్తే ఆనంద తాండవం చేస్తాడు’ అని శంకర భగవత్పాదులు శివతత్త్నాన్ని ఆవిష్కరించారు.
భగవానుడికి భక్తుల పట్ల అంత వినయ విధేయతలు ఉంటే, ఆయన దయాలబ్ధులు దైవం పట్ల మరెంత వినయశీలురు కావాలో.. అన్నది అంతరార్థంగా చెబుతారు.
అచంచల భక్తితో శివ నామస్మరణ చేస్తే.. భవభయ బాధలన్నీ తొలగిపోతాయని శాస్త్రపురాణవాక్కు. ‘శివశివ శివ యనరాదా… భవభయ బాధలనణచుకోరాదా’ అని త్యాగరాజ స్వామి అన్నారు.
ముక్కోటి దేవతలలో సనాతనుడు. భక్తవశకంరుడు. భోళాశంకరుడు. భవరోగాలు నయం చేసే వైద్యుడు. సమస్త చరాచర జగత్తుకు విశ్వనాథుడు.
‘సర్వం శివమయం జగత్’… అంతా శివస్వరూపమే అన్నారు. శివుడు అందరివాడు. బ్రహ్మ విష్ణు దేవేంద్రాది దేవతలే కాదు… హిరణ్యకశిపు రావణ, బాణాసుర, బ్రహ్మాసుర దానవ శ్రేష్ఠులు, వాలి వంటి వానర ప్రముఖులు, సమస్త రుషులు, ఆదిశంకరాచార్యుల వంటి జగద్గురువులు, కన్నప్పలాంటి భక్తులు ఆయనను అర్చించి తరించిన వారే.
క్షీరసాగర మథన వేళ లోక సంరక్షణార్థం హాలాహల స్వీకరణతో గరళకంఠుడిగా ప్రశస్థి పొందిన పరమశివుడిని వేదాలు మహాదేవుడు, మహేశుడు, దేవదేవుడు, అశుతోషుడు అని కీర్తించాయి.
‘శం నిత్యం సుఖమానందమికారః పురుషః స్మృతః
వకారః శక్తిరమృతం మేలనం శివ ఉచ్యుతే’
శకార, ఇకార, వకారాలు కలయిక శివుడు. ‘శ’ అంటే నిత్యం, సుఖం, ఆనందం. ‘ఇ’కారమంటే పరమ పురుషుడు. ‘వ’కారమంటే అమృతపరమైన శక్తి అని అర్థం. అమృత సమానమైన పరమానంద సుఖాన్ని, దివ్యశక్తిని ప్రసాదించే పురుషుడిని శివుడు అని వ్యవహరిస్తారు. సంసారమనే రోగానికి శివనామం పరమౌషధం.
శివుడే సత్యం, శివం, సుందరం అని వర్ణించారు జ్ఞానులు. ఆయన సత్య స్వరూపుడు, మంగళకారుడు, సుందరరూపుడు, శుభకరుడు, కల్యాణ కారకుడు.
ఆయనకు శంకరుడు, శంభుడు, త్రినేత్రుడు, రుద్రుడు, మహేశ్వరుడు, హరుడు, మహాదేవుడు, నటరాజు లాంటి సహస్రాధిక పేర్లున్నా, ‘శివ’ (శివయ్య) అనేది మహిమాన్వితం, భక్తకోటికి అత్యంత ప్రియమైనది.
‘విద్యలు అన్నిటిలో వేదం గొప్పది. వేదాలన్నిటిలోనూ సంహితకాండలోని నమక చమక మంత్రాలతో కూడిన రుద్రం, అందులోనూ ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మిన్న. దానిని పలుకలేకపోతే అందులోని రెండక్షరాలు ‘శివ’ మరింత గొప్పది’ అని శాస్త్ర వచనం. శివం అనే పదానికి మోక్షం, మంగళం, శుభం, శ్రేయస్సు, భద్రం,, కల్యాణం అనే అర్థాలు ఉన్నాయి.
‘మహాపాతక విచ్ఛింతై శివ ఇత్యక్షరద్వయం
అలం నమస్క్రియా యుక్తోముక్తయే పరికల్పతే’…
శివ అనే రెండక్షరాలు మహా పాతకాలను నాశనం చేయగల సామర్థం కలిగినవి. శివ శబ్దానికి ‘నమః’ (నమః అంటే త్యాగం, ప్రణతి, శరణాగతి, సనాతం వంటి అర్థాలు ఉన్నాయి) అని జోడించి ఉచ్చరిస్తే అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది.
‘నమః శివాయ’ ప్రాణ పంచాక్షరీగా రుద్రాధ్యయం అభివర్ణించింది. పంచాక్షరి లోని బీజాక్షరాలను పంచభూతాలకు ప్రతీకలుగా చెబుతారు. మనసు, వాక్కు, కర్మ,బుద్ధి, చైతన్యాలకు ఇవి సంకేతాలు. నాదం, మంత్రం, శుభం, వాక్కు, యజ్ఞాల మేలుకలయిక శివపంచాక్షరీ వైభవం.
SUBSCRIBE & CLICK THE 🔔 ICON FOR DAILY & REGULAR UPDATES.
@SNDEVOTIONAL18
2 weeks ago | [YT] | 535
View 5 replies
SN DEVOTIONAL
*శ్రీశివకేశవస్తుతి* (యమ కృతం)*
ధ్యానం |
మాధవోమాధవావీశౌ సర్వసిద్ధివిహాయినౌ |
వందే పరస్పరాత్మానౌ పరస్పరనుతిప్రియౌ ||
స్తోత్రం |
గోవింద మాధవ ముకుంద హరే మురారే
శంభో శివేశ శశిశేఖర శూలపాణే |
దామోదరాఽచ్యుత జనార్దన వాసుదేవ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || ౧ ||
గంగాధరాంధకరిపో హర నీలకంఠ
వైకుంఠకైటభరిపో కమఠాబ్జపాణే |
భూతేశ ఖండపరశో మృడ చండికేశ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || ౨ ||
విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే
గౌరీపతే గిరిశ శంకర చంద్రచూడ |
నారాయణాఽసురనిబర్హణ శార్ఙ్గపాణే
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || ౩ ||
మృత్యుంజయోగ్ర విషమేక్షణ కామశత్రో
శ్రీకంఠ పీతవసనాంబుదనీలశౌరే |
ఈశాన కృత్తివసన త్రిదశైకనాథ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || ౪ ||
లక్ష్మీపతే మధురిపో పురుషోత్తమాద్య
శ్రీకంఠ దిగ్వసన శాంత పినాకపాణే |
ఆనందకంద ధరణీధర పద్మనాభ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || ౫ ||
సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ
బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శంఖపాణే |
త్ర్యక్షోరగాభరణ బాలమృగాంకమౌళే
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || ౬ ||
శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే
భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ |
చాణూరమర్దన హృషీకపతే మురారే
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || ౭ ||
SUBSCRIBE & CLICK THE 🔔 ICON FOR DAILY & REGULAR UPDATES.
@SNDEVOTIONAL18
2 weeks ago | [YT] | 415
View 4 replies
SN DEVOTIONAL
🙏ఓం నమో వేంకటేశాయ🙏
!! వేంకటేశ్వరుని సందేశము. !!
దివ్యమంగళకరం శ్రీవేంకటేశ్వరుని రూపం - ఆత్మజ్ఞాన ప్రబోధకరం.
ఆత్మజ్ఞాన చిహ్నాలతో అలరారే వేంకటేశ్వరుని తేజోమూర్తి కడు రమ్యం.
హస్తముల ద్వారా ఇస్తున్న సందేశం :-
'సంసార సాగర సముత్తరణైక సేతో' అన్నట్లుగా -
కుడి హస్తముతో తన పాదములను చూపుతూ, వీటిని శరణువేడితే చాలు, మీ సంసార సాగరాన్ని మోకాళ్ళ లోతు మాత్రమే చేసి సులభముగా దాటిస్తాననే అభయ హస్త సందేశం ఇస్తుండగా, ఎడమచేతితో నాభి క్రింద స్థానం చూపిస్తూ, ప్రాణవాయువును నాభి క్రింద నుండి ఊర్ధ్వముఖంగా తీసుకుపోయి సహస్రారంలో ఉన్న పరబ్రహ్మ యందు లయం చెయ్యమన్న సందేశముంది.
కుడి హస్తంతో, నా పాదాలను శరణువేడితే ఎడమ చేతితో నిను నా అక్కున చేర్చుకుంటానన్న సూచన ఉందని కూడా కొందరు పెద్దల విశ్లేషణ.
శంఖు నామ చక్రములు ద్వారా ఇస్తున్న సందేశం :-
శంఖం ద్వారా ఉద్భవించునది శబ్దం. శంఖారావం ద్వారా జనించే ధ్వనిలో రజో తమో గుణములను హరింపజేసి సత్వగుణమును పెంచే శక్తి ఉండడమే కాక, విశ్వచైతన్యమును ఎరుకలోనికి తెస్తుంది.
కుడి ప్రక్కగల నామము ను సూర్యనాడిగా, ఎడమ ప్రక్కగల నామమును చంద్రనాడిగా, మధ్యనగల నామమును బ్రహ్మనాడిగా చెప్తుంటారు.
చక్రము ద్వారా కర్మ అనే శత్రువును నశింపజేయమనే సందేశముంది. అంటే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఈశ్వారార్పితంతో కర్మలు చేయాలన్న సూచనకి గుర్తు చక్రం.
జ్ఞానమును పొందమని జ్ఞానచిహ్నముగా శంఖమును, మోక్షచిహ్నముగా నామమును, కర్మనాశనశక్తి చిహ్నముగా చక్రమును ధరించి, కర్తృత్వభావం లేకుండా జ్ఞామును పొంది, తద్వారా కుండలినీ జాగృతమొనర్చి మోక్షమును పొందవలేనన్న సందేశం ఈ శంఖు నామ చక్రములలో ఉంది. ప్రతిరోజూ జరిగే వేంకటేశ్వరుని కళ్యాణం కూడా ఇదే తెలియజేస్తుంది.
వేంకటేశ్వరుని కళ్యాణములో అంతరార్ధం :-
వేంకటేశ్వరుడు ఉన్నది ఏడుకొండలమీద. ఏడుకొండలు మానవశరీరంలో ఏడు చక్రాలు. సహస్రారం మీద ఉండే ఈశ్వరుడే వేంకటేశ్వరుడు.
ఇక పద్మావతి అమ్మవారు. ముందుగా ఈ తల్లీ జననం గమనిస్తే -
నారాయణపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న ఆకాశరాజు, ఓసారి యజ్ఞమును ఆచరింపదలచి ఆరణీనదీ తీరంలో బంగారునాగాలితో కర్షణం చేస్తూ, నవధాన్యములు చల్లుచుండగా పద్మశయ్యపై పరుండి బంగారుబొమ్మ వలె ఉన్నబాలిక కనబడగానే, అశరీరవాణి ఈ బిడ్డ నీదే, పెంచుకో అని పలికెను.
పద్మావతి అన్న పేరు పద్మమునందు జన్మించినందున వచ్చింది. అంతరంగమనే హృదయతీరంలో బంగారు నాగలి అనే శుద్ధ సంకల్ఫంతో ప్రాణాయామం ద్వారా సాధన చేస్తూ, నవవిధ భక్తిమార్గములను అనుచరించగా మూలాధారపద్మమునందు ఉన్న పద్మావతి సాక్షాత్కరిస్తుంది. అంటే -
మానవశరీరంలో జగన్మాత కుండలినీ రూపంలో మూలాధారంలో మూడున్నర చుట్టలు చుట్టుకుని ఉంటుంది. ఈ మూలాధార పద్మమునుండి ఉద్భవించిన కుండలినీశక్తియే పద్మావతీదేవి.
ఈ పారమార్ధిక అంతరార్ధ తత్త్వమును అందరూ గ్రహించలేరు కాబట్టి సర్వశక్తిమయి జగన్మాత అందరూ ఆరాధించడానికి అనువుగా దాల్చిన భౌతికరూపం పద్మావతి. ఇది సూచించడానికే ఇక్కడ కూడా అమ్మ ఏడుకొండలకు మూలంలో వెలిసింది.
ప్రాణాయామం అనే సాధన ద్వారా మూలాధార పద్మచక్రమందున్న పద్మావతి అంటే కుండలినీశక్తి జాగృతమై భక్తిమార్గంలో ఊర్ధ్వముఖంగా పయనిస్తూ, ఆ మార్గంలో ఉన్న మిగిలిన చక్రాలను (అన్ని చక్రాలు పద్మావతి స్థానములైన పద్మాలే) అధిరోహిస్తూ, సహస్రారం మీదున్న పరమాత్మ వెంకటేశ్వరునిని యందు లయించడమే కళ్యాణం.
ప్రతినిత్యం తన కళ్యాణం ద్వారా ఇస్తున్న ఆత్మజ్ఞాన సందేశమిదే.
SUBSCRIBE & CLICK THE 🔔 ICON FOR DAILY & REGULAR UPDATES.
@SNDEVOTIONAL18
2 weeks ago | [YT] | 568
View 2 replies
Load more