#vijayawada# httpt://www.youtube.com/@VJANEWS5


VJA NEWS 5

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గంగానమ్మ తల్లి దేవస్థానం పునప్రతిష్ట

2 months ago | [YT] | 1

VJA NEWS 5

రాయనపాడు గ్రామంలో శ్రీ లక్ష్మీ కుబేర సహిత కార్తవీర్యార్జున హోమం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వసంత వేణుగోపాలస్వామి వారి దేవస్థానంలో ధన త్రయోదశి సందర్భంగా త్రయోదశి సందర్భంగాఅనాదిగా వేంచేసియున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వసంత వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో ఈనెల 19వ తేదీ ఆదివారం నాడు ధన త్రయోదశి పర్వదిన సందర్భంగా శ్రీ లక్ష్మీ కుబేర సహిత కార్తవీర్యార్జున హోమం జరుగుతుంది. ఈ హోమ కార్యక్రమంలో శ్రీలక్ష్మీ అమ్మవారికి, కుబేర స్వామికి ప్రీతికరమైన తామర పువ్వులతో పాయసంతో విశేష ద్రవ్యాలతో హోమం జరుగుతుంది.

2 months ago | [YT] | 7

VJA NEWS 5

జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికరత అధికారిణి వారి కార్యాలయంఎన్టీఆర్ జిల్లా,

ఎన్జిల్లా.ఆర్.టి , మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యములో నడపబడుచున్న ICPS, SAA & Children Homes , విజయవాడ నందు కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ పద్ధతిపై పనిచేయుటకు స్థానిక అర్హులైన 18 నుండి 42 సంవత్సరముల వయస్సు కలిగిన మహిళా అభ్యర్ధుల నుండి క్రింది పోస్టులకు దరఖాస్తులు కోరియున్నారు . SC,ST,BC,EWS మహిళలకు5 ( సంవత్సరాల వయస్సు సడలింపు మరియు దివ్యాంగులకు 10 సంవత్సరాల వయస్సు సడలింపు (Upper age relaxation) కలదు.
పోస్ట్ వివరాలు: అకౌంటెంట్-1, అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్-1,పార్ట్ టైం డాక్టర్-1, చౌకీదారు కం నైట్ వాచ్ విమెన్-
1,ఆయా-6,ఎడ్యుకేటర్ పార్ట్ టైం -1,ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ పార్ట్ టైం -2,పీటీ ఇన్స్ట్రక్చర్ కం యోగ
టీచర్ పార్ట్ టైం-2,కుక్-1, హెల్పర్-1, హౌస్ కీపర్-2, హెల్పర్ కం నైట్ వాచ్ విమెన్-1

పైన ప్రకటించిన పోస్టులకు దరఖాస్తులు స్వీకరించుటకు గడువు 13.10.2025 నుండి 22.10.2025 5.00 PM వరకు, ఆసక్తిగల స్థానిక మహిళా అభ్యర్ధులు ntr.ap.gov.in నుండి దరఖాస్తులు డౌన్లోడు చేసుకొని పూర్తిచేసిన అన్ని ధ్రువపత్రాల నకళ్ళు గజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేయించి దరఖాస్తులు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయము , డోర్ నెంబర్ 6-93, కార్మెల్ చర్చి ఎదురురోడ్, కానూరు, విజయవాడ వారి కార్యాలయమునకు అభ్యర్ధులు స్వయముగా సమర్పించవలెనని జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి శ్రీమతి షేక్ రుక్సానా సుల్తాన బేగం గారు ఒక ప్రకటనలోతెలిపారు.

2 months ago | [YT] | 1

VJA NEWS 5

ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ'*

తేదీ.07-10-2025న పౌర్ణమి సందర్భంగా ఉదయం 05.55 గం.లకు ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద ఉన్న శ్రీ కామధేను అమ్మవారి ఆలయం నుండి 'ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ'కార్యక్రమం ప్రారంభమగును.

ఘాట్ రోడ్ అమ్మవారి గుడి,కుమ్మరి పాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ప్యాక్టరీ, చిట్టినగర్, కొత్త పేట, బ్రాహ్మణ వీధి నుండి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ జరుగుతుందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి. కె. శీనానాయక్ తెలిపారు.

సకల అభీష్టములు నెరవేర్చే ఈ విశిష్ట
కార్యక్రమంలో భక్తులంతా పాల్గొని శ్రీ దుర్గామల్లేశ్వరుల అనుగ్రహం పొందాలని, భక్తులందరికీ ఇదే దేవస్థానం నుండి ఆహ్వానమని కార్యనిర్వహణాధికారి పేర్కొన్నారు.

3 months ago | [YT] | 9

VJA NEWS 5

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ


నేడు అనగా ది 06.10.2025న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము విజయవాడ నందు 50 హుండీలు-237 Bags తెరచి లెక్కించగా ( దసరా సందర్భంగా మొదటి విడత నగదు:-రూ.3,57,92,708 /- బంగారం: 122 గ్రాములు, మరియు వెండి: కేజీల 9-700 గ్రాములు లభించినవి. రేపు మరొక విడత లెక్కింపు జరుగును.

💫పలు దేశాల విదేశీ కరెన్సీ వచ్చియున్నవి.
1. U.S.A (Dollars) -52
2. Singapore (Dollars) – 55
3. U.A.E (Dinar) - 130
4. Canadian (Dollar) - 5
5.Saudi-(Riyals)- 3
6.Kuwait (Dinar)- 7 ½

శ్రీ అమ్మవారి సేవలో
వి. కే. శీనా నాయక్
కార్యనిర్వహణాధికారి

3 months ago | [YT] | 4

VJA NEWS 5

పత్రికా ప్రకటన
తిరుమల, 2025 అక్టోబర్ 06

*అక్టోబరు 07న పౌర్ణమి గరుడ సేవ*

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో అక్టోబరు 07వ తేదిన పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జరుగనుంది.

ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహ‌రించి భక్తులకు దర్శనమిస్తారు.
-------------------
టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

3 months ago | [YT] | 2

VJA NEWS 5

గుంటుపల్లి గ్రామంలోని రామకృష్ణ నగర్ వాస్తవ్యులు అందరూ ఈరోజు సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారము తమ ప్రాంతం వికాసం కొరకు ఒకచోట సమావేశమైనారు తమ ప్రాంత అభివృద్ధి కొరకు 9 మంది కార్య నిర్వాహణ బృందం తో *రామకృష్ణ నగర్ వికాస మండలి* ని చుక్కపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఈ ప్రాంతంలో ఖాళీగా ఉన్న పార్కు స్థలాన్ని గ్రామస్తులు మరియు పంచాయతీ వారి సమిష్టి సహకారంతో అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించారు.

3 months ago | [YT] | 4

VJA NEWS 5

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ మళ్లింపు వివరాలు పార్కింగ్ ప్రదేశాలు విజయవాడ నగరం లో*ట్రాఫిక్ మళ్ళింపులు మరియు పార్కింగ్ ప్రదేశాలు*

3 months ago | [YT] | 0

VJA NEWS 5

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ మళ్లింపు వివరాలు పార్కింగ్ ప్రదేశాలు విజయవాడ నగరం లో*ట్రాఫిక్ మళ్ళింపులు మరియు పార్కింగ్ ప్రదేశాలు*

3 months ago | [YT] | 1

VJA NEWS 5

కొండపల్లి ఈఎస్ఐ డిస్పెన్సరీని సందర్శించిన బిఎమ్ఎస్ నేతలు

భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి, ESI బోర్డు సభ్యులు శ్రీ ఎస్. దురై రాజు గారు, BMS రాష్ట్ర కార్యదర్శి శ్రీ లోవరెడ్డి గారు 19.09.2025న కొండపల్లి ఈఎస్ఐ డిస్పెన్సరీని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ యూనియన్ (BMS అనుబంధం) తరఫున స్టేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ పి. బాలకృష్ణ గారు కూడా పాల్గొన్నారు.

డిస్పెన్సరీ పరిస్థితులను సమీక్షిస్తూ, సిబ్బందితో మాట్లాడి, రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా –

షుగర్ టెస్ట్ కోసం అవసరమైన పరికరాలు లేవు

వేయిటింగ్ పేషెంట్లకు కుర్చీలు/బెంచీలు లేకపోవడం

నీటి సౌకర్యం లేకపోవడం (మోటార్ చెడిపోయింది) అని గుర్తించారు.

ఈ సమస్యలను కూలంకషంగా విన్న అనంతరం, శ్రీ ఎస్. దురై రాజు గారు మాట్లాడుతూ – “కార్పొరేషన్ స్థాయిలో సాధ్యమైనంతలో, ఈ సమస్యలను ఒక నెల రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాను” అని హామీ ఇచ్చారు.

3 months ago | [YT] | 1