Welcome to PSR TIMES the pulse of Telugu States. We bring you the fastest, most reliable, and in-depth Telugu News Updates across all major categories. Subscribe for Daily News that matters

Your source for spiritual inspiration, devotional reflections, and insightful coverage of current affairs and political developments shaping our world.🙏 Dive deep into daily devotional messages that uplift your soul and bring peace and positivity to your life.

Stay informed with balanced, up-to-date discussions on political events and social issues impacting communities locally and globally.
🌍 Explore thoughtful analysis and respectful dialogue around public policy, governance, and pressing societal challenges.Subscribe and join our growing community of thoughtful viewers seeking both spiritual growth and awareness of the world’s happenings. Don't forget to Subscribe channel to receive timely.

#Devotion #CurrentAffairs #Politics #PublicIssues #Spirituality #NewsAnalysis
updates



PSR TIMES

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్

1 week ago | [YT] | 27

PSR TIMES

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో “ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47”

“ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47” చిత్రీకరణ ప్రారంభం

ఆకట్టుకుంటున్న “ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47” ఫస్ట్ లుక్

తెలుగు చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేసిన విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో రానున్న చిత్రం కోసం సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా వెంకటేష్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే, చక్కిలిగింతలు పెట్టే హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో కుటుంబ బంధాలను, విలువలను తెలియజేసే చిత్రాలను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ దిట్ట. అందుకే వీరి కలయిక, ప్రకటనతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.

వెంకటేష్ సినీ ప్రయాణంలో 77వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాకి “ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47” అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ లోగోని గమనిస్తే.. వినోదభరితమైన ఈ కుటుంబ కథా చిత్రంలో ఉత్కంఠ రేకెత్తించే అంశాలు కూడా ఉంటాయని అర్థమవుతోంది.

“ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47” ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. వెంకటేష్ ఫ్యామిలీ మ్యాన్ లుక్‌లో క్లాస్ గా కనిపిస్తున్నారు. హృదయాన్ని తాకే భావోద్వేగాలతో నిండిన ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రాబోతోందనే సంకేతాన్ని ఫస్ట్ లుక్ ఇస్తోంది. ఈరోజు హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ మొదలైంది. వెంకటేష్-త్రివిక్రమ్ కలయిక మరోసారి ప్రేక్షకులందరికీ చిరస్మరణీయమైన అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది.

వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో చిత్ర ప్రకటన వచ్చినప్పటి నుంచి చిత్ర పరిశ్రమతో పాటు, సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. పైగా త్రివిక్రమ్ శైలి భావోద్వేగాలు, హాస్యం, కుటుంబ విలువలను మేళవిస్తూ తెరకెక్కించే చిత్రంలో వెంకటేష్ నటిస్తుండటం ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. వెంకటేష్ తో కలిసి, ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని త్రివిక్రమ్ అందిస్తారనే అంచనాలు ఉన్నాయి.

ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ పతకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 వేసవిలో భారీగా విడుదలకు సిద్ధమవుతోంది. వెంకటేష్, త్రివిక్రమ్ కలయిక కావడంతో ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు టైటిల్, ఫస్ట్ లుక్ విడుదలతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రేక్షకులు, అభిమానులు ఈ అద్భుత కలయిక తెరపై ఏ మాయ చేస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా.. హాస్యం, భావోద్వేగాల మేళవింపుతో వెండితెరపై వినోదాల విందుని అందించడానికి సిద్ధమవుతున్నారు.

2 weeks ago | [YT] | 9

PSR TIMES

తిరుపతి : తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. హంస వాహనంపై సరస్వతి అలంకారంలో సిరుల‌త‌ల్లి

1 month ago | [YT] | 17

PSR TIMES

తిరుపతి : శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

1 month ago | [YT] | 42

PSR TIMES

Radiating Beauty in every frame ✨

Gorgeous @ItsAnuEmmanuel charms every heart in the most beautiful avatar ❤️❤️

#AnuEmmanuel #TheGirlfriend

1 month ago | [YT] | 12

PSR TIMES

తిరుపతిలో వేడుకగా కార్తీక దీపోత్సవం. గోవింద నామస్మరణతో మారుమోగిన టీటీడీ పరిపాలన భవనం మైదానం. భారీ సంఖ్యలో హాజరైన భక్తులు.. గోవిందా..

1 month ago | [YT] | 19

PSR TIMES

నవీన్ యాదవ్ గెలుపును అధికారికంగా ప్రకటించిన ఈసీ... పార్టీలవారీగా ఓట్లు, నోటాకు పడ్డ ఓట్లు ఇవే!

24,729 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపు

నోటాకు ఓటు వేసిన 924 మంది ఓటర్లు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరోసారి తన ఆధిక్యాన్ని నిరూపించుకుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

నవీన్ యాదవ్ కు 98,988 ఓట్లు రాగా... బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇండిపెంటెంట్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిలో బేర బాలకిషన్ కు అత్యధికంగా 175 ఓట్లు వచ్చాయి. నోటాకు 924 మంది ఓటు వేశారు.

1 month ago | [YT] | 17

PSR TIMES

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, మహేష్ బాబు పి, మైత్రి మూవీ మేకర్స్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' టైటిల్ ట్రాక్ ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్

1 month ago | [YT] | 10

PSR TIMES

కాంతలో కుమారి క్యారెక్టర్ చేయడం నా అదృష్టం. ఇది కంప్లీట్ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది: హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే

1 month ago | [YT] | 5