Rajashekar Sharma

Exploring Sanatan Dharma in Details..🚩

మనం పఠించే లేదా జపించేటప్పుడు మంత్రం యొక్క అర్థం తెలుసుకోవడం చాలా అవసరం ఎందుకంటే మంత్ర పఠించే సమయంలో అర్థం తెలిసినట్లైతే మంత్రంలోని దేవిదేవతల రూపం, భావనలు మనకు అర్థం అవ్వటం వలన జపిం, ధ్యానం చేసే సమయంలో ఏకాగ్రత, విశ్వాసం పెరుగుతుంది. వారి అనుగ్రహం లభిస్తుంది.

అత్యంత శక్తివంతమైన ప్రముఖ మంత్రాలకు, స్తోత్రాలకు, శ్లోకాలకు సరళా తెలుగు బాషలో అర్థం, భావం అందించబడుతుంది. చానల్ ని అందరికీ youtube.com/@RajaShekarSharma చానల్షే ని ర్ చేసి మన సనాతన ధర్మంలోని విశేషమైన మంత్రాల యొక్క అర్థం అందరూ తెలుసుకునే అవకాశం కల్పించండి.


Rajashekar Sharma

సకల విద్యా స్వరూపిణి, పరాశక్తి, జ్ఞాన ప్రదాయిని శ్రీ సరస్వతి అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరికీ లభించాలని కోరుకుంటూ..

మిత్రులకు, శ్రేయోభిలాషులకు..

" వసంత పంచమి "
శుభాకాంక్షలు
💐💐🪷💐💐

🙏 శ్రీ మాత్రే నమః 🙏

#vasantpanchami #BasantPanchami #Saraswati #VasantPanchami2026 #saraswatipuja2026

1 day ago | [YT] | 42

Rajashekar Sharma

సభ్యులకు నమస్కారం..🙏
మన ఛానల్ లో వస్తున్న వీడియో పోస్టులకు సంబంధించిన ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే చెప్పగలరు.

2 months ago | [YT] | 10

Rajashekar Sharma

కార్తీక మాసం సందర్భంగా మన ఛానల్ లో ఏ స్తోత్రానికి తెలుగు అర్థం కావాలనుకుంటున్నారు..?

3 months ago | [YT] | 15

Rajashekar Sharma

ఎంతటి అవరోధాలు ఎదురైనా ప్రయత్నాన్ని ఆపకండి..⚡

#truefacts #factsyoudidntknow #facts #FactsMatter #humanmentality #mentality #insprationalstory #RajaShekarSharma #todaybestphoto #krishna #mahabharat

4 months ago | [YT] | 8

Rajashekar Sharma

భగవద్దర్శనం, మహాత్ముల సూచనలు పాటించడం, అనవసర విషయాల జోలికి పోకపోవడం లాంటివి చేస్తే ఆధ్యాత్మిక పురోగతి, తద్వారా భగవదనుగ్రహం కలుగుతాయి. అలా అనుభవజ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞానం సాధకుడికి ఒక్క క్షణంలో లభించే వస్తువు కాదు.

ఒక్కొక్క రూపాయి పొదుపు చేసి లక్షలు కూడబెట్టినట్లు సాత్వికానుభవంతో జ్ఞానం ప్రతిక్షణం ప్రవర్ధమానమవుతుంది. అలా పొందిన అనుభవ జ్ఞానానికి మించింది లేదు. దాని బలంతో సాధించలేనిది లేదు.

1 year ago | [YT] | 21

Rajashekar Sharma

రేపు కార్తీక పౌర్ణమి.."


ॐ ప్రతివాళ్ళూ ఇళ్లలో కార్తీక పౌర్ణమి దీపం పెట్టుకుంటారు. అందుకే ఆ రోజు వెలిగించే దీపాలు గుత్తిదీపాలు కూడా పెడతారు. దానికి రెండు కారణాలు.
ॐ ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజు ఉండకూడదు. శాస్త్రంలో ఏమిటంటే యధార్దంగా మీరు ఇల్లు కట్టి ఎక్కడికైనా తాళం వేసి వెళ్ళిపోతున్నారనుకోండి. ఇంటి బ్రహ్మగారు వుంటారు.
ॐ ఆయన్ని పిలిచి అయ్యా! మేము కాశీ పట్టణానికి వెళుతున్నాం. రావటానికి ఒక ఇరవై రోజులు పడుతుంది.
ఈ ఇరవై రోజులు మీరు కాస్త మా పూజామందిరంలో దీపం వెలిగించి స్వామికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి అని చెప్పి వెళ్ళాలి ఇంటి తాళమిచ్చి.
ॐ ఆయన రోజూ దీపం పెట్టి వెళ్ళేవారు. ఇంట దీపం వెలగలేదు అంటే పరమ అమంగళకరమైన గృహం అని గుర్తు. అలా నీ ఇండ్లన్నవి ఎన్ని ఉన్నాయో అన్నిచోట్లా దీపం వెలగాలి.
ॐ స్వగృహే అని నీవు ఎక్కడ కూర్చుని సంకల్పం చెప్పగలవో అక్కడన్నిచోట్లా దీపాలు వెలుగుతూ వుండాలి 365 రోజులు! అలా దీపం వెలగకపోతే ఆ దోషం మీకే వస్తుంది.
ॐ మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవటానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడిన అద్భుతమైన తిధి కార్తీక పౌర్ణమి.
అందుకే కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు గుత్తిదీపం అని ఆవునేతిలో ముంచి వెలిగిస్తూంటారు.
ॐ పదిరోజులొ, పదిహేనురోజులో, ఇది తెలియకముందెప్పుడు తప్పు చేసిన రోజులెన్నెన్ని వున్నాయో ఒక ఏడాదంతా నేను దీపం పెట్టకపోతే ఎంత పాపం వస్తుందో, అదంతా పోవాలని 365 వత్తులు వెలిగించి వచ్చేస్తారు.
ॐ దీపాలు వెలిగించుకోవాలి. ఇంటి యజమాని వెలిగించాలి .మా ఆవిడ వెలిగిస్తుంది .నేను టీవి చుస్తాను అని అనకూడదు. యజమాని పంచె కట్టుకుని వెళ్లి దేవాలయంలో దీపం పెట్టాలి.
ॐ యజమాని ఇంట్లో దీపం పెడితే సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి. ధర్మపత్నీ సమేతస్య అని సంకల్పం వుందిగాని ఆవిడ వెలిగించి ధర్మపతీ సమేతస్య అని సంకల్పం లేదు. నువ్వు పెట్టాలి దీపం.
ॐ పురుషుడు యజమాని ఇంటికి. కాబట్టి యజమానీ ఆ రోజున ఇది చెయ్యకపోతే అతనికి పరమేశ్వరుడు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్నవాడవుతాడు.
ॐ కాబట్టి ఎంతంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం. దేవాలయ ప్రాంగణంలో కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట్లో అయితే తిధిని ప్రమాణం తీసుకోవాలి.
ॐ ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిధి ప్రధానం. దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతిని వెలిగిస్తారు.



హర హర మహాదేవ! శంభోశంకర హర!!


ॐ సర్వం శివమయం జగత్ ॐ


#ShivholicSharma #కార్తీకమాసం #శివోహం #కార్తీకపురాణం #ఓంనమఃశివాయ #karteekamasam #kartikamasam #kartikamasamdeepalu #kartikadeepam #karteekadeepam #karteekamasam2023 #kartikamasamspecial #IamShivholic #WeAreShivholics #MahadevFan #Mahakaal #kartikamasam2024 #thalapathranidhi #RajaShekarSharma #omnamahshivaya #harharmahadev #mahadev #mahadevstatus #karteekapournami


🚩🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏🚩


🙏🙏🙏🙏🚩🙏🙏🙏🙏

1 year ago | [YT] | 56

Rajashekar Sharma

#శ్రీకార్తీక_పురాణము 8వ అధ్యాయము


|| శ్రీహరినామస్మరణ సర్వఫలప్రదము ||


ధర్మము మూడు రకాలు అవి సాత్విక, రాజస, తామసములు.
సాత్వికము అనగా దేశకాల పాత్రలు మూడునూ సమయాన సత్త్వామనే గుణము జనించి ఫలమంతా పరమేశ్వరార్పితము గావించి, మనోవాక్కయ కర్మలచే నొనర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతో ఆధిక్యత కలదు. సాత్త్విక ధర్మము సమస్త పాపములు నాశనమొనర్చి పవిత్రలను చేసి దేవలోక సుఖములు చేకూర్చును.ఉదాహరంగా తామ్రపర్ణినది సముద్రంలో కలిసే తావునందు స్వాతికార్తెలో ముత్యపుచిప్పలో వర్షబిందువు పడి ధగధగ మెరిసి, ముత్యంగ మారే విధంగా సాత్త్వికత వహించి, సాత్త్వికధర్మము ఆచరిస్తూ గంగ, యమున, గోదావరి, కృష్ణానదులు పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల యందూ, దేవలయాలందూ వేదాలు పఠించి, సదాచారుడై, కుటుంబీకుడైన బ్రాహ్మణుడు ఎంత స్వల్పదానము చేసినా లేక దేవాలంలో జపతపాదులు ఒనరించినను విశేషఫలమును పొందగలరు.
రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్తవిధులు విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్టసుఖాలను కలిగించునదగును.
తామస ధర్మమనగా శాస్త్రోక్తవిధులను విడివి దేశకాల పాత్రములు సమకూడని సమయమున డాంబికాచరణార్ధము చేయు ధర్మము. ఆ ధర్మము ఫలమునీయదు.
దేశకాలపాత్రముల సమకూడినపుడు తెలిసిగాని, తెలియకగాని ఏ స్వల్పధర్మమును చేసిననూ గొప్పఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము, తెలిసిగాని, తెలియకగాని ఉచ్ఛరించిన వారి సకల పాపములు పోయి ముక్తిపొంపుతారు. దీనికొక ఇతిహాసము కలదు.


|| అజామీళుని కథ ||


పుర్వకాలంలో కన్యాకుబ్జము అనే నగరంలో నాల్గువేదాలు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణరాశియగు హేమవతి అనే భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమకలిగి అపూర్వ దంపతులు అని పేరు బడసిరి. వారికి చాలాకాలానికి లేకలేక ఒక కుమారుడు జన్మించాడు. వారు ఆ బాలున్ని అతిగారబంగా పెంచుతూ, అజామీళుడని పేరు పెట్టరు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతిగారాబం వలన పెద్దలను కూడ నిర్లక్ష్యంగా చూస్తూ, దుష్టసాహవాసములు చేస్తూ, విధ్యను అభ్యసించకుండా, బ్రాహ్మణధర్మలు పాటించక సంచరిస్తూండేవాడు. ఈ విధంగా కొంతకాలానికి యవ్వనంరాగా కామాంధుడై, మంచిచెడ్డలు మరచి, యజ్ణోపవితము త్రెంచి, మద్యన్ని సేవిస్తూ, ఒక ఎరుకల జాతి స్త్రీ ని వలచి, నిరంతరం ఆమెతో కామక్రీడలలో తేలియాడుతూ, ఇంటికి రాకుండా, తల్లితండ్రులను మరచి, ఆమె ఇంట్లోనే భుజించేవాడు. ఆ విధంగా అజామీళుడు కులభ్రష్టుడు కాగా, అతని బందువులు అతనిని విడిచిపెట్టారు. అందుకు అజామీళుడు రెచ్చిపొయి వేటవలన పక్షులు, జంతువులను చంపుతూ కిరాతకవృత్తితో జీవిస్తుండెవాడు. ఒకరోజు ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను. అజామీళుడు ఆస్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి, తరువాత అడవిలోనే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చెను. ఆ యెరుకల దానికి అంతక ముందే ఒక కుమార్తె వుండెని. కొంత కాలనికి ఆ బాలికకు యుక్తావయస్సురాగా కామాంధకారంచే కన్నుమిన్నుగానక అజామీళుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుతూ వుండెను. వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి. ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి. మరల ఆమె గర్బం ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరు ఆ బాలునికి "నారాయణ" అని పేరు పెట్టి పిలుస్తూ ఒక్కక్షణమైనా ఆ బాలున్ని విడువక ఎక్కడికి వెళ్లినా వెంటబెట్టుకొని వెల్తూ " నారాయణా - నారాయణా" అని ప్రేమతో సాకుచుండిరి. కాని "నారాయణ" అని స్మరించిన యెడల తన పాపములు నశించి, మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను. ఇట్లు కొంతకాలానికి అజామీళునికి శరీరపటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచముపట్టి చావుకి సిద్ధపడియుండెను. ఒకనాడు భయంకర ఆకారములతో, పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి వారిని చూసి అజామీళుడు భయము చెంది కుమారునిపై వున్న వత్సల్యము వలన ప్రాణములు విడువలేక "నారాయణా" "నారాయణా" అంటు ప్రాణలు విడిచెను. అజామీళుని నోట "నారాయణా" అను శబ్దము వినబడగానే యమబటులు గడగడ వణకసాగిరి. అదేవెళకు దివ్య మంగళాకారులు, శంఖ చక్ర గదాధరులూ అగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో అక్కఫికి వచ్చి" ఓ యమభటులారా! వీడు మావాడు.మేము వీనిని వైకుంఠనికి తిసుకుపొవాడనికి వచ్చము" అని చెప్పి అజామీళుని వీమానమెక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు "అయ్యా! మీరెవరు? వీడు అతిదుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకొని పోవడానికి మేము వచ్చము కవున వానిని మాకు వపులుము అమి కోరగ విష్ణు దూతలు ఇలా చెప్పరు.


ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము.


కార్తీక మాస ఎనిమిదవ రోజు దానధర్మ జపతపాది విధులు - ఫలితాలు
పూజించాల్సిన దైవము → దుర్గ
జపించాల్సిన మంత్రము → ఓం చాముండాయై విచ్చే స్వాహా
దానములు → తోచినవి, యథాశక్తి
నిషిద్ధములు → ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం
ఫలితము → ధైర్యం, విజయం



🙏🙏🙏 శివోహం 🙏🙏🙏


#ShivholicSharma #karteekamasam #kartikamasam #RajaShekarSharma #IamShivholic #WeAreShivholics #MahadevFan #కార్తీకమాసం #శివోహం #ఓంనమఃశివాయ #kartikamasamdeepalu #kartikadeepam #karteekadeepam #karteekamasam2024 #kartikamasamspecial #Mahakaal #thalapathranidhi #omnamahshivaya #harharmahadev #mahadev #mahadevstatus #karteekapournami


🚩🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏🚩


౹౹ హరిఓం ౹౹


🙏🙏🙏🙏🚩🙏🙏🙏🙏

1 year ago | [YT] | 25

Rajashekar Sharma

#కార్తీకమాసం రేపటి రోజున..
కార్తీకమాసం 2వ రోజు పాటించవలసిన నియమాలు దానధర్మ జపతపాది విధులు - వాటి ఫలితాలు..

🔸౹౹౹ ॐ... శివోహం ...ॐ ౹౹౹🔸

🚩 హర హర మహాదేవ్ 🚩

ॐ సర్వం శివమయం జగత్ ॐ

#shivholicsharma #karteekamasam #kartikamasam #RajaShekarSharma #iamshivholic #weareshivholics #mahadevfan #కార్తీకమాసం #శివోహం #ఓంనమఃశివాయ #kartikamasamdeepalu #kartikadeepam #karteekadeepam #karteekamasam2024 #kartikamasamspecial #mahakaal #thalapathranidhi #omnamahshivaya #harharmahadev #mahadev #mahadevstatus #karteekapournami

🚩🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏🚩

౹౹ హరి ఓం ౹౹

1 year ago | [YT] | 19

Rajashekar Sharma

రేపటి దేవి నవరాత్రులు 8వ రోజున అమ్మవారి అవతారం..

8. మహాగౌరి మాత

దుర్గామాత యొక్క ఎనిమిదవ స్వరూపానికి ‘మహాగౌరి.
తల్లి గౌరీ దేవి, శక్తి, మాతృదేవత, దుర్గా, పార్వతి, కాళీ అని అనేక రూపాల్లో కనిపిస్తుంది. ఆమె పవిత్రమైనది, తెలివైనది. చెడు పనులను చేసేవారిని శిక్షించి, మంచి వ్యక్తులను రక్షిస్తుంది. తల్లి గౌరీ మోక్షాన్ని ఇవ్వడం ద్వారా పునర్జన్మ భయాన్ని తొలగిస్తుంది.
ఈమె పూర్తిగా గౌరవర్ణశోభిత. ఈమె గౌరవర్ణశోభలు మల్లెపూలూ, శంఖం, చంద్రులను తలపింపజేస్తాయి. ఈమె అష్టవర్షప్రాయముగలది (అష్టవర్షభవేద్గౌరీ). ఈమె ధరించే వస్త్రాలూ, ఆభరణాలూ ధవళ కాంతులను వెదజల్లుతుంటాయి. చతుర్భుజ, సింహవాహన. ఒక కుడిచేత అభయముద్రనూ, మరొక కుడి చేతిలో త్రిశూలాన్నీ వహించి ఉంటుంది. ఒక ఏడమచేతిలో డమరుకమూ, మరొక ఎడమ చేతిలో వరదముద్రనూ కలిగి ఉంటుంది. ఈ ముద్రలలో ఈమె దర్శనం ప్రశాంతంగా ఉంటుంది.

పురాణ చరిత్ర:

పార్వతీదేవి తన భర్తగా శివుడిని పొందడంకోసం నారదుడు ఇచ్చిన సలహాతో తపస్సు చేయటానికి పూనుకుంది. కాబట్టి, ఆమె రాజ భవనాన్ని, అన్ని సౌకర్యాలను విడిచి, అడవికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది. ఆమె ఎండ, చలి, వర్షం, కరువు, భయంకరమైన తుఫానులను కూడా లెక్కచేకుండా చాలా సంవత్సరాలు కఠిన తపస్సు కొనసాగింది. దాంతో పార్వతి శరీరం దుమ్ము, ధూళి, నేల, చెట్ల ఆకులతో నిండిపోయింది. అప్పుడు ఆమె తన శరీరంపై నల్లటి చర్మాన్ని ఏర్పాటుచేసుకుంది. చివరికి, శివుడు ఆమెముందు ప్రత్యక్షమై, ఆమెను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడు. అతను తన ముడి వేసిన జుట్టు నుండి వెలువడే గంగా నది పవిత్ర జలాల ద్వారా ఆమెను తడిపాడు. గంగ పవిత్రమైన జలాలు పార్వతికి అంటుకున్న మురికిని కడిగివేయడంతో ఆమె మహిమాన్వితమైన తెల్లని రంగులోకి మారింది. ఆ విధంగా తెల్లని రంగును సంపాదించడం ద్వారా పార్వతిని మహాగౌరి అని పిలుస్తారు.

ఇంకో కధ ప్రకారం..

పుట్టుకతోనే నల్లని రంగు గల పరమేశ్వరిని ... పతి అయిన పరమేశ్వరుడు ఒకసారి పరిహాసముగా " కాళీ " అని పిలుస్తాడు. దాంతో ఆమె శివునితో పంతగించి , బ్రహ్మ గురించి కఠోర తపస్సు చేసి ... ఆ నల్లని దేహాన్ని వదిలి శివునికి దీటుగా తెల్లని ఛాయతో 'మహా గౌరి 'గా అవతరించినది .
అష్టమ శక్తియైన మహాగౌరి పూజ కరణంగా ప్రాప్తించే మహిమలు శ్రీదేవీ భాగవతంలో వర్ణించబడినవి.
ఈమె నామస్మరణ చేత సత్ప్రవర్తన వైపు మనసు నడుస్తుంది. సర్వవిధ శుభంకరి - మహాగౌరి.
ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషాలన్నీ ప్రక్షాళన చెందుతాయి. వారి పూర్వసంచిత పాపాలన్నీ పూర్తిగా నశిస్తాయి. భవిష్యత్తులో కూడా పాపతాపాలుగానీ, దైన్యదుఃఖాలు కానీ వారి దరిజేరవు. వారు సర్వ విధాలా పునీతులై, అక్షయంగా పుణ్య ఫలాలను పొందుతారు.
మహాగౌరీ మాతను ధ్యానించటం, స్మరించటం, పూజించటం, ఆరాధించటం, మున్నగు రీతుల్లో సేవించటం వల్ల భక్తులకు సర్వ విధాలైనట్టి శుభాలు చేకూరుతాయి. దేవి కృపవల్ల ఎల్లరికీ అలౌకిక సిద్ధులు ప్రాప్తిస్తాయి. మనస్సును ఏకాగ్రచిత్తం చేసి, అనన్య నిష్ఠతో సాధకులు ఈ దేవి పాదారవిందాలను సేవించటంవల్ల వారి కష్ఠాలు మటుమాయమవుతాయి.
ఈమె ఉపాసన ప్రభావం వల్ల అసంభవాలైన కార్యాలు సైతం సంభవాలవుతాయి. కనుక సర్వదా సర్వదా ఈమె పాదాలను శరణుజొచ్చటమే కర్తవ్యము. పురాణాలలో ఈమె మహిమలు శతథా ప్రస్తుతించబడ్డాయి. ఈమె సాధకుల మనో వ్యాపారాలను అపమార్గాల నుండి సన్మార్గానికి మరలిస్తుంది.
మనం అనన్య భక్తి ప్రపత్తులతో ఈమెకు శరణాగతులమవటం ఎంతో శుభదాయకం.

ధ్యాన శ్లోకము:

శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః
మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవప్రమోదదా

అలంకారము: మహిషాసురమర్ధిని - ఎర్రని ఎరుపు రంగు
నివేదనం:( బెల్లంఅన్నం

🙏 ఓం శ్రీ మాత్రేనమః 🙏

#navratri #navratri2024 #navratrivibes #navratrispecial #navratrispecial #shailaputri #SriMatreNamaha #RajaShekarSharma #thalapathranidhi #HinduDharmikaSena #dasara #dussehra #festival #maadurga #JaiBhavani #Jogulamba #నవరాత్రి #నవరాత్రులు #దసరా #దుర్గ #విజయదశమి #దేవినవరాత్రులు #kanakadharastotram #maalaxmi #laxmi #mantra #navaratri #devinavaratri #devinavarathrulu #devinavaratrulu

🙏 సర్వేజనా సుఖినోభవంతు 🙏

🙏 ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే 🙏

1 year ago | [YT] | 61