This channel is a proof of our love and responsibility for the village. Its main purpose is to bring the village to the front of the room. Even if you are not in the village, everyone can watch the celebrations here through this channel. Experiences can be shared. You can swim in the lakes of memories. Its purpose is to make the concept of who we are, no matter where we are, from our minds.
The aim of this is to protect our mother town from being separated... 🙏
మన మహిమలూరు
Hare Krishna 🙏
11 minutes ago | [YT] | 0
View 0 replies
మన మహిమలూరు
Jai Jagannath 🙏🙏
11 minutes ago | [YT] | 0
View 0 replies
మన మహిమలూరు
సంక్రాంతి పండుగ పర్వదినాన గౌరవనీయులైన డాక్టర్ జి. సతీష్ రెడ్డి గారు తన సొంత గ్రామమైన మన మహిమలూరును సందర్శించారు. ఈ సందర్భంగా అరుంధతి వాడలో గ్రామ ప్రజలతో ఆత్మీయంగా కలుసుకొని వారి అభివృద్ధి, సంక్షేమంపై చర్చించారు. అనంతరం గ్రామంలోని దేవాలయాలను సందర్శించి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.
#Mahimaluru #SankranthiCelebrations #GSatishReddy #GramaSeva #ManaGramaGauravam @mahimaluru
13 hours ago | [YT] | 3
View 0 replies
మన మహిమలూరు
గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ గారు, గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరియు కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి సమక్షంలో, మంత్రివర్యులు శ్రీ ఎల్. మురుగన్ గారి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకలలో మన రామ్మోహన్ నాయుడు గారు పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది.
దేశవ్యాప్తంగా జరుపుకునే సంక్రాంతి, పొంగల్ మరియు ఉత్తరాయణ పండుగలు మన మధ్య బంధాన్ని మరింత బలపరుస్తూ, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని పటిష్టం చేస్తాయి.
1 day ago | [YT] | 18
View 0 replies
మన మహిమలూరు
Darshan of the day - Hare Krishna Golden Temple, Hyderabad
1 day ago | [YT] | 3
View 1 reply
మన మహిమలూరు
శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
సకల దేవతలను ఆహ్వానిస్తూ
#Srisailam
2 days ago | [YT] | 10
View 0 replies
మన మహిమలూరు
#Bhogi
2 days ago | [YT] | 11
View 0 replies
మన మహిమలూరు
నెమలి పించంపై డిఆర్డిఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి గారి చిత్రం
- గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్ అమీర్ జాన్ ప్రతిభను ప్రశంసించిన సతీష్ రెడ్డి గారు.
భారత రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మాజీ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గౌరవ సలహాదారు డాక్టర్ జి. సతీష్ రెడ్డి గారి పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్ షేక్ అమీర్ జాన్ నెమలి పించంపై సతీష్ రెడ్డి గారి చిత్రాన్ని చిత్రీకరించి తన అద్భుత నైపుణ్యంతో అబ్బుర పరిచారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని షేక్ అమీర్ జాన్ గారు డాక్టర్ సతీష్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసి నెమలి పించంపై తాను చిత్రించిన సతీష్ రెడ్డి గారి చిత్రపటాన్ని ఆయనకు బహుకరించారు.
ప్రకృతి సిద్ధమైన నెమలి పించంపై ముఖ కవళికలు స్పష్టంగా కనిపించేలా "యాకర్లిక్" పెయింటింగ్ తో అమీర్ జాన్ గీసిన ఈ చిత్రం అతని చిత్రలేఖనా ప్రతిభకు అద్దం పట్టేలా ఉంది. శాస్త్ర సాంకేతిక రంగంలో దేశానికి సతీష్ రెడ్డి గారు చేసిన సేవలకు గుర్తింపుగా ఒక కళాకారుడిగా తన వంతు గౌరవాన్ని ఈ విధంగా ప్రకటించానని అమీర్ జాన్ తెలిపారు. అతి సూక్ష్మమైన నెమలి పించంపై ఇంతటి అందమైన చిత్రాన్ని గీసిన అమీర్ జాన్ గారి ప్రతిభను డాక్టర్ సతీష్ రెడ్డి గారు కొనియాడారు. గిన్నిస్ రికార్డు గ్రహీత అయిన అమీర్ జాన్ ఇలాంటి మరెన్నో అద్భుత కళాఖండాలను సృష్టించాలని డాక్టర్ సతీష్ రెడ్డి గారు ఆకాంక్షించారు.
2 days ago | [YT] | 7
View 0 replies
మన మహిమలూరు
తిరుమల ఘాట్ రోడ్డు ప్రయాణానికి సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న సమయాలు మరియు నిబంధనలు కింద ఇవ్వబడ్డాయి. భక్తుల భద్రత మరియు వన్యప్రాణుల రక్షణ దృష్ట్యా టీటీడీ (TTD) ఈ సమయాలను నిర్ణయించింది.
ఘాట్ రోడ్డు సమయాలు (Ghat Road Timings)
కార్లు / బస్సులు (Four Wheelers) : తెల్లవారుజామున 3:00 AM నుండి రాత్రి 12:00 AM వరకు...అర్ధరాత్రి 12 నుండి 3 వరకు రోడ్డు మూసివేస్తారు.
ద్విచక్ర వాహనాలు (Two Wheelers) ఉదయం 6:00 AM నుండి రాత్రి 9:00 PM వరకు..జంతువుల వల్ల రాత్రి వేళల్లో బైక్‌లకు అనుమతి లేదు.
ప్రయాణ సమయ నిబంధనలు (Time Lock Rules)
ఘాట్ రోడ్డులో ప్రమాదాలను అరికట్టడానికి టీటీడీ ప్రయాణ సమయంపై పరిమితులు విధించింది. టోల్ గేట్ వద్ద మీ వాహనం ఎంట్రీ టైమ్ రికార్డ్ చేస్తారు:
* తిరుపతి నుండి తిరుమల (Upward): కనీసం 28 నిమిషాలు పట్టాలి.
* తిరుమల నుండి తిరుపతి (Downward): కనీసం 40 నిమిషాలు పట్టాలి.
* నిర్ణీత సమయం కంటే ముందే చేరుకుంటే టోల్ గేట్ వద్ద జరిమానా విధించే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణంలో వేగం తగ్గించి, ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్లడం మంచిది.
పాదచారుల మార్గం సమయాలు (Footpath Timings)
ఒకవేళ మీరు నడక మార్గంలో వెళ్లాలనుకుంటే:
* అలీపిరి మెట్ల మార్గం: ఉదయం 6:00 నుండి సాయంత్రం 6:00 వరకు.
* శ్రీవారి మెట్టు మార్గం: ఉదయం 6:00 నుండి సాయంత్రం 5:00 వరకు.
* (గమనిక: చిన్న పిల్లలతో ఉన్న తల్లిదండ్రులకు కొన్నిసార్లు మధ్యాహ్నం 2:00 గంటల వరకే అనుమతి ఇస్తారు.)
ముఖ్యమైన సూచనలు:
* ఘాట్ రోడ్డులో ఎక్కడా వాహనాలు ఆపకూడదు.
* మద్యం, పొగాకు ఉత్పత్తులు మరియు ప్లాస్టిక్ వస్తువులను కొండపైకి తీసుకెళ్లడం నిషేధం.
* తిరుమల వెళ్లే దారిలో అడవి జంతువులు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి.
4 days ago | [YT] | 1
View 0 replies
మన మహిమలూరు
వైకుంఠద్వార దర్శనాలు విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన అధికారులందరికీ ధన్యవాదాలు.
టీటీడీ చరిత్రలోనే కాక, ఎన్నడూ లేని విధంగా ఈసారి వైకుంఠద్వార దర్శనాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి.
🔹 రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులకు వైకుంఠద్వార దర్శనం
🔹 టీటీడీ ఏర్పాట్లు, సదుపాయాలపై 93% భక్తులు సంతృప్తి
🔹 2024లో 6.83 లక్షలు, 2023లో 6.47 లక్షలతో పోలిస్తే భక్తుల సంఖ్యలో గణనీయ వృద్ధి
🔹 10 రోజుల్లో రూ.41 కోట్ల హుండీ ఆదాయం
🔹 44 లక్షల లడ్డూలు విక్రయం – గతేడాదితో పోలిస్తే 10 లక్షలు అధికం
🔹 గతేడాదికంటే 27% అధికంగా అన్నప్రసాదాల పంపిణీ
🔹 50 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల పండ్లు, 4 టన్నుల కట్ ఫ్లవర్స్‌తో అద్భుత అలంకరణలు
🔹 కళ్యాణకట్ట, పారిశుద్ధ్యం, వైద్య సేవల ఏర్పాట్లు భక్తులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచాయి
🔹 AI కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ
🔹 ప్రణాళికాబద్ధ క్యూలైన్ నిర్వహణతో అంచనాలకన్నా ఎక్కువ మందికి దర్శనం కల్పించగలిగాం
ఈ వైకుంఠద్వార దర్శనాలను శాంతియుతంగా విజయవంతం చేసిన భక్తులకూ, మెరుగైన సేవలు అందించిన అధికారులు, సిబ్బంది మరియు సేవకులకూ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
#TTD #Tirumala #Tirupati #SriVenkateswara #SrivariDarshanam
#VaikuntaDwaraDarshanam #VaikuntaEkadasi #VaikuntaDwaram
#Devotees #Annaprasadam #LadduPrasadam
#TTDAdministration #PublicService #TempleManagement
6 days ago | [YT] | 28
View 1 reply
Load more