Thanks for checking out HOME BRO
Buying a Real Estate property is one of the safest & beneficial investment options & at the same time without a professional assistance, property assistance means putting at a stake huge amounts of hard-earned money.
Me with my crew who are dedicated & hard working professionals in the field of Real Estate services & Development, deal with all types of property services mostly related to Agricultural, Commercial & Residential Properties & Construction.
Our main motive of Business is to provide a Good Property to my Customers at a affordable and reasonable price & with Best service.
We deal in 100% transparency..
You all gonna like my channel, plz subscribe and share videos.
Contact us so that you will find accurate information so that it would save your time and you can get the overview of the property before visiting it.
Keep CRUSHING IT & we'll talk soon!
Business : DPropertyServices2020@gmail.com
9966242409
HOME BRO
8 months ago | [YT] | 0
View 0 replies
HOME BRO
వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండోవ రోజు ప్రాతః కాల విశేష దర్శనం లో స్వామివారు⛩️🌺🪔 🔱🙏🏻🙇🏻♂️
#namahshivaya #shiva
1 year ago | [YT] | 5
View 0 replies
HOME BRO
రుద్రేశ్వర స్వామి ⛩️🔱🪔🌺🙏
#RudreshwaraSwamy #ThousandPillarsTemple #happyugadi2024 #HarHarMahadev ॐ
1 year ago | [YT] | 14
View 0 replies
HOME BRO
Om Namah shivaya
He is observing everything
1 year ago | [YT] | 1
View 0 replies
HOME BRO
Ab Rule Pushpa ka 🔥🔥
#PushpaMassJaathara
#Pushpa2TheRule #Pushpa2Teaser #AlluArjun
1 year ago | [YT] | 1
View 0 replies
HOME BRO
2 years ago | [YT] | 0
View 0 replies
HOME BRO
Greatest of the Greatest.. #Viratkohli
3 years ago | [YT] | 0
View 0 replies
HOME BRO
Some useful information
From Team HomeBro
*భూమి కొనే ముందు పాటించవలసిన జాగ్రత్తలు*
*1. మీకు అమ్మడానికి వచ్చిన వ్యక్తిని ముందు ఆ ల్యాండ్ యొక్క డాక్యుమెంట్ అడిగి తీసుకోవాలి.*
*2. దానిని శ్రద్ధగా చదవాలి. నిశితంగా పరిశీలించాలి.*
*3. మీకు అమ్ముతాను అని చెప్పిన వ్యక్తి పేరు ఆ డాక్యుమెంట్ లో ఉన్న పేరు ఒకటేనా లేదా అని సరి చూసుకోవాలి.*
*4. అవసరమైతే ఆధార్ కార్డు అడిగి తీసుకుని మరీ సరి పోల్చుకోవాలి.*
*5. తర్వాత అమ్ముతాను అని వచ్చిన వ్యక్తికి అసలా ఆస్తి ఎలా సంక్రమించిందీ ఒకసారి అడిగి తెలుసుకోవాలి.*
*6. వక్ఫ్ భూములు, ఎండోమెంట్ భూములు, అసైన్డ్ భూములు పొరబాటున కూడా కొనకూడదు వాటిని అమ్మే హక్కు విక్రయ దారునికి, కొనే హక్కు మీకు ఉండదు. అవి గవర్నమెంట్ వారు ఇచ్చిన భూములు కాబట్టి ఎప్పుడైనా వాటిని తిరిగి తీసుకునే హక్కు గవర్నమెంట్ కు ఉంటుంది.*
*7. RSR/సేత్వార్ ప్రకారం భూమి classification ప్రభుత్వ భూమిగా వున్నదా లేక పట్టా భూమి గా వున్నదా పరిశీలించాలి.*
*8. ప్రభుత్వ భూముల నిషేధిత జాబితా యందు కొనుగోలు చేయు భూమి యొక్క సర్వే నెంబరు నమోదు అయి వున్నదా లేదా చూసుకోవాలి ఒక వేళ నమోదు అయి వుంటే సదరు భుమిని కొనుగోలు చేయకూడదు.*
*9. ex-service men కి గవర్నమెంట్ వారు ఇచ్చిన భూముల్ని, ఇచ్చినప్పటి నుండి 10 సంవత్సరాల వరకు అమ్మ కూడదు. అందువల్ల అలాంటి వారి దగ్గర కొనాలి అనుకుంటే వారికి ఆ భూమి వచ్చి 10 సంవత్సరాలు దాటిందో లేదో చూసుకుని మరీ కొనాలి.*
*10. మర్చిపోకుండా, నిర్లక్ష్యం చేయకుండా మీకు అతనిచ్చిన డాక్యుమెంట్ లోని సర్వే నంబరు, మీకు అమ్ముతాను అని చూపిస్తున్న ల్యాండ్ సర్వే నెంబర్ ఒకటేనా కాదా తెలుసుకోవాలి.*
*11. ఒక్కోసారి ఎక్కువగా ఎవరూ రాని, గమనించని ల్యాండ్ ఒకటి చూసుకుని ఈ డాక్యుమెంట్ లోని ల్యాండ్ ఇదే అని చెప్పి అమ్మేస్తారు.మనం ఎవరినైనా లోకల్ సర్వేయర్ ని తీసుకువచ్చి ఆ ల్యాండ్ సర్వే చేయించినా ఆ విషయం పైకి తేలదు. ఎందుకంటే అతనికి కూడా ఆ ల్యాండ్ సర్వే నెంబర్ తెలీదు. జస్ట్ అతను అమ్ముతాను అని చెప్పిన వ్యక్తి చూపించిన ల్యాండ్ ని సర్వే చేసి వెళ్ళిపోతాడు. అందువల్ల సర్వే కొలత సరిగ్గా వచ్చింది అని ల్యాండ్ కరెక్ట్ అనుకోకండి. డాక్యుమెంట్ లోని సర్వే నెంబర్ అతను చూపిస్తున్న ల్యాండ్ సర్వే నెంబర్ ఒకటేనా కాదా అని తెలుసుకోవాలి అంటే VRO ని కలిసి సర్వే నెంబర్ చెప్పి ఆయన దగ్గర ఉన్న పటం లేదా మ్యాప్ లో ఆ ల్యాండ్ ఉందొ లేదో ఉంటే ఎక్కడ ఉందో తెలుసుకోవాలి.*
*12. VRO ని మీకు చూపించిన ల్యాండ్ దగ్గరకు తీసుకెళ్లి చూపించి మరీ అడగాలి.*
*ఒక్కోసారి ల్యాండ్ ని అసలు ఓనర్స్ కాకుండా GPA(జనరల్ పవర్ అఫ్ అటార్నీ) holders అమ్ముతుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు ఎక్కువగా ఇలా చేస్తుంటారు.*
*అసలు ఓనర్ కి ఎంతో కొంత బయానా లేదా అడ్వాన్సు ఇచ్చి ఒక 4 నెలల్లో రిజిస్ట్రేషన్ పెట్టుకుందాము అని చెప్తారు. ఈలోపు దాన్ని ఎవరికో ఒకరికి మంచి బేరానికి అమ్మే ఒప్పదం చేసుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా మోసం జరిగే అవకాశం ఉంది. GPA హోల్డర్ అమ్మే హడావిడిలో ఎక్కువ వివరాలు సేకరించకుండా మనకు అమ్మేస్తారు. ఆ తర్వాత మోసపోయాక మనకు అసలు ఈ GPA హోల్డర్ కనిపించడు, అతనికి అమ్మిన అసలు ఓనర్ కనిపించడు. తర్వాత కోర్టు లు కేసులు అని తిరగాల్సి వస్తుంది.*
*ల్యాండ్ మ్యాప్ లో సర్వే నెంబర్ ఉంది అని తెలుసుకున్నాక, ఆన్లైన్ లో EC తీసుకోవాలి. దీనివల్ల మనకు ఆపొలం ఎటువంటి లోన్లు, తాకట్లు లాంటివి ఉన్నాయో తెలుస్తుంది. ఉదాహరణకు నేను ఐసీఐసీఐ బ్యాంకు లో నా పొలం కాగితాలు పెట్టి లోన్ తీసుకున్నాను అనుకోండి..అది మనకు EC లో తెలిసిపోతుంది. అదే కాకుండా ఇంకా ఆ ప్రధాన సర్వే నంబర్ల కింద ఉన్న వేరు యజమానులు పేర్లు కూడా తెలుస్తాయి. అందులో లింక్ డాకుమెంట్స్ కూడా దొరుకుతాయి. మీరు EC ఆన్లైన్ లో తీయాలి అంటే ఈ లింక్ ను క్లిక్ చేయండి. లేదా మీ-సేవ కి వెళ్లి అడిగినా కూడా ఇస్తారు.*
*13. తర్వాత పహాణీ లేదా అడంగళ్ కాపీలను ఎంత కుదిరితే అంత పాత కాలం నుండి అడిగి తీయించండి.*
*14. పహాణీలో లో ఏముంటుంది అంటే ఆ ఫలానా సర్వే నెంబర్ ల్యాండ్ లో ఏ సంవత్సరంలో ఎవరు కబ్జాలో ఉన్నారు. ఎంత విస్తీర్ణంలో కబ్జాలో ఉన్నాడు. కబ్జాలో ఉన్నవాడు యజమాని నా లేదా కౌలుదారా వంటి విషయాలు ఉంటాయి. ఈ పహాణి అనేది ప్రతి సంవత్సరం VRO ఆ ల్యాండ్ సందర్శించి తెలుసుకుని కొత్త పహాణీ రాస్తూ ఉండాలి. పాత పహాణీలు కూడా భద్రపరుస్తూ ఉంటారు.*
*15. మీరు కొనేటప్పుడు మండల ఆఫీస్ కి వెళ్లి పాత పహాణి లన్నీ తీయించి చూస్తే మీకు ఎన్ని సంవత్సరాల నుండి ఈ అమ్మే వ్యక్తి కబ్జాలో ఉన్నాడో తెలిసిపోతుంది.*
*16. ఫారం-1బి కూడా ఆన్లైన్ లో నుండి సేకరించాలి.*
*17. ఒక్కోసారి ఒక వ్యక్తి ల్యాండ్ కొనుక్కుంటాడు. ఆ ల్యాండ్ కొత్త వ్యక్తి పేరు మీద రెవిన్యూ మరియు గవర్నమెంట్ వారి రెకార్డులలోకి మారడానికి కొంత సమయం పడుతుంది. అందువల్ల రిజిస్ట్రేషన్ అయ్యాక కూడా కొన్ని రోజుల వరకు రికార్డు లలో పాత అమ్మిన వ్యక్తి పేరు కనిపిస్తూ ఉంటుంది. మోసం చేయాలి అనుకున్నవారు కొనుక్కున్న వ్యక్తి పేరు మీదకు మ్యుటేషన్ అవ్వకముందే ఇంకొకరికి అమ్మేస్తారు. ఒక్కోసారి కొనుక్కునే వారి నిర్లక్ష్యం వల్ల కూడా తప్పు జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోగానే ఇక మా పని అయిపొయింది అన్నట్లుగా మ్యుటేషన్ మీద శ్రద్ధ చూపరు. మర్చిపోతారు. 2 లేదా 3 సంవత్సరాలైనా అసలు మ్యుటేషన్ అనేది ఒకటుంటుంది అనే ఆలోచన రాదు. ఈలోపు ఆ మొదట అమ్మిన వ్యక్తి మళ్ళీ వేరొకరికి అమ్ముతాడు. పాపం ఇందులో కొనుక్కున్న వారి తప్పు కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు ఇంకా పాత వ్యక్తి పేరే కనిపిస్తూ ఉంటుంది కదా, వాళ్లు చూసుకోవాల్సిన చెక్ లిస్ట్ ప్రకారం అది సరిగ్గానే ఉంటుంది కాబట్టి కొనేసుకుంటారు. ఈ లోపు ఇంతకుముందు కొన్న రెండవ వ్యక్తి వచ్చి ఇది నాది అని క్లెయిమ్ చేస్తాడు. ఈ సందర్భంలో తప్పు ఫస్ట్ అమ్మిన వ్యక్తి మోస గుణం, రెండో కొనుక్కున్న వ్యక్తి నిర్లక్ష్యం. బలయ్యేది మూడో కొన్న వ్యక్తి*.
*18. మీకు అమ్ముతాను అని చెప్పిన వ్యక్తిది ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు తీసుకుని పైన సేకరించిన అన్ని డాకుమెంట్స్ తీసుకుని ఒక మంచి లాయర్ దగ్గరకు వెళ్లి అవన్నీ చూపించి అంతా సవ్యంగా ఉంది లేనిది తెలుసుకోవాలి. ఇక్కడ లాయర్ ఖర్చు ఎందుకు దండగ అని అని మీరు నిర్లక్ష్యం చేశారంటే మాత్రం తర్వాత ఇబ్బందుల్లో పడతారు.*
*19. రిజిస్ట్రేషన్ కు వెళ్ళేటప్పుడు పొలం అమ్ముతున్న వ్యక్తే కాకుండా అతని తల్లిదండ్రులు, భార్య, అన్న దమ్ములు, మేజర్ అయిన పిల్లలు ఇలా ఎవరు ఉన్నా వారందరితో కూడా సంతకం పెట్టించడం మర్చిపోకండి. ఎందుకంటే తర్వాత భవిష్యత్తులో వాళ్లలో ఎవరో ఒకరు వచ్చి అతను మా ప్రమేయం లేకుండా మా పర్మిషన్ లేకుండా అమ్మాడు. అది మాది అని క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది.*
*20. ప్లాట్ లేదా పొలానికి ఒక్కోసారి దారి ఉండదు. దారి లేనిప్లాట్ లేదా పొలం కొనుక్కోవడం వృధా. అందువల్ల కాస్త ఖర్చు ఎక్కువ అయినా దారి ఉన్న పొలం కొనుక్కోండి. ఒకవేళ దారి లేకపోతే పక్క పొలాల వారిని అడిగి వారికి ఇష్టముంటే ఎంతో కొంత ఇచ్చి కొనుక్కోవచ్చు. దీనికి కూడా పైన చెప్పిన పాయింట్ లోని నిబంధన వర్తిస్తుంది. మీకు దారి అమ్మిన వ్యక్తి పొలం ఇద్దరు అన్నదమ్ములది అనుకోండి. అన్న వేరే ఊర్లో ఉంటాడు. తమ్ముడు అన్నకు తెలీకుండా డబ్బుకోసం ఏదో నోటి మాట మీద దారి అమ్మాడు అనుకుందాము. కొన్ని రోజుల తర్వాత అది అన్నకు తెలిసి మీతో గొడవ పడే అవకాశం ఉండి. ఈ విషయం లో తప్పు మీదే అవుతుంది.*
*21. ఇక రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మ్యుటేషన్ కి అప్లై చేయడం అస్సలు మర్చిపోకండి.*
*22. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీరు కొన్న స్థలానికి కంచె వేయించండి.*
*23. ఒక బోర్డు తీసుకుని This Property Belongs to అని దాని మీద మీ పేరు, సర్వే నంబరు, ఫోన్ నంబరు రాయించండి.*
*24. తప్పకుండా చిన్నదైనా ఒక గేట్ పెట్టించండి, 4 రేకులతో ఒక షెడ్ వేయించండి. ఇదంతా ఎందుకు అంటే చూసేవారికి “ఓహ్ ఇక్కడ ఎవరో ఉన్నారు. ఎప్పుడూ వస్తుంటారు.” అనే భావన కలిగించడం కోసం.*
25.*కొనుగోల చేసే వ్యవసాయ భూమి లేదా మరియు ఓపెన్ ఫ్లాట్ కి సంబంధించిన సరిహద్దులతో, లాయర్ ద్వారా పేపర్ ప్రకటనతో జారీ చేసుకోవలెను ఈ ఆస్తికి సంబంధించిన వారసులు మరియు ఫేక్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అభ్యంతరాలు ఆక్షేపణలు ఉంటే తెలియజేయగలరని చెప్పేసి పేపర్ ప్రకటన ద్వారా తెలుసుకోగలము గడువు వారం రోజులు లేదా పది రోజులపాటు పేపర్ ప్రకటన ద్వారా టైం ఇవ్వగలము అభ్యంతరాల కోసం లాయర్ కాంటాక్ట్ నెంబర్ కి సంప్రదించగలరు.*
26. *కొనుగోలు చేసే భూమికి లేదా ఓపెన్ ప్లాట్ కి సంబంధించి భయానా రాసుకునే కాగితం స్టాంప్ పేపరులో మరియు తగు కండిషన్స్ సరిచూసుకోవలెను మరియు భయాన ఇచ్చిన రుసుముని సాక్షి సంతకాలతో భూమికి సంబంధించిన సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు భయాన కాగితాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని ఎడల భయానా కాకితం చెల్లుబాటు కాకపోవు గనుక డబ్బులు ఇయ్యని పక్షాన టర్మ్స్ కండిషన్స్ ఇరువురికి వర్తించను గాక దీనితో భయానిచ్చిన మొత్తాన్ని తిరిగి తీసుకోగల అవకాశాన్ని కోల్పోకుండా ఉండడం జరుగుతుంది లేదా ఇచ్చిన రుసుముకి వ్యవసాయ భూమి లేదా మరియు ఓపెన్ ప్లాట్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఇది ఎవరికి తెలియక పోవుగాక సామాన్యులు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ భయాన కాగితాన్ని రిజిస్టర్ చేసుకోవలెను. అప్పుడు కోర్టుకెళ్లినా కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న భయానా కాగితం చెల్లును గాక ఇరువురికి మంచి జరిగే విధంగా ఈ పద్ధతి పాటించవలెను.*
*27. కొనుగోలు చేసే వ్యవసాయ భూమికి సంబంధించి కాస్త్ర పహాని నుండి తీసుకునే రోజు లేదా నెల వరకు గల పహానిలు మరియు ఎమ్మార్వో ఆఫీస్ లో గల 7a లేదా 7 బి గల రిజిస్టార్లు చూసుకోగలము 7a లేదా 7 బి చూసుకోవడం ద్వారా మనకు పూర్తి సమాచారం లభించును కొనుగోలు చేసిన భూమి లేదా గిఫ్ట్ డిడి చేసిన భూమి ఇనామిచ్చిన భూమి 7a లేదా 7b రిజిస్టర్ లో తెలిసిపోతుంది ఈ సెవెన్ ఏ లేదా 7b రిజిస్టర్ ప్రతి సంవత్సరం ప్రతి ఎమ్మార్వో ఆఫీస్ లో అందుబాటులో ఉంటుంది ఏదైనా 7a లేదా 7b లో రిజిస్టార్ లో మనకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది.*
*27. ఓపెన్ ప్లాట్ కి సంబంధించి హద్దులో గల పేర్లు సర్వే నెంబరు ప్లాట్ మరియు ప్లాట్లో గల విస్తీర్ణం చదరపు అడుగులలో లేదా చదరపు గజాలలో సరిచూసుకోవలెను ఓపెన్ ప్లాట్ కొనేముందు ఆ ప్లాట్ కు సంబంధించిన సర్వే నెంబరు సీలింగ్ సంబంధించిన భూమి లేదా అసైన్మెంట్ ల్యాండ్ లేేదా పట్టా భూమి లేదా వ్యవసాయ భూమి నుండి రెసిడెన్షియల్ జోన్ కి కన్వర్షన్ అయినదా లేదా సరిచూసుకోగలరు అసైన్మెంట్ భూమి మరియు సీలింగ్ భూమి చెల్లుబాటు కాదు గనుక రిజిస్టర్ ఆఫీస్ లో ఈసీ కూడా సరిచూసుకోగలరు ఫిజికల్ పొజిషన్ కూడా చాలా ముఖ్యం. ఫేక్ డాక్యుమెంట్స్ ఉంటే కూడా చెక్ చేసుకోగలరు.*
*28. ఎప్పుడు గాని సర్వేనెంబర్ గల విస్తీర్ణాన్ని పూర్తిగా తెలుసుకోగలరు మరియు సర్వేనెంబర్ తప్పు పడినచో కూడా చెక్ చేసుకోగలరు భూమి లేదా ప్లాటు కొనేముందు మర్చిపోకుండా భూమిని సర్వే చేసుకోవలెను సర్వే చేయడంతో పూర్తి సమాచారం లభిస్తుంది*
టీమ్ హోంబ్రో
Subscribe in YouTube and follow in FB
9966242409
3 years ago | [YT] | 1
View 0 replies
HOME BRO
When I got started in the stock markets, it was his interviews and optimism about India that reinforced my confidence to go down this path.. Life is so short...
RIP #Rakeshjhunjhunwala 😔
3 years ago | [YT] | 0
View 0 replies
HOME BRO
Hi,
Good morning...
One more low Budget Plotting/Farm land Venture for future investment.....
Farm lands/Open plots Booking Open...
60 feet road Bit,
500 Meters from Warangal-Khammam Highway Road
NH 563,
7 Km from Proposed 300 Feet Outer Ring Road,
15 Km from Sanctioned Mamnoor Airport,
20km from Warangal Bus-stand,
Surrounded by Residential zone,
Best for Investment Purpose,
Price:
1 Gunta : Rs/-3,00,000
Or
1 Sq.yd : Rs/- 2,478
E.M.I Plan:
Booking : 1,00,000/-
12 Months : 16,666/- Monthly EMI
Available Plot Area in :
150 Sq.yd to 484 Sq.yd
Registration:
Option 1: Dharani Passbook ( in Guntas )
Option 2 : Document ( NALA Converted )
Small investment for your future....
Never Regret......
E.M.I Available 12Months....
For more details
Call us...
9966242409
3 years ago | [YT] | 1
View 0 replies
Load more