❤️❤️❤️LIFE IS BEAUTIFUL❤️❤️❤️
TELUGU EDITOR ఛానల్‌కు స్వాగతం 🙏
ఈ ఛానల్ ద్వారా
🎶 భక్తి భావంతో నిండిన తెలుగు devotional songs
✍️ నాణ్యమైన తెలుగు భాషా సేవలు
రెండింటినీ మీకు అందిస్తున్నాము.
భక్తి గీతాలు మనసుకు శాంతిని, ఆధ్యాత్మికతను అందిస్తాయి.
అలాగే, సరైన పదజాలం మరియు శుద్ధమైన భాష రచనకు అందాన్ని ఇస్తాయి.
🎶 ఈ ఛానల్‌లో మీరు పొందేది:
✔️ తెలుగు భక్తి గీతాలు
✔️ దేవుని స్తుతి పాటలు
✔️ ఆధ్యాత్మిక సందేశాలతో కూడిన పాటలు
✍️ మా భాషా సేవలు:
✔️ కంటెంట్ ఎడిటింగ్
✔️ ప్రూఫ్ రీడింగ్
✔️ ఆంగ్ల–తెలుగు అనువాదం
✔️ పుస్తక సంపాదన
✔️ రిజ్యూమ్ ఎడిటింగ్
✔️ కంటెంట్ రీరైటింగ్
✔️ వ్యాకరణ సవరణ
భక్తి, భాష — రెండింటిలోనూ నాణ్యతే మా లక్ష్యం.
📩 భాషా సేవల కోసం సంప్రదించాలంటే DM చేయండి
🙏 TELUGU EDITOR – భక్తి మరియు భాషకు నమ్మకమైన చిరునామా.
🙏తెలుగు భక్తి గీతాలు మరియు వృత్తిపరమైన తెలుగు ఎడిటింగ్ సేవలు ఒకే చోట.
🙏 భక్తి | ✍️ భాష | ✨ నాణ్యత
TELUGU EDITOR
🙏🕉️🛕 *అరుణాచలం కొత్తగా వెళ్లేవారికి కొన్ని వివరాలు* 🛕🕉️🙏
1. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే వారు ఎక్కడ నుంచి మొదలు పెడతారు అక్కడికి చేరుకోవడం తోనే గిరిప్రదక్షిణ పూర్తి అవుతుంది.
రాజగోపురం దగ్గరి నుంచి నడక మొదలు పెట్టి తిరిగి అక్కడికి చేరుకోవడం ఈ ప్రదక్షిణ పూర్తి అవుతుంది అని భావించకండి .
మీరు ఎక్కడినుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టిన ఖచ్చితంగా అక్కడ ఒక వినాయకుని గుడి అయినా ఉంటుంది.
అక్కడ స్వామికి నమస్కరించి మొదలుపెట్టవచ్చు.
2. గిరిప్రదక్షిణ అనేది ఖచ్చితంగా ఎడమవైపున మాత్రమే చేయాలి " కుడివైపున కరుణగిరి కి దగ్గరలో ఉండే కుడి మార్గం లో సూక్ష్మరూపంలో యోగులు ' సిద్ధులు ' దేవతలు ప్రదక్షిణలు చేస్తారట . అందువలన కుడివైపున ప్రదక్షిణ చేయరాదు .
3. ఆరుణాచలం వెళ్లే ప్రతి వారు ఖచ్చితంగా పది రూపాయల నోట్లు వీలైనంత ఎక్కువ తీసుకుని వెళ్ళండి .
ఎందుకంటే ప్రతి ఆలయంలో పది రూపాయలు దక్షిణగా వేసిన ప్రతి భక్తునికి విభూది ప్యాకెట్ లు ఖచ్చితంగా ఇస్తారు .
4 . దర్శనానికి గిరిప్రదక్షిణకి వెళ్లేటప్పుడు రెండు చిన్న చిన్న డబ్బాలను తీసుకుని వెళ్ళండి . ప్రతి ఆలయంలో ఇచ్చే విభూది ఆ చిన్న డబ్బాలలో తీసుకోవచ్చు .
5. ఎముకలు అరిగి పోయిన వారు యమ లింగం దగ్గర ఇచ్చే విభూతి ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘం అని చెబుతారు .
6. నైఋతి లింగం దగ్గర మంత్ర సాధన చేసుకునేవారు ఖచ్చితంగా అక్కడ జపం చేసుకుంటే వెయ్యి రెట్లు ఫలితం ఉంటుంది '
ఏ మంత్రము లేనివారు పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు .
7. ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు గాని ' మధ్యలో గాని ఎక్కువ ఆహారం తీసుకుని మొదలు పెట్టవద్దు " భుక్తాయాసం వలన అడుగులు ముందుకు పడవు . ఖాళీ కడుపుతో చేసే గిరిప్రదక్షణ వేగవంతంగా ఉంటుంది .
8. సమూహంగా గిరి ప్రదక్షిణ చేసే కంటే ఏకాంతంగా చేసే గిరిప్రదక్షణ చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఉంటుంది .
నా స్వానుభవం .
9. గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో ఎక్కువసార్లు కూర్చోవడం వలన నరాలు పట్టి నడక వేగం తగ్గిపోతుంది '
చాలామటుకు కూర్చోకుండా నిలబడి గానీ ' తప్పనిసరి పరిస్థితుల్లో బెంచీపై పడుకోండి " కూర్చోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి .
10 . కరోనా అనంతరం కొబ్బరికాయలు పట్టుకొని దర్శనానికి వెళ్లే వారు ' అరుణాచలేశ్వరుని దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఎడమవైపు కార్నర్లో స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి . అక్కడ మీరు ఇచ్చిన కొబ్బరికాయలు కొట్టి గోత్ర నామాలు చదివి విభూతి ప్రసాదంగా ఇస్తారు .
లేకపోతే అక్కడ ఖచ్చితంగా మీ గోత్రనామాలు చదవరు.
11. ఆలయ ప్రాంగణంలోకి మనం అడుగుపెట్టిన తర్వాత
ఎడమవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది .
కచ్చితంగా దర్శనం చేసుకోండి .
12. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెద్దపెద్ద పిల్లర్లతో అతి పెద్ద మండపం ఉంటుంది '
ఆ మండపంపై కి వెళ్లి కొంచెం ముందుకు వెళితే పాతాళ లింగం ఉంటుంది .
రమణ మహర్షి వారు అక్కడే తపస్సు చేసారు .
13.రాజ గోపురానికి కుడివైపున అనుకొని ఒక పెద్ద స్టేజ్ లాగా ఉంటుంది . అది అరుణాచలేశ్వరుడి ఆస్థాన ఏనుగు బృందావనం .
14 ' ఉత్తరం వైపు ఉండే ప్రధాన గోపురం నుంచి ఒకసారి వెళ్లి రావాలని శాస్త్రం ' అది. ఇది మహా భక్తురాలైన అమ్మాణి అమ్మన్ అని ఆవిడ కట్టించిన గోపురం .
15. రెండవ ప్రాకారానికి ఎడమవైపున అతిపెద్ద కాలభైరవుని విగ్రహం గల ఆలయం ఉంటుంది .తప్పకుండా దర్శనం చేసుకోండి .
16. అదే ప్రాంగణంలో కుడివైపున మారేడు చెట్టు ఉంది దాని క్రింద రాతితో చెక్కిన అతి పెద్ద త్రిశూలం ఉంటుంది .
అద్భుతః
17. అమ్మవారి ఆలయంలో కూడా పది రూపాయల దక్షిణగా వేస్తే అమ్మవారి కుంకుమ ప్రసాదం ఇస్తారు .
18 ' అగ్ని లింగానికి ' రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది . చాలా పెద్ద విగ్రహం ' అత్యంత శక్తివంతమైన విగ్రహం '
అరుణాచల శివుడిని దక్షిణామూర్తి స్వరూపంగా కొలుస్తారు .
ఒకవేళ మీరు గురువారం రోజున అక్కడ ఉంటే ఖచ్చితంగా దీపం వెలిగించండి . రూపాయలకు శెనగల దండ అమ్ముతారు . మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అన్ని శెనగల దండలను స్వామివారికి సమర్పించండి . అది స్వామి వారి మీద వేస్తారు .
19. శివసన్నిధి రోడ్ లో కొంచెం ముందుకు వెళ్లి కుడివైపు తిరిగితే రామ్ సూరత్ బాబా ఆశ్రమం ఉంటుంది '
చాలా చాలా బాగుంటుంది . ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది .
రమణ మహర్షి వారి ఆశ్రమంలో కి వలె ఇక్కడ కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి .
ఇక్కడ
ఉదయం టిఫిన్ ' మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెడతారు .
విదేశీయులు కూడా సామాన్యులతో పాటు లైన్ లో ఉండి ప్రసాదం స్వీకరిస్తారు .
ఒకసారి అక్కడి ప్రసాదం స్వీకరించండి.
20 . ఈ రామ్ సూరత్ బాబా ఆశ్రమం లోనే అవధూత శ్రీ తోప్పి అమ్మాల్ వారు వుంటారు.
దర్శనం చేసుకొని తరించండి 🙏
🏵🍂🍁ఓం అరుణాచలేశ్వరాయ నమః🏵🍃🪴
6 days ago | [YT] | 7
View 0 replies
TELUGU EDITOR
🌹🍂🌹🍂🌹🍂🌹
*🌻సరస్వతీ స్తోత్రం🌻*
🥀యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా ।
యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ॥ 1 ॥
🌹దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభై రక్షమాలాందధానా
హస్తేనైకేన పద్మం సితమపిచ శుకం పుస్తకం చాపరేణ ।
భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానాzసమానా
సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా ॥ 2 ॥
🥀సురాసురైస్సేవితపాదపంకజా కరే విరాజత్కమనీయపుస్తకా
విరించిపత్నీ కమలాసనస్థితా సరస్వతీ నృత్యతు వాచి మే సదా ॥ 3 ॥
🌹సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా ।
ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ ॥ 4 ॥
🥀సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి ।
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ॥ 5 ॥
🌹సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః ।
శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః ॥ 6 ॥
🥀నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః ।
విద్యాధరే విశాలాక్షి శుద్ధజ్ఞానే నమో నమః ॥ 7 ॥
🌹శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః
శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః ॥ 8 ॥
🥀ముక్తాలంకృత సర్వాంగ్యై మూలాధారే నమో నమః
మూలమంత్రస్వరూపాయై మూలశక్త్యై నమో నమః ॥ 9 ॥
🌹మనోన్మని మహాభోగే వాగీశ్వరి నమో నమః ।
వాగ్మ్యై వరదహస్తాయై వరదాయై నమో నమః ॥ 10 ॥
🥀వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః
గుణదోషవివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః ॥ 11 ॥
🌹సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః ।
సంపన్నాయై కుమార్యై చ సర్వజ్ఞే తే నమో నమః ॥ 12 ॥
🥀యోగానార్య ఉమాదేవ్యై యోగానందే నమో నమః
దివ్యజ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః ॥ 13 ॥
🌹అర్ధచంద్రజటాధారి చంద్రబింబే నమో నమః
చంద్రాదిత్యజటాధారి చంద్రబింబే నమో నమః ॥ 14 ॥
🥀అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః ।
అణిమాద్యష్టసిద్ధాయై ఆనందాయై నమో నమః ॥ 15 ॥
🌹జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞానమూర్తే నమో నమః ।
నానాశాస్త్ర స్వరూపాయై నానారూపే నమో నమః ॥ 16 ॥
🥀పద్మజా పద్మవంశా చ పద్మరూపే నమో నమః ।
పరమేష్ఠ్యై పరామూర్త్యై నమస్తే పాపనాశినీ ॥ 17 ॥
🌹మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః
బ్రహ్మవిష్ణుశివాయై చ బ్రహ్మనార్యై నమో నమః ॥ 18 ॥
🥀కమలాకరపుష్పా చ కామరూపే నమో నమః ।
కపాలికర్మదీప్తాయై కర్మదాయై నమో నమః ॥ 19 ॥
🌹సాయం ప్రాతః పఠేన్నిత్యం షణ్మాసాత్సిద్ధిరుచ్యతే ।
చోరవ్యాఘ్రభయం నాస్తి పఠతాం శృణ్వతామపి ॥ 20 ॥
*🌼🥀ఇత్థం సరస్వతీ స్తోత్రమగస్త్యముని వాచకమ్🌼🥀*
*సర్వసిద్ధికరం*
🌼🥀🌼🥀🌼🥀🌼
6 days ago | [YT] | 6
View 0 replies
TELUGU EDITOR
🍁🌺🍁🌺🍁🌺🍁
*🚩ఈరోజు నుండి మాఘమాసం ప్రారంభం , మాఘమాసం విశిష్టత ఏమిటి ?🚩*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*'మాఘం'* అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించేవారు. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైంది.
మాఘ స్నానం పవిత్రస్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సాంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. *మృకండుముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం.*
కల్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం.
మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్య కిరణాల్లో ఉండే అతినీల లోహిత , పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20నుంచి మార్చి 30వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని , వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమని పేర్కొంటున్నారు.
ఈ స్నానాలకు అధిష్ఠానదైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం.
*మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని , తటాక స్నానం ద్విగుణం , నదీస్నానం చాతుర్గుణం , మహానది స్నానం శతగుణం , గంగాస్నానం సహస్ర గుణం , త్రివేణీ సంగమ స్నానం నదిశతగుణఫలాన్ని ఇస్తాయని పురాణవచనం.* మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో *'ప్రయాగ'* ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం.
మాఘ పూర్ణిమను *'మహామాఘం'* అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. స్నానదాన జపాలకు అనుకూలం. ఈ రోజున సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకమంటారు.
*మాఘమాసం మహిమ*
అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఇది మాధవ ప్రీతికరం. స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు.
శివుడైనా , విష్ణువైనా , ఎవరైనా కావచ్చు. ఈ మాసంలో గణపతి , సూర్య తదితర దేవతల పూజలు , వ్రతాలు కూడా జరుగుతుంటాయి.
మాఘ విశిష్టతను గురించి , ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది , చెరువు , మడుగు , కొలను , బావి చివరకు చిన్ననీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం.
*తిథులు:-*
1. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన , నువ్వులతో హోమం , నువ్వుల దానం , నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి. మాఘమాసంలో శుద్ధ విదియనాడు బెల్లం , ఉప్పు దానం చేయటం మంచిది.
2. శుద్ధ విదియ
3. శుద్ధ చవితి
4. శుద్ధ పంచమి
5. శుద్ధ షష్టి
6. శుద్ధ సప్తమి
7. అష్టమి
8. నవమి
9. ఏకాదశి
10. ద్వాదశి
11. త్రయోదశి
12. మాఘ పూర్ణిమ
13. కృష్ణపాడ్యమి
14. కృష్ణ సప్తమి
15. కృష్ణ ఏకాదశి
16. కృష్ణద్వాదశి
17. కృష్ణ చతుర్దశి
18. కృష్ణ అమావాస్య ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు , పర్వదినాలు , వివిధ దేవతలను ఉద్దేశించి జరపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ళనుండి అంత విశిష్టత ఉంది.
ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి *"శుక్ల పక్ష చవితి"* దీనిని *"తిల చతుర్థి"* అంటారు. దీన్నే *"కుంద చతుర్థి"* అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. ఈ రోజున *"డుంఢిరాజును"* ఉద్దేశించి , నక్త వ్రతము పూజ చేస్తారు ! డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలందుకుంటారని కాశీ ఖండములో తెలియజేశారు. *"కుంద చతుర్థి"* నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్పించి రాత్రి జాగారణ చేసినవారు , సకలైశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమం అని ఈ సందర్భంలో తెలుసుకోవాలి.
మాఘమాసంలో ప్రాతఃకాలంలో చేసే స్నాన , జప , తపములు చాలా ఉత్తమమైనవి. ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు *"దుఃఖ దారిద్ర్య నాశాయ , శ్రీ విష్ణోతోషణాయచ ! ప్రాతఃస్నానం కరోమ్య , మాఘ పాప వినాశనం!"* అని చేసిన తరువాత *"సవిత్రేప్రసవిత్రేచ ! పరంధామజలేమమ ! త్వత్తేజసా పరిబ్రష్టం , పాపం యాతు సస్రదా !"* అని చదవాలి. సూర్య భగవానునికి ఆర్గ్యమివ్వాలి.
ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు. కొంతమంది ఈ నెలనాళ్ళు ముల్లంగి దుంపను తినరు. ఈ మాసంలో నవ్వులను , పంచదారను కలిపి తినాలట. నువ్వులను దానమివ్వాలట. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది. ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్దిస్తుందట. *"మాఘశుద్ద పంచమి"ని శ్రీ పంచమి అంటారు. ఈ పంచమి నాడే "సరస్వతీదేవి" జన్మించిందట. ఈనాడు "రతీ మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు.*
ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని , సరస్వతి దేవిని కూడా పూజిస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్ధతతో ఉందట. అవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆ వగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్థతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్దులకు అదిష్టాత్రి అయింది ఆ దేవి.
అప్పటి నుండి శ్రీ పంచమి రోజును సరస్వతిని పూజించడం జరుగుతుంది.
ఇక మాఘశుద్ద సప్తమి ఇదే *"సూర్య సప్తమి"అని కూడా పిలువబడుతుంది. ఇదే రథసప్తమి సూర్య గ్రహణదినం వలె ఇది పరమ పవిత్రమైనది.* ఈ రోజున అరుణోదయకాలంలో ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలాపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట. స్నానికి ముందు చెరకుగడతో నీటిని కదిలిస్తారు. నమస్కారం ప్రియ:సూర్య: అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృప్తి చెందుతాడని తెలుస్తుంది. ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు అకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం.
సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే *"శమంతకమణి"* ప్రసాదించాడు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యజ్ఞవల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. *ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్* అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి. *రథసప్తమి నాటి స్నానం సప్త సప్త మహాసప్త ద్వీపా వసుంధరా ! కోటి జన్మార్జితంపాపిం వినశ్యతితత్‌క్షణాత్ అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట.*
భీష్మాష్టమి *"మాఘమానస్యచాష్టమ్యాం శుక్ల పక్షేచ పార్థివ !ప్రాజాపత్యేచ నక్షత్రే మద్యఃప్రాప్తే దివాకరే !"* శోభకృత నామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట. స్వచ్చంద మరణం ఆయనకి వరం.
ఆయనకు తర్పణలు విడిచి పెట్టడం నెలగంటు పెట్టినప్పటినుంచి పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం. అష్టమినాడే దైవ సాయుజ్యం పొందినా శ్రీ కృష్ణుని సమక్షంలోనే విష్ణుసహస్ర నామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు. కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు. భీష్మ ఏకాదశి నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ. ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే. ఈ విధంగా మాఘమాసమంతా *"శివరాత్రి"* వరకూ అన్ని పర్వదినాలే.
*_🙏🙏🙏
🍀🪷🍀సర్వేజనా సుఖినోభవంతు🍀🪷🍀
1 week ago | [YT] | 9
View 0 replies
TELUGU EDITOR
🙏 *శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం* 🙏
🌀 *శ్లోకం - 2* 🌀
2. *ఉత్తిషోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ |*
*ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ||*
🍃🌺ఓ గోవిందా! నిద్ర మేలుకో ఓ గరుడధ్వజా! నిద్రలే ఓ కమలాపతి!వేగమే నిద్ర లేవయ్యా మేలుకొని ముల్లోకాలకూ శుభాన్నివ్వు
🍃🌺ఈ శ్లోకంలో గోవిందుడైన భగవంతునికి భక్తుడు విన్నపాలు చేస్తున్నారు. శ్రీ రామావతారంలో బల అతిబల శక్తులతో కూడిన శ్రీరాముడు దుష్టశిక్షణ ఎలా చేశాడో అందరికీ తెలుసు.
🍃🌺శ్రీరాముడు ఎంత భక్తవత్సలుడో ఎంతటి ఆశ్రితజన రక్షకుడో ఎంతటి శత్రు భయంకరుడో కూడా అందరికీ తెలుసు. అలాంటి దేవునికి ధ్వజం వేరే ఏదో కాదు. గరుడ ధ్వజం. వినతా పుత్రుడైన గరుడుడు శ్రీహరికి ఉత్తమమైన వాహనం. ఇంద్రుని వజ్రాయుధం సైతం గరుడుడి ఈకకున్న శక్తిని తట్టుకోలేక పోయింది.
🍃🌺అంతటి శక్తిసంపన్నుడే మహావిష్ణువుకు వాహనమూ పతాక చిహ్నం కూడా అయితే కేవలం గరుడధ్వజం ఉన్నంత మాత్రాన్నే శ్రీమహావిష్ణువు పూర్తి శక్తిమంతుడు కాదు. ఆయన భాగస్వామి శ్రీ లేదా కమల, శ్రీమహాలక్ష్మి తోడుగా నిలిచి విష్ణు భక్తులను బ్రోచే మహత్యం శక్తిగా అవతరించింది. ఆమెతో బాటు విష్ణువును కీర్తిస్తూ నిద్ర లెమ్మని ప్రార్థిస్తూ, ముల్లోకాలను ఆశీర్వదించి, శుభాల నివ్వమని భక్తుడు ఈ శ్లోకంలో వేడుకుంటున్నాడు.
🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
1 week ago | [YT] | 5
View 0 replies
TELUGU EDITOR
🙏 *శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం* 🙏
🌀 *శ్లోకం 1* 🌀
🍃🌺1. *కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ౹*
*ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ ||*
🍃🌺పుణ్య మాత కౌసల్యకు తనయుడవైన ఓ శ్రీరామా! సర్వ శ్రేష్ఠుడా! తూర్పున భానుడు ఉదయించాడు. దైనందిన దైవ కార్యక్రమాలు, ప్రార్థనలు నిర్వహించాలి కదా! కాబట్టి ఓ పురుషోత్తమా నిద్రలే...
🍃🌺పురాణ పురుషుడైన ఆ సర్వోత్తముడిని మునిశ్రేఘ్టులెందరో కీర్తించారు. మనందరిని ఆదుకొని, రక్షిస్తూ, కోరిన కోర్కెలు తీరుస్తున్న ఆర్తజనరక్షకుడు శ్రీవేంకటేశ్వరుడు. శ్రీవేంకటేశ్వరుని కీర్తిస్తూ సప్తర్షులు శరణాగతి స్తోత్రాలు చేశారు కూడా. విశ్వామిత్ర మహర్షి శ్రీ వేంకటేశ్వరుడు శ్రీ మహావిష్ణువు కీర్తించాడు.
🍃🌺శ్రీరాముడైనా, శ్రీవేంకటేశ్వరుడైనా సాక్షాత్తు శ్రీమహావిష్ణు అవతారమూర్తి అని ప్రవచిస్తూ విశ్వామిత్ర మహర్షి తన శరణాగతి స్తోత్రంలో శ్రీ వేంకటేశ్వరున్ని ఇలా కీర్తించాడు.
🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
1 week ago | [YT] | 6
View 0 replies
TELUGU EDITOR
☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️
*నారాయణి అమ్మ జన్మదినం*
🍀*జనవరి 3 #నారాయణి అమ్మ జన్మదినం*🍀
మనకు విగ్రహారాధన అనాదిగా వస్తున్నదే. అనేక లోహాలతో తయారై తమకు ఇష్టమైన రూపాలతో ఉన్న దేవత. మూర్తులను ఆరాధిస్తారు భక్తులు. ఒక్కొక్క లోహానికి ఒక్కో ఫలితం ఉంటుంది. అలా స్వర్ణంతో తయారు చేసిన మూర్తిని పూజిస్తే అత్యంత పుణ్యదాయకమని శాస్త్రాలు చెబుతున్నాయి. తమిళనాడులోని వేలూరుకు దగ్గరలో ఉన్న తిరుమలైకుడి అనే ప్రదేశంలో చాలామందికి సాధ్యం కాని స్వర్ణలక్ష్మి దర్శన భాగ్యాన్ని మనకు కల్పించారు శ్రీనారాయణి అమ్మ స్వామి. శ్రీపురం నారాయణి క్షేత్రాన్ని చరిత్రలో ఉండిపోయే విధంగా రూపొందించారు. ఈ దేవాలయ నిర్మాణం సరికొత్తగా రూపుదిద్దుకుంది. ఈ స్వర్ణదేవాలయాన్ని నిర్మించి శ్రీనారాయణి అమ్మ భక్తుల హృదయాల్లో నిలిచిపోయారు. శ్రీనారాయణి పీఠం, శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మి ఆలయం ప్రపంచ దేశాల ప్రజల్ని కూడా విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
శ్రీనారాయణి అమ్మ జీర్ణ దేవాలయాల సముద్ధరణకు పూనుకొని అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా దీనజనోద్ధరణలాంటి అనేక సేవా కార్యక్రమాలు సైతం చేపట్టారు. ఆధునిక కాలంలో అతిచిన్న వయసులో కోట్లాది రూపాయల వ్యయంతో బంగారు దేవాలయం నిర్మించడం అనితర సాధ్యమని ఎందరో కొనియాడుతున్నారు.
శ్రీనారాయణి అమ్మ చేపట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా అందరితో ప్రశంసలు. అందుకున్నాయి. నారాయణి పీఠం ఆధ్వర్యంలో దాదాపు 3 వందల కోట్ల రూపాయల వ్యయంతో శ్రీపురం దేవాలయానికి చుట్టుపక్కల ఉన్న 600 దేవాలయాలకు జీర్ణోద్ధరణ పనులు నిర్వహించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు విద్య, వైద్య, మంచినీటి సౌకర్యాలు అందించారు. నారాయణి పీఠం పేదరికాన్ని నిర్మూలంచాలనే ధ్యేయంగా కూడా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు. వికలాంగులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, శాంతి స్థాపనకోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రకృతి పరిరక్షణ, గ్రామీణులకు ఉపాధి లాంటి రంగాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు పీఠం నిర్వాహకులు శ్రీనారాయణి అమ్మ విశేషంగా చేసిన కృషికి అభినందనలు అందుతున్నాయి.
🍀నారాయణి అమ్మ అసలు పేరు సతీష్ కుమార్. జనవరి 3వ తేదీ 1976లో నందగోపాల్, జ్యోతమ్మ దంపతులకు జన్మించారు. పుట్టినప్పుడే ఆయన నుదుట నామ రేఖ ఎంతో పవిత్రంగా కనిపించిందట. ఆయన చిన్నతనం నుండే ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి చూపేవారు. ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగిన అక్కడికి వెళ్లి శ్రద్ధగా పాల్గొనేవారు. ఓరోజు సతీష్ కుమార్ దైవదర్శనం కోసం బస్సులో వెళ్తుంటే తన మనస్సు ఆకాశంతో విహరిస్తున్నట్టు అనిపించిందట. శ్వేత వస్త్రాలు ధరించిన నారాయణి దేవి దర్శనమిచ్చిందట. అంతేకాకుండా అమ్మవారు తనలో లీనం అయినట్లుగా భావన కలిగిందట. ఆరోజు నుండి అనగా 1992, మే 8 నుండి సతీష్ కుమార్ నారాయణి అమ్మగా గుర్తింపు పొందారు. నారాయని అమ్మ భక్తులకు చెప్పినట్టుగానే స్వయం భూ నారాయణి అమ్మవారి విగ్రహం శ్రీపురంలో వెలిసింది. అనంతరం అక్కడ శ్రీమహాలక్ష్మి అమ్మవారి స్వర్ణదేవాలయం నిర్మితమైంది. శ్రీపురం స్వర్ణదేవాలయం దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంది. ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు 1500 కిలోల బంగారాన్ని ఉపయోగించినట్టు చెబుతారు. నాలుగు వందల మంది శిల్పులు 6 సంవత్సరాల పాటు శ్రమించి ఆలయాన్ని రూపొందించారట. ఎంతో మంది దాతల సహకారంతో దాదాపు 600 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఆలయ నిర్మాణం 2001 లో ప్రారంభమై 2007లో పూర్తయింది. ఆగస్టు 24, 2007లో కుంభాభిషేకం నిర్వహించిన అనంతరం నారాయణి అమ్మ స్వర్ణమహాలక్ష్మి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సకల నదీజలాలు గర్భగుడికి మూడువైపుల ఉండడంతో దీనిని సర్వతీర్థం అని పిలుస్తారు. స్వర్ణమయమైన ఈ ఆలయం శ్రీచక్రం ఆకారం గల ప్రాకారాలతో నిర్మితమైంది. విద్యుత్ దీపాలంకరణలో అద్భుతంగా మెరిసిపోయే ఈ ఆలయాన్ని రాత్రిపూట చూస్తే మరింత నయనానందకరంగా ఉంటుంది. స్వర్ణమహాలక్ష్మి దర్శనం సకల దారిద్ర్యాలను దూరం చేస్తుందని భక్తుల విశ్వాసం. స్వర్ణమయమైన మహాలక్ష్మిని దర్శించుకునే భాగ్యాన్ని కలిగించిన శ్రీనారాయణి అమ్మ సదా భక్తుల హృదయాల్లో కొలువై ఉంటారు.
🚩 🌾🚩🌾🚩🌾🚩🌾🚩
3 weeks ago | [YT] | 6
View 0 replies
TELUGU EDITOR
🍀🌺🍀శ్రీ వరాహ స్తోత్రం...........!!🍀🌺🍀
🍀🪷🍀ఇల్లుకట్టుకోవాలన్నా,స్థలాలు,భూములు కొనాలన్నా ఈ స్తోత్రమును రోజూ 9 సార్లు పఠించాలి.1🍀🪷🍀
🪷ఋషయ ఊచు |
జితం జితం తేఽజిత యజ్ఞభావనా
త్రయీం తనూం స్వాం పరిధున్వతే నమః |
యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాః
తస్మై నమః కారణసూకరాయ తే || ౧ ||
రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం
దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం |
ఛన్దాంసి యస్య త్వచి బర్హిరోమ-
స్స్వాజ్యం దృశి త్వంఘ్రిషు చాతుర్హోత్రమ్ || ౨ ||
స్రుక్తుండ ఆసీత్స్రువ ఈశ నాసయో-
రిడోదరే చమసాః కర్ణరంధ్రే |
ప్రాశిత్రమాస్యే గ్రసనే గ్రహాస్తు తే
యచ్చర్వణంతే భగవన్నగ్నిహోత్రమ్ || ౩ ||
దీక్షానుజన్మోపసదః శిరోధరం
త్వం ప్రాయణీయో దయనీయ దంష్ట్రః |
జిహ్వా ప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతోః
సభ్యావసథ్యం చితయోఽసవో హి తే || ౪ ||
సోమస్తు రేతః సవనాన్యవస్థితిః
సంస్థావిభేదాస్తవ దేవ ధాతవః |
సత్రాణి సర్వాణి శరీరసంధి-
స్త్వం సర్వయజ్ఞక్రతురిష్టిబంధనః || ౫ ||
నమో నమస్తేఽఖిలయంత్రదేవతా
ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే |
వైరాగ్య భక్త్యాత్మజయాఽనుభావిత
జ్ఞానాయ విద్యాగురవే నమొ నమః || ౬ ||
దంష్ట్రాగ్రకోట్యా భగవంస్త్వయా ధృతా
విరాజతే భూధర భూస్సభూధరా |
యథా వనాన్నిస్సరతో దతా ధృతా
మతంగజేంద్రస్య స పత్రపద్మినీ || ౭ ||
త్రయీమయం రూపమిదం చ సౌకరం
భూమండలే నాథ తదా ధృతేన తే |
చకాస్తి శృంగోఢఘనేన భూయసా
కులాచలేంద్రస్య యథైవ విభ్రమః || ౮ ||
సంస్థాపయైనాం జగతాం సతస్థుషాం
లోకాయ పత్నీమసి మాతరం పితా |
విధేమ చాస్యై నమసా సహ త్వయా
యస్యాం స్వతేజోఽగ్నిమివారణావధాః || ౯ ||
కః శ్రద్ధధీతాన్యతమస్తవ ప్రభో
రసాం గతాయా భువ ఉద్విబర్హణం |
న విస్మయోఽసౌ త్వయి విశ్వవిస్మయే
యో మాయయేదం ససృజేఽతి విస్మయమ్ || ౧౦ ||
విధున్వతా వేదమయం నిజం వపు-
ర్జనస్తపః సత్యనివాసినో వయం |
సటాశిఖోద్ధూత శివాంబుబిందుభి-
ర్విమృజ్యమానా భృశమీశ పావితాః || ౧౧ ||
స వై బత భ్రష్టమతిస్తవైష తే
యః కర్మణాం పారమపారకర్మణః |
యద్యోగమాయా గుణ యోగ మోహితం
విశ్వం సమస్తం భగవన్ విధేహి శమ్ || ౧౨ ||
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే శ్రీ వరాహ ప్రాదుర్భావోనామ త్రయోదశోధ్యాయః |
@everyone
1 month ago | [YT] | 13
View 0 replies
TELUGU EDITOR
🍀🪷🍀🪷🍀🪷🍀🪷🍀🪷🍀🪷🍀🪷🍀🪷
🪔*ఏకాదశ సరస్వతీ దేవాలయములు*🪔
🪷॥శ్లోకం॥🪷
శరదిందు సమకారే ! పరబ్రహ్మ స్వరూపిని!!
వాసరా పీఠ నిలయే! సరస్వతీ నమోస్తుతే!!
1) శృంగేరి : సువర్ణ శారదాదేవి,
శారదాపీఠము, కర్నాటక రాష్ట్రము.
2) సూరత్ : తెల్లని పాలరాతి విగ్రహము, గుజరాత్ రాష్ట్రము.
3) బికనీర్ : కోటలో ఎరుపురంగు కలిగిన పసుపు ఛాయతో వెలసిన అమ్మవారు, రాజస్థాన్.
4) పుష్కర్ : గాయత్రీ నామమున వెలసియున్నారు. బ్రహ్మసరోవర తీరము,11 కి.మీ. అజ్మీర్, రాజస్థాన్.
5) కుత్తునూర్: మైలాడుదురై, తిరువార్ బస్సు మార్గంలో అరసిలార్ నదిగట్టుపై నున్న ఆలయం, తంజావురు జిల్లా, తమిళనాడు.
6) పూందోట్టం : సరస్వతీ అమ్మవారి చక్కని విగ్రహం, తమిళనాడు.
7) పిలానీ: అతి సుందర సున్నిత పాలరాతి కట్టడము, శారదాదేవి ఆలయము, రాజస్థాన్.
8) కాశ్మీర్ : ఫ్రౌఢ సరస్వతీ పీఠము -- అష్టాదశ పీఠములలో ఒకటి.
9) బాసర : ఆదిలాబాద్ జిల్లాలో బాసర క్షేత్రము కలదు. ఇది జ్ఞాన సరస్వతి దేవాలయము.
10) శనిగరం: కరీమ్ నగర్ జిల్లాలో - హైదరాబాద్ నుండి కరీమ్ నగర్ వచ్చుదారిలో ఈ గ్రామంలో సరస్వతి దేవాలయం కలదు.
11) కాలేశ్వరము : కరీమ్ నగరకు 130 కి.మీ. దూరంలో కాళేశ్వరంలో మహా సరస్వతి దేవాలయము కలదు.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺
1 month ago | [YT] | 5
View 0 replies
TELUGU EDITOR
🍀🪷🍀🪷🍀🪷🍀🪷🍀🪷🍀🪷🍀🪷🍀🪷
🍀*గోదాదేవి ఎవరు ? పాశురాలు అంటే ఏమిటి ? వాటి పరమార్ధం ఏమిటి ?*
🍀*గోదాదేవి 1200 ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ వైతాళికులు ఆళ్వారులలో ఏకైక మహిళ.*
🍀*ఆళ్వారులు పాడిన నాలాయిర ప్రబంధంలో (4000 పాశురాలు) గోదాదేవి పాడిన 30 పాశురాలకు అతి విశిష్ట స్థానం ఉంది.*
*గోదాదేవి తనని తాను రేపల్లెలో గొల్లభామగా భావించుకుంది.*
*తమ మధ్యనే తిరుగాడే శ్రీకృష్ణస్వామిని పగలంతా చూస్తున్న సంతోషం , రాత్రివేళ చూడలేని తాపం , తెల్లవారే వేళనే కన్నులారా చూసి తరించాలన్న తపన , ఆత్రం కలబోసిన భావరాగానురాగాల పారిజాతాల మాల తిరుప్పావై*
🌞*పాశురాల పరమార్ధం*🌞
*తిరుప్పావైలో ఉన్న మొత్తం పాశురాలు 30. వీటిలో మొదటి అయిదు ఉపోద్ఘాతంగా ఉంటాయి.*
*తిరుప్పావై ప్రాధాన్యతను వివరిస్తాయి. భగవంతునికి చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపచారాల్లో ఆడంబరం అవసరం లేదని , చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాశురాలు చెబుతాయి.*
*భగవంతుని ఆరాధించటం వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని , పంటలు నిండుగా పండుతాయని , దేశం సుభిక్షంగా ఉంటుందని వీటిలో ఉంది.*
*తర్వాతి పది పాశురాల్లో చెలులతో కలిసి శ్రీరంగనాథుని సేవించడానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాలు వర్ణితమై ఉంటాయి.*
*పదిహేను నుంచి ఇరవయ్యో పాశురం వరకు గోదాదేవి చెలులతో కలిసి దేవాలయానికి వెళ్లిన విషయాలు , అక్కడి శిల్పసౌందర్యాల వర్ణనలు , రంగనాథునికి సుప్రభాతం పాడటం మొదలైనవి ఉంటాయి.*
🪷*కృష్ణుడి అష్టభార్యల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ పాశురాల్లోనే ఉంటుంది.*
*చివరి తొమ్మిది పాశురాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని ప్రకటిస్తాయి. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి.*
*చివరి పాశురంలో ఫలశృతి చెబుతూ ఎవరైతే ఈ పాశురాలు ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది.
🪷ఆండాళ్ తిరువడిగలే శరణం...*🪷
🍃🪷🍃🪷🍃🪷🍃🪷🍃
*🪷🍃ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🏻*
.
*🍃🪷ధనుర్మాస వ్రతం.... ఎవరు చేయాలి భక్తి ఉన్న ప్రతి ఒక్కరూ చేయాలి. ఈశ్వర సానిహిత్యం కావాలి అని కోరుకునే ప్రతి ఒక్కరు చేయాలి. స్వామిని పొందాలి అన్న ప్రీతి ఉన్న ప్రతి ఒక్కరూ చేయాలి*.
*🪷🍃అతి చిన్న వయసులో గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి తనతోపాటు తన తోటి వారిని ఈ వ్రతంలో పాల్గొన్నట్లు చేసి స్వామి ని పొంది తాను ధన్యురాలు తాము ఇచ్చిన పూజా పద్ధతి తో మా అందర్నీ కూడా ధన్యులను చేసింది*
.
*🍁🌾ఆముక్తమాల్యదను సమర్పించి (చూడి కుడుత నాంచార్) తాను ధరించిన మాలను సమర్పించినది*...
*🪷🍃గోదాదేవి తండ్రి విష్ణుచిత్తుడు ఆయన మహా విష్ణుభక్తుడు.విష్ణు సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన మహా భక్తుడు.ఆయనకు తులసివనంలో దొరికిన బాలిక యే గోదాదేవి*.
*🪷🍃పెరిగి పెద్దయ్యేకొద్దీ తండ్రి యొక్క విష్ణు భక్తిని గమనిస్తూ తండ్రి అనేక పూలను సేకరించి తులసి మాలలను సేకరించి అర్పణ చేయడం చూసి గోదాదేవి ఆ మాలను తాను ధరించి మరల తండ్రి సేవ కి వెళ్లేటప్పుడు వాటిలో పెడుతూ ఉండేది... ఓ రోజు తండ్రి ఆ మాల లో బాలిక తలవెంట్రుకలను చూసి అయ్యో ఇలాంటివి స్వామికి అర్పించటం దోషం అని భావించాడు.... అందుకని గోదాదేవి అలంకరించుకుని పక్కన పెట్టిన మాలను స్వామికి కైంకర్యం నకు తీసుకొని వెళ్ళేవాడు కాదు అప్పుడు ఆ ఊరిలో ఉన్న (శ్రీరంగనాథుడు) వటపత్ర సాయి దేవాలయ అర్చకులకు విష్ణుచిత్తుడికి కలలో కనిపించి నాకు ఎంతో ప్రీతికరమైన అండాళ్ ధరించిన మాలలే వాటినే నాకు సమర్పించండి అని చెప్పాడు*..... 🙏🏻.
*🪷🌾 అప్పటికి గోదాదేవి ఏ సాధన చేయనప్పటికీ ఆవిడ ఇచ్చిన మాలలు ప్రీతికరమైనవి అని చెప్పాడు అంటే ఆ తల్లి కారణజన్మురాలు*.
*భగవంతుని పొందేందుకు ఉన్న అనేక పద్ధతుల్లో ఈ ప్రీతికరమైన భక్తి మహా విశేషమైనది*.
*అలాంటి భక్తితో గోదాదేవి 30 రోజులు 30 పాశురాలను రచించి స్వామికి పూమాలతో పాటు అక్షరమాలలను కూడా అందించి శ్రీరంగనాధునే పతిగా భావించి తుదకు శ్రీ రంగనాయిక గా శ్రీ హరి అనుగ్రం పొందినది*...
*సాధకుడికి శ్రద్ధ నమ్మకము ప్రీతి ఇష్టంతో చేసే ఏకాగ్రత మైన వ్రత నియమాలు తప్పక భగవంతుని చేరుస్తాయి అనేదే ఈ వ్రత ఫలం*.
*ఎంత చేయాలో అంత చేయలేననప్పటికీ ఏ కొద్దిగా చేసిన మనసు పెట్టి మనో పుష్పాన్ని స్వామి పాదాల దగ్గర పెట్టి ఆచరిద్దాం శ్రీరంగనాథుని సేవలో తరిద్దాము*.
🪷🌾🪷🌾🪷🌾🪷🌾🪷
1 month ago | [YT] | 12
View 0 replies
TELUGU EDITOR
🍀🏆🍀🏆🍀🏆🍀🏆🍀🏆🍀🏆🍀🏆🍀
*మీ కూతురికి నేర్పించాల్సిన 16 నైపుణ్యాలు!!!*
*1. ఆత్మవిశ్వాసం – తన మీద నమ్మకాన్ని పెంపొందించుకోవడం.*
*2. కమ్యూనికేషన్ – తన ఆలోచనలను స్పష్టంగా వ్యక్తీకరించడం మరియు శ్రద్ధగా వినడం.*
*3. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ – తన భావాలను మరియు ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం , నిర్వహించడం.*
*4. ప్రాబ్లమ్ సాల్వింగ్ – సృజనాత్మకంగా మరియు సమర్థవంతంగా సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం.*
*5. టైమ్ మేనేజ్‌మెంట్ – పనులను చక్కబెట్టడం మరియు సమయాన్ని సమర్థవంతంగా వినియోగించడం.*
*6. ఫైనాన్షియల్ లిటరసీ – డబ్బు నిర్వహణ, బడ్జెటింగ్ మరియు సేవింగ్ గురించి అర్థం చేసుకోవడం.*
*7. సెల్ఫ్-రెస్పెక్ట్ – తనను తాను గౌరవించడం, ఇతరులతో ఆరోగ్యకరమైన హద్దులను ఏర్పరచుకోవడం.*
*8. ఎమ్పతి – ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, అనుభూతి చెందడం.*
*9. సెల్ఫ్ కేర్ – శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రాధాన్యత ఇవ్వడం.*
*10. డెసిషన్ మేకింగ్ – ఆలోచింపబడిన, సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం.*
*11. లీడర్‌షిప్ – ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ఇతరులను ప్రేరేపించడం.*
*12. గోల్ సెట్టింగ్ – స్పష్టమైన, సాధ్యమైన లక్ష్యాలను నిర్ధేశించుకోవడం, వాటి కోసం కృషి చేయడం.*
*13. రెసిలియన్స్ – అవాంతరాలను అధిగమించడం, సానుకూలంగా నిలబడటం.*
*14. నెగోషియేషన్ – సమర్థవంతంగా చర్చించడం మరియు ఒప్పందాలను కుదుర్చుకోవడం.*
*15. టీమ్‌వర్క్ – ఇతరులతో సహకరించడం మరియు సాధారణ లక్ష్యాలను చేరుకోవడం.*
*16. కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్ – విభేదాలను శాంతియుతంగా మరియు గౌరవప్రదంగా పరిష్కరించడం.*
*మీ కూతురుకి ముందుగా ఏది అవసరమో చెప్పండి?*
🍀🏆🍀🏆🍀🏆🍀🏆🍀🏆🍀🏆🍀🏆🍀
1 month ago | [YT] | 1
View 0 replies
Load more