వర్తమాన అంశాల మీద లోతైన విశ్లేషణల కోసం చూస్తున్నారా? కనిపించే వార్తల వెనక కనిపించని కోణాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? దశాబ్ధాల అనుభవం, అపారమైన అధ్యయనం కలిగిన జర్నలిస్టుల విశ్లేషణలను ఇక్కడ మీరు చూడొచ్చు.
రాజకీయాలతో పాటు, జీవితం, చరిత్ర, న్యాయం, ఆరోగ్యం వంటి అన్ని విషయాలు గురించి చర్చించే వేదికగా ఈ ఛానల్ ఉంటుంది. దాంతో పాటుగా వివిధ సామాజిక అంశాలపై గ్రౌండ్ రిపోర్టులు, డాక్యుమెంటరీలు, టెలి ఫిలింలకు కూడా #MahuaMedia ఒక వేదికగా ఉంటుంది.

Mahua Media is a space for social concerns run by media professionals. It also brings analysis on current affairs and talks about all aspects of people, life, literature and arts.
Paid Members గా ఛానల్ ను సపోర్ట్ చెయ్యండి. Link below 👇


Mahua Media

జనవరి 3, సావిత్రీబాయి పూలే జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం మహిళా ఉపాధ్యాయినిల దినోత్సవం గా ప్రకటించింది. నిజానికి ఆమెకు అంతకుమించిన అర్హత ఉన్నది. ఆమె చదువు చెప్పటం కోసం చేసిన పోరాటం కూడా చిన్నదేమీ కాదు. ఆసక్తికరమైన ఆమె కథ వివరంగా తెలుసుకోవటానికి మూడేళ్ల కింద చేసిన ఈ పాడ్కాస్ట్ వీడియోను క్లిక్ చెయ్యండి. ఇది ఆడియో మాత్రమే. ఉదయం వాకింగ్ లో విన్నారంటే రోజు చాలా స్పూర్తివంతంగా ప్రారంభం అవుతుంది కూడా.
https://youtu.be/7EULNUEvfgA

15 hours ago | [YT] | 37

Mahua Media

అధికార దుర్వినియోగాన్ని ఆపాల్సిన లోకపాల్ తానే విలాసాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడితే...
https://youtu.be/iDrnUctMiTs

16 hours ago | [YT] | 25

Mahua Media

గత కాలము మేలు వచ్చుకాలం కంటెన్ అనుకునే వాళ్ళు కొందరుంటారు.
ఉందిలే మంచి కాలం ముందు ముందునా అనుకునే వాళ్ళు కొందరు.
పర్సనల్ గా మీకు 2025 సంతృప్తికరంగా ఉందా? లేదా 2026 బాగుంటుందని అనిపిస్తుందా?

1 day ago | [YT] | 31

Mahua Media

మహువా మీడియా వీక్షకులకు, సబ్స్క్రైబర్స్ కు, మెంబర్స్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
కొత్త సంవత్సరం మనకు మరింత అవగాహన, మరింత బాధ్యత, మరింత ధైర్యం ఇవ్వాలి.
2025 సంవత్సరం మన ఛానల్ కు చాలా ప్రత్యేకమైన సంవత్సరం. 2026 లో కూడా మీ ఆదరణ కొనసాగుతుందని ఆశిస్తున్నాము.

2 days ago (edited) | [YT] | 470

Mahua Media

హఠాత్తుగా అర్ణబ్ గోస్వామి ఎందుకు జర్నలిస్టులాగా వ్యవహరిస్తున్నాడు?

2 days ago | [YT] | 212

Mahua Media

కింది స్థాయి జుడిషియరీ లో వెన్నెముక ఉన్న జడ్జిలు ఉండటం అందులోనూ యోగి రాజ్యంలో...
https://youtu.be/sgU6lydS0kA

2 days ago | [YT] | 36

Mahua Media

ఒకప్పుడు రేపిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ లు జరిగేవి. ఇప్పుడు రేపిస్టులకు అనుకూలంగా ర్యాలీలు, వాళ్లు బయటికే వస్తే పూల దండలు. గతంలో 8 ఏళ్ల పసిబిడ్డను కతువ లో వారం రోజుల పాటు గుడిలో బంధించి అత్యాచారం చేసి చంపేస్తే ఆపని చేసిన పూజారికి అనుకూలంగా ర్యాలీలు జరిగాయి. ఇప్పుడు అత్యాచారం చేశాడని రుజువైన సెంగర్ కు అనుకూలంగా కొంతమంది ఢిల్లీ లో ర్యాలీ. స్వయంగా మంత్రులు, పార్టీ నాయకులు అతనికి సపోర్ట్ గా ప్రకటనలు. బిల్కిస్ బానో కేసులో బయటకు వచ్చిన హీనాతి హీనమైన రేపిస్టులకు పూల దండలు, కాళ్లకు దండాలు. బ్రాహ్మడు కాబట్టి తప్పు చేయడని , తప్పు చేసినా అంత శిక్ష వెయ్యాల్సిన పని లేదని స్వయంగా నాయకులే ప్రకటనలు. మనుధర్మం చెప్పింది కూడా అదే కదా. బ్రాహ్మడు అత్యాచారం చేస్తే చిన్న శిక్ష, సూద్రుడు చేస్తే మరణ శిక్ష అని. నిర్భయ సంఘటన అప్పుడు ప్రభుత్వం మీద విరుచుకు పడిన పార్టీ ఇప్పుడు చేస్తున్నది ఏంటి? ఎవరికీ అర్థం కావటం లేదా దేశం ఏమైపోతుందో ?

3 days ago | [YT] | 1,111

Mahua Media

Supreme Court Vs Government! ఉన్నావ్, ఆరావళి కేసుల్లో సుప్రీం కోర్ట్ స్టే ఎందుకిచ్చింది?
https://youtu.be/8icCD2SrP10

3 days ago | [YT] | 20

Mahua Media

ఛానల్ లో మొదటి బ్రేక్ అవుట్ వీడియో ఇది. మూడేళ్ల కింద ఛానల్ పెట్టిన కొత్తలో చేసిన ఈ వీడియో తోనే ఛానల్ పేరు తెలిసింది. అప్పటికి వీడియో ప్రొడక్షన్, గ్రాఫిక్స్, థంబ్ నెయిల్ అన్నీ నేనే చేసుకుంటున్న కాలం అది. కాబట్టి కొంచెం ప్రిమిటివ్ గా ఉంటుంది. ఇప్పుడు చేస్తే చాలా బెటర్ గా ఉంటుంది.
ఎందుకో ఈ వీడియో ని రెండు రోజులుగా యూట్యూబ్ రికమండ్ చేస్తోంది. దాంతో చాలా మంది కొత్త వాళ్లు చూస్తున్నారు. మీరు కూడా చూసి ఉండక పోతే చూడండి. ఈ వీడియో చూసి సబ్స్క్రయిబ్ చేసిన వాళ్ళు (మొదటి 5 వేల సబ్స్క్రైబర్స్ లో ఉండి ఉంటారు) ఎవరన్నా ఉంటే కామెంట్స్ లో చెప్పండి.

https://youtu.be/x48IIECQmo4

4 days ago (edited) | [YT] | 51

Mahua Media

అందరినీ అనుమానిద్దాం! ప్రజలపై ప్రభుత్వ ఎక్కుపెడుతున్న గాండీవం!!
ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరి అన్ని వ్యక్తిగత వివరాలు ప్రభుత్వం సేకరిస్తోంది. ఇది ప్రజల గోప్యత హక్కు కు విఘాతం. పారా హుషార్.
https://youtu.be/Z28ZtMSVnfY

4 days ago | [YT] | 48