కవిత్వం ఒక భావప్రాప్తి
కవిత్వం ఒక ఆలోచన వ్యాప్తి
నేను నా ఆలోచనలు నా కవిత్వాన్ని సూక్తులని నా సృజన సాహిత్యాని దృశ్య కావ్య స్వరంతో మీ ముందుకు తెస్తాను
అలాగే సాహిత్య విశ్లేషణ సమాచారం కథలు పాటలు అందిస్తాను.
మీరు అందరూ ఆదరిస్తారని ప్రోత్సహిస్తారని నన్ను నిలబెడుతారని కోరుకుంటున్న కృతజ్ఞతలతో...!!
saidachary mandoju
శుభోదయం ☕
1 day ago | [YT] | 1
View 0 replies
saidachary mandoju
భోగి,సంక్రాతి, కనుమ శుభాకాంక్షలు!
1 week ago | [YT] | 10
View 1 reply
saidachary mandoju
జీవితాన్ని ద్వేషిస్తూ ప్రేమిస్తా
ప్రేమిస్తూ ద్వేషిస్తా
బతకడమే విజయమని గర్విస్తా!
జీవితం పాతదే కానీ,
రుచించి జీవించడమే కొత్తది
రోజుకో అనుభూతి
కాలం అనే పాఠశాలలో
జీవితం అనే తరగతిలో
బతుకు అనే అధ్యాయంలో
రోజుకో అనుభవపు పాఠం
స్ఫూరిస్తా
అజ్ఞానాన్ని గురువుగా
అవివేకానికి స్నేహితుడిగా
దరిద్రాన్ని ఆత్మీయుడిగా
కాల విధి ఋతువులను
కావ్యంగా రచిస్తా
దుఃఖపు చమురును
అక్షరంగా వెలిగిస్తా
మిణుగురునై విహరిస్తా
నమ్మాలనే నిజంలో
నమ్మలేని ఒకానొక అబద్ధంలో...
జీవితాన్ని అందమైన నాటకీయతగా
రమిస్తూ, బ్రమిస్తూ
కల్పనాత్మకుడిగా
ప్రయాసం అనకుండా
ప్రయాణం చేస్తా
కాలం కాగితంపై ఒక
చిరస్మరణీయమైన
సంతకమై ముద్రించుకుంటా!!
-సైదాచారి మండోజు
1 week ago | [YT] | 13
View 13 replies
saidachary mandoju
జరిగిపోయిన కాలాన్ని స్మరిస్తూ
జరగాల్సిన కాలం గురించి
ఆలోచిస్తూ,
పాత వసంతం నుంచి కొత్త
వసంతంలోకి అడుగుపెడుతూ...
గమ్యం అనే ఆశల
పల్లకిపై ప్రయాణిస్తూ,
జరిగిపోయిన వసంతంలో
జ్ఞాపకాలను, బాధలను
అనుభవాలుగా అన్వయించుకుని
నూతన సంవత్సరంలోకి
అడుగుపెడుతున్న
వారందరికీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు..!
2 weeks ago | [YT] | 3
View 1 reply
saidachary mandoju
చూడండి ప్రోత్సహం ఇవ్వండి!!
1 month ago | [YT] | 0
View 0 replies
saidachary mandoju
#ఉషోదయం
2 months ago | [YT] | 2
View 0 replies
saidachary mandoju
మా ఫ్రెండ్ టీమ్ చాలా ప్యాషన్ తో తీసిన “వీరబాబు వీరాంజనేయ భక్తుడు” ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్లను మనమందరం సపోర్ట్ చేద్దాం
సీసీ ట్రైలర్ చూడండి & మీ అభిప్రాయాలు కామెంట్స్ లో చెప్పండి!
youtube.com/@chitramvichitram?si=KXk0sZ1O_gqoQN-V
youtube.com/shorts/ww-LYLUwvD...
#VeerababuVeeranjaneyaBhaktudu #TeluguWebSeries #SupportOriginal Talent
2 months ago (edited) | [YT] | 2
View 0 replies
saidachary mandoju
గత కొంతకాలంగా నాకు పరిచయం ఉన్నా, మన ప్రతిలిపిలో మంచి కథలు, రచనలు రాసే మనలో ఒకరు శ్రీ గన్న బత్తుల శ్రీనివాస్ అన్న. గత కొంత కాలం నుంచి పరిచయం తెలుసు.
అన్న రచనలు, కథలు మంచి సాంద్రత, విషయ గాఢత, మంచి ఆలోచన, సృజన పరిణితి కలిగి ఉంటాయి.
అన్న రాసిన వాటిలో ‘లీలా’, ‘మౌన శృంగారం’ అనే రెండు పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి.
‘మౌన శృంగారం’ అనే కథ ఒక అద్భుతం. ఒక భావ ఊహ దృశ్యంలా చాలా బాగుంటుంది. అదొక అద్భుతం. అలాగే అన్న రాసిన కథలు ప్రతిలిపిలో చాలా ఉన్నాయి. చాలా బాగుంటాయి.
అన్న నా ‘సంచారి’ పుస్తకానికి చాలా సహాయకంగా, సపోర్ట్‌గా, హెల్ప్ చేశారు. అప్పటి నుండి అన్న నాకు పరిచయం.
అన్న అప్పటి నుంచి సినిమా ప్రయత్నాలు చాలా తీవ్రంగా చేశారు. నాకు తెలిసి మూడేళ్ల పైనుంచి, నాకు తెలిసిన కానుంచి అన్న అదే ప్రయత్నంగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఎవరైనా కాస్త ప్రయత్నం చేయగానే పరిస్థితుల ప్రభావంతోనో, ఇబ్బందులతో కాస్త స్కిప్ అయ్యి, కాస్త వెనకముందుతో ‘ఇక చాలు’ అన్నట్లు వెనకడుగు వేస్తారు. మరల మన రోజువారి జీవితంలోకి, బాధ్యతలు, పరిస్థితులలోకి వెళ్ళిపోతాము. కానీ...
ఎంత మధన పడ్డా, ఎంత సంఘర్షణలు, ఇబ్బందులు పడ్డా కానీ అన్న పట్టు విడువకుండా ప్రయత్నం చేసి, ఈరోజు మన ముందు ‘వీరబాబు వీరాంజనేయ భక్తుడు’ అనే సినిమాకు కథ, మాటలు, పాటలు రాశారు. నేను వారి టీమ్ యూట్యూబ్ ఛానల్ ‘చిత్రం విచిత్రం’లో అన్నీ చూశాను. చాలా బాగా, అద్భుతంగా, చాలా బాగా అనిపించాయి.
అన్న మనలో ఒకరుగా, మనతో పాటు రచనలు చేస్తూ ఈరోజు ఈ స్థాయికి రావడం... వారి కృషి, కష్టం చాలా అభినందనీయం.
నిజంగా ప్రతిలిపి ఉన్నా మనందరికీ ఇదొక స్ఫూర్తి, ఒక గర్వ కారణమైన గొప్ప విషయం మన వరకు.
కాబట్టి మీకు కుదిరితే, నచ్చితే తప్పకుండా మీ ప్రోత్సాహం ఇవ్వాలని, వారి చిత్రం చూసి మీ స్పందన తెలియజేయాలని, వారి టీమ్ యూట్యూబ్ ఛానల్ **Chithram Vichithram** ఛానల్‌ని subscribe చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.
ఇలా మనం కూడా ఒక స్ఫూర్తి, ఒక లక్ష్యంతో వృద్ధిలోకి రావాలని... నువ్వు, నేను, మీరు, మనం... మన అందరం బాగుండాలని.
ఇలా మన ఆలోచనలు
చాలా కళాత్మకంగా,
మన జీవనం చాలా ప్రేరణాత్మకంగా,
మన కలం, గలం, స్వరం వినపడాలని, కనపడాలని కోరుకుంటున్నాను.
@gannabathula srinivas
@ChitramVichitram
@venkateshchanti
2 months ago | [YT] | 4
View 0 replies
saidachary mandoju
సంచారి
2 months ago | [YT] | 5
View 0 replies
saidachary mandoju
దీపావళి శుభాకాంక్షలు "
3 months ago | [YT] | 1
View 0 replies
Load more