Promote mrps, mahajana socialist party , achieve power in future


MSP NEWS

4 hours ago |[YT] | 35

MSP NEWS

4 hours ago |[YT] | 36

MSP NEWS

4 hours ago |[YT] | 25

MSP NEWS

4 hours ago |[YT] | 15

MSP NEWS

4 hours ago |[YT] | 18

MSP NEWS

4 hours ago |[YT] | 4

MSP NEWS

12 hours ago |[YT] | 54

MSP NEWS

తేదీ: 19-10-2026
ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయం

​తౌషిక్, మౌలాభి కేసు దర్యాప్తును
వేగవంతం చేసి

నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని
ప్రకాశం జిల్లా ఎస్పీ గారిని కలిసి విజ్ఞప్తి చేసిన

పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు మరియు ముస్లిం మైనారిటీ ప్రజాసంఘాలు,రాజకీయ పార్టీల నాయకులు

21 hours ago |[YT] | 150

MSP NEWS

17 - 10 - 2026
విజయవాడ

మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ సమావేశంలో కీర్తి శేషులు అమరుడు రవిరాజ్ అన్న చిత్ర పటానికి పూలదండ వేసి, మౌనం పాటించి ఘన నివాళులర్పించిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు

ఎస్సీ వర్గీకరణ ఉద్యమ తొలి తరం పోరాట యోధుడు సర్వేపల్లి రవి రాజు మృతి ఉద్యమానికి తీరని లోటు

రవి రాజు అన్న మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురైన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ

ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో తొలి తరం ఉద్యోగ నాయకుడిగా, ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రస్థానంలో కీలక భూమిక పోషించిన సర్వేపల్లి రవి రాజు గారు ఈరోజు హైదరాబాద్‌ లో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించడం పట్ల ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రవి రాజు అన్న మరణ వార్తను కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న మంద కృష్ణ మాదిగ గారు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఆయన మరణం ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి, మాదిగ జాతికి తీరని లోటని పేర్కొన్నారు.

ఎమ్మార్పీఎస్ ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్లలోనే ఉద్యమ ఆశయాలను బలంగా విశ్వసించి, ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన నాయకుడు సర్వేపల్లి రవి రాజు అన్న అని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే, ఎస్సీ వర్గీకరణ సాధన కోసం సాగిన చారిత్రాత్మక పోరాటంలో అత్యంత క్రియాశీలకంగా పాల్గొన్న గొప్ప ఉద్యమకారుడని గుర్తుచేశారు.

ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహిస్తూ.. జాతి కోసం ఉద్యమ బాటలో నడిచిన అరుదైన పోరాట యోధుడు రవి రాజు అన్న!

ఎమ్మార్పీఎస్ 32 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు, అవరోధాలు ఎదురైనా, ఉద్యమ స్ఫూర్తిని వీడకుండా మాదిగ జాతి ఆత్మగౌరవం కోసం అంకితభావంతో పనిచేసిన నిబద్ధత కలిగిన నాయకుడు రవి రాజు అన్న. ఉద్యమం ప్రారంభ దశ నుంచి నేటి వరకు అదే పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ, ఒక సాధారణ ఉద్యమ కార్యకర్త స్థాయి నుంచి మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (MEF) జాతీయ సహాయ కార్యదర్శి స్థాయికి ఎదిగిన ఆయన ప్రస్థానం నేటి తరం ఉద్యమకారులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

రవి రాజు అన్న కేవలం ఒక ఉద్యోగ నాయకుడు మాత్రమే కాదు.. మాదిగ జాతి హక్కుల కోసం తపించిన ఉద్యమ సహచరుడు. ఆప్యాయతకు మారుపేరుగా, స్నేహశీలిగా, మానవతావాదిగా అందరితో కలిసిమెలిసి ఉండే ఆయన వ్యక్తిత్వం ఉద్యమ శ్రేణుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిందని తెలిపారు.

32 ఏళ్ల ఉద్యమ చరిత్రలో రవి రాజు అన్న వేసిన అడుగులు చెరిగిపోవు.. జాతి విముక్తి కోసం ఆయన అందించిన ఉద్యమ స్ఫూర్తి మరువలేనిది!

ఎస్సీ వర్గీకరణ సాధన కోసం సాగిన పోరాటంలో రవి రాజు అన్న అందించిన సేవలు, ఉద్యమానికి చేసిన సహకారం ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయని మంద కృష్ణ మాదిగ గారు పేర్కొన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, జాతి హక్కుల కోసం ఆయన సాగించిన పోరాటం, ఉద్యమం పట్ల ఆయనకు ఉన్న అంకితభావం భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు.

ఈ విషాద సమయంలో రవి రాజు అన్న కుటుంబ సభ్యులకు మంద కృష్ణ మాదిగ గారు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబానికి ఈ బాధను తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

ఓ అమరుడా మాదిగ జాతి హక్కుల పోరాటంలో నీ అడుగుజాడలు చిరస్థాయిగా నిలిచిపోతాయి !

2 days ago |[YT] | 202

MSP NEWS

నివాళి – ఆత్మీయ పరామర్శ

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన తొలి తరం ఉద్యమకారుడు, ఉద్యమానికి–ఉద్యమకారులకు అండగా నిలిచిన తనుగుల సాంబయ్య మాదిగ గారి మరణం బాధాకరం.

వారి నివాసానికి వెళ్లిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు సాంబయ్య మాదిగ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఉద్యమంలో సాంబయ్య మాదిగ గారి సేవలను స్మరించుకుంటూ, MRPS వారి కుటుంబంనికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

— మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS)

#mandakrishnamadiga #mrps #hanamkonda #madiga

3 days ago |[YT] | 236