జనం కోసం న్యూస్ ఛానల్ , ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం..

News channel,youtube channel , Telecommunication, service cable, sattilite,
News agency , political news , advitersing,adds ,jk news contact no : 6303384314


JK TV NEWS

7 months ago | [YT] | 2

JK TV NEWS

ఆదోని మున్సిపల్ తాత్కాలిక చైర్మన్గా మొదటి వైస్ చైర్మన్ ఎంఎంజి గౌస్ ను నియమించినట్లు CDMA ఉత్తర్వులు జారీ...

8 months ago | [YT] | 9

JK TV NEWS

( 11.03.2025) కర్నూలు జిల్లా...

పాండవగల్లు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన...

కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు .

కర్నూలు జిల్లా, ఆదోని మండలం , పెద్ద తుంబళం పోలీసు స్టేషన్ పరిధిలోని పాండవగల్లు గ్రామం జాలీమంచి క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని చేరుకుని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు మంగళవారం పరిశీలించారు.

రెండు బైక్ లను కర్ణాటక ఆర్టీసీ KA 37 F 0711 నెంబర్ గల బస్సు ఢీ కొన్నది.

ఈ ప్రమాద ఘటన స్ధలంలో నలుగురు మృతి చెందారు.

చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు.

ఆదోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు మృత దేహాలను తరలించారు.

ప్రమాద కారణాల పై జిల్లా ఎస్పీ గారు ఆరా తీశారు.

రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తీసుకోవలసిన చర్యల పై పోలీసు అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.

వాహనదారులు రహదారి భద్రతా నిబంధనలు పాటించాలన్నారు.

వాహానాలు నడిపే సమయంలో సురక్షితంగా , క్షేమంగా గమ్యాలను చేరుకోవాలని తెలిపారు.

జరిగిన విషయం.

ఐదుగురు రెండు వేర్వేరు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నారు.

పాండవగల్లు గ్రామం వద్ద రెండు బైక్ లను కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.

ఘటనాస్థలిలో నలుగురు, చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు.

1) ఒక బైక్ పై కుప్పగల్ నుంచి ఆదోని వస్తున్న దంపతులు ... ఈరన్న ( 25), ఆదిలక్ష్మి. (20)

2) మరో బైక్ పై వెళుతున్న కర్ణాటక రాష్ట్రం, మాన్వికి చెందిన ముగ్గురు వ్యక్తులు... దంపతులు హేమాద్రి (40) నాగరత్న(35), కుమారుడు దేవరాజు(22) .

జిల్లా ఎస్పీ గారితో పాటు ప్రమాద సంఘటన స్ధల పరిశీలనలో ఆదోని డిఎస్పీ హేమలత గారు, ఆదోని రూరల్ సిఐ నల్లప్ప, పెద్ద తుంబళం ఎస్సై మహేష్ కుమార్ ఉన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు

10 months ago | [YT] | 19

JK TV NEWS

నూతన సంవత్సరం సందర్భంగా DEC 30 ,31, JAN 1 తరికు వరకు ఆహార ప్రియులకు #తృప్తి భోజనశాల నందు రుచికరమైన వెజ్ & నాన్ వెజ్ లభించును..

అడ్రస్ : బసవేశ్వర సర్కిల్ ఎమ్మిగనూరు బైపాస్ రోడ్డు , ఐచర్ ట్రాక్టర్ షోరూమ్ ప్రక్కన ,ఆదోని

www.facebook.com/share/r/TzaMqzjVZoBBYx3Y/

1 year ago | [YT] | 8

JK TV NEWS

*CM నీ కలిసి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే డా.పార్థసారథి వాల్మీకి*

విజయవాడ వరద బాధితుల సహాయార్థం గౌ.ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి చెక్కును అందజేసిన ఆదోని ఎమ్మెల్యే : డా.పార్థసారధి

విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఆదోని నియోజకవర్గం లో ఆదోనిలో ప్రజలు ,వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు తదితరులు వరద బాధితులకు ఇచ్చినటువంటి చెక్కులను గురువారం విజయవాడ నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారిని కలిసి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు 13 లక్షల 86000 రూపాయలు చెక్కులను సీఎం గారికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ ఆదోని నియోజకవర్గం లో విరాళాలు అందజేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఇకముందు కూడా రాష్ట్రంలో ఏ ఆపద వచ్చినా ఆదోని నుంచి మాకు తోచిన సాయాన్ని మేము చెయ్యటం లో వెనుకాడ బొమని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు దేశాయ్ చంద్రన్న , రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు విట్టా రమేష్ బిజెపి అసెంబ్లీ కోకన్వీనర్ నాగరాజుగౌడ్, నాయకులు మరియాని చిన్న బసప్ప తదితరులు పాల్గొన్నారు.

1 year ago | [YT] | 52

JK TV NEWS

ఆదోని నియోజకవర్గం లో ప్రభుత్వ జూనియర్ కళాశాలను , అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాలను నిర్మించాలని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే డా.పార్థసారథి
#adoni #andhrapradesh

1 year ago | [YT] | 31

JK TV NEWS

శాసనసభ ఉప సభాపతిగా ఎన్నికైన రఘురామకృష్ణరాజు గారిని, సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సభాపతి స్థానం వరకు తీసుకెళ్లి, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి సమక్షంలో స్పీకర్ చైర్‌లో కూర్చోబెట్టారు.
డిప్యూటీ స్పీకర్ పదవికి రఘురామ కృష్ణంరాజు వన్నె తేవాలని, సభను సమున్నతంగా నడపాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు.
#APBudgetSession2024
#APAssembly
#ChandrababuNaidu
#AndhraPradesh

1 year ago | [YT] | 13

JK TV NEWS

ఆదోని పట్టణంలోని జి.ఎస్.ఆర్ రెసిడెన్షియల్ హై స్కూల్ వారి ఆధ్వర్యంలో ఆదోని జోనల్ లెవెల్ బాలికల త్రోబాల్ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించి, జ్యోతి ప్రజ్వలన చేసి , జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ #adoni

1 year ago | [YT] | 13

JK TV NEWS

రాజేశ్వరి లాంటి వీర మహిళలు మరికొంతమంది రావాలి :- ఎమ్మెల్యే పార్థసారథి

జనసేనా వీరమహిళ రాజేశ్వరి ఆదోని నుండి జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరి దాకా సైకిల్ యాత్ర చేసినటువంటి వీర మహిళను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ఘనంగా సన్మానించారు.

1 year ago | [YT] | 23

JK TV NEWS

ఏ సినిమా కోసం మీరు ఎక్కువ ఎదురుచూస్తున్నారు..?

1 year ago | [YT] | 7