న్యాయ సమాచార అవగాహన, యాత్ర విశేషాలు , ప్రస్తుత సమాజానికి అవసరమైన విషయాలు ప్రజలకు సామాన్యులకు అర్థమయ్యే విధంగా వారి అవగాహన కోసం మాత్రమే.అందమైన చిన్న పిల్లల పేర్లు తెలుగులో ఇంగ్లీషులో వాటి అర్థాలతో సహా తెలపడం traveling, personal development ,education,land records,spiritual vlogs
Gajula Nagendra
1 week ago | [YT] | 2
View 0 replies
Gajula Nagendra
*🌸పితృదేవతలకు ముక్తినిచ్చే స్మశాన నారాయణస్వామి ఆలయం, అలంపురం:*
*పితృదోషం:* మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించటానికి మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో అలాగే... తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి. మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది. అలాగే అదే పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే అది తెలుసు కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా గాని వారు చేసిన పాప కర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు..
మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ముఖ్యమైనది ఒక్కటే. అదే *పితృదోషం*.
(ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం. అందుకే ఈ పోస్టు పెడుతున్నాను)
🔹పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది.
🔹ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు. వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే.
*పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని చర్చించుకుందాము...*
- చిన్న వారు అకాలమరణం పొందడం.
- శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రి పాలవడం.
- అప్పులపాలు అవ్వడం, లేనిపోని అపనిందల పాలు అవ్వడం.
- మన ప్రమేయం లేకుండా ప్రమాదాలకు గురయ్యే జీవితాంతం కర్మలను అనుభవించడం.
- మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అయ్యి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడం
*🔹ఇలా వీటన్నిటికీ కారణం పితృ దోషం కారణం. దీని నుండి విముక్తి పొందడానికి ఏకైక పరిష్కారం. స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకోవడమే* ... అయితే ఈ స్మశాన నారాయణుడి ఆలయాలు ఈ భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి.
1 కాశీ
2 పాపనాశి (అలంపురం 'జోగుళాంబ గద్వాల జిల్లా)
🔹అలంపురంలోని ఈ స్మశాన నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది.
🔹 విచిత్రం ఏమిటంటే ఈ స్మశాన నారాయణ ఆలయం అలంపురంలో ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియదు.
🔹అయితే ఈ స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలంటే ఏమి చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం...
🔹స్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకోవాలంటే... పాలు అన్నముతో చేసిన పాయసం, అన్నము, ముద్దపప్పు, నేయి, వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి ! ఈ విధంగా స్మశాన నారాయణుడికి నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని వారి ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే దానిని స్వీకరించాలి. ఇతరులకు ఇవ్వరాదు.
🔹స్వామికి తెల్లటి కండువా అలంకరించాలి. ఈ వంటలను స్వయంగా వండుకొని తీసుకొని వెళ్ళి నివేదన చేయాలి లేదా (వెళ్ళడానికి వీలు లేనివారు ఖర్చులను ఇచ్చి అక్కడి పూజారి చే చేయించ వచ్చును).
🔹అలంపురం తెల్లవారుజామునే వెళ్లి తుంగభద్రా నదీ స్నానం చేసి అమ్మవారిని అయ్యవార్లను దర్శనం చేసుకున్న తరువాత ఈ స్మశాన నారాయణుడిని సేవించుకొని ఇంక వేరే చోటకి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి.
🔹ఈ ఆలయ ప్రాముఖ్యము తంత్ర గురు "వేణు మాధవ నంబూద్రి" ద్వారా తెలుసుకోవడం జరిగింది ' ఈ అలంపుర స్మశాన నారాయణుడి దాని ప్రాముఖ్యము కేరళ తంత్ర శాస్త్రంలో లిఖించబడి ఉన్నదట !
🔹ఎంతోమంది పితృదోషం తో బాధపడే వారు ఉన్నారు. అలాంటివారికి ఈ విషయం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.
*చేరుకొనే విధానం:*
💚అలంపూర్ "హరిత హోటల్ " కు ప్రక్కన ఒక చిన్న దారి ఉంటుంది . ఆ చిన్న దారి ఎడమవైపున 1.2 కిలోమీటర్ల దూరంలో పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది . ఆలయ సముదాయంలో ఒక ప్రత్యేక ఆలయం "స్మశాన నారాయణుని ఆలయం".
*💚ఇంకొక ముఖ్య విషయం :* స్మశాన నారాయణుడి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశేశ్వరుడు ' 7వ శతాబ్దం నాటి అతి పురాతన ' అతిపెద్ద మరకత లింగం ' దక్షిణ కాశి అంటారు. ఈ స్వామిని దర్శించుకున్న నంతనే పాపాలు నాశనం అవుతాయని ప్రతీతి!
*🪷సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🪷*
Thanks for Reading
2 months ago | [YT] | 2
View 0 replies
Gajula Nagendra
Final preparation for aibe
3 months ago | [YT] | 1
View 2 replies
Gajula Nagendra
Last destination 🏛️ of every advocate like me 🚩
3 months ago | [YT] | 5
View 1 reply
Gajula Nagendra
నా 30 సంవత్సరాల కల ఈ సంవత్సరం నెరవేరింది నల్లకోటు అనేది నా యొక్క ఎమోషన్ ఇప్పటివరకు నల్ల వస్తువుల్ని బట్టల్ని చెప్పుల్ని వాడలేదు ఇకపై ఆ దేవుడు అనుగ్రహంతో మొదలుపెడతాను
4 months ago | [YT] | 5
View 3 replies
Gajula Nagendra
మన దేశ చట్టాలు సామాన్యమైన ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఇకపై క్రమంగా మన చట్టాలకు సంబంధించిన వీడియోలు కూడా మన చానల్లో పొందుపరచడం జరుగుతుంది మీకు ఏదైనా సందేహాలు గాని సమాచారం గానీ కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి
4 months ago | [YT] | 0
View 0 replies
Gajula Nagendra
మీ అభిమాన స్వాతంత్ర సమరయోధుడు?
4 months ago | [YT] | 4
View 1 reply
Gajula Nagendra
Jobs available
5 months ago | [YT] | 0
View 0 replies
Gajula Nagendra
Vkota
5 months ago | [YT] | 1
View 0 replies
Gajula Nagendra
2500000 compleated
6 months ago | [YT] | 0
View 0 replies
Load more