సందర్భం ఉన్నా.. లేకున్నా..
జై తెలంగాణ ✊🏻
మా ఆస్తి.. అస్థిత్వం..
-------------------------
నమస్తే... నేను మీ బండి శ్రీకాంత్ . ఏదైనా అంశాన్ని పంచుకోగల వేదికను సృష్టించాలనే ఉద్దేశ్యంతో, నేను నా YouTube ప్రయాణాన్ని ప్రారంభించాను. ఈ వేదికకు కులం, మతం మరియు లింగ వివక్షత లేదు. స్ఫూర్తిదాయకమైన కథల నుండి సామాజిక-రాజకీయ మరియు మానవీయ కథనాల వరకు, అవసరమైన దృక్పథంతో వాటిని వివరించడమే నా లక్ష్యం. నా వీడియోలను చూసే వారు నన్ను ముందుకు నడిపిస్తారని నేను నమ్ముతున్నాను. మరియు ఈ నమ్మకంతో, నేను ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను....
Namaste.I am your bandi Srikanth. With the intention of creating a platform where any topic can be shared, I started my YouTube journey. This platform has no caste, religion and gender discrimination. Here, those with quality content shine. From inspirational stories to socio-political and human stories, my aim is to narrate them with the necessary perspective. I believe that those who watch my videos will drive me forward. And with this belief, I am starting this journey.
Srikanth T News
#APNEWS
విజయవాడ
ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో భోగిమంటలు
పార్టీ నేతల సమక్షంలో భోగిమంట వెలిగించిన జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్..ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల జీవో కాపీలను తగలబెట్టిన అవినాష్
దేవినేని అవినాష్ మాట్లాడుతూ..
ఎన్టీఆర్ జిల్లా, నగర ప్రజలు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు..ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా తీసుకున్న జీవో కాపీ నేడు తగలబెట్టాం. చెత్తను తగలబెట్టినట్లు ఈ జీవోలను భోగి మంటల్లో తగలబెట్టాం. ఇకనైనా మంచి పాలన అందించాలని దేవుడుని కోరుకున్నాం. కోడి పందేలు వేసుకునే కూటమి నేతలు మాత్రమే ఈ రెండేళ్లలో ఆనందంగా ఉన్నారు. జగన్ హయాంలో ఏ పండగ వచ్చినా ప్రజలు అందరూ సంతోషంగా ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు కరువయ్యాయి. టీడీపీ వాళ్లు సంతోషంగా ఉంటే అందరూ ఉన్నట్లు కాదు..KPL (కోడి పందేలు లీగ్) లు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం పై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. జగన్ ను ఎందుకు ఓడించాం
అని ప్రజలు బాధ పడుతున్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారు? ప్రతి పనిలో స్కాం చేయటానికి ప్రభుతం ప్రయత్నం చేస్తుంది. కోటి మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాలు చేశారు అంటే మీరు ఏ దుస్థితిలో ఉన్నారో ఆలోచన చేయండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ప్రజా ఆగ్రహానికి గురవటం ఖాయం.
#SaveMedicalCollegesInAP
#YSRCPForMedicalStudents #YSRPCPPARTY
9 months ago |[YT] | 0
View 0 replies
Srikanth T News
#APNEWS
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబునాయుడు గారు, కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నాను. టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను తిలకించాను. అనంతరం స్థానికంగా వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులతో నిర్వహించిన క్రీడా పోటీలను వీక్షించాను. క్రీడా పోటీలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినీ, విద్యార్థులకు సీఎం చంద్రబాబు గారు, భువనేశ్వరి గారు బహుమతులు అందజేశారు.
#andrapradesh #tirupathi #Tdpparty #cmchandrababu #naralokesh
9 months ago (edited) |[YT] | 2
View 0 replies
Srikanth T News
#SaveMedicalCollegesInAP
చిత్తూరు జిల్లా
నగరి లో మాజీ మంత్రి ఆర్.కే.రోజా ఇంటి వద్ద భోగి సంబరాలు
కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఆర్ కే రోజా
ఆర్. కే.రోజా, మాజీ మంత్రి కామెంట్స్
కూటమి ప్రభుత్వం చెప్పిన సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు, రాష్ట్రంలో ప్రజలు పండుగ జరుపుకునే పరిస్థితి లేదు
రైతులు సంతోషం జరుపుకునే పండుగ ఇది, 20 వేలు ఇస్తామని చెప్పి, కొందరికే 10 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు
రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని సంతోషంగా నమ్మిన వారు నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే
4సార్లు సీఎంగా చేసినా చంద్రబాబు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకు రాలేదు
కూటమి ప్రభుత్వం లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేస్తున్నారు
ప్రైవేట్ మెడికల్ జీవో కాపీలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపిన మాజీ మంత్రి ఆర్.కే రోజా
ఫ్రీ ఫ్రీ అనే ఫ్రీ బాబు మాటలు నమ్మవద్దు
#YSRCPForMedicalStudents #andrapradesh #Ysrcpvstdp #vairalnews
9 months ago |[YT] | 1
View 0 replies
Srikanth T News
కూటమిపాలన పీడ విరుగుడు కావాలి - కాకాణి పూజిత
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ముందు భోగి పండుగ సందర్భంగా భోగిమంటవేసి చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తాలూకా చీకటి జీవోలు భోగిమంటలలో వేసి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ గారు, MLC మరియు నెల్లూరు సిటీ ఇంచార్జ్ శ్రీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ ఇంచార్జ్ శ్రీ ఆనం విజయకుమార్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నిరసన తెలియజేసిన రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి కాకాని పూజిత
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఏటా పనికిరాని వస్తువులు, వృధా సామాగ్రి భోగిమంటలో వేసి భోగి పీడ విరుగుడు అయిందని పేర్కొనడం ఆనవాయితీ.
చంద్రబాబు చీకటి జీవోలను ఈ సంక్రాంతి సందర్భంగా భోగిమంటలో వేసి కూటమి ప్రభుత్వ పీడనుండి ప్రజలకు విముక్తి కలగాలని కోరుకుంటున్నాం
చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది పొడుగునా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి అనేక పనికిమాలిన ప్రభుత్వ ఉత్తర్వులను విడుదల చేశారు.
ప్రజలకు హాని కలిగించే దిక్కుమాలిన జీవోలను భోగిమంటలలో వేసి నిరసన తెలియజేస్తున్నాం.
సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఈ సంక్రాంతి నుండి అయినా చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.
జగనన్న ఎంతో కష్టపడి దేశ చరిత్రలో ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా మెడికల్ కళాశాలలను మంజూరు చేస్తే చంద్రబాబు వాటిని అమ్మేయాలని చూడటం దుర్మార్గం
చంద్రబాబు బుద్ధి మార్చుకొని పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం కాకుండా పేద ప్రజలకు మంచి వైద్య మందేలా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం.
మా నాయకుడు జగనన్నకు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
#YSRCPForMedicalStudents
#SaveMedicalCollegesInAP #Andrapradesh #Ysrcpvstdp
9 months ago |[YT] | 0
View 0 replies
Srikanth T News
#SaveMedicalCollegesInAP
రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ రోజు కడప నియోజకవర్గం, కడప నగరంలోని అప్సర సర్కిల్ నందు భోగి పండుగను పురస్కరించుకొని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న జీవోలను దహనం చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి.అంజాద్ భాష , రాజంపేట పరిశీలకులు కే.సురేష్ బాబు , కడప నగర మేయర్ పాకా సురేష్ ....
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నిర్ణయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో జరిగింది. ఈ ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందకుండా చేయాలనే దురుద్దేశంతోనే ఈ ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగించే కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ప్రజా ధనంతో నిర్మించిన వైద్య కళాశాలలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం ప్రజా ద్రోహమేనని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు కొనసాగించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉధృత ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ ఎస్.బి. అంజాద్ భాష , అన్నమయ్య జిల్లా పరిశీలకులు కే. సురేష్ బాబు , కడప నగర మేయర్ పాక సురేష్ , డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి , కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, డివిజన్ ఇన్‌చార్జులు, ముఖ్య నాయకులు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
#YSRCPForMedicalStudents #andrapradesh #Ysrcpvstdp #kadapa
9 months ago |[YT] | 1
View 0 replies
Srikanth T News
భారతదేశ ఔన్నత్యాన్ని దశదిశలా చాటిచెప్పిన మహోన్నత మూర్తి, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రజలందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు.
#Telangana #andrapradesh
9 months ago (edited) |[YT] | 1
View 0 replies
Srikanth T News
మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు.
#Telangana #cmrevanthreddy
9 months ago |[YT] | 0
View 0 replies
Srikanth T News
*తిరుమల సమాచారం:*
09-01-2026
🍁🍁🍁🍁🍁
👉🏻 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .
👉🏻 ఉచిత దర్శనం కోసం *అన్ని కంపార్ట్మెంట్లు నిండి, నారాయణ గిరి షెడ్స్ వరకు* క్యూ లో వేచి ఉన్న భక్తులు .
👉🏻 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు *16 గంటల* సమయం పడుతుంది.
👉🏻 300 రూ..శీఘ్రదర్శనంకు *3-4 గంటల* సమయం పడుతుంది.
👉🏻 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *4–6 గంటల* సమయం పడుతుంది.
👉🏻 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *73,580*
👉🏻 *18,465* మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
👉🏻 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: *3.57 కోట్లు.*
#Andrapradesh #Telangana #TTD #Devastanam
9 months ago (edited) |[YT] | 0
View 0 replies
Srikanth T News
తెలంగాణలో రాజాసాబ్ మూవీకి ఎదురుదెబ్బ
టికెట్ల పెంపు కోసం చివరి క్షణం వరకు వేచి ఉంచి తిరస్కరించిన తెలంగాణ ప్రభుత్వం
చివరి క్షణం వరకు బుకింగ్స్ ఓపెన్ చేయకుండా నిరీక్షించిన మూవీ నిర్మాతలు
చివరి నిమిషంలో తిరస్కరించడంతో అభిమానుల ఆగ్రహం
సాధారణ ధరలకే టికెట్ బుక్సింగ్స్ ఓపెన్..
#Telangana #telugucinema #rajasaab #heroprabhas
#bandisrikanth #srijournalist #Vemulawada
9 months ago |[YT] | 0
View 0 replies
Srikanth T News
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కొల్లాపూర్ నియోజకవర్గం, చిన్నంబావి మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ దివ్యశ్రీ రంజిత్, వార్డు మెంబర్లు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు..
ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రావుల చంద్ర శేఖర్ రెడ్డి, రంగినేని అభిలాష్, అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, ఆంజనేయ గౌడ్, ఇంతియాజ్ అలీ, కురువ విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ గారి కామెంట్స్ 👇
♦️కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తిరిగి వస్తుందో.. రాదో తెలియదు నేను కూడా గెలుస్తానో లేదో తెలియదు అని మంత్రి జూపల్లి కృష్ణారావు అదిలాబాద్ లో గత ఏడాది చాలా స్పష్టంగా చెప్పాడు.
♦️కృష్ణారావును ఎట్టి పరిస్థితుల్లో గెలిపించబోమని కొల్లాపూర్ ప్రజలు మాత్రం ఇప్పటికే నిర్ణయించుకున్నారు.
♦️ఇదే కృష్ణారావు మా పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి గురించి ఎంత గొప్పగా మాట్లాడారు అందరికీ తెలుసు
♦️అట్లాంటిది రేవంత్ రెడ్డిని సంతృప్తి పరచడానికి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు
♦️తన మంత్రి పదవి కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డిని ఇంద్రుడు చంద్రుడు అంటున్నాడు.
♦️అవకాశవాదంతో కాంగ్రెస్ లోకి పోయిన నాయకుడు జూపల్లి కృష్ణారావు
♦️మంత్రి జూపల్లి కృష్ణారావు అరాచకాలను ఎదుర్కొని మరి పంచాయతీ ఎన్నికల్లో కొల్లాపూర్ లో గట్టిగా గెలిచాము
♦️కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలి అంటే మూడు ముక్కల్లో.. ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు తప్ప చేసింది ఏమీ లేదు
♦️ఒకవైపు ఆరు గ్యారెంటీలను ఎగవేస్తూ.. హైడ్రా వంటి అరాచక విధానాలతో ఇండ్లను కూల్చివేస్తూ.. చెక్ డాంలను పేల్చి వేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్
♦️చెక్ డాములు కట్టేచోట పేల్చివేతలకు పాల్పడుతున్న ఏకైక దరిద్రపుగొట్టు ప్రభుత్వం ప్రపంచంలో కాంగ్రెస్ ఒకటే ఉంటుంది.
♦️పాలమూరు ప్రాజెక్టును పండబెట్టి రైతులను తొక్కుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
♦️కేవలం తన పాత బాస్ కి కోపం వస్తుందని ఏకైక ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి పాలమూరును పట్టించుకోవడం లేదు.
♦️తెలంగాణలోని ఏ ప్రాంతం ఏ బేసిన్ లో ఉందో తెలవని ముఖ్యమంత్రి తోని మాకు నీటి పాఠాలు అవసరం లేదు.
♦️రేవంత్ రెడ్డికి బాక్రానంగల్ ఎక్కడుందో కూడా తెలియని అజ్ఞాని
♦️నదుల గురించి నీళ్ల గురించి ప్రాజెక్టుల గురించి కనీస అవగాహన లేని రేవంత్ రెడ్డి కేసీఆర్ కి నీటి పాఠాలు చెప్తా అంటున్నాడు.
♦️కాంగ్రెస్ పార్టీ అరాచకాల నుంచి తెలంగాణను కాపాడుకోవాలి అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి.
♦️ఇందుకోసం పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలి
♦️రేపు రాబోయే మున్సిపల్, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలలో గట్టిగా కొట్లాడి గెలవాలి.
♦️రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి చాలా దారుణంగా తయారయింది.
♦️వ్యవసాయ దారులకు ఇచ్చే అన్ని పథకాలను కాంగ్రెస్ ఆపివేసింది.
♦️మేము 11 సార్లు రైతు భరోసా ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సారి ఇచ్చి చేతులు దులుపుకుంది.
♦️ఈరోజు యూరియా గురించి అడిగితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
♦️షాపుల్లో లేని యూరియాను మొబైల్ యాప్స్ తో ఇస్తామని చెప్తుంది.
♦️కొత్తగా యూరియా కార్డ్ అంటూ నాటకం మొదలుపెట్టింది
♦️రైతన్నలకు యూరియా దొరకక లైన్లో నిలబడి యుద్ధాలు చేసుకునే పరిస్థితి వచ్చింది.
♦️చెప్పులు లైన్లో పెట్టి కుటుంబమంతా ఒక్క బస్తా యూరియా కోసం నిలబడుతున్నది.
♦️గ్యారంటీ కార్డులకే దిక్కులేదు.. కొత్తగా యూరియా కార్డు ఇచ్చి కాంగ్రెస్ ఏం చేస్తుంది.
♦️రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో క్రాప్ హాలిడేలు ప్రారంభమయ్యాయి .
♦️గతంలో మా ప్రభుత్వం లో యూరియా కోసం కుస్తీ లేదు.. విత్తనాల కోసం పోటీ లేదు.. కరెంటు కష్టాలు లేవు.. క్రాప్ హాలిడేలు లేవు.
#Telangana #Brsparty #Ktr
#Bandisrikanth #Vemulawada
9 months ago |[YT] | 2
View 0 replies
Load more