Devotional, temples, Gods videos,Political news TG and AP,NEWS VIDEOS, PHOTOGRAPHY, TECHNOLOGY, ENTERTINEMENT, ART etc.


VEGU NEWS

జఫర్ గడ్ ఎస్. ఐ రవి సస్పెండ్
జఫర్ గడ్ ఎస్. ఐ ఎస్. రవి సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కొద్ది సేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. గత సంవత్సరం జఫర్ గడ్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో అలసత్వంతో వ్యవహరిస్తూ, కేసు విచారణ పోలీస్ ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తూ, బాధితులకు న్యాయం చేయకుండా నిందితులకు సహకరిస్తూ, తప్పడు పత్రాలను సృష్టిస్తున్నట్లుగా ఫిర్యాదు రావడంతో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు విచారణ జరిపిన అధికారులు ఎస్.ఐ అవకతవకలకు పాల్పడినట్లుగా నిర్ధారణ కావడంతో జఫర్ గడ్ ఎస్. ఐ ఎస్. రవిని సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

1 year ago (edited) | [YT] | 3

VEGU NEWS

నీ *జీవితమే* నీకు *గురువు* ఎందుకంటే అది *నిరంతరం పాఠాలు* నేర్పుతూనే ఉంటుంది అన్ని *వ్యాధుల్లో* కెళ్ళ *భయంకరమైన* వ్యాధి *అహంకారం* అది *సోకిన* వాళ్ళు *సంతోషంగా* ఉండరు *ఎదుటివారిని సంతోషంగా* ఉండనివ్వరు .

Your *life* is your *teacher* because it is *constantly teaching* lessons* among all *diseases* the *dreadiest* disease is *pride* those *infected* are not *happy* and do not let others be happy* 🙏

1 year ago | [YT] | 2

VEGU NEWS

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంలొ హీరో చిరంజీవి కి కీలక పదవి ఇవ్వనుంద....?

1 year ago | [YT] | 2

VEGU NEWS

*వండర్ కిడ్ ను అభినందించిన పోలీస్‌ కమిషనర్‌*

అతి పిన్న వయస్సులో చూడకుండా ప్రపంచ దేశ రాజధానులు,కరెన్సీలను ఆనర్గళంగా తెలియజేస్తున్న బాల మేధావిని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా శుక్రవారం అభినందించారు. కెయూసి పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌.ఐగా విధులు నిర్వహిస్తున్న దామెరుప్పుల దేవేందర్‌,స్వప్న దంపతుల కుమారుడు తేజస్వీ పబ్లిక్‌ స్కూల్‌లో 6వ తరగతి చదువుచున్న దామెరుప్పుల అక్షిత్‌ అతి పిన్న వయస్సులోనే ప్రపంచ దేశాలకు సంబందించిన రాజధానులతో పాటు ఆ దేశ కరేన్సీలను చూడకుండా ధారళంగా చెప్పడంతో ఈ బాల మేధావి ప్రతిభను గుర్తించిన తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ అక్షిత్‌ పేరును తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చిన్నారుల విభాగంలో నమోదు చేసి గుర్తింపు పత్రాన్ని జారీచేసారు. ఈ పత్రాన్ని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ చేతుల మీదుగా బాల మేధావికి అందజేసారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ ముందుగా బాల మేధావి తల్లిదండ్రులతో పాటు, ట్రైనీ రఘును అభినందిస్తూ మాట్లాడుతూ పిల్లల ప్రతిభను గుర్తించి వారికి సరైన శిక్షణ, సహకారాన్ని అందించడం ద్వారా చిన్నారులు భవిష్యత్తులో ప్రతిభావంతులుగా గుర్తించబడుతారని పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు.

*వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయము*

1 year ago | [YT] | 3

VEGU NEWS

మారుమూల అటవీ ప్రాంతాల్లో వైద్యసేవలు
డాక్టర్ భవ్య శ్రీ
ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్మిపురం అటవి ప్రాంతంలో ఏదిరా డాక్టర్ భవ్య శ్రీ ఆధ్వర్యంలో హెల్త్‌క్యాంపులు నిర్వహించారు. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో నడుచుకుంటూ వెళ్లి గిరిజనులకు వైద్యం అందజేశారు

1 year ago | [YT] | 1

VEGU NEWS

*ప్రజాపాలనా...
ప్రతీకార పాలన...?*

*- బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్.*

*ఇటుక పెళ్ళ కదిపిన గాంధీభవన్ కూలుతది*

*జాగ్రత్త అంటూ.. హెచ్చరించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి*

గత ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనా అని చెప్పి,ప్రతీకార పాలన తీర్చుకుంటుందని ప్రభుత్వ మాజీ చీప్ విప్,బి ఆర్ ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర వినయ్ భాస్కర్ అన్నారు.బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లాకార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకతను కూడగట్టుకుందని అన్నారు.హామీలు నెరవేర్చుకుంటే నిడదీస్తున్నటువంటి బి ఆర్ ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులపై కేసులు పెడుతున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతూ శాంతి భద్రతలకు కూడా కాపాడలేని నిస్సాయస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం ఉందన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధనే ద్యేయంగా నీళ్లు,నిధులు, నియామకాలు అనేటువంటి నినాదంతో అనేక ఉద్యమాలు చేసిన పార్టీ బి ఆర్ ఎస్ పార్టీ అని, పదేళ్లలో బ్రహ్మాండంగా రైతాంగానికి సకాలంలో ఎరువులు, రైతుబంధు, రైతు బీమా ను అందించామని రుణమాఫీ కూడా చేశామని ఈ సందర్భంగా తెలిపారు.వారు ఇచ్చినటువంటి హామీల్లో రుణమాఫీ హామీని అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు తర్జనభజన పడుతున్నారని అన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఇవ్వలేదని, సీఎంఆర్ఎఫ్ ఇవ్వలేని దుస్థితిలో ఉందని అన్నారు. కాలయాపన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నెల మేడిగడ్డ కృంగిపోయిందని,మరొక నెల విద్యుత్ అవినీతి అని, మరొక నెల టెలిఫోన్ టాపింగ్ అని తాత్సరం చేస్తున్నారని అన్నారు. ప్రజల పక్షాన కొట్లాడలని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కెసిఆర్ ప్రభుత్వము జిల్లా పార్టీ కార్యాలయాలకు స్థలాలను కేటాయించిందని అన్నారు. మిగతా పార్టీలకు ఏ విధంగానైతే స్థలాలను కేటాయించిందో బి ఆర్ ఎస్ పార్టీకి కూడా అదే విధంగా కేటాయించిందని ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ వ్యాప్తంగా అవినీతి, అసత్య ఆరోపణలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.సర్వేనెంబర్ 1066 లో ఒక ఎకరం భూమిని బి ఆర్ ఎస్ పార్టీ రూ. 4,84,000 కు కొనుగోలు చేసి పార్టీ కార్యాక్రమాలకు, పార్టీ కార్యకలాపాలకు వాడుతుందని అన్నారు. కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయం పై మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ కు జిల్లా పార్టీ కార్యాలయాలనికి కేటాయించిన భూమిని క్యాన్సిలేషన్ చేయాలని వినతి పత్రాన్ని అందజేశారని అన్నారు. వారు పంపినటువంటి నోటీసులకు వివరణతో కూడిన సమాధానాన్ని బుధవారం రోజున డిప్యూటీ కమిషనర్ కు అందించామని తెలిపారు.అన్ని పార్టీలకు కార్యాలయాలకు ప్రభుత్వమే భూములను కేటాయిస్తుందని,అలాగే హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కూడా మున్సిపాలిటీ స్థలాన్ని కేటాయించిందని వారు పార్టీ కార్యకలాపాలకు వాడకుండా ఆంధ్ర బ్యాంకుకు కిరాయి ఇచ్చారని అన్నారు. 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా,2009 నుండి 2024 వరకు పని చేశానని వేరే పార్టీ నాయకుల పైన ప్రతీకార చర్యలు తీసుకోలేదని, అన్ని పార్టీల నాయకుల వ్యక్తిగత సమస్యలు, వారికి అనారోగ్యం సమస్యలు ఏర్పడినప్పుడు సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా కూడా సహాయ సహకారాలు అందించాలని అన్నారు. కరోనా విపత్కర కష్ట కాలంలో రెమిడీ స్పేర్ ఇంజక్షన్ కూడా వారికి అందజేయడం జరిగిందని అన్నారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే పార్టీలని తర్వాత ప్రజలందరూ సమానమేనన్న దాస్యం వినయ్ భాస్కర్ తనకంటే ముందుగా ముందు పని చేసినటువంటి ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల పైన తన యొక్క సలహాలు సూచనలు తీసుకునేవారని,30 ఏళ్ల రాజకీయ జీవితంలో కక్షపూరితంగా వ్యవహరించలేదని అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము బిఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన, నాపైన వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ భయందోలనాలకు గురి చేస్తున్నారని అన్నారు.శ్రేణుల జోలికి వస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. ఆరు నెలలు గడిచినా కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే ఇప్పటివరకు నయా పైసా నిధులు కూడా తీసుకురాకుండా కెసిఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెచ్చినటువంటి నిధులతోనే కార్యక్రమాలు చేపడుతున్నాడని అన్నారు. మా పార్టీ జోలికి,కార్యాలయానికి జోలికి వస్తే ప్రజలే అడ్డుకుంటారని అన్నారు.పార్టీ కార్యాలయాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని అన్నారు.నిరుద్యోగుల యువకులకు జాబ్ క్యాలెండర్ను, 6 గ్యారెంటీ లు అమలు చేసే విధంగా,ప్రజలు నచ్చే విధంగా, ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన సాగించాలని తెలిపారు.మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారని, హనుమకొండ కార్యాలయం జోలికి రావద్దు అని
టార్గెట్ కావొద్దు అని అన్నారు. గాంధీభవన్ కానీ, సిపిఐ,సిపిఎం, టిడిపి ఇతర పార్టీల కార్యాలయాలకు భూమిని కేసీఆర్ గారు రాకముందే కేటాయించారని అన్నారు. ఖాదీ బోర్డు కు కేటాయించినటువంటి భూమి కూడా ప్రభుత్వ భూమి అని అన్నారు.పార్టీ కార్యాలయంలో ఇటుక పెళ్ల కదిపిన,గాంధీభవన్ కూల్తాదని హెచ్చరించారు. పార్టీ కార్యాలయాలు కట్టుకోవడానికి జీవోను అప్పుడున్నటువంటి నామినల్ రేట్ ప్రకారము ఇవ్వడం జరిగిందని,ఉమ్మడి రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి బోయినపల్లి మెయిన్ రోడ్ లో 10 ఎకరాల భూమిని రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ కు కేటాయించారని,అది కూడా అదే జీవోను అనుసరించి కేటాయించారని అన్నారు. తను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు చాలామంది లేరని,జిల్లా పార్టీ కార్యాలయం కూడా మున్సిపాలిటీ కి చెందినటువంటి భూమిలోనే దగ్గరుండి కట్టించడం జరిగిందని గుర్తు చేశారు.జీవోలను అనుసరించి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయాలకు భూమిలను కేటాయించారని, వాటి జోలికి వస్తే జాగ్రత్త అని అన్నారు.పార్టీ కార్యలయాలను టచ్ చేస్తే,మీ పార్టీ కార్యాలయాలను కూడా టచ్ చేయాల్సి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఆంధ్ర బ్యాంకుకు ఏ విధంగా మీరు కిరాయికి ఇస్తారో తెలపాలని, కరీంనగర్ కాంగ్రెస్ జిల్లా ఆఫీసును పెళ్లిళ్లకు కిరాయి కి ఇస్తున్నారని, ఖమ్మంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కమర్షియల్ గా వాడుకుంటున్నారని అన్నారు. ఇంకా ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూడా ఇదేవిధంగా వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.మీరు మీ మంత్రులు వెంటనే సమావేశమై మాట్లాడుకోవాలని,ఆత్మ విమర్శన చేసుకోవాలని సూచిస్తున్నానని తెలిపారు. అనంతరం దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు,కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి,వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ తాళ్లపల్లి జనార్దన్ గౌడ్,కోఆర్డినేటర్ పులి రజనీకాంత్,కార్పొరేటర్లు చెన్నం మధు,బోయిన్ పల్లి రంజిత్ రావు, నల్ల స్వరూపారాణి, ఇమ్మడి లోహిత రాజు,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జానకి రాములు, నార్ల గిరి రమేష్, నయీముద్దీన్,ఉడుతల సారంగ పాణి, కుసుమ లక్ష్మీనారాయణ, బండి రజిని కుమార్,పరశురామ్, యాదగిరి,పోలేపల్లి రామ్మూర్తి,సాల్వజీ రవీందర్, విద్యార్థి నాయకులు శరత్చంద్ర, బైరపాక ప్రశాంత్,సుమన్,వీరస్వామి,నాగరాజు,లంక రాజ్ గోపాల్,సౌరం రఘు, తోపాటు తదితరులు పాల్గొన్నారు.

1 year ago | [YT] | 0

VEGU NEWS

*నేడు ఢిల్లీలో ప్రధాని మోడీతో సీఎం రేవంత్‌ భేటీ*

న్యూ ఢిల్లీ:0407024
తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఈరోజు మ.1.30 గంటలకు ప్రధాన మంత్రి మోడీతో పాటు హోంమంత్రి అమిత్‌ షాను సైతం కలిసే అవకాశ ముంది.

త్వరలో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో సీఎం ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి, నిధులను కేటాయించాలని కోరారు.

కాగా సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టివిక్ర మార్క కూడా ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం..

1 year ago | [YT] | 2

VEGU NEWS

*ట్రాఫిక్‌ జంక్షన్లను పరిశీలించిన పోలీస్‌ కమిషనర్‌*

ట్రాఫిక్‌ రద్దీని నియంత్రణ భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా హనుమకొండ ప్రాంతంలో పలు ట్రాఫిక్‌ జంక్షన్లను క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్‌ అధికారులతో పరిశీలించారు. ఇందులో భాగంగా బుధవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ముందుగా మర్కజీ పాఠశాల వద్ద మూసివేసిన ట్రాఫిక్‌ జంక్షన్‌ పరిశీలించారు. మర్కజీ జంక్షన్‌ వద్ద మూసి వేయడం ద్వారా కుమార్‌పల్లి మార్కెట్‌, ఈదుల వాగు, పెద్దమ్మగడ్డ ఆ క్రింది ప్రాంతాలకు వేళ్ళే వాహనదారులు మిషన్‌ హస్పటల్‌ వద్ద యూ టర్నన్‌ నుండి రాంగ్‌ రూట్‌లో వాహనదారులు ప్రయాణిస్తుండంతో పాటు, నయీంనగర్‌ ప్రాంతంలోని ప్రధాన రోడ్డు మార్గంలోని బ్రిడ్జ్‌ పనులు కోనసాగుతుందడంతో కెయూసి వైపు వేళ్ళే వాహనదారులకు మర్కజీ జంక్షన్‌ వద్ద డివైడర్‌ను మూసి వేయడంతో వాహనదారులకు ఇబ్బందులకు గురౌవుతున్నట్లుగా పోలీస్‌ అధికారులకు పలు విన్నపాలు రావడంతో దీనిపై స్పందించిన పోలీస్‌ కమిషనర్‌ క్షేత్ర స్థాయిలో మర్కజీ జంక్షన్‌ పరిశీలించారు. ఈ జంక్షన్‌ తిరిగి పున:ప్రారంభించడం ద్వారా ట్రాఫిక్‌ క్రమబద్దీకరణలో కలిగే సానుకూల పరిణామాలపై పోలీస్‌ కమిషనర్‌ ట్రాఫిక్‌ అధికారులను అడిగితెలుసుకున్నారు. ప్రస్తుత స్థితిగతుల దృష్యా వాహనదారులకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో వుంచుకోని మర్కజీ జంక్షన్‌ వద్ద మూసి డివైడర్లను తోలిగించాల్సిందిగా పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు అదేశించడంతో పాటు, ఈ జంక్షన్‌ నుండి ప్రయాణించే వాహనాల సంఖ్య దృష్టిలో వుంచుకోని ఈ జంక్షన్‌ వద్ద విధులు నిర్వహించేందుకుగాను ఏ.ఆర్‌ పోలీస్‌ సిబ్బందిని వినియోగించుకోవాల్సిందిగా పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు సూచించారు.
అనంతరం పోలీస్‌ కమిషనర్‌ ఆదాలత్‌ జంక్షన్‌ను పరిశీలించారు. ఈ జంక్షన్‌తో పాటు నగరంలోని ఇతర జంక్షన్లలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేయడంతో గతంలో ఎర్పాటు చేసిన పాత ట్రాఫిక్‌ సిగ్నల్‌ కొత్తగా ఎర్పాటు చేసిన ట్రాఫిక్‌ సిగ్నల్‌ అడ్డుగా నిలవడంతో వాహనదారులకు సిగ్నల్స్‌ సరిగా కనిపించ ఇబ్బందులకు గురౌవుతున్నారు. ఈ సమస్యను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన పోలీస్‌ కమిషనర్‌ పాత ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ తొలిగించి నగరంలో నూతనంగా ఏర్పాటు చేసేందుకుగాను ట్రాఫిక్‌ అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు.
పోలీస్‌ కమిషనర్‌ వెంట ట్రాఫిక్‌ ఏసిపి సత్యనారయణ, హనుమకొండ, కాజీపేట ట్రాఫిక్‌ ఇన్స్‌స్పెక్టర్లు షూకూర్‌, నాగబాబు, హనుకొండ ఇన్స్‌స్పెక్టర్‌ సతీష్‌ వున్నారు.

*వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయము*

1 year ago | [YT] | 2

VEGU NEWS

*మీడియా ప్రతినిధులకు ఆహ్వానం*

రేపటి నుండి దేశవ్యాప్తంగా అమలుకానున్న నూతన నేర, న్యాయ చట్టలపై మీడియా ప్రతినిధులకు మరింత అవగాహన కల్పించడం కోసం రేపు ఉదయం 11 గంటలకు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సాధరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మీడియా ప్రతినిధులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయగలరని మనవి

*-వరంగల్ పోలీస్ కమిషనరేట్*

1 year ago | [YT] | 5