JanaSena Party Telangana

In the footsteps of - JanaSena Party Telangana

Official Channel of JanaSena Party Telangana, Founded by Sri Pawan Kalyan.

JanaSena Party Telangana is an Indian political party active in the states of Telangana and Andhra Pradesh. Founded by Sri Pawan Kalyan on 14 March 2014, it is currently the second largest party in the Andhra Pradesh & Telangana Legislative Assembly and a partner in the ruling coalition. Pawan Kalyan, the party leader, has been serving as the Deputy Chief Minister of Andhra Pradesh since June 2024.


JanaSena Party Telangana

ఖాకీ… సమాజానికి రక్షణ కవచం

•కానిస్టేబుల్ ఉద్యోగం పోలీస్ వ్యవస్థకు మూల స్థంభం లాంటిది
•మీ గౌరవాన్ని ఎవరి ముందూ తగ్గించుకోవద్దు
•శాంతి భద్రతలను పరిరక్షించే మీరు… రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు ఓ చోదక శక్తి
•సక్రమంగా విధులు నిర్వర్తిస్తూ మీరంతా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
•గత ప్రభుత్వ నిర్వాకంతో మూడున్నరేళ్ల విలువైన కాలాన్ని కోల్పోయారు
•కూటమి ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో న్యాయపరమైన చిక్కులు తొలగించి నియామకాలు చేపట్టింది
•మాజీ ముఖ్యమంత్రి పోలీసులకు హెచ్చరికలు చేస్తున్నారు
• ⁠పోలీసులని బెదిరించేవారిని ఉపేక్షించం
•మీరు ప్రజలకు రక్షణ కల్పించండి.. అండగా మేము ఉంటాం
•కానిస్టేబుళ్ల నియామక పత్రాల ప్రదానం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు

‪@JanaSenaParty‬ ‪@janasenapartytelanganapk‬

#6000PoliceJobsinAP #AndhraPradesh #Pawankalyan #Chandrababunaidu #Vangalapudianitha #Nagababu #Janasenapartytelangana #JanaSenaParty #TDP #BJP #Telangana #Chiranjeevi #Pspk

17 hours ago | [YT] | 2,391

JanaSena Party Telangana

శ్రీ పవన్ కల్యాణ్ గారు సుజిత్ కి కారును బహుమతిగా ఇచ్చారు🔥❤️

‪@JanaSenaParty‬ ‪@janasenapartytelanganapk‬

#TheyCallHimOG #OG #Pawankalyan #Sujeeth #PSPK #Deputycmpawankalyan #Janasenapartytelangana #JanaSenaParty #AndhraPradesh #JanaSenaParty

1 day ago | [YT] | 1,783

JanaSena Party Telangana

శ్రీ @PawanKalyan గారి చొరవతో కేరళ, తమిళనాడుల్లో ఉప్పాడ మత్స్యకారులకు శిక్షణ.

‪@JanaSenaParty‬
‪@janasenapartytelanganapk‬

#Pithapuram #AndhraPradesh
#PawanKalyanAneNenu
#pawankalyan #Deputycmpawankalyan
#Nagababu #Pspk #AndhraPradesh #Telangana #Janasenapartytelangana #JanaSenaParty #JSPTG #chiranjeevi

2 days ago | [YT] | 1,855

JanaSena Party Telangana

ఉదయం విజ్ఞప్తి.. సాయంత్రానికి రోడ్డు మంజూరు..

డిసెంబర్ 12 వ తేదీ ఉదయం అంధ మహిళా క్రికెట్ జట్టును కలిసి అభినందించిన సందర్భంలో టీమ్ కెప్టెన్ దీపిక తమ గ్రామానికి సరైన రోడ్డు లేక వారు పడుతున్న ఇబ్బందులను ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి వివరించగా సాయంత్రానికి రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇచ్చేలా చర్యలు చేపట్టారు.

‪@JanaSenaParty‬ ‪@janasenapartytelanganapk‬

#PawanKalyanAneNenu #Pawankalyan #Pspk #AndhraPradesh #Telangana #Deputycmpawankalyan #Nagababu #Chiranjeevi #Janasenapartytelangana #JanaSenaParty

4 days ago | [YT] | 2,641

JanaSena Party Telangana

ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బందితో ఈ భేటీ జరిగింది.

• ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను అభినందించి, ఒక్కో మహిళా క్రికెటర్ కు రూ.5 లక్షల చొప్పున, శిక్షకులకు రూ.2 లక్షలు చొప్పున చెక్కులు అందించారు.
• ప్రతి మహిళ క్రికెటర్ కు పట్టు చీర, శాలువాతోపాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను అందించి సత్కరించారు
• మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమని కొనియాడారు.
• అంధ క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, అన్ని విధాలా అండగా నిలవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా విజ్ఞప్తి చేస్తానని హామీ.
• రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని, మహిళా క్రికెటర్లు తెలిపిన అంశాలను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు.
• ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఉన్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు దీపిక (జట్టు కెప్టన్), పాంగి కరుణా కుమారి ఉండటం సంతోషంగా ఉందన్నారు.
• ఈ సందర్భంగా జట్టు కెప్టన్ దీపిక తమ గ్రామ సమస్యలు తెలిపారు. ఆమె శ్రీ సత్యసాయి జిల్లా హేమావత్ పంచాయతీ తంబలహట్టి తండాకు చెందినవారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కావాలని దీపిక విజ్ఞప్తి చేశారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు.
• అల్లూరి సీతారామరాజు జిల్లాకి చెందిన క్రికెటర్ కరుణకుమారికి చేసిన విజ్ఞప్తులపైనా తక్షణమే చర్యలు ప్రారంభించాలని పేషీ అధికారులకు సూచించారు.

@blind_cricket
‪@JanaSenaParty‬
‪@janasenapartytelanganapk‬


#WomensBlindCricket
#Pawankalyan #indiancricketteam
#cricket #deputycmpawankalyan #pspk #janasenapartytelangana #JanaSenaParty #AndhraPradesh #Telangana #Nagababu #chiranjeevi #RamCharan #TDP #BJP

5 days ago | [YT] | 2,016

JanaSena Party Telangana

ప్రమోషన్ల ఆనందం ప్రజలకు అందించే సేవల్లో కనబడాలి

•ఉద్యోగులు నిష్పక్షపాతంగా, నిబద్ధతతో వ్యవహరించాలి
•పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికే నూతన సంస్కరణలు
•గత ప్రభుత్వంలో పోస్టింగ్ కీ, ప్రమోషన్ కీ ఓ రేటు కార్డు ఉండేది
•కూటమి పాలంలో సీనియారిటీ, సిన్సియారిటీకే ప్రాధాన్యమిచ్చాం
•గతంలో ఎన్నడూ లేని విధంగా 10 వేల మందికి పైగా పదోన్నతులు కల్పించాము
•నేను జవాబుదారీతనంతో ఉంటా... మీరూ తప్పు చేయొద్దు
•పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో మాటా-మంతి కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

‘ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమారుడిగా ఉద్యోగుల సాధకబాధకాలు నాకు తెలుసు. నా శాఖ పరిధిలో ఉన్న ఉద్యోగులకు ఏం చేయగలనని మొదటి నుంచి ఆలోచించాను. ఉన్నతాధికారులను అడిగితే తీసుకురావాల్సిన సంస్కరణలు చాలా ఉన్నాయని చెప్పారు. ఒక ప్రమోషన్ వస్తే ఉద్యోగి ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. వారు మరింత ప్రభావవంతంగా పని చేస్తారు. అందుకే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతుల వ్యవహారాన్ని బలంగా, పారదర్శకంగా ముందుకు తీసుకువెళ్లామ’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఈ రోజు ప్రమోషన్లతో మీరు ఎంత సంబరపడ్డారో.. మీరు అందించే సేవల ద్వారా ప్రజలు కూడా అంతే ఆనందపడాలన్నారు. ప్రజలకు సేవలు అందించే క్రమంలో మీరంతా నిష్పక్షపాతంగా, నిబద్ధతతో వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. ఏడాదిన్నర పాలనలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో ఎన్నో నూతన సంస్కరణలు అమలు చేశాం.. మరిన్ని అమలు చేయబోతున్నామన్నారు. చట్టబద్దంగా మీకు చేయగలిగినవన్నీ చేస్తామని తెలిపారు. ఉద్యోగుల భద్రత, హక్కుల పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇస్తామన్నారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో పెండింగ్ ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు వెంటనే చెల్లించాలని ఆదేశించారు. బుధవారం మంగళగిరిలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఇంజినీరింగ్ విభాగం, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, సిబ్బందితో మాటా మంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “పల్లెలు బాగుంటే దేశం బాగుంటుంది. అందుకే గ్రామాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పంచాయతీరాజ్ శాఖను ఎంచుకున్నా. అనుభవం ఉన్న అధికారి పర్యవేక్షణ కావాలని శ్రీ శశిభూషణ్ కుమార్ గారిని ప్రధాన కార్యదర్శిగా తీసుకున్నాం. ఉపముఖ్యమంత్రి హోదాలో ఎక్కడా నా సొంత తెలివితేటలు వాడలేదు. కొన్ని సందర్భాల్లో నిర్ణయం తీసుకుంటే తప్పు తీసుకోకుంటే ఒప్పు అన్న పరిస్థితులు ఎదురయ్యాయి. అందుకే నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. శ్రీ శశిభూషణ్ కుమార్, శ్రీ కృష్ణతేజ, శ్రీ వెంకటకృష్ణ లాంటి నిబద్దతతో పని చేసే బలమైన అధికారులు నాతో ఉన్నారు. వారి అనుభవంతో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం. గత ప్రభుత్వ పాలనలో చాలా అంశాల్లో పారదర్శకత లేదన్న విషయాన్ని వీరు నా దృష్టికి తీసుకువచ్చారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లు అభివృద్ధి చేయలేదు. కనీస మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించలేదు. ప్రతి పోస్టుకీ, బదిలీకి ఒక రేటు కార్డు ఉండేది. ఇలాంటి పరిస్థితులు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. మన వరకు ఉద్యోగులకు ఎంత పారదర్శకంగా వ్యవహరించగలమనే ఆలోచన చేశాం
•పూర్తి పారదర్శకంగా పదోన్నతులు
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఔట్ సోర్సింగ్ తో కలిపి సుమారు రెండు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరికి పదోన్నతులు కల్పించే వ్యవహారంలో కార్యాలయ అధికారులు వెన్నెముకలా నిలిచారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వ్యవస్థ ప్రక్షాళణకు సంస్కరణలు అవసరం అని వారు చెప్పేవారు. సమీక్షల సమయంలో చిన్న చిన్న మార్పులు తీసుకురావడం ద్వారా మంచి ఫలితాలు సాధించాం. పదోన్నతుల వ్యవహారంలో నేను కల్పించుకోను అని ముందే చెప్పా. అయితే పాదర్శకతతో కూడిన పాలన కావాలని మాత్రమే కోరుకున్నా. సీనియారిటీ, సిన్సియారిటీ ఆధారంగా నివేదికలు ఇవ్వాలని సూచించా. బదిలీలు, పదోన్నతులపై ఎంతో మంది ఎమ్మెల్యేలు, మంత్రులు సిఫార్సు లెటర్లు ఇచ్చారు. సిఫార్సు పొందిన ఉద్యోగికి నిర్దేశిత ప్రమాణాలకు తగ్గ అర్హత ఉంటేనే దాన్ని ఆమోదించాలని స్పష్టంగా చెప్పాం.
•ఆర్థిక వ్యవస్థ గాడినపడితే ఉద్యోగుల ఆకాంక్షలు తీరుతాయి
ఈ రోజున మనం 10 వేల మంది పైచిలుకు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పదోన్నతుల వ్యవహారంలో ఇంత భారీ స్థాయిలో సంస్కరణలు అమలు చేయలేదు. నేడు పూర్తి పాదర్శకంగా మీకు పదోన్నతులు కల్పించాం. మేము ఎంత పాదర్శకంగా నిలబడ్డామో అదే స్ఫూర్తిని మీరు గ్రామాల్లోనూ ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు సంపద పెంచిన తర్వాత హక్కులు, జీతాల పెంపు గురించి మాట్లాడాలి.
#MataManthi

‪@JanaSenaParty‬ ‪@janasenapartytelanganapk‬

#Pawankalyan #Deputycmpawankalyan #Janasenapartytelangana #JanasenaParty #AndhraPradesh #Telangana #Tdp #Bjp #pspk #Nagababu #Chiranjeevi

1 week ago | [YT] | 3,606

JanaSena Party Telangana

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి అరుదైన గౌరవం.!!
“అభినవ కృష్ణదేవరాయ” బిరుదుతో సత్కారం.
పుట్టగ శ్రీకృష్ణ మఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ వారి చేతుల మీదుగా
‘అభినవ కృష్ణదేవరాయ’ బిరుదు ప్రదానం.!!

ఇది సేవకు, త్యాగానికి, ప్రజాప్రయోజన నాయకత్వానికి లభించిన మహా గుర్తింపు.

‪@JanaSenaParty‬ ‪@janasenapartytelanganapk‬

#Pawankalyan #SriKrishnatemple #Karnataka #Deputycmpawankalyan #Pspk #Nagabau #Janasenapartytelangana #JanaSenaParty #Telangana #AndhraPradesh #Chiranjeevi

1 week ago | [YT] | 4,063

JanaSena Party Telangana

విద్యార్థులను దేశానికి పనికొచ్చే శక్తులుగా తయారు చేయాలి

• తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య నిరంతర సమన్వయం అవసరం
• కేరళ తరహా విద్యావిధానం అమలు అవసరం
• రాష్ట్ర ఐ.టి., మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి చొరవతో చేపట్టిన మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు మంచి ఫలితాలు ఇస్తాయి
• జెన్ జీ కాలంలో విభిన్న రంగాల్లో సృజన అందరికీ అవసరం
• పుస్తకాలు చదవడం మనల్ని ఉన్నతంగా నిలబెడుతుంది... గ్రూప్ లైబ్రరీలు ఏర్పాటు కావాలి
• గంజాయి, మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని కలిసికట్టుగా నిర్మిద్దాం
• చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్ లో నిర్వహించిన మెగా టీచర్స్ – పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.

‪@JanaSenaParty‬ ‪@janasenapartytelanganapk‬

#Pawankalyan #Students #School #Chilakaluripet #AndhraPradesh #Telangana #Janasenapartytelangana #JanaSenaParty #TDP #BJP #Pspk #Deputycmpawankalyan

1 week ago | [YT] | 3,335

JanaSena Party Telangana

శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మరింత చేరువయ్యేలా పంచాయతీరాజ్ వ్యవస్థ

•డీడీఓ కార్యాలయాల ద్వారా సంక్షేమ, అభివృద్ధి సమన్వయం
•ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న అధికారులకు పదోన్నతులు
•సులభంగా, సత్వరంగా ప్రజలకు సేవలందించేలా ఏర్పాటు
•నూతన సంస్కరణలతో సరికొత్తగా బాధ్యతలు
•గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర పంచాయతీలకు సహాయ సహకారాలు అందుతున్నాయి
•గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు సారథ్యంలో నిధులను సక్రమంగా వినియోగించే బాధ్యత తీసుకున్నాము
•చిత్తూరులో డీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించి, రాష్ట్రంలోని 77 డీడీఓ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు

‪@JanaSenaParty‬ ‪@janasenapartytelanganapk‬

#pawankalyan #Chittoor #AndhraPradesh #Telangana #Nagababu #Pspk #JanaSenaParty #Janasenapartytelangana #TDP #BJP

1 week ago | [YT] | 3,103