INTURI NAGESWARARAO

MLA, Kandukuru Constituency
Prakasam District, Andhra Pradesh

Like me on Facebook: www.facebook.com/iNRKandukuru

Follow me on Twitter: twitter.com/inrKandukuru

Follow me on Instagram: www.instagram.com/inr_kandukuru/

#yuvagalam
#yuvagalampadayatra
#yuvagalamlokesh
#padayatra
#kandukur
#kandukurtdp
#tdpkandukur
#inturinageswararao
#nageswararaointuri



INTURI NAGESWARARAO

ఈ రోజు వలేటివారిపాలెం మండలం, పోకూరు గ్రామంలో "స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది మనందరి సామాజిక బాధ్యత. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని వీధులను శుభ్రం చేయడం, డ్రైనేజీల నిర్వహణ మరియు ప్లాస్టిక్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాము. ఈ బృహత్తర కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న గ్రామస్తులకు, అధికారులకు మరియు సిబ్బందికి అభినందనలు.

#MLAinturi #InturiNageswaraRao #KandukurMLA #teaminr #naralokesh #narachandrababunaidu #kandukurtdp #inr2024kandukurmla #inrmarkruling #AndhraPradesh

18 hours ago | [YT] | 15

INTURI NAGESWARARAO

పరిశుభ్రతే ఆరోగ్యం - విద్యార్థుల సంక్షేమమే మా ప్రభుత్వం లక్ష్యం!

ఈరోజు 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో భాగంగా కందుకూరు పట్టణంలోని ప్రభుత్వ ఎస్సీ (SC) బాలికల వసతి గృహాన్ని (Hostel) అధికారులతో కలిసి సందర్శించడం జరిగింది.

హాస్టల్‌లోని వంటగది, బాత్‌రూమ్‌లు, గదులను స్వయంగా పరిశీలించి, వ్యర్థాల నిర్వహణపై ఆరా తీశాను. విద్యార్థినులతో ముచ్చటించి పారిశుధ్యంపై ప్రశ్నలు అడిగి వారి అవగాహనను తెలుసుకున్నాను. వ్యక్తిగత శుభ్రతతో పాటు, తమ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించాను.

ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థలో ఉన్నందున, త్వరలోనే నూతన భవన నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. తాత్కాలికంగా నిర్మిస్తున్న భవన పనులను కూడా ఈ సందర్భంగా పరిశీలించడం జరిగింది.

యువనేత, మంత్రి శ్రీ నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టాక హాస్టల్స్ రూపురేఖలు మారాయి. విద్యార్థులకు సకాలంలో ఆహారం, పుస్తకాలు, కాస్మోటిక్స్ అందుతున్నాయి. 'తల్లికి వందనం' పథకం ద్వారా పేద విద్యార్థుల చదువులకు మా ప్రభుత్వం భరోసా ఇస్తోంది.

హాస్టల్ పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని వార్డెన్‌ను ఆదేశించాను. స్థానిక నాయకులు తరచుగా హాస్టల్‌ను సందర్శించి పిల్లల బాగోగులు తెలుసుకోవాలని సూచించాను.


#MLAinturi #InturiNageswaraRao #KandukurMLA #teaminr #naralokesh #narachandrababunaidu #kandukurtdp #inr2024kandukurmla #inrmarkruling #AndhraPradesh

19 hours ago | [YT] | 26

INTURI NAGESWARARAO

ప్రజల ఆరోగ్యం - కూటమి ప్రభుత్వ లక్ష్యం!

సీఎంఆర్ఎఫ్ (CMRF) నిధుల మంజూరులో మన కందుకూరు నియోజకవర్గం అగ్రస్థానం. 🙏

కందుకూరులోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 53 మంది లబ్ధిదారులకు ₹45.27 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు మన నియోజకవర్గానికి ₹10 కోట్లకు పైగా CMRF నిధులు మంజూరయ్యాయి. దరఖాస్తు చేసిన వెంటనే స్పందిస్తూ, పేదవాడి ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా తరపున మరియు నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు.


పంపిణీ చేసిన వివరాలు:
🔹 ఉలవపాడు మండలం: 20 మందికి - ₹21.63 లక్షలు
🔹 లింగసముద్రం మండలం: 18 మందికి - ₹9.30 లక్షలు
🔹 గుడ్లూరు మండలం: 15 మందికి - ₹14.34 లక్షలు

పేదలకు మేలు చేసేందుకు నిరంతరం తపిస్తున్న మన ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలవాలని కోరుకుంటున్నాను.

#MLAinturi #InturiNageswaraRao #KandukurMLA #teaminr #naralokesh #narachandrababunaidu #kandukurtdp #inr2024kandukurmla #inrmarkruling #AndhraPradesh

21 hours ago | [YT] | 15

INTURI NAGESWARARAO

తెలుగు జాతి ఆత్మగౌరవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహ ఏర్పాటుకు ఈ రోజు వలేటివారిపాలెం మండలం, చుండి గ్రామంలో భూమి పూజ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అన్నగారి ఆశయసాధనలో మనందరం ముందుకెళ్లాలి.

అలాగే, మన యువనేత, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా గ్రామస్తులు మరియు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి, వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. లోకేష్ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో వర్థిల్లాలని, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.

#MLAinturi #InturiNageswaraRao #KandukurMLA #teaminr #naralokesh #narachandrababunaidu #kandukurtdp #inr2024kandukurmla #inrmarkruling #AndhraPradesh

1 day ago | [YT] | 19

INTURI NAGESWARARAO

శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా కందుకూరులోని ఏఎంసీ (AMC) గ్రౌండ్ లో ‘జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్’ను ఈ రోజు ఉత్సాహంగా ప్రారంభించడం జరిగింది.

యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి, వారిని క్రీడల వైపు ప్రోత్సహించడానికి ఇదొక చక్కటి వేదిక. టోర్నమెంట్ లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ నా శుభాకాంక్షలు. అందరూ స్పోర్టివ్ గా ఆడి టోర్నమెంట్ ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.


#MLAinturi #InturiNageswaraRao #KandukurMLA #teaminr #naralokesh #narachandrababunaidu #kandukurtdp #inr2024kandukurmla #inrmarkruling #AndhraPradesh

1 day ago | [YT] | 20

INTURI NAGESWARARAO

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలన్నదే మన లక్ష్యం!

ఈ రోజు మన యువనేత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా కందుకూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు రూ. 2.25 లక్షల విలువైన వైద్య పరికరాలను (ECG మిషన్, నెబ్యులైజర్లు, బెడ్లు తదితర వస్తువులు) దాతల సహకారంతో అందజేయడం జరిగింది.

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి మన ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. కందుకూరు నియోజకవర్గానికి ఇప్పటివరకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా సుమారు 10 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించగలిగాము.

ఆసుపత్రి అభివృద్ధికి రూ. 50 వేల విరాళం అందించిన పిడికిటి వెంకటేశ్వర్లు గారికి, అలాగే ఇతర సామగ్రిని సమకూర్చిన ఉప్పుటూరి శ్రీనివాసరావు, వెంకట నరసింహం గార్లకు, ఇతర దాతలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

ఒక చిన్న విన్నపం నన్ను కలవడానికి వచ్చే వారు దయచేసి శాలువాలు, పూలదండలు తీసుకురావద్దు. అవి ఎవరికీ ఉపయోగపడవు. వాటికి బదులుగా ఆసుపత్రి అభివృద్ధికి విరాళాలు లేదా వస్తువులు అందిస్తే పేద రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మన ఆసుపత్రిని మనమే అభివృద్ధి చేసుకుందాం.

#MLAinturi #InturiNageswaraRao #KandukurMLA #teaminr #naralokesh #narachandrababunaidu #kandukurtdp #inr2024kandukurmla #inrmarkruling #AndhraPradesh

1 day ago | [YT] | 28

INTURI NAGESWARARAO

కందుకూరు పట్టణంలోని బి.ఆర్ ఆక్స్ ఫర్డ్ స్కూల్ (B.R. Oxford School) లో జరిగిన 12వ వార్షిక స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో పాల్గొని, క్రీడలను ప్రారంభించాను. ఈ సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశాను.

#MLAinturi #InturiNageswaraRao #KandukurMLA #teaminr #naralokesh #narachandrababunaidu #kandukurtdp #inr2024kandukurmla #inrmarkruling #AndhraPradesh

1 day ago (edited) | [YT] | 17

INTURI NAGESWARARAO

ఈరోజు కందుకూరు టీడీపీ కార్యాలయంలో శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేయడం జరిగింది.

#HappyBirthdayNaraLokesh #MLAinturi #InturiNageswaraRao #KandukurMLA #teaminr #naralokesh #narachandrababunaidu #kandukurtdp #inr2024kandukurmla #inrmarkruling #AndhraPradesh

1 day ago | [YT] | 40

INTURI NAGESWARARAO

తెలుగువారి ఆరాధ్య దైవం, అన్న శ్రీ నందమూరి తారకరామారావు గారి 30వ వర్ధంతి రోజున ఆయనకు ఘన నివాళులు అర్పించాను.

ఆయన తెలుగుజాతి గుండె చప్పుడు. తెలుగువారి కీర్తి పతాకం. అటు రాజకీయ, ఇటు సినీ రంగాల్లో మహోన్నత శిఖరం.

మన నియోజకవర్గం నలుమూలల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చి ఆయనను స్మరించుకోవడం స్ఫూర్తిదాయకం. తారక రాముడి మీద వెలకట్టలేని అభిమానంతో రక్తదానం చేసిన ప్రతి ఒక్కరూ అభినందనీయులు. వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

#JoharNTR #NTRVardhanthi #NTR30thVardhanthi #LegendNTR #AnnaNTR #NTRBloodDonation #MLAinturi #InturiNageswaraRao #KandukurMLA #teaminr #naralokesh #narachandrababunaidu #kandukurtdp #inr2024kandukurmla #inrmarkruling #AndhraPradesh

6 days ago | [YT] | 95

INTURI NAGESWARARAO

సన్నిహితులు, అభిమానుల ఆహ్వానంతో ఈరోజు రెండు చాయ్ దుకాణాలను ప్రారంభించడం జరిగింది.

వలేటివారిపాలెం మండలం చెర్లోపాలెం వద్ద చాయ్ బ్రో, కందుకూరు పట్టణంలో మిస్టర్ చాయ్ దుకాణాలు ఏర్పాటు చేసిన యువతను అభినందించాను. వ్యాపారం బాగా జరిగి అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తున్నాను.

1 week ago | [YT] | 48