Jagan mohan vlogs

Welcome to Jagan Mohan Vlogs
This channel contain is natural vlogs, entertainment live, daily vlogs
Please give us your support by giving a
Like👍 Share🔃 Subscribe 👈 Hit the 🔔 icon


Jagan mohan vlogs

Latest my eye report

1 week ago | [YT] | 2

Jagan mohan vlogs

ఒక కొడుకు తన తండ్రిని అడిగిన ఒక సందేహం. నాన్నా మీ కాలంలో
1. ఇంత టెక్నాలజీ లేదు..
2. విమానాలు లేవు..
3. ఇంటర్నెట్ లేదు..
4. TV లు లేవు..
5. కంప్యూటర్లు లేవు..
6. ఏసీ లు లేవు..
7. లగ్జరీ కార్ లు లేవు..
8. మొబైల్ ఫోన్ లు లేవు..
మీరెలా బ్రతికేవారు?

దానికి ఆ తరము తండ్రిగారు ఇచ్చిన జవాబు అందరూ చదవవలసిందే.
మీ తరమువారు ఈ రోజుల్లో ఎలాగైతే
1. ప్రార్ధన లేకుండా..
2. మర్యాద లేకుండా
3. ప్లానింగ్ లేకుండా
4. క్రమశిక్షణ లేకుండా..
5. పెద్దల ఎడల గౌరవం లేకుండా..
6. మన చరిత్ర పై అవగాహన లేకుండా..
7. కుటుంబ విలువలపై ఏ మాత్రం పట్టింపులు లేకుండా..
8. ఏ Morals లేకుండా..
రోజులు ఎలా గడిపేస్తున్నారో!
మేము ఆ Morals అన్నీ పాటిస్తూ ఆనందంగా జీవించాము.
మేము మీలాగా...
1. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించలేదు
2. పాఠశాల వేళలు అయిన తరువాత చీకటి పడేదాకా ఆడుకున్నాము. TV లు చూడలేదు.
3. ఇంటర్నెట్ స్నేహితులతో కాక నిజమైన స్నేహితులతో గడిపాము.
4. దాహం వేస్తే కుళాయి నీరు, బావి నీరు త్రాగాము. బాటిల్ నీరంటే ఏమిటో తెలియదు.
5. ఒకే గ్లాస్ లో నలుగురం జ్యూస్ త్రాగినా, కాకి ఎంగిలి చేసిన జామకాయలు తిన్నా
మాకెప్పుడూ జబ్బులు రాలేదు.
6. మూడు పూటలా అన్నమే తిన్నా మాకు ఊబకాయం రాలేదు.
7. షూస్ లేకుండా ఉత్తి పాదాలపై పరిగెత్తినా
మాకు కీళ్ళ నొప్పులు రాలేదు.
8. సొంత ఆట వస్తువులు తయారు చేసుకొని ఆడుకున్నాము, అష్టా చెమ్మా, ఏడు పెంకులు, కోతి కొమ్మచ్చి, వైకుంఠ పాళీ, దొంగ పోలీస్ ఆడుకున్నాము. బంధువులతో కలసి మెలసి ఆనందంగా ఉన్నాము,
9. పిలువక పోయినా స్నేహితుల ఇండ్లకు వెళ్లి వారి తినుబండారాలు ఆరగించాము..
10. మావి black and వైట్ ఫొటోలే అయినా వాటి వెనుక ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి.
బహుశా మా తల్లిదండ్రులు చెప్పింది ఆచరించిన చివరి తరం మేమే.
మా వారసులు శాసించినది పాటించే మొదటి తరమూ మాదే కావచ్చు అయినప్పటికీ మీ యాంత్రిక జీవితానికి యధాశక్తి సహాయ పడుతున్న వాళ్ళము. మేము ఒక limitted ఎడిషన్ మోడల్స్ లాంటి వాళ్ళము. అందుకే మా విన్నపము ఏమంటే భూమి పైనుండి మేము వెళ్ళిపోకముందే మా జీవితాలనుండి, ఎంతో కొంత మానుండి మీరు నేర్చుకోండి. మమ్మల్ని చక్కగా పెంచిన మంచి తల్లిదండ్రులకు వందనాలు, మేము అలా పెంచడం చేతకాని ఈ సమాజంలో,
ఓడిపోయిన మొదటి తరం తల్లిదండ్రులం అవుతున్నాం.

1 month ago | [YT] | 1

Jagan mohan vlogs

మీకు మీ కుటుంబ సభ్యులకు విశ్వ వాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కొత్త సంవత్సరంలో మీరు ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలని ఉగాది పచ్చడి జీవితం అన్ని రుచులతో సమతూకంగా ఉండాలని ఆశిస్తున్నాను ఇట్లు మీ జగన్

1 month ago | [YT] | 7

Jagan mohan vlogs

*కాముని పూర్ణిమ హోళీ*

'హోలీ' అంటే రంగులు చల్లుకునే పండుగ కాదు. కానీ ప్రస్తుతకాలంలో రంగుల పండుగగా స్థిరపడింది. ఈ పండుగ మహాభారతకాలం నుండే వాడుకలో ఉంది. “హోళీక” అను స్త్రీ రాక్షస దేవత.

ఈవిడ బ్రహ్మచే సృష్టించబడిన రావణాబ్రహ్మ సోదరి.

ఈ హోళికను అందరూ దేవతగా కులదైవంగా పూజించేవారు. సంతానం లేనివారు ఈమెను పూజిస్తే సంతానవతులవుతారు.

దీనికి ఒక కథ తెలుసుకుందాము.

మహాభారతకాలంలో “బృహద్రధుడు” అను ఒకరాజు ఉండేవాడు. ఆ రాజులకు ఇరువురు భార్యలు. వారికి సంతానం లేకపోవుటచే హోళికను పూజించమని చెప్పారట. వారు హోళికారాక్షసి బొమ్మను గోడపై చిత్రించుకుని పూజలు చేశారట. వారు చేసిన పూజలు ఫలించి వారికి ఒక పండు లభించింది. ఇరువురు భార్యలు ఉన్నారు కనుక వారు ఆ పండును రెండు భాగములుగా చేసి భుజించినారట. సగం-సగం శరీరభాగాలతో వారికి శిశువులు కలిగారట. వారు అలా శిశువులను చూసి తట్టుకొనలేక ఆ రెండు శరీర భాగములు సంధిచేసి (అనగా అతికించి)

ఒక్క ఆకారంగా చేశారట. ఆ శరీరమే జరాసంధుడు.

ఈ హోళీ పండుగను సత్యయుగం నుండి జరుపుకుంటు న్నట్లుగా పురాణాలు తెలుపుతున్నాయి.

'హోళీ' అంటే 'అగ్నిపునీత' అని అర్థం. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసం పౌర్ణమిరోజున వస్తుంది. కనుక ఈ పండుగను 'హోళీ' కామునిపున్నమి', 'దోలికో త్సవం' అని కూడా పిలుస్తారు.

హోలీ అంటే అసలు తత్త్వం మరచిపోయి కాలాను గుణంగా రంగులపండుగగా జరుపుకునే ఆనవాయితీకి ప్రజలందరూ అలవాటుపడ్డారు.

కానీ భారతీయ సాంప్రదాయంలోని అసలుతత్త్వం తెలుసు కుందాం. దీనికి పురా ణాల ప్రకారం ఒక కథ ప్రచారంలో ఉంది. 'హిరణ్యకశివుడు' రాక్షసరాజు, అతని కుమా రుడు ప్రహ్లాదుడు. అతని ని విద్య కొఱకు ఆచా ర్యుల వద్దకు పంపుతాడు.

కానీ అక్కడ ప్రహ్లాదుడు హరినామ స్మరణతోనే తన తోటి విద్యార్ధులతో విద్యను అభ్యసించుచూ హరిభక్తిలో లీనమవు తాడు. అది తెలిసిన అతని తండ్రి హిరణ్యకశిపుడు తన పుత్రుని బ్రతిమిలాడి, బుజ్జగించి హరిభక్తిని విడనాడ మంటాడు. కానీ ప్రహ్లాదుడు హరినామస్మరణే జీవిత పర మార్ధమని చెప్పి తండ్రిమాటను వినడు.

హిరణ్యకశిపుడు హరివైరి. కనుక హరిని సేవించే తన కుమారుని తన శతృవుగా భావించి ప్రహ్లాదుని అంత మొందింపదలచి తన సేవకులను పిలిచి పిల్లవానిని వారికి అప్పగించి ఏనుగులతో తొక్కించడం. లోయలో పడ చేయడం, పాములతో కరిపించడం చేయిస్తాడు.

కానీ ఆ సమయంలో కూడా హరిభక్తివీడక 'నారా యణ' నామస్మరణచేస్తూ ఉంటాడు ప్రహ్లాదుడు, విష్ణు మహిమ వలన అతనికి ఎటువంటి బాధ కలుగదు. అది గమ నించిన హిరణ్యకశిపుడు తనసోదరి హోళికను పిలి పించుతాడు. ఎందుకంటే హోళికకు వరప్రభావం వలన ఆమె వద్ద ఒక శాలువ' ఉంటుంది.

ఆ శాలువ ఆమె ఒంటిమీద ఉన్నంతవరకు మం టలు ఆమెను అంటుకొనలేవు. అందువలన హిరణ్యక శిపుడు తన చెల్లితో ఇలా చెబుతాడు.

'అమ్మా! హోళికా! నీవు నీ మేనల్లుడిని ఒడిలో కూర్చుండబెట్టుకుని చితిమీద కూర్చో! నీవు శాలువా కప్పుకో. నీకు మంటలు అంటవు. ప్రహ్లాదుడు కాలి బూడిదవుతాడు అని చెబుతాడు. ఆమె అన్న చెప్పి నట్లుగా చితి పేర్పించి ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చుండ బెట్టుకుని, తానుమాత్రం శాలువాను కప్పుకుని చితికి నిప్పు పెట్టుమంటుంది. అత్తఒడిలో కూర్చున్న ప్రహ్లా దుడు ఏమీ భయపడకుండా నారాయణనామ స్మరణ చేస్తూ ఉంటాడు. విష్ణువు తన మాయచే హోళికశరీరంపై ఉన్న శాలువను ప్రహ్లాదుని శరీరంమీదకి వచ్చినట్లు చేస్తాడు.

అప్పుడు హోలిక బూడిద అవుతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటకు వస్తాడు. ఆ రోజు హోళిక దహించ బడిన కారణంచేత ఈనాటికీ చాలా ప్రదేశాలలో ఊరి మధ్యలో పేరిచితిని పాత కర్రలతో మంటలు పెట్టి 'హోళికాదహనం' అని జరుపుకుంటారు.

రాక్షసుల పరాక్రమం ఆ రోజుతో అంతమయినది అని సంతోషంలో జరుపుకొనే పండుగ.

ఈ పండుగకు మరొకగాధ కూడా ప్రచారంలో ఉంది. తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మచే వరం పొంది. మదగర్వంతో దేవతలను బాధించుతూ ఉండేవాడు. ఆ బాధలు తట్టుకొనలేక దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించగా అప్పుడు విష్ణుమూర్తి ఇలా చెబుతాడు. తారకాసురుడు శివుని కుమారుని చేతిలోనే మరణం పొందేటట్లు వరం పొందాడు. కానీ శివుడేమో విరాగిలా స్మశానాలలో తిరుగుతూ ఉంటాడు. కనుక మీరు ఎలా గైనా హిమవంతుని వద్దకు వెళ్ళి ప్రార్ధించి పార్వతిని ఒప్పించి శివకల్యాణం జరిగేటట్లు చూడమని చెబు తాడు.

విరాగిగా మారిన శివునిలో కోరికలు కలిగించడానికి అతనివద్దకు మన్మథుని పంపుతారు ఋషులు. శివునిపై మన్మథుడు కామమును ప్రేరేపించే పూలబాణం వేయిం చుతారు. ఆ బాణ ప్రభావం శివునిలో శారీరక వికార మును కలిగించగా ఆయన కోవంలో మన్మథుని చూశాడు.

ఆ సమయానికి మన్మథుడు ఇంకా పూలబాణం చేతిలో పట్టుకునే ఉండటం గమనించి కోపముతో తన మూడవకన్ను తెరుస్తాడు.

ఆ సమయంలో ఆ కంటినుండి వచ్చిన మంటలు సూర్యుని కిరణాలలో ఉన్న ఏదురంగులకాంతి మిళిత మైన ఆ మంటలధాటికి మన్మథుడు భస్మమైపోతాడు. అది గమనించిన మన్మథుని భార్య రతీదేవి శివుని ప్రార్ధించగా కామదేవుడయిన మన్మథుని తిరిగి బ్రతి కించుతాడు. కానీ భౌతికంగా కనిపించడని, భౌతికకామం కంటే నిజమైన ఉద్రేకపూరితమయిన ప్రేమ ఆధ్యా త్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే కనిపిస్తాడని తెలియజేస్తాడు.

ఆ ఏడురంగుల మంటలను గుర్తుచేసుకుంటూ రంగుల పండుగ క్రింద ఈ హోలీని జరుపుకుంటారు.

శ్రీ కృష్ణునికి సంబంధించిన మరొక విషయంకూడా ఈ హోలీపండుగకు సంబంధించింది.

బాలకృష్ణుని ఫాల్గుణమాసం పౌర్ణమిరోజునే ఊయలలో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి.

అందువలన పశ్చిమబెంగాల్లో ఈ పండుగరోజున శ్రీకృష్ణుని ప్రతిమను ఊయలలోని వేసి 'డోలోత్సవం' జరుపుతారు. అందుకనే డోలికోత్సవం అనే పేరు కూడా వచ్చింది. ఈ హోలీపండుగరోజున యవ్వనంలో ఉన్న కృష్ణుడు గోపికలతో రాధతో కలసి రంగురంగుల పువ్వులతో ఆటలాడాడట.

కృష్ణుడు పెరిగిన మధుర, బృందావనంలో 16 రోజుల పాటు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

"రంగ పంచమి" రోజున శ్రీకృష్ణునికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు.

తల్లి యశోదతో శ్రీకృష్ణుడు తన శరీరం నీలివర్ణం, రాధశరీర ఎరుపువర్ణం గురించి ఫిర్యాదుచేశాడట. అందు కని కృష్ణునితల్లి యశోద రాధ ముఖానికి రంగులు పూసిందట.

అందువలన అందరూ హోళీపండుగకు రంగులు పులుముకుంటారట.

పూరీ జగన్నాధ్ జగన్నాథుడి ఆలయంలో కృష్ణుడు, రాధ విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు జరిపి అత్యంత ఆనందంతో వేడుకలు జరుపుకుంటారు.

మహారాష్ట్రలో హోళిక దిష్టిబొమ్మను దహనంచేసి, వీధులలో ఉదయం నుండి సాయంత్రం వరకు మంటలు వేస్తారు.

కాశ్మీరులో సైనికులు రంగు రంగుల నీళ్ళను చల్లుకుంటూ పండుగ జరుపుకుంటారు.

ఒకసారి కృష్ణుడు రాధ గ్రామానికి వచ్చి అక్కడ గోపిక లను ఆటపట్టించాడట. అది తప్పుగా భావించిన ఆ గ్రామ ప్రజలు కర్రలతో కృష్ణయ్యను వెంబడించారట.

అప్పటినుండి హోళీ పండుగను 'లార్మోర్' అనే పేరుతో జరుపుకుంటారు.

*"విలాసానాం సృష్టికర్రీ హోలికా పూర్ణిమా సదా"*

కాళిదాసమహాకవి ఈ హోళీ పండుగను వర్ణించుచూ సూర్యకాంతిలోని ఏడురంగుల కలయిక హోళీ అన్నాడట. రంగులు అంటే రాగరంజిత భావానలు అని అర్ధం. అవి పాలు, వెన్న, నెయ్యి, తేనె రంగు రంగుల పూలు ఇలా స్వభావసిద్ధంగా ఉండాలి. అవి ఆరోగ్యకరమైనవిగా ఉండాలి. ఆనందమంటే ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అది శారీరకంగా, మానసికంగా ఆధ్యాత్మికంగా కూడా. అంతే గానీ రసాయనాల రంగుల హోళీకాదు.

రసాయనాల రంగులు ఆనందమును ఇవ్వకపోగా ఆనారోగ్యాన్ని ఇస్తాయి.

అల్లసాని పెద్దన పౌర్ణమి వెన్నెల గురించి ఇలా అన్నాడు-

*"వెలగడిమి నాడి వెన్నెల అలవడునే గాది బోయెన అమవస నిశితిన్"* అంటే పౌర్ణిమనాటి వెన్నెలను విడిచి బెట్టకుండా గాదెలలో దాచి ఉంచి అమావాస్యవరకు కూడా వెలుగునుంచుకోవాలని... అలాగే జీవితంలో పండుగలద్వారా మనం పొందే ఆనందం, మానసిక ఆనందంగా మలచుకోవాలని పెద్దనగారి ఉద్దేశ్యం.

ఎలా అంటే ఈ పండుగను గాయన్, హసన్, జల్పన్ అన్నట్లుగా అంటే పాటలతో, నవ్వులతో, కాముని దహనంతో ఆనందంగా గడపాలని అర్ధం.

1 month ago | [YT] | 6

Jagan mohan vlogs

శుభోదయం మిత్రులారా

2 months ago | [YT] | 3

Jagan mohan vlogs

ఈ భోగి మీ ఇంట భోగభాగ్యాలను నింపాలని మనసు పూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు

2 months ago | [YT] | 10

Jagan mohan vlogs

Eroju mana co youtuber Naveen Anna birthday wish chayandi friends

4 months ago | [YT] | 22

Jagan mohan vlogs

కాకినాడ *బాలాజీ చెరువు సెంటర్ నందు నూతనంగా నిర్మించిన "VEGA జూవెలర్స్" ప్రారంభోత్సవ కార్యక్రమం* నందమూరి బాలకృష్ణ గారు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు

4 months ago | [YT] | 3

Jagan mohan vlogs

*ఆరోగ్యం*

మీ శరీర భాగాలను జాగ్రత్తగా చూసుకోండి..

1. మీకు ఉదయం అల్పాహారం లేనప్పుడు పొట్ట గాయపడుతుంది.

2. మీరు 24 గంటల్లో సరిగ్గా నీరు కూడా తాగనప్పుడు కిడ్నీలు గాయపడతాయి.

3. మీరు 11 గంటల వరకు నిద్రపోకపోయినా, సూర్యోదయానికి మేల్కొనకపోయినా గాల్ బ్లాడర్ గాయపడుతుంది.

4. మీరు చల్లని మరియు పాత ఆహారాన్ని తినేటప్పుడు చిన్న ప్రేగు గాయపడుతుంది.

5. మీరు ఎక్కువ వేయించిన మరియు కారంగా ఉండే ఆహారాన్ని తినేటప్పుడు పెద్ద ప్రేగులు గాయపడతాయి.

6. మీరు పొగతో ఊపిరి పీల్చుకున్నప్పుడు మరియు సిగరెట్ల కలుషిత వాతావరణంలో ఉన్నప్పుడు
లంగ్స్ గాయపడతాయి.

7. మీరు భారీగా వేయించిన ఆహారం, జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడు లివర్ గాయపడుతుంది.

8. మీరు ఎక్కువ ఉప్పు మరియు కొలెస్ట్రాల్‌తో మీ భోజనం తిన్నప్పుడు గుండె గాయపడుతుంది.

9. మీరు తీపి పదార్థాలు తినేటప్పుడు ప్యాంక్రియాస్ గాయపడుతుంది. .

10. మీరు చీకటిలో మొబైల్ ఫోన్ మరియు కంప్యూటర్ స్క్రీన్ వెలుగులో పనిచేసేటప్పుడు కళ్ళు గాయపడతాయి.

11. మీరు ప్రతికూల ఆలోచనలను ఆలోచించడం ప్రారంభించినప్పుడు మెదడు గాయపడుతుంది.

---- ఈ భాగాలన్నీ మార్కెట్లో అందుబాటులో లేవు.

కాబట్టి జాగ్రత్త వహించండి మరియు మీ శరీర భాగాలను ఆరోగ్యంగా ఉంచండి.

నీ దేహం దేవుని ఆలయం..

ఒక్క రోజు లoగ్స్ చేసే పని వెంటిలేటర్ చేస్తే పాతిక వేలు..

కిడ్నీస్ చేసే పని డయాలిసిస్ చేస్తే 10 వేలు..

హార్ట్ లుంగ్స్ మిషన్ అయితే రోజుకు లక్షల్లో..

ఇంకా బ్రెయిన్ కి సబ్టిట్యూట్ రాలేదు, వస్తే కోట్లల్లో..

అంటే మెడికల్ పరిభాషలో, రోజుకు కొన్ని లక్షల విలువైన పని మన శరీరం చేస్తుంది..

దేవుడికి కృతజ్ఞతలు చెప్పటానికి ఇంతకంటే బలమైన కారణం కావాలా???

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వేరే ఉదాహరణలు కావాలా.. అందుకే శరీర భాగాలను జాగ్రత్తగా చూసుకోండి..

మీ ఆరోగ్యం జాగ్రత్త

6 months ago | [YT] | 6

Jagan mohan vlogs

♨️🔥🔆🍂🪸♨️🏮🥀🌹🥀
*విజయ దశమి శుభాకాంక్షలు*


!! శమి శమయతే పాపం, శమి శత్రు వినాశనం
అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని !!

అందరు తమ తమ వృత్తులలో *విజయం* పొందాలని ఆశీస్తూ,

మీరు చేపట్టిన ప్రతీ పని *విజయం* సాధించాలని

మీరు,
మీ కుటుంబ సభ్యులు
సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో,
సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని
ముక్కోటి దేవుళ్ళ ఆశీర్వాదాలు మీపై ఉంటాయని ఆశిస్తూ..

**విజయ దశమి/ దసరా *శుభాకాంక్షలు* 🏹 JAGAN MOHAN VLOGS 🎯

6 months ago | [YT] | 7