IMPORTANT NOTE :
Telugu Tv Channel,Village Entertainments,Short films,Folk Songs Latest,News update, Live,Live Shows, Entertainment, Video Songs, Audio Songs, Interviews published on our 69 Tv Telugu Channel
All kinds of programs are not meant to humiliate anyone.
We are broadcasting. If there are any comments, compliant, copyrights on these please pre-mail my mail
Can give information.our mail : www.69tvnews@gmail.com
THANK YOU
Copyright Notice: Please feel free to leave me a notice if you find this upload inappropriat
69Tv Telugu Channel is one of the leaders in the production and un-biased and comprehensive news and entertainment programmes in India and abroad
69Tv Telugu delivers reliable information across all platforms:TV, Internet and Mobile.
Thank U For Watching
69Tv
రాత్రికి రాత్రే సీన్ రివర్స్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు..
పసిడి ప్రియులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. కొత్త సంవత్సరంలోనూ బంగారం ధరలు ఆరంభంలో బారీగా పెరిగి గత 2 రోజులుగా తగ్గాయనుకుంటే మళ్లీ ధరలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఇవాళ రాత్రికి రాత్రే బంగారం ధరల్లో భారీ మార్పు సంభవించింది. ఒక దశలో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇంట్రాడేలో కిందటి రోజుతో పోలిస్తే దిగొచ్చిన స్పాట్ గోల్డ్ రేటు మళ్లీ ఊహించని స్థాయిలో పెరిగింది. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలే దీనికి కారణం. వెండి ధరలు కూడా అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో పుంజుకున్నాయి. దీంతో మళ్లీ గోల్డ్, సిల్వర్ రేట్లు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిలకు చేరువయ్యాయి. దేశీయంగా చూస్తే బంగారం ధర పెరగ్గా.. వెండి ధర తగ్గింది. ఇవాళ (శనివారం) ఉదయం 10 గంటల తర్వాత ఈ రెండింటి ధరలు మళ్లీ భారీ స్థాయిలో పెరగనున్నాయని చెప్పొచ్చు.
1 week ago | [YT] | 0
View 0 replies
69Tv
గుమ్మడి గింజలు ఎందుకు తినాలో చెప్పిన ఎక్స్‌పర్ట్...
గుమ్మడికాయ గింజలు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సాయపడతాయి. వాటిలో ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరిచే, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించే సమ్మేళనాలు ఉంటాయి. ఇది డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్న పురుషులు ఈ విత్తనాలు తినడం మంచిది.
గుమ్మడి గింజల్లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రించడానికి, అతిగా తినకుండా నిరోధించడానికి సాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం తీసుకునే ఆహారం తగ్గుతుంది. దీంతో బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఆప్షన్.
1 week ago | [YT] | 5
View 0 replies
69Tv
విద్యాబోధన నుంచి వసతి దాకా.. అన్నీ ఫ్రీ..
సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీసత్యసాయి ప్రశాంతి నికేతనం బాల మందిర ట్రస్టు పేద విద్యార్థులకు ఉచిత విద్య, వసతిని అందిస్తోంది. 'వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్' ద్వారా 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఇంగ్లీష్ మీడియంలో నియోస్ (NIOS) విధానంలో బోధన సాగుతుంది. అకడమిక్ విద్యతో పాటు సంగీతం, నాట్యం, డ్రైవింగ్, వంటలు, జీవన నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తారు. ఉన్నత చదువుల కోసం డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులను కూడా ఉచితంగా పూర్తి చేయవచ్చు. ఈ నెల 20వ తేదీ వరకు ప్రవేశాలకు అవకాశం ఉంది. ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ పూర్ణిమ సూచించారు.
1 week ago | [YT] | 8
View 1 reply
69Tv
డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. చదువుతో పాటు స్టైఫండ్...
తెలంగాణలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్న్‌షిప్ తప్పనిసరి కానుంది. విద్యార్థుల ఉపాధి సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. శిక్షణ కాలంలో విద్యార్థులకు స్టైఫండ్ అందించేందుకు ఆర్థిక నమూనాను సిద్ధం చేస్తున్నారు.ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం పట్టాలు ఉంటే సరిపోదు.. కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలు ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయని ఐటీ, పారిశ్రామిక రంగాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ విద్యాశాఖ ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షల్లో విద్యార్థుల ఉపాధి సామర్థ్యాన్ని పెంచాలని ఆదేశించడంతో విద్యాశాఖ ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం (2026-27) నుండి ఈ నూతన విధానం అమల్లోకి రానుంది.
1 week ago | [YT] | 4
View 0 replies
69Tv
2010లో ఫోన్లు ఆర్డర్ చేస్తే ఇప్పుడు ..16 ఏళ్లు ఆలస్యంగా డెలివరీ...
ఓ వ్యాపారి 2010లో నోకియా ఫోన్లను ఆర్డర్ చేశాడు. అయితే ఆ ఆర్డర్లు కాస్తా జీవిత కాలం లేటు అన్నట్లు 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు అతడికి డెలివరీ అయ్యాయి. అప్పట్లో ట్రెండింగ్‌లో ఉన్న ఫోన్లు.. ఇప్పుడు డెలివరీ కావడంతో అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పట్లో లక్షల రూపాయలు వెచ్చించి ఆ ఫోన్లను కొనుగోలు చేయగా.. ఇప్పుడు రావడంతో అవి జ్ఞాపకాలుగానే మిగిలిపోనున్నాయి. ఆ ఫోన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
1 week ago | [YT] | 0
View 0 replies
69Tv
మళ్లీ 2040 వరకు ఇలాంటి రోజు రాదు!.. ఈ ఏడాది భోగి పండుగ+ ఏకాదశి కలిసి వస్తున్నాయ్!...
Bhogi Festival 2026 భగ అను పదం నుంచి భోగి (Bhogi) అని వచ్చిందని చెబుతారు. భగ అంటే మంటలు లేదా వేడి పుట్టించడం అని అర్థం. భోగి రోజు వేసే మంటలు కేవలం వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తాయట. ధనుర్మాసంలో ఎక్కువగా రోగాలు వచ్చే అవకాశం ఉండటంతో ఈ సమయంలో ఇంటి ముందు ఆవు పేడతో చేసిన పిడకలు కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుందని.. సూక్ష్మజీవులు నశిస్తాయని నమ్మకం. ఇక భోగి మంటలు పెద్దగా రావడానికి రావి చెట్టు, మామిడి చెట్టు, మేడి చెట్టు వంటి ఔషధ చెట్ల బెరళ్లను కాలుస్తారు. ఇవి కాలడానికి ఆవు నెయ్యి వేస్తారు. ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినవి కావడంతో వాటి నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల శరీరంలోని 72 వేల నాడులు ఉత్తేజితమవుతాయట.
1 week ago | [YT] | 19
View 0 replies
69Tv
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. యూరియా కొరతపై చర్చ జరపాలంటూ బీఆర్‌ఎస్ సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభలో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్ సభ్యుల నిరసనపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఇలా చేయడం సరికాదన్నారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రతీ అంశంపై జవాబు చెబుతామని తెలిపారు.
2 weeks ago | [YT] | 5
View 0 replies
69Tv
తెలంగాణ ప్రభుత్వం వినూత్న ప్రయోగం.. డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్(డీసీఎస్) అమలు...
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్‌సిటీలో ఏసీలు లేకుండానే చల్లదనాన్ని అందించే సరికొత్త డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ (DCS) ను ప్రవేశపెట్టనుంది. ఈ వినూత్న విధానం ద్వారా విద్యుత్ ఆదా చేయడంతో పాటు పర్యావరణానికి మేలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో ఈ విధానం విజయవంతంగా అమలు అవుతోంది. కొత్తగా నిర్మిస్తోన్న మాల్స్, నగరాలు, టౌన్‌షిప్‌లలో ఈ విధానం అమలు చేస్తున్నారు.
2 weeks ago | [YT] | 1
View 0 replies
69Tv
మహిళా సంఘాలకు శుభవార్త.. కొత్త పథకం ప్రారంభం..70 శాతం సబ్సిడీ..
కొత్త ఏడాది ప్రారంభంలోనే మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారి కోసం 'ఇందిరా డెయిరీ ప్రాజెక్టు'ను తీసుకువచ్చింది. దీని ద్వారా మహిళా సంఘాల సభ్యులు ప్రతి నెలా ఆదాయం పొందేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ పథకంలో భాగంగా 70 శాతం సబ్సిడీతో రెండు పాడి గేదెలు/ఆవులు అందిస్తారు. రాష్ట్రంలో పాల కొరత తీర్చడంతో పాటు మహిళా సాధికారత, పాడి పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా ఈ పథకం ప్రారంభించబోతున్నారు.
2 weeks ago | [YT] | 27
View 0 replies
69Tv
యాదగిరి గుట్ట ఆలయ ఈఓ రాజీనామా..కారణం...?
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో వెంకట్రావు తన పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. అనారోగ్య సమస్యల కారణంగానే తాను తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించగా.. ప్రభుత్వం ఆ రాజీనామాను తక్షణమే ఆమోదించింది. అయితే.. ముక్కోటి ఏకాదశి ముగిసిన వెంటనే.. అధ్యయనోత్సవాలు జరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక స్థానిక ఎమ్మెల్యేతో ఉన్న విభేదాలే కారణమని ప్రచారం జరుగుతోంది. గత ఏడాది ఆగస్టులో బాధ్యతలు చేపట్టిన ఆయన.. కేవలం నాలుగు నెలల్లోనే తప్పుకున్నారు. ప్రస్తుతం ఆలయంలో ఉత్సవాలు వైభవంగా సాగుతుండగా.. భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రసాదాలు , దర్శన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
2 weeks ago | [YT] | 19
View 0 replies
Load more