VOICE OF SAINTS తెలుగు

Welcome To VOICE Of SAINTS. An ultimate channel to know in depth of about Life of Saints, how they lived, works of saints and how they termed as saints.


Story Of Each Saints is will be very interesting and many hidden things most of them not aware of it.

Saints are persons believed to be connected in a special manner with what is viewed as sacred reality—gods, spiritual powers, mythical realms, and other aspects of the sacred or holy.

We are looking forward for your support in reviewing our videos, sharing videos.

We appreciate for your Subscribe to our Channel of Voice Of Saints.

Follow Us On : www.facebook.com/VoiceOfSaints/

Thank you,

GOD BLESS YOU ALL




VOICE OF SAINTS తెలుగు

January 7. మరియ తల్లి తో మన ప్రయాణం. ♥️♥️

ఓ దేవా, నీ కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం ద్వారా ప్రపంచాన్ని ఆనందంతో నింపడానికి హామీ ఇచ్చిన దేవా; ఆయన కన్య తల్లి మరియ ద్వారా, మేము నిత్యజీవ ఆనందాలను పొందేలా ప్రసాదించుము . మన ప్రభువైన క్రీస్తు ద్వారా వాడికి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్. ఆమెన్ 🙏

ఈరోజు పునీత. పెన్నా పోర్టు రేమండ్ గారి పండుగ 💐
వీరు క్రీస్తుశకం 1175 - 1275 మధ్య కాలంలో జీవించిన గురువు, న్యాయ చట్టం చదివే విద్యార్థుల వేదాంత శాస్త్ర విద్యాలయాలకు పాలక పునీతుడు 💫💫💫

బంగారు మాట 🌟 : స్వేచ్ఛగా ఎగిరి పోవడానికి గల సాధనాలను బంధిస్తాడు భూలోక రాజు, కానీ వాటిని సమకూరుస్తాడు పరలోక రాజు 🛐🛐

St. Raymond Of Penafort గారా మా కొరకు ప్రార్థించండి 🙏 🙏 🙏

7 hours ago | [YT] | 899

VOICE OF SAINTS తెలుగు

January 6 . ఈరోజు క్రీస్తు ప్రభువు సాక్షాత్కార పండుగ 💐 💐 💐 💐 ఈ పండుగను మనం ముగ్గురు జ్ఞానుల Epiphany పండుగ ( లేదా )ముగ్గురు రాజుల పండగ అని పిలుస్తూ ఉంటాము 💫💫💫

మరియ తల్లి తో మన ప్రయాణం ♥️ ♥️ ♥️ ♥️

పవిత్ర రాణి,
కరుణామాత, మా జీవితం,
మా మాధుర్యం మరియు మా ఆశ, నీకు వందనం.

బంగారు మాట 🌟 : దేవుని యెదుట వినంబ్రులు కండు అప్పుడు ఆయన మిమ్ము ఉద్ధరించును.
( యాకో 4:10 )

క్రీస్తు ప్రభువు సాక్షాత్కార పండుగ పూర్తి చరిత్ర 👇👇

ఈ ముగ్గురు రాజుల వలే మనము కూడా క్రీస్తు ప్రభువుని మంచి హృదయంతో , భక్తితో అనుసరిద్దాం 🙏🙏🙏

1 day ago | [YT] | 1,500

VOICE OF SAINTS తెలుగు

January 5, మరియ తల్లి తో మన ప్రయాణం ♥️♥️

1854లో 9 వ భక్తి నాథ పోపు గారు డిసెంబర్ 8న మరియ మాత అమలోద్భవి మాత అని ప్రకటించారు. ఏ కళంకము లేకుండా జన్మించింది అని అర్థం. పోపు గారు ప్రకటించడమే కాదు సామాన్య విశ్వాసులు కూడా మరియ మాత ను విశ్వసించి గౌరవిస్తున్నారు. మరియా తల్లి దేవుని అంటిపెట్టుకుని ఉన్నారు కాబట్టి దేవుడు ఇచ్చిన ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకున్నారు. అదే రీతిగా ఎవరైతే దేవునితో ఐక్యంగా జీవిస్తారో వారు కూడా అలాంటి గొప్ప భాగ్యాన్ని పొందుకుంటారు అనేది మరియ తల్లి నుండి మనం విశ్వసిస్తున్నాము. ఇదే గొప్ప సత్యం కూడా .💫💫💫

ఈరోజు పునీత సైమన్ సైయిలైటు గారి పండుగ 💐
వీరు క్రీస్తుశకం 388 నుండి 459 మధ్య కాలంలో జీవించిన సన్యాసి మరియు స్వస్తత వరం కలవారు 💫

సైయిలైట్ అంటే స్తంభం పైన నివసించే ముని అనే అర్థము ❤️❤️

బంగారు మాట 🌟 : మానవుడు కేవలం రొట్టె వలననే జీవింపడు. కానీ దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవించును.✝️✝️

St.Simeon Stylites గారా మా కొరకు ప్రార్థించండి 🙏

2 days ago | [YT] | 1,798

VOICE OF SAINTS తెలుగు

January 4 , ఈరోజు క్రీస్తు ప్రభువు సాక్షాత్కార మహోత్సవం 💐💐💐

అజ్ఞానులవలే కాక !
జ్ఞానులవలే నడుచుకొనుడి !
Live Not As unwise But As wise 👑👑
.... ఎఫెసీయులకు 5:15

ప్రభువు సాక్షాత్కార మహోత్సవం పూర్తి చరిత్ర 👇 👇

👑 👑 👑https://youtu.be/UkGK7S8sTrE?si=iEFN3...

మరియ తల్లితో మన ప్రయాణం ♥️♥️

కతోలికులు మరియు తల్లిని గౌరవించి , మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉంటారు. కష్టాలలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడం ద్వారా ఆమె మానవాళి అంతటిని ఆదుకునే తల్లిలాగా ఒక కొత్త బాధ్యతను స్వీకరించారు. ద్రాక్షరసం ప్రేమకు, సంతోషానికి గుర్తు, మరియ తల్లి ఈ ప్రేమను సంతోషాన్ని ప్రతి కుటుంబానికి ఎప్పుడు పంచుతూనే ఉంటుంది. కాబట్టి మొదటి క్రైస్తవ సంఘం నుండి ఇప్పటి క్రైస్తవ సంఘం వరకు కూడా మరియ తల్లిని కుటుంబాల తల్లిగా భావిస్తూనే ఉన్నారు.
కాబట్టి మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్ధనా సహాయముతో మన కుటుంబంలో ఉన్న ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏

ఈరోజు పునీత ఎలిజిబెత్ అన్న బెలీ సేటను గారి పండుగ 💐💐💐

వీరు క్రీస్తుశకం 1774 - 1821 మధ్యకాలంలో జీవించిన వితంతువు మరియు మత సాక్షి 💫💫

బంగారు మాట 🌟 : తడబడే ఆత్మను విశ్వాసం ఒకవైపు లేవనెత్తుతుంది. ఆశాభావం మరోవైపు నుండి సహాయపడుతుంది ♥️♥️♥️

St. Elizabeth Seton గారా మా కొరకు ప్రార్థించండి

3 days ago | [YT] | 935

VOICE OF SAINTS తెలుగు

January 3 , మరియ తల్లి తో మన ప్రయాణం ♥️♥️

మరియ తల్లి తన కుటుంబముతో వ్యవహరించిన తీరు వారి మధ్య ఉన్న అవగాహన, అనురాగము, ప్రతి క్రైస్తవ జంటకు ఆదర్శం. మరియ తల్లి సుగుణాలను అనుసరించి ఎంతో మంది ధన్యాత్ములుగా , పునీతుల గా వర్ధిల్లుతూ ఉన్నారు, కానాపల్లిలో మరియ తల్లి కోరిక మేరకు అద్భుతం చేసిన దైవ సుతుడు, మన కోసం మరియ తల్లి చేసే ప్రార్థన కూడా తప్పకుండా ఆలకించి మనలను దీవిస్తారు. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో మరియ తల్లి అనుగ్రహాలను పొందూకుంటూ,ఆ దేవాది దేవుని దీవెనలు పొందూకుందాం 🙏🙏🙏🙏

ఈరోజు పునీత. జెనెవీవు గారి పండుగ 💐💐💐
వీరు క్రీస్తుశకం 422 నుండి 511 మధ్య కాలంలో జీవించిన ఫ్రాన్స్ దేశపు కన్య💫💫💫

బంగారు మాట 🌟 : పరలోక భూలోక పాతాళలోక మందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాళ్లు వంచి వినతులు కావలెను.♥️♥️

St. Genevieve గారా మా కొరకు ప్రార్థించండి 🙏🙏

4 days ago | [YT] | 1,604

VOICE OF SAINTS తెలుగు

January 2, మరియ తల్లి తో మన ప్రయాణం ♥️♥️

తల్లి మరియను దేవుడు తన కృపావరాలతో బలపరిచి నట్లు. పవిత్ర మూర్తిగా ఉంచినట్లు మన జీవితాలు కూడా దీవించబడిన గాక. మరియ తల్లి మధ్య ప్రార్థనా సహాయంతో ఈ సంవత్సరం అంతా దేవుని కృపలో జీవిద్దాం 🙏🙏

ఈరోజు పునీతులు. బాసిలు మరియు నజియాంజెనునగర గ్రెగొరీ గార్ల పండుగ 💐💐💐

వీరు క్రీస్తు శకం 330 నుండి 390 మధ్య కాలంలో జీవించిన పీఠాధిపతులు వేదాంత పండితులు మరియు మత సాక్షులు💫💫💫

Sts.Basil and Gregory Nazianzen గార్ల మా కొరకు ప్రార్థించండి 🙏🙏🙏

5 days ago | [YT] | 1,879

VOICE OF SAINTS తెలుగు

2026 January 1st , మరియా దివ్య మాతృత్వ మహోత్సవం పండుగ శుభాకాంక్షలు 💐💐💐 మరియు నూతన సంవత్సరం శుభాకాంక్షలు 💐💐

ఈ నూతన సంవత్సరములో మరియ తల్లి తో మన ప్రయాణం ♥️♥️♥️

మరియ తల్లి పుట్టినప్పటి నుండి సకల సద్గుణలతో పెరిగారు. క్రీస్తు ప్రభువు తన గర్భమున జన్మించిన తర్వాత తాను దైవ ప్రేమలో పరిపూర్ణత పొంద కోవడానికి ఎంతగానో ప్రయాస పడ్డారు. మరియ మాత దేవుని తల్లియను పేరును తన పుణ్య జీవితం ద్వారాను, పరిశుద్ధ మగు ప్రవర్తన ద్వారా సంపాదించుకున్నారు. ఎల్లప్పుడు పాపానికి దూరంగా ఉంటూ తన మనో వాక్కు కర్మల ద్వారా దేవునికి ప్రీతి పాత్రలుగా జీవించారు. పుష్పాలలో లిల్లీ పుష్పము వలె మరియమాత పాపులగు మానవుల మధ్య పావనిగా విలసిల్లారు. మరియ తల్లి ఆదర్శ జీవితం మనందరికీ అనుసరణీయము. దేవుని ప్రేమకు పాత్రులము అవ్వడానికి మరియ తల్లి చక్కని జీవితం మనకి ఆదర్శంగా నిలుస్తుంది. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో మరియ తల్లి చల్లని నీడలో, దేవుని దీవెనలు నిండుగా పొందుకుందాం ♥️♥️♥️

బంగారు మాట 🌟 : మాతృదేవోభవ ఈ లోకములో తల్లిని మించిన దైవం లేనేలేదు అంటారు కదా ! ఇంకా ఈ భూ పరలోకముల తల్లిని గురించి వేరే చెప్పాలా ? ఆమె రక్షకుని మాత, మన రక్షణ మాత 💫💫

MARY MOTHER OF GOD PLEASE PRAY FOR US 🙏🙏🙏🙏

6 days ago | [YT] | 973