Stotraveda.com contains devotional songs, Mantras, Vedic hymns, lyrics,Devotional Speeches . A step towards Sanathana Dharma please follow and subscribe our channel to encourage us


StotraVeda

Jai Shri Ram || जय श्री राम || జై శ్రీ రామ్

శ్రీరామ రామ రామేతి , రమే రామే మనోరమే;
సహస్ర నామ తతుల్యం, రామ నామ వరాననే.

राम रामेति रामेति, रमे रामे मनोरमे ।
सहस्रनाम तत्तुल्यं, रामनाम वरानने ॥

SRI RAMA RAMA RAMETI RAME RAME MANORAME
SAHASRANAMA TATTULYAM RAMA NAMA VARANANE

1 year ago (edited) | [YT] | 28

StotraVeda

ఏ వ్యక్తి అయినా ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని అర్థం. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయంలో ఉత్తరం వైపున్న ద్వారం నుంచి ప్రవేశం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్నవారికి పునర్జన్మ ఉండదని, మోక్షదాయకమే అని వేదవాక్కు. అందుకే మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు శ్రీ మాహావిష్ణువుని పూజిస్తే అమ్మ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. నిత్యం శ్రీహరిని పూజిస్తే ఇంటా-బయటా ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం. సంపదతో పాటూ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని ఆరాధించే శ్లోకాలివి. మీ బంధుమిత్రులకు ఈ శ్లోకాలతో వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేయండి...



శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైకనాథం



ఓం నమోః భగవతే వాసుదేవాయ ||


ఓం నారాయణ విద్మహే వాసుదేవాయా ధీమహి
తన్నో విష్ణు ప్రచోదయాత్



వనమాలీ గదీ శాంగీ శంఖీ చక్రీ చ నన్దకీ|
శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవో భిరక్షతు||



ఓం హ్రీం కార్తవీర్యార్జునో నామ రాజు బహు సహస్త్రవాన్ ।
యస్య స్మేరేణ మారేణ హ్రతం నిష్టం చ లభ్యతే ॥



మీకు, మీ కుటుంబ సభ్యులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు

2 years ago | [YT] | 6

StotraVeda

కార్తీక మాసంలో శుక్ల పక్ష చవితినాడు నాగులచవితి పర్వదినంగా జరుపుకుంటారు.
Subramanya Ashtakam | విన్నక్షణాన్నే సర్వ పాపాలను హరించే సుబ్రహ్మణ్య అష్టకం
https://youtu.be/CTpsjs3VAIU

Shri Subramanya Ashtakam also known as Swaminatha Karavalambam is an octet composed by Sri Adi Shankaracharya, praising Lord Subramanya.


#Subramanyaashtakam #సుబ్రహ్మణ్యఅష్టకం #Subramanyaswami #subramanya #subramanyaswamy #stotraveda #subramanyasashti #vallidevasenasamethasubramanyeswaraswamykalyanam #successmantra

2 years ago | [YT] | 3

StotraVeda

Atla Tadde Festival Scientific Significance | అట్లతద్ది విశేషాలు | Atla Taddi Festival Timings
#atlataddi #stotraveda #atlatadde # అట్లతద్దిపండగ #ఉండ్రాళ్ళతద్దె

Atla Taddi nomu is a traditional festival of Andhra Pradesh and Telangana is celebrated by Hindu married women to seek blessings of Goddess Gauri for a happy and long married life. This festival is symbolic of the strength of a woman and the effect of her good deeds that benefit her husband.

2 years ago | [YT] | 0

StotraVeda

Sri Rama Raksha Stotram| శ్రీ రామ రక్షా స్తోత్రమ్ | श्री राम रक्षा स्तोत्रम् #ramarakshastotram #ramastotra #sriramarakshastotram #stotraveda

Sri Rama Raksha Stotram Lyrics:


శ్రీ రామ రక్షా స్తోత్రం

ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య
బుధకౌశిక ఋషిః
శ్రీ సీతారామ చంద్రోదేవతా
అనుష్టుప్ ఛందః
సీతా శక్తిః
శ్రీమద్ హనుమాన్ కీలకం
శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్రజపే వినియోగః ॥

ధ్యానం
ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం
పీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్ ।
వామాంకారూఢ సీతాముఖ కమలమిలల్లోచనం నీరదాభం
నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్ ॥

స్తోత్రం
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ ।
ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్ ॥ 1 ॥

ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్ ।
జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్ ॥ 2 ॥

సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్ ।
స్వలీలయా జగత్త్రాతు మావిర్భూతమజం విభుమ్ ॥ 3 ॥

రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్ ।
శిరో మే రాఘవః పాతు ఫాలం (భాలం) దశరథాత్మజః ॥ 4 ॥

కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్రప్రియః శృతీ ।
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః ॥ 5 ॥

జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః ।
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః ॥ 6 ॥

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ ।
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః ॥ 7 ॥

సుగ్రీవేశః కటిం పాతు సక్థినీ హనుమత్-ప్రభుః ।
ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకుల వినాశకృత్ ॥ 8 ॥

జానునీ సేతుకృత్-పాతు జంఘే దశముఖాంతకః ।
పాదౌ విభీషణశ్రీదః పాతు రామోఽఖిలం వపుః ॥ 9 ॥

ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ ।
స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ ॥ 10 ॥

పాతాళ-భూతల-వ్యోమ-చారిణ-శ్చద్మ-చారిణః ।
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః ॥ 11 ॥

రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ ।
నరో న లిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి ॥ 12 ॥

జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్ ।
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః ॥ 13 ॥

వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్ ।
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళమ్ ॥ 14 ॥

ఆదిష్టవాన్-యథా స్వప్నే రామరక్షామిమాం హరః ।
తథా లిఖితవాన్-ప్రాతః ప్రబుద్ధౌ బుధకౌశికః ॥ 15 ॥

ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్ ।
అభిరామ-స్త్రిలోకానాం రామః శ్రీమాన్ స నః ప్రభుః ॥ 16 ॥

తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ ।
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ॥ 17 ॥

ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ ।
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ॥ 18 ॥

శరణ్యౌ సర్వసత్త్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతామ్ ।
రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ ॥ 19 ॥

ఆత్త సజ్య ధనుషా విషుస్పృశా వక్షయాశుగ నిషంగ సంగినౌ ।
రక్షణాయ మమ రామలక్షణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్ ॥ 20 ॥

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా ।
గచ్ఛన్ మనోరథాన్నశ్చ (మనోరథోఽస్మాకం) రామః పాతు స లక్ష్మణః ॥ 21 ॥

రామో దాశరథి శ్శూరో లక్ష్మణానుచరో బలీ ।
కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః ॥ 22 ॥

వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః ।
జానకీవల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః ॥ 23 ॥

ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః ।
అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః ॥ 24 ॥

రామం దూర్వాదళ శ్యామం పద్మాక్షం పీతవాససమ్ ।
స్తువంతి నాభి-ర్దివ్యై-ర్నతే సంసారిణో నరాః ॥ 25 ॥

రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్ ।
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిమ్ ॥ 26 ॥

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే ।
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ॥ 27 ॥

శ్రీరామ రామ రఘునందన రామ రామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ ।
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ ॥ 28 ॥

శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి
శ్రీరామ చంద్ర చరణౌ వచసా గృహ్ణామి ।
శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి
శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే ॥ 29 ॥

మాతా రామో మత్-పితా రామచంద్రః
స్వామీ రామో మత్-సఖా రామచంద్రః ।
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
నాన్యం జానే నైవ జానే న జానే ॥ 30 ॥

దక్షిణే లక్ష్మణో యస్య వామే చ (తు) జనకాత్మజా ।
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ ॥ 31 ॥

లోకాభిరామం రణరంగధీరం
రాజీవనేత్రం రఘువంశనాథమ్ ।
కారుణ్యరూపం కరుణాకరం తం
శ్రీరామచంద్రం శరణ్యం ప్రపద్యే ॥ 32 ॥

మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్ ।
వాతాత్మజం వానరయూథ ముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే ॥ 33 ॥

కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్ ।
ఆరుహ్యకవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్ ॥ 34 ॥

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ ।
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్ ॥ 35 ॥

భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదామ్ ।
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్ ॥ 36 ॥

రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః ।
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర ॥ 37 ॥

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ।
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ॥ 38 ॥

ఇతి శ్రీబుధకౌశికముని విరచితం శ్రీరామ రక్షాస్తోత్రం సంపూర్ణమ్ ।

శ్రీరామ జయరామ జయజయరామ ।

2 years ago | [YT] | 0

StotraVeda

న‌వంబ‌రు నెల‌ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల



భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం న‌వంబ‌రు నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది.



ఇందులో భాగంగా న‌వంబరు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం ఆగ‌స్టు 19వ తేదీ ఉదయం 10 గంటల నుండి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్ లో టికెట్లు పొందిన భక్తులు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.



కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను ఆగ‌స్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లను ఆగ‌స్టు 22వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆగ‌స్టు 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

శ్రీ‌వాణి ట్ర‌స్టు బ్రేక్ ద‌ర్శ‌నం టికెట్ల‌ను ఆగ‌స్టు 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.

వృద్ధులు, దివ్యాంగులకు ద‌ర్శ‌న టోకెన్ల కోటాను ఆగ‌స్టు 23వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం రూ.300 టికెట్లు ఆగ‌స్టు 24వ తేదీ ఉద‌యం 10 గంటలకు విడుదల చేస్తారు.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో వ‌స‌తి గ‌దుల బుకింగ్‌ ఆగ‌స్టు 25వ తేదీ ఉద‌యం 10 గంటలకు విడుదల చేస్తారు.



భక్తులు ఈ విషయాలను గమనించి tirupatibalaji.ap.gov.in/ వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది.

2 years ago | [YT] | 10

StotraVeda

Varalakshmi Vratham Pooja Vidhanam | చారుమతి చేసిన అసలైన వరలక్ష్మీ వ్రతం Chaganti Latest Pravachanam on VaraLakshmi Devi #chagantipravachanalu
https://youtu.be/2GsJkrWZv3M

2 years ago | [YT] | 0

StotraVeda

Paramacharya Swamy Ammavari Darshanam | పరమాచార్య స్వామివారికి అమ్మవారి దర్శనం విశేషాలు #devi #stotraveda #chaganti #chagantikoteswararao #chagantikoteswararaopravachanamlatest #chagantikoteswararaospeeches #chagantipravachanalu #durga #kamakshi

2 years ago | [YT] | 0

StotraVeda

About Ammala Ganna Yamma Chaganti Words | అమ్మలగన్న యమ్మ పద్యం గురించి చాగంటి కోటీశ్వరరావు గారి అద్భుత వ్యాఖ్యానం వినండి ఆపారా సంపదను పొందండి | ప్రణవ రహస్యము, దుర్గా నామ రహస్యము తెలుసుకోండి

Like Us
Share Us
Visit www.stotraveda.com
Thank you Stotra Veda Team

2 years ago | [YT] | 0

StotraVeda

According to the TSRTC, the corporation has arranged a special super luxury bus from Hyderabad in view of the rush of devotees to the Arunachala Giri Pradakshin for every Pournima.

2 years ago | [YT] | 2