Mana Paleru News | Telangana Politics & Local Updates
Mana Paleru News brings you the latest news, political updates, Paleru constituency developments, Telangana state politics, and local issues with truth and clarity. Stay updated with breaking news, live coverage, and analysis on leaders, elections, and public voices.
👉 Subscribe for Paleru politics, Telangana updates, Revanth Reddy, Congress and more!
Mana Paleru News
🔸మార్చి నాటికి భూభారతి కొత్త పోర్టల్
🔸ఒకే గొడుగు కిందకు రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్
🔸వారం రోజుల్లో మరో 3వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లు
-రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్, సర్వే- ల్యాండ్ రికార్డ్స్ విభాగాలను భూభారతి పోర్టల్‌లో ఒకే గొడుగు కిందకు తీసుకువస్తున్నామని ఈ పోర్టల్‌ను మార్చి నాటికి పూర్తి స్ధాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు, పారదర్శకంగా ఉండేలా ఈ పోర్టల్‌ను రూపొందించామని వెల్లడించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, దేవాదాయ, అటవీ, వక్ప్ భూములు తదితర అన్ని వివరాలు కనిపించేలా పోర్టల్‌లో పొందుపరిచామని తెలిపారు.
మంగళవారం నాడు నాంపల్లిలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ( ట్రెస్సా) 2026 డైరీని మంత్రిగారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ ఆనాటి ప్రభుత్వ పదేళ్ల పాలనలో రెవెన్యూ వ్యవస్ధలో ఎదుర్కొన్న సమస్యల నుంచి విముక్తి లభిస్తుందనే నమ్మకంతో తెలంగాణ ప్రజానీకం ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు.
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పదేళ్ల కాలంలో భ్రష్టు పట్టిన రెవెన్యూ వ్యవస్ధను ఒక్కో మెట్టు పేర్చుకుంటూ గ్రామ స్ధాయి వరకు బలోపేతం చేశామని ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని అయితే ఇవి సరిపోవని ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని మంత్రి గారు అన్నారు.
రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతున్న భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా గడచిన రెండేళ్లలో ఎన్నొ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి పోర్టల్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
తెలంగాణ రైతుల భూములకు సంబంధించి గుండెకాయలాంటి సర్వే విభాగాన్ని పటిష్టపరుస్తున్నామని ఇందులో భాగంగా ఇప్పటికే 3500 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను తీసుకోవడం జరిగిందని వారం రోజుల్లో మరో మూడువేల మందిని తీసుకోబోతున్నామని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తమ ప్రభుత్వం అర్ధం చేసుకుందని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక ఇబ్బందుల వల్లే కొంత ఆలస్యం జరుగుతుందని ప్రభుత్వం తరపున ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన అన్ని ప్రయోజనాలను అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ట్రెస్సా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగా రవీందర్ రెడ్డి, గౌతమ్ కుమార్, కోశాధికారి రమణారెడ్డి, కల్చరల్ డైరెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, టిఎన్‌జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాస్, జగదీష్, ఆర్డీవో ఉపేందర్ రెడ్డి జిహెచ్ఎంసీ జోనల్ కమీషనర్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
#ministerponguletisrinivasreddy #bhubharathiportal #telanganarevenue #LandReforms #RevenueDepartment #surveyandlandrecords
#stampandregistration #DigitalGovernance
9 hours ago | [YT] | 25
View 0 replies
Mana Paleru News
ఈ నెలాఖరులోగా 10 సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శంకుస్థాపన
మూడు దశల్లో 94 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు
- శాసనమండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
#SubRegistrarOffices #IntegratedSubRegistrar #ministerponguletisrinivasreddy #LegislativeCouncil
1 day ago | [YT] | 44
View 0 replies
Mana Paleru News
రూ. 250 కోట్లతో మేడారం ఆధునీకరణ
>>> 200 సంవత్సరాలు నిలిచేలా రాతి కట్టడాలు
>>> కుంభమేళాను తలపించేలా ఏర్పాట్లు
శాసనమండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.
#SammakkaSaralamma #250Crores #TribalCulture #LegislativeCouncil #MinisterPonguleti
1 day ago | [YT] | 55
View 0 replies
Mana Paleru News
ఈనెల 28 నుంచి 31 వరకు జరగనున్న సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు కుటుంబ సభ్యుల తో కలిసి హాజరు కావాల్సిందిగా మంత్రి సీతక్క, వనదేవతల పూజారులు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ కుమార్ లను ఆహ్వానించారు. మంత్రులకు అమ్మ వార్ల జాతర ఆహ్వాన పత్రిక, బంగారం ప్రసాదాన్ని అందజేసారు. మంత్రి సీతక్కతో పాటు వన దేవతల పూజారులు కాక వెంకటేశ్వర్లు, సిద్దబోయిన జగ్గారావు, కాక సమ్మయ్యలు కూడా మంత్రులను అసెంబ్లీ ప్రాంగణంలో కలిసి ఆహ్వానించారు.
#SammakkaSaralammaJatara #JataraInvitation #MedaramJatara #TribalFestival #MinisterSeethakka
1 day ago | [YT] | 29
View 0 replies
Mana Paleru News
గత పాలకులు ఇండ్లు కట్టిస్తామని మాటిచ్చి విస్మరించారు..
కేసిఆర్ దత్తత తీసుకున్న వాసాలమర్రిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనతో ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇచ్చింది మా ప్రజా ప్రభుత్వం
#IndirammaIndlu #Vasalamarri #CMRevanthReddy #MinisterPonguleti #KCRAdoptedVillage
3 days ago | [YT] | 80
View 1 reply
Mana Paleru News
ఇప్పటికే వివిధ దశల్లో 3 లక్షలపైగా
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి..
50 వేలకు పైగా ఇండ్ల గృహప్రవేశాలు అయినవి.. రాబోయే వర్షాకాలంలోపు ఇందిరమ్మ ఇండ్లన్ని పూర్తవుతాయి..
- శాసన సభ సమావేశాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.
3 days ago | [YT] | 37
View 0 replies
Mana Paleru News
జిహెచ్ఎంసి పరిధితో పాటు పెద్ద టౌన్లలో
పేదలందరికీ G+3 తరహాలో ఇండ్ల నిర్మాణాలు.
#IndirammaIndlu #GPluse3IndirammaIndlu #PrajaPalana #TelanganaCongress
3 days ago | [YT] | 43
View 0 replies
Mana Paleru News
మూసీలో శుద్ధమైన నీరు ప్రవహించేలా సమగ్ర ప్రణాళికలు..
మార్చి 31లోగా డీపీఆర్ సిద్ధం చేసి, టెండర్లను పిలవాలని ప్రభుత్వ యోచన.
#MoosiRiver #DPR #GovernmentInitiative #CleanWaterMission #Hyderabad #Telangana
4 days ago | [YT] | 67
View 0 replies
Mana Paleru News
ప్రగతి సారథికి 'నవ' శుభాకాంక్షలు
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి పొంగులేటిశ్రీనివాస రెడ్డి గారు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నూతన సంవత్సర సందడి ఉప్పొంగింది. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిగారిని ఆయన ఛాంబర్‌లో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇద్దరు నేతలు ఆత్మీయంగా కరచాలనం చేసుకుని, కొత్త ఏడాదిలో ప్రజా పాలనను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చాలని సంకల్పించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
#newyeargreetings2026 #DrBRAmbedkarSecretariat
5 days ago | [YT] | 88
View 0 replies
Mana Paleru News
నారాయణపురంలో రూ. 15 కోట్లతో అభివృద్ధి పనులు
ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
#KallurDevelopment #IndirammaIndlu #BTRoads #Khammam
5 days ago | [YT] | 35
View 0 replies
Load more