Vennela Cheppina Katha

Hello everyone.. welcome to Vennela Cheppina Katha. I am a student of Literature. Everyone loves to listen to stories whether they are short or long in length. Everyone has that nostalgic feeling towards stories. Like in any other culture in the world.. India is the place where stories flow through the homes, farms, and through the hearts of the people. I personally consider every narrative as a story, every memory, every narration related to a context is a story. A story can change our perspectives, it can even mould a person. Not only that, it also gives us the scope to explore the world. There are no boundaries to the story. That is the reason why I've started this channel called VENNELA CHEPPINA KATHA. I'm gonna publish the best stories related to both nonfiction and fiction along with my own stories and narratives. So do subscribe and follow this channel. Thank you..


Vennela Cheppina Katha

సరదాగా ఒక కథ చెప్తాను.. కాసేపు అలా కూర్చుని ఇది చదవండి!

చిన్నప్పుడు చూసిన అదేదో పాత సినిమాలో ఒక వ్యక్తికి చాలా కష్టాలుంటాయి. అతని కష్టాన్ని చూసిన భగవంతుడు జాలిపడి, అతనికి సాయం చేద్దామని అతను నడిచి వస్తున్న దారిలో ఒక బంగారు మూటని వేసి ఉంచుతాడు. అటుగా వస్తున్న ఆ వ్యక్తికి దారిలో ఒక గుడ్డివాడు కనిపిస్తాడు.

కళ్లు లేకుండా జీవించడం ఎలా ఉంటుందో చూద్దామని కళ్లు మూసుకుని ఆ అంధుడిలా నడవడం స్టార్ట్ చేస్తాడు. ఆ నడిచే ప్రయత్నంలో ఉండగా భగవంతుడు ఇతని కోసం దారిలో వేసి ఉంచిన బంగారు మూటని చూసుకోడు. అలా కష్టాల నుండి బయటపడే మార్గాన్ని కోల్పోతాడు.

ఆ సినిమా పేరు గానీ, ఆ సందర్భం గానీ నాకు గుర్తు లేవు గానీ సన్నివేశం మాత్రం గుర్తుండిపోయింది…

ఇలాంటిదే ఎప్పుడో చదివిన ఒక కథ ఉంది..

పూర్వం ఒక రాజు తన రాజ్యంలోని ప్రజల మనస్తత్వాన్ని తెలుసుకుందామని రాజ్యానికి ఎంటరయ్యే మెయిన్ రోడ్ లో ఒక పెద్ద బండని అడ్డంగా పెట్టించాడు.

ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో అని గమనిస్తూ కొంచెం దూరంలో ఆగి ఉన్నాడు.

రాజు ఆస్థానంలో పని చేసే ఉద్యోగులు ఆ బండకి పక్కగా వచ్చేస్తూ.. రాయిని పక్కకి తొలగించే పని తమకంటే కింది స్థాయి కూలీలది కానీ తమది కాదనుకుంటూ వెళ్లిపోయారు.

తర్వాత మామూలు పౌరులు దాన్ని తప్పించుకుని పక్కనుంచి వెళ్తూ, తాము కాకపోతే ఎవరొకరు ఆ పని చేస్తారులే అనుకుంటూ వెళ్లిపోతారు. అలా చాలాసేపు చాలామంది దాన్ని దాటుకుని వెళ్లిపోతూ అది తమ పని కాదని కొందరు, తమకి వేరే ముఖ్యమైన పనులున్నాయని మరి కొందరు బండని దారి మధ్యలోంచి తీయడానికి ప్రయత్నం కూడా చేయరు. కొందరైతే రాజ్యంలో కనీసం దారులు కూడా సరిగా లేవని రాజుని నిందించారు.

చివరికి చీకటిపడే సమయానికి పొలం నుంచి ధాన్యం ఎడ్లబండిలో వేసుకుని ఒక రైతు వస్తున్నాడు అటుగా. అప్పుడే రాజ మందిరానికి వెళ్లిపోబోతున్న రాజు గారు ఒక క్షణం ఆగారు. తన బండి ముందుకి వెళ్లడానికి పక్కన కాస్త దారి ఉన్నా సరే, ఆ రైతు బండి దిగి, ఆ రాయిని అతి కష్టం మీద పక్కకి నెట్టేశాడు. దాని కింద ఉన్న బంగారు మూటని చూసి ఆశ్చర్యపోయాడు. చుట్టూ చూశాడు ఎవరూ కనపడలేదు. ఆ మూటపై రాసి ఉన్నదాన్ని చదివాడు, బాధ్యత కలిగిన పౌరుడికి రాజుగారు ఇచ్చిన బహుమానం అని ఉంది దాని మీద.. రైతు సంతోషంగా నవ్వుతూ వెళ్లిపోయాడు. కనీసం ఒకరైనా ఇలాంటివారు ఉన్నారనే సంతృప్తితో రాజు కూడా వెళ్లిపోయాడు.

కొన్నిసార్లు చాలా కష్టపడి ఒక లక్ష్యం కోసం ముందుకెళ్తున్నపుడు… బండరాళ్ల లాంటి ఆటంకాలు ఎదురవుతాయి. దాటుకుని వెళ్లాలంటే పక్కనుండీ వెళ్లొచ్చు, దాన్ని తొలగించి కూడా వెళ్లొచ్చు. ప్రయాణం ఒక్కటే ముఖ్యం కాదు , నడిచే దారి కూడా ముఖ్యమే! నాకేంటి లాభం అనుకుంటే ఆ రైతు ప్రయత్నం కూడా చేసేవాడు కాదేమో! కానీ అన్నిసార్లూ ప్రయత్నానికి ఫలితం సంపదే కాకపోవచ్చు, కొన్నిసార్లు సంతృప్తి కూడా దొరుకుతుంది. మరికొన్నిసార్లు రెండూ దొరకొచ్చు.

1 year ago (edited) | [YT] | 8