#rspowermedia#rsnews#rscreations#newsupdates
RS POWER MEDIA
New online channel 24/7 News across Telangana and Andhra Pradesh other parts of the world through Live Reports, Breaking News,Exclusive Interviews, Entertainment, Sports News, Weather Reports, Business Trends, & Current Affairs.
Subscribe & Share Our Channel for Latest Updates.
► Subscribe to RS POWER MEDIA : youtube.com/channel/UCVWNO9I2lwo3kbEDfZBg0XQ
► FACEBOOK PAGE RS POWER MEDIA :
www.facebook.com/RS-POWER-MEDIA-112985810479540/?m…


RS Power Media

మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు TSRTC అన్ని ఏర్పాట్లు చేసింది.

1 year ago | [YT] | 1

RS Power Media

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 48వ జీఎస్టీ మండలి సమావేశం ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కౌన్సిల్ భేటీ జరుగుతోంది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారులు హాజరయ్యారు. క్యాసినో, రేస్ కోర్స్, ఆన్‌లైన్ గేమింగ్‌, పన్నులపై కౌన్సిల్‌లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రాలు లేవనెత్తుతున్న సమస్యలను పునః పరిశీలించనున్నారు. క్యాసినో, రేస్ కోర్స్, గేమింగ్ పన్ను స్లాబులపై మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం నివేదికను సిద్ధం చేసింది. కాగా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యాహ్నం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

3 years ago | [YT] | 0

RS Power Media

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవంగ్ సెక్టర్‌లో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ సందర్భంగా భారత దేశ భూభాగాన్ని చైనా ఆక్రమించుకోలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆయన మంగళవారం పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ, భారత దేశానికి చెందిన కనీసం ఒక అంగుళం భూమి కూడా ఆక్రమణకు గురికాలేదని తెలిపారు. చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో భారత సైనికులు అద్భుతమైన ధైర్యసాహసాలను ప్రదర్శించారని చెప్పారు. అతి తక్కువ సమయంలోనే చైనా దళాలకు దీటుగా జవాబు చెప్పారన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో భారత దేశ భూభాగాన్ని కనీసం ఒక అంగుళం మేరకు అయినా ఎవరూ కబ్జా చేయలేరని తెలిపారు.

3 years ago | [YT] | 1

RS Power Media

ఏపీ పట్ల కేంద్రం మరోసారి నిర్లక్ష్య వైఖరి అవలంభించింది. రాష్ట్ర విభజన వల్ల ఏపీకి ఎంత మేరకు ఆర్థిక నష్టం జరిగిందనే రికార్డులు తమ వద్ద లేవని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లేనట్లేనని మరోసారి పరోక్షంగా కేంద్రం స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. 14, 15 ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రత్యేక హోదా అంశంపై... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలతో సమావేశాలు నిర్వహించారా? అని కేంద్రాన్ని కేశినేని నాని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం పలు రాష్ట్రాలతో పాటు... ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రతిపాదనలు వచ్చాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. 14వ ఆర్థిక సంఘం.. జనరల్ కేటగిరీ రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీకి ఎలాంటి వ్యత్యాసం చూపలేదని కేంద్రం తెలిపింది. 15వ ఆర్థిక సంఘం కూడ ఈ విషయంలో ఎలాంటి ప్రత్యేక ప్రస్తావన చేయలేదని పేర్కొంది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుతో కేంద్ర పనుల్లో 41 శాతం వాటా రాష్ట్రాలకు ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పన్నుల పంపిణీ ద్వారా... రెవెన్యూ లోటు భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. నిధుల పంపిణీ ద్వారా వీలైనంత మేరకు ప్రతి రాష్ట్రానికి వనరులు అందించే ప్రయత్నం చేస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది.

3 years ago | [YT] | 1

RS Power Media

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి’ వాహనానికి లైన్ క్లియర్ అయింది. పవన్ వాహనానికి అన్ని అనుమతులు ఉన్నాయని తెలంగాణ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు. పవన్‌ 'వారాహి' వాహనానికి ఆర్టీఏ అధికారులు రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను కూడా కేటాయించారు. 'వారాహి' రిజిస్ట్రేషన్ నెంబర్ TS 13 EX 8384 అని అధికారులు పేర్కొన్నారు. ‘వారాహి’ కలర్‌ ఆలివ్ గ్రీన్‌‌ కాదని.. ఎమరాల్డ్ గ్రీన్ అని అధికారులు వివరణ ఇచ్చారు. నిబంధనల మేరకు ఉన్నందునే రిజిస్ట్రేషన్ చేశామని అధికారులు చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార వాహనంగా చెబుతున్న ‘వారాహి’ వాహనం రంగు ‘ఆర్మీ’ వాహనాల రంగును పోలి ఉండటంతో

3 years ago | [YT] | 1

RS Power Media

శబరిమలకు అయ్యప్ప  స్వాములు పొటెత్తుతున్నారు. భక్తులతో పంబా, సన్నిదానం కిక్కిరిసిపోతున్నాయి. పంబా  నుంచే సన్నిధానానికి క్యూలైన్‌ ఉంది. అయ్యప్ప దర్శనానికి సుమారు 24 గంటలకుపైగా సమయం పడుతోంది. రోజూ లక్షమందికి పైగా భక్తులు స్వామి దర్శనం చేసుకుంటున్నారు. మాండస్‌ తుఫాన్‌  ప్రభావలవల్ల పది రోజులుగా భారీ వర్షంలోనే భక్తులు

3 years ago | [YT] | 2