AP39TV News – The Voice of the People, Fighting for Justice!
At AP39TV News, we stand as the voice of the people.
We relentlessly fight for justice in politics, social issues, and against injustices.
📢 Fearlessly Speaking the Truth – Our Duty!
⚖ Protecting People's Rights – Our Responsibility!
🔔 Subscribe now for the latest news updates!

AP39TV న్యూస్
మేము AP39TV న్యూస్ ఛానల్ ద్వారా ప్రజల గొంతుకగా నిలుస్తాం. రాజకీయాలు,అన్యాయాలు, సామాజిక సమస్యలు వంటి విషయాల్లో న్యాయం కోసం నిరంతరం పోరాడుతాం.
నిజాన్ని, సమచారాన్ని స్పష్టంగా, ధైర్యంగా ప్రజలకు అందించడం మా లక్ష్యం.

🔴 నిజానికి న్యాయం – ప్రజల హక్కులకు రక్షణ!
🔔 మా తాజా న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి!

Email : bhrap39tv@gmail.com


ap39 tv

వినాయక చవితి శుభదినం – మీకు శాంతి, ఆరోగ్యం, అభివృద్ధి కలగాలని కోరుకుంటున్నాం. వినాయక చవితి శుభాకాంక్షలు......

1 month ago | [YT] | 99

ap39 tv

ఏపీ 39 టీవీ వార్తకు స్పందించిన విద్యుతాధికారులు *


అనంతపురం జిల్లా పామిడి పట్టణం నందు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఏపీ 39 టీవీ ద్వారా మూడు రోజుల క్రితం ప్రచురించినటువంటి వార్తపై విద్యుతాధికారులు స్పందించి మరమ్మత్తు పనులు జరిపి ప్రమాదం సంభవించకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసి తగు చర్యలు తీసుకోవడం జరిగినది కానీ పామిడి పట్టణం నందు ఈ ఒక్క ప్రాంతంలో ఈ ఒక్క ట్రాన్స్ఫార్మర్ దగ్గరే కాకుండా పామిడి పట్టణంలో పలుచోట్ల ఇదేవిధంగా ప్రమాదాలకు దారి తీసే విధంగా ఉన్నాయంటూ ప్రజలు గుసగుసలాడుతున్నారు పామిడి పట్టణంలో ఈ విధమైన ఎన్నో సమస్యలు కల్ల ఎదుట కనిపిస్తున్న విద్యుతాధికారుల కంట పడలేదా నిత్యం కరెంట్ లైన్ మ్యాన్ లు విద్యుత్ సమస్యలపై ప్రతి వీధి తిరుగుతూనే ఉంటారు అదేవిధంగా ప్రతి నెల క్రమం తప్పకుండా కరెంట్ బిల్లుల కోసం ఇంటింటికి వెళుతూనే ఉంటారు అలాంటిది ఈ విధంగా ప్రమాదకరంగా మారినటువంటి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు వీరి ఎవరికంటా పడలేదా లేదా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారా ఒకవేళ చూసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదా లేక తీసుకెళ్లిన ఉన్నతాధికారులు స్పందించలేదా అన్న మరెన్నో ప్రశ్నలకు తావిస్తోంది.

2 months ago | [YT] | 21

ap39 tv

ప్రాణాలు కోల్పోతే తప్పా అధికారులు స్పందించరా?

పామిడి పట్టణంలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు


అనంతపురం జిల్లా పామిడి పట్టణం నందు ప్రమాదకరంగా మారిన విద్యుత్ ట్రాన్ఫర్మర్ లు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న విద్యుత్ శాఖ అధికారులు పామిడి పట్టణం నందు ఎక్కువ మోతాదులో జనసంచారం ఉన్నటువంటి ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా మారిన అధికారుల కంట పడలేదా అని పామిడి పట్టణ ప్రజలు వాపోతున్నారు ఈ మధ్యకాలంలో పలు రకాల ప్రమాదాల జరుగుతున్న కూడా ఎన్నో ప్రమాదాలను కళ్లారా చూస్తూ ఎన్నో ప్రాణాలను కోల్పోతున్న ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ల వల్ల ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకు మరియు అన్నివేళలా ప్రమాదం జరిగే అవకాశం ఎంతైనా ఉందని తెలిసి కూడా నిత్యం జన సంచారం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మరియు వాటి చుట్టూ వ్యాపారాల నిమిత్తం చిరు వ్యాపారస్తులు నివసిస్తున్నప్పటికీ విద్యుత్ ట్రాన్స్ఫర్మర్ల నుండి సంభవించే ప్రమాదాల పట్ల సంబంధిత అధికారులు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం అర్థం కాని పరిస్థితుల్లో అయోమయ పరిస్థితిలో పామిడి పట్టణ ప్రజలు ఉండిపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎటువంటి ప్రమాదం జరగక ముందే అప్రమత్తమయ్యి తగు చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తారని ఈ విధంగా ప్రమాదకరంగా ఉన్నటువంటి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు చుట్టూ ఫెన్సింగ్ లాంటిది ఏర్పాటు చేసి నిండు ప్రాణాలు బలి అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారని పామిడి పట్టణ ప్రజలు కోరడమైనది

2 months ago | [YT] | 18

ap39 tv

టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయ‌న‌ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో క‌న్నుమూశారు.

ఫిష్ వెంకట్‌కు రెండు కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయి. దాంతో కొంత‌కాలంగా డయాలసిస్ చేయించుకుంటూ జీవితం కొనసాగించారు. ఆ త‌ర్వాత ఆరోగ్యం మ‌రింత క్షీణించ‌డంతో ఇటీవ‌ల ఆసుప‌త్రిలో చేరారు. అప్పుడే ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌నే విష‌యం బ‌య‌ట‌కు తెలిసిందే. వైద్యులు కిడ్నీ మార్పిడి అవసరమని చెప్పారు. కానీ, స‌మ‌యానికి సరైన దాతలు దొరకకపోవడం విషాదకరంగా మారింది.

చేప‌లు అమ్ముకునే స్థాయి నుంచి న‌టుడిగా
ఫిష్ వెంకట్ అసలు పేరు ముంగిలంపల్లి వెంకటేశ్‌. 1971 ఆగస్టు 3న ఏపీలోని మచిలీపట్నంలో జన్మించారు. అయితే, చిన్నతనంలో హైదరాబాద్‌కు వలస వచ్చారు. ముషీరాబాద్‌లోని కూరగాయల మార్కెట్‌లో చేపలు అమ్మే వ్యాపారం చేస్తూ జీవ‌నం సాగించేవారు. అందుకే ఫ్యాన్స్‌, సహచరులు ఆయనను 'ఫిష్ వెంకట్' అని పిలిచేవారు.

కాగా, మూడవ తరగతి వరకే చదివిన వెంకట్‌కు సినిమాలంటే పిచ్చి. ఆ అపారమైన ఆసక్తితో సినిమాల్లోకి వ‌చ్చారు. దివంగత నటుడు శ్రీహరి ద్వారా వెంకట్‌ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆయ‌న‌ను దర్శకుడు వీవీ వినాయక్ సినీ ప్రపంచానికి పరిచయం చేశారు. 2002లో విడుదలైన తార‌క్‌ నటించిన 'ఆది' మూవీలో చెప్పిన డైలాగ్ “ఒక్కసారి తొడకొట్టు చిన్నా”తో ఫిష్ వెంకట్ ప్రజల మదిలో నిలిచిపోయారు. అలాగే ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన‌ 'గ‌బ్బ‌ర్ సింగ్' మూవీలో కూడా త‌నదైన‌ కామెడీ టైమింగ్‌తో కిత‌కిత‌లు పెట్టారు.

ఇలా 100కి పైగా సినిమాల్లో విల‌న్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా మెప్పించారు. తెలంగాణ యాస, విలక్షణమైన హావభావాలు, కామెడీ టైమింగ్ ఆయన నటనలో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. చిన్న పాత్రల్లో కనిపించినా, ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్నారు. ఆయ‌న మృతితో టాలీవుడ్ ఓ మంచి న‌టుడిని కోల్పోయింది. ఫిష్ వెంకట్ మృతిపై సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలియ‌జేస్తున్నారు.

2 months ago | [YT] | 52

ap39 tv

నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.
తెలుగు సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూసినట్లు ఆయన కుటుంబసభ్యులు చెప్పారు.

వయోభారం కారణంగా ఆయన కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు 750కి పైగా చిత్రాల్లో నటించారు.

విలక్షణ నటుడిగా పేరున్న కోట శ్రీనివాస రావు నెగటివ్ పాత్రలు, హాస్య పాత్రల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ వరకు ఎందులోనైనా ఒదిగిపోయేవారని సినీ విశ్లేషకులు చెప్తారు.
డాక్టర్ కావాలనుకుని..
చిన్నప్పుడు డాక్టర్ కావాలనుకున్న కోట.. ఆ తర్వాత నాటకాల పట్ల ఆకర్షితులై నటన వైపు అడుగులేశారు.
పల్లెటూరి విలన్ నుంచి పట్నంలోని ఆధునిక విలన్ వరకు తనదైన శైలితో మెప్పించారు.

కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున వంటి హీరోలతో పాటు యువ హీరోలతోనూ ఆయన నటించారు.

తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లోనూ పనిచేశారు.

అహనా పెళ్లంట సినిమాలో పిసినారిగా ఆయన నటనకు ప్రశంసలొచ్చాయి.

అలాగే, వెంకటేష్ హీరోగా చేసిన గణేశ్ సినిమాలో రాజకీయ నాయకుడిగా, తెలంగాణ మాండలీకంలో మాట్లాడుతూ విలనిజానికి కొత్త రంగులు అద్దారు.

హాస్యం పండించడంలోనూ కోట శ్రీనివాసరావుకు పేరుంది.
‘విలక్షణ నటుడు’
కోట నటనలో విలక్షణతను సినీ రంగానికే చెందిన నటులు, దర్శకులు ప్రశసించిన సందర్భాలున్నాయి.

మూడు రోజుల కిందట(జులై 10న) కోట శ్రీనివాసరావు పుట్టిన రోజు సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో ఉన్న ‘ఎక్స్‌’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు.

‘చాలామంది నటులు నవ్వించగలరు.. చాలామంది నటులు ఏడిపించగలరు.. నవ్వించి, ఏడిపించి, భయపెట్టగలిగే నటులు బహుశా కోట ఒక్కరే’ అంటూ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా..
కోట శ్రీనివాసరావు రాజకీయంగానూ రాణించారు.

1999 ఎన్నికల్లో బీజేపీ తరఫున కృష్ణా జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.


2 months ago (edited) | [YT] | 60

ap39 tv

HAPPY WOMEN'S DAY

6 months ago | [YT] | 17

ap39 tv

Follow Our New Facebook Page Ap39tv: www.facebook.com/profile.php?id=61551534886316

2 years ago | [YT] | 3