Welcome to the official YouTube channel of Vamsikrishna Gaddam, Member of Parliament from Peddapalli, Telangana.
📌 On this channel, you'll find:
Speeches, Parliament sessions & interviews
Updates on Peddapalli development projects
Ground-level public service and citizen engagement
Insights into governance, youth empowerment & welfare initiatives
🎯 Committed to people-first leadership, transparency, and progress.
🔔 Subscribe for regular updates and follow Vamsikrishna Gaddam across platforms:
👉 Twitter (X): x.com/KakaVamsiGaddam
👉 Instagram: instagram.com/kakavamsigaddam
👉 Facebook: facebook.com/vkgaddamofficial
#VamsikrishnaGaddam #PeddapalliMP #TelanganaPolitics #PublicService #VKGaddam
Gaddam Vamsi Krishna
జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు నిర్వహించిన యువజన కేంద్రిత కార్యక్రమంలో నేను ప్రముఖ ప్యానలిస్టుగా పాల్గొన్నాను.
CII–యంగ్ ఇండియన్స్ (హైదరాబాద్ చాప్టర్) ఆధ్వర్యంలో నిర్వహించిన “యూత్ ఇన్ యాక్షన్: 2047 దిశగా భారతదేశం తదుపరి ఎదుగుదలకు నాయకత్వం” అనే అంశంపై జరిగిన ప్యానల్ చర్చలో పాల్గొని, యువత పాత్ర, నాయకత్వం, దేశ భవిష్యత్తులో వారి భాగస్వామ్యం వంటి అంశాలపై నా అభిప్రాయాలను పంచుకున్నాను.
భారతదేశ భవిష్యత్తును నిర్మించడంలో యువతే కీలక శక్తి అని, 2047 లక్ష్యంగా దేశాన్ని ముందుకు నడిపించేందుకు యువత ఆలోచనలు, ఆవిష్కరణలు, నాయకత్వం అత్యంత అవసరమని ఈ సందర్భంగా నేను స్పష్టం చేశాను.
యువత శక్తిని సరైన దిశలో ప్రోత్సహిస్తే, భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి చేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశాను.
@YiTweets @FollowCII
4 hours ago | [YT] | 0
View 0 replies
Gaddam Vamsi Krishna
“లేచి నిలబడి, లక్ష్యాన్ని చేరే వరకు ఆగకండి”
స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఆయన ఆలోచనలకు శతకోటి నమస్కారాలు.
7 hours ago | [YT] | 4
View 0 replies
Gaddam Vamsi Krishna
ప్రియాంకా గాంధీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ప్రజాసేవ పట్ల మీ అంకితభావం, ధైర్యం, నాయకత్వం ఎల్లప్పుడూ అందరికీ ప్రేరణగా నిలవాలని కోరుకుంటున్నాం. మీరు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాం.
7 hours ago | [YT] | 4
View 0 replies
Gaddam Vamsi Krishna
ఈ రోజు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం తిరుమలాపూర్ (పీ.డి) గ్రామానికి చెందిన ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్‌లను నేను ఘనంగా సన్మానించాను.
ఈ సందర్భంగా గ్రామస్థులు, ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించాను. గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాలు, రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం వంటి సమస్యలను అడిగి తెలుసుకున్నాను.
అనంతరం నేను మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని స్పష్టం చేశాను. తిరుమలాపూర్ గ్రామం సమగ్ర అభివృద్ధి చెందేలా నా వంతుగా పూర్తి సహకారం అందిస్తానని నూతన సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు మరియు గ్రామస్థులకు భరోసా ఇచ్చాను.
గ్రామ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు జరిగేలా నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశాను.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
6 days ago | [YT] | 7
View 1 reply
Gaddam Vamsi Krishna
ఈ రోజు రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని నేను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించాను.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు నాకు పూర్ణకుంభ స్వాగతం పలికి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, దైవ ఆశీర్వాదాలు పొందాను.
ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ, నా పార్లమెంట్ పరిధిలోని ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించాను అని పేర్కొన్నాను.
ప్రజల శ్రేయస్సే నా ధ్యేయం అని, దైవ ఆశీస్సులతో ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమం మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించాను.
6 days ago | [YT] | 10
View 1 reply
Gaddam Vamsi Krishna
ఈ రోజు మంచిర్యాల జిల్లాలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల డిగ్రీ కాలేజ్‌ను నేను సందర్శించాను. విద్యార్థులు లేరనే కారణంతో కాలేజ్‌ను నిర్మల్‌కు తరలించిన విషయాన్ని విద్యార్థులు, సిబ్బంది నా దృష్టికి తీసుకువచ్చారు.
వెంటనే స్పందించి, డిగ్రీ కాలేజ్‌ను మంచిర్యాలలోనే కొనసాగించాలని విద్యాశాఖ అధికారులను కోరాను. ఫలితంగా కాలేజ్ తిరిగి మంచిర్యాలలోనే కొనసాగుతోంది.
విద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోంది.
విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా మీ వెంట నేనుంటాను.
6 days ago | [YT] | 5
View 1 reply
Gaddam Vamsi Krishna
ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ట్రినిటీ హై స్కూల్లో నిర్వహించిన వార్షిక క్రీడోత్సవాల్లో నేను పాల్గొనడం ఎంతో ఆనందంగా అనిపించింది. జ్యోతి ప్రజ్వలనతో పాటు జెండా ఆవిష్కరణ చేసి ఈ క్రీడోత్సవాలను ఘనంగా ప్రారంభించాను.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు ఎంతో అవసరమని నేను పేర్కొన్నాను. క్రీడల ద్వారా క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలు అలవడతాయని, నేటి పోటీ ప్రపంచంలో విద్యతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడం చాలా అవసరం అని స్పష్టం చేశాను.
ఈ స్కూల్‌కు రావడంతో నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. నేను చదువుకునే రోజుల్లో క్రికెట్, ఫుట్‌బాల్ ఆడేవాడిని. క్రీడలు జీవితంలో ఒక భాగం. క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుంది. శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవ్వడానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయి అని విద్యార్థులతో పంచుకున్నాను.
అలాగే గెలుపు–ఓటములు సహజమే అని, వాటిని సమానంగా స్వీకరించే మనస్తత్వం క్రీడల ద్వారా వస్తుందని, టీమ్ స్పిరిట్ అలవడుతుందని వివరించాను. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా క్రీడల్లో పాల్గొనాలని, క్రీడల ద్వారా క్రమశిక్షణ అలవడడంతో నిజ జీవితంలో వచ్చే ఆటుపోట్లు ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుందని చెప్పాను.
గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో అపారమైన క్రీడా ప్రతిభ ఉందని, దానిని గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత విద్యాసంస్థలపై ఉందని పేర్కొన్నాను. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, క్రీడలను జీవన భాగంగా చేసుకోవాలని సూచించాను.
క్రీడోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలను తిలకించి, విజేతలైన విద్యార్థులను అభినందించాను. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారు, మాజీ కౌన్సిలర్ హరికృష్ణ గారు, డీసీసీ మాజీ సెక్రటరీ నల్ల రవి గారు తదితర నాయకులు పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు.
6 days ago | [YT] | 6
View 1 reply
Gaddam Vamsi Krishna
ఈ రోజు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిని నేను సందర్శించాను. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సౌకర్యాల గురించి నేరుగా అడిగి తెలుసుకున్నాను.
ఈ సందర్భంగా ఆసుపత్రిని శుభ్రంగా ఉంచాలని, అలాగే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని వైద్య అధికారులు, సిబ్బందికి సూచించాను.
ఆసుపత్రిలో సరిపడా మందులు అందుబాటులో లేవని నా దృష్టికి రావడంతో, ఇకపై ఇలాంటి సమస్యలు తలెత్తకుండా తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను.
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే నా ప్రథమ ప్రాధాన్యం అని ఈ సందర్భంగా స్పష్టం చేశాను.
6 days ago | [YT] | 4
View 1 reply
Gaddam Vamsi Krishna
ఈ రోజు మంచిర్యాల పట్టణ మార్కెట్ ప్రాంతంలో నేను పర్యటించాను. ఈ సందర్భంగా రతన్ లాల్ చాయ్ హోటల్లో ప్రజలు, పార్టీ కార్యకర్తలతో కలిసి చాయ్ తాగుతూ, పట్టణంలోని విశేషాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం కలిగింది.
అనంతరం మార్కెట్లోని వ్యాపారులు, స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలు, అవసరాలను శ్రద్ధగా విన్నాను. వారు నా దృష్టికి తీసుకువచ్చిన అంశాలపై సానుకూలంగా స్పందించి, ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని వారికి భరోసా ఇచ్చాను.
ప్రజల మధ్య ఉండి వారి మాట వినడమే నా రాజకీయ జీవితం లక్ష్యం అని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశాను.
6 days ago | [YT] | 10
View 1 reply
Gaddam Vamsi Krishna
ఈ రోజు జగిత్యాల పట్టణంలో నిర్వహించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి శ్రీ జీవన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్లో నేను పాల్గొనడం ఎంతో ఆనందంగా అనిపించింది.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారితో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాను. అనంతరం ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించాను.
ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ, జీవన్ రెడ్డి గారు ప్రజాసేవలో సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడు అని పేర్కొన్నాను. ఆయన ప్రజల కోసం చేసిన సేవలు అనేక తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని, రాజకీయ జీవితంలో ఆయన చూపిన విలువలు, నిబద్ధత మాకు స్ఫూర్తిదాయకమని అభిప్రాయపడ్డాను.
జీవన్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో, శతాయుష్కులుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించాను.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
6 days ago | [YT] | 7
View 1 reply
Load more