Hi Viewers🔔

Please Subscribe My Channel and Bell on Permanently For More Updates


Fair Use Disclaimer

"Copyright Disclaimer under section 107 of the Copyright Act 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education and research. ... Non-profit, educational or personal use tips the balance in favor of fair use"


S&BR Media

🔥 *డి.ఏ.లపై సరియైన మరియు పూర్తి సమాచారం* 👇

☛ 27.248% నుండి 30.392% వరకు డి.ఏ.
01.07.2018 నుండి 31.12.2020 వరకు రావలసిన 30 నెలల డి.ఏ. బకాయిలను మూడు బిల్లుల రూపంలో సమర్పించారు. OPS ఉద్యోగుల బకాయిలు వారి PF ఖాతాల్లో జమ చేయబడ్డాయి. పింఛనుదారుల బకాయిలు మరియు CPS ఉద్యోగుల బకాయిలలో 90 శాతం నగదు 14.01.2026 న జమ చేయబడింది.

☛ 30.392% నుండి 33.536% వరకు డి.ఏ. (30 నెలలు)
01.01.2019 నుండి 30.06.2021 వరకు రావలసిన 30 నెలల డి.ఏ. బకాయిలను మూడు బిల్లులుగా సమర్పించారు. OPS వారికి PF ఖాతాలో జమ చేశారు. అయితే పింఛనుదారులు మరియు CPS ఉద్యోగులకు సంబంధించిన 90 శాతం నగదు బకాయిలు ఇప్పటివరకు చెల్లించలేదు.

☛ 30.392% నుండి 33.536% వరకు డి.ఏ. (1 నెల)
01.07.2021 నుండి 31.07.2021 వరకు రావలసిన ఒక నెల నగదు డి.ఏ. బకాయిలు కొందరికి ఇంకా చెల్లించలేదు. దీనికి సంబంధించిన బిల్లు ఇప్పటికే సమర్పించారు.

☛ 33.536% నుండి 38.776% వరకు డి.ఏ.
01.07.2019 నుండి 31.03.2020 వరకు రావలసిన 9 నెలల డి.ఏ. బకాయిలను PRC బకాయిలతో కలిపి చెల్లిస్తామని ప్రభుత్వం G.O. జారీ చేసింది.

☛ కోవిడ్ కారణంగా ఫ్రీజ్ చేసిన డి.ఏ.లు
01.01.2020, 01.07.2020 మరియు 01.01.2021 తేదీలకు సంబంధించిన డి.ఏ.లను కోవిడ్ కారణంగా ఫ్రీజ్ చేశారు.

☛ 20.02% డి.ఏ. బకాయిలు
01.07.2021 నుండి 31.12.2021 వరకు రావలసిన డి.ఏ. బకాయిలను PRC బకాయిలతో చెల్లిస్తామని ప్రభుత్వం G.O. జారీ చేసింది.

☛ 20.02% నుండి 22.75% వరకు డి.ఏ.
01.01.2022 నుండి 30.06.2023 వరకు రావలసిన 18 నెలల డి.ఏ. బకాయిలను సెప్టెంబర్ 2023, డిసెంబర్ 2023 మరియు మార్చి 2024లో మూడు వాయిదాలలో చెల్లిస్తామని G.O. ఇచ్చారు. అయితే ఇప్పటివరకు బిల్లులు సమర్పించడానికి అవకాశం ఇవ్వలేదు. OPS, పింఛనుదారులు మరియు CPS ఉద్యోగులకు ఎవరికి కూడా బకాయిలు చెల్లించలేదు.

☛ 22.75% నుండి 26.39% వరకు డి.ఏ.
01.07.2022 నుండి 31.10.2023 వరకు రావలసిన 16 నెలల డి.ఏ. బకాయిలను ఏప్రిల్ 2024, జూలై 2024 మరియు అక్టోబర్ 2024లో మూడు వాయిదాలలో చెల్లిస్తామని G.O. ఇచ్చారు. ఇప్పటివరకు బిల్లుల సమర్పణకు అవకాశం లేదు. ఎవరికి కూడా బకాయిలు చెల్లించలేదు.

☛ 26.39% నుండి 30.03% వరకు డి.ఏ.
01.01.2023 నుండి 31.03.2024 వరకు రావలసిన 15 నెలల డి.ఏ. బకాయిలను ఆగస్టు 2024, నవంబర్ 2024 మరియు ఫిబ్రవరి 2025లో మూడు వాయిదాలలో చెల్లిస్తామని G.O. ఇచ్చారు. కానీ ఇప్పటివరకు బిల్లులు సమర్పించలేదు. OPS, పింఛనుదారులు, CPS ఉద్యోగులకు ఎవరికీ చెల్లింపులు జరగలేదు.

☛ 30.03% నుండి 33.67% వరకు డి.ఏ.
01.07.2023 నుండి 30.06.2024 వరకు రావలసిన 12 నెలల డి.ఏ. బకాయిలను సెప్టెంబర్ 2024, డిసెంబర్ 2024 మరియు మార్చి 2025లో మూడు వాయిదాలలో చెల్లిస్తామని G.O. ఇచ్చారు. ఇప్పటివరకు బిల్లుల అవకాశం లేదు. ఎవరికీ చెల్లింపులు జరగలేదు.

☛ 33.67% నుండి 37.31% వరకు డి.ఏ.
01.01.2024 నుండి 30.09.2025 వరకు రావలసిన 21 నెలల డి.ఏ. బకాయిలను ఆగస్టు 2026, నవంబర్ 2026 మరియు ఫిబ్రవరి 2027లో మూడు వాయిదాలలో చెల్లిస్తామని ప్రభుత్వం G.O. జారీ చేసింది.

🔔 ఇంకా ప్రకటించాల్సిన డి.ఏ.లు

☛ 01.07.2024 నిచ్చే డి.ఏ.
☛ 01.01.2025 నిచ్చే డి.ఏ.
☛ 01.07.2025 నిచ్చే డి.ఏ.

👉 ఇది డి.ఏ.లపై ప్రస్తుత స్థితిగతుల పూర్తి మరియు సరైన సమాచారం.

3 days ago | [YT] | 1

S&BR Media

*వాలంటరీ రిటైర్మెంట్:*
*(స్వచ్ఛంద పదవీ విరమణ)*

వాలంటరీ రిటైర్మెంట్ కొరకు 20 సం॥ అర్హత గల సర్వీసు పూర్తి చేసినవారు 3 నెలల ముందుగా తానున్న పోస్టుకు నియామకము చేయు అధికారికి నోటీసు ఇవ్వాలి.

వాలంటరీ రిటైర్మెంట్ అనుమతికై ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నట్టు, డ్యూటీ చేయుటకు అర్హత కలిగినట్లు ఇద్దరు వైద్యులచే (Civil Surgeons) సర్టిఫికెట్ సమర్పించాలి.

అనారోగ్యం,ఉన్నత విద్యాభ్యాసమునకు పెట్టిన జీతనష్టపు సెలవు తప్ప,మరే ఇతర జీతనష్టపు సెలవు అర్హత గల సెలవుగా పరిగణించబడదు.

అధికారి ఐచ్చిక రిటైర్మెంట్ కు అనుమతి ఇచ్చిన తర్వాత పదవీ విరమణ చేయాలి.

గ్రాట్యూటీ మాత్రము 20 సం॥ వచ్చేదే ఇస్తారు.కుటుంబ పెన్షన్,కమ్యూటేషన్ సౌకర్యాలు ఉంటాయి.

*(A.P.R.P Rule 1980 Rule 43(5)*

*(G.O.Ms.No.413 F&P Dt:29-11-1977)*

వాలంటరీ రిటైర్మెంట్ పొందువారికి (ఇతర కారణాలపై) కారుణ్య నియామక సౌకర్యం వర్తించదు.

వాలంటరీ రిటైర్మెంట్ కు వైద్య పరీక్షలు అవసరం లేదు.

20 సం॥ సర్వీసు కలిగి యుండి వాలంటరీ రిటైర్మెంట్ చేయు ఉద్యోగి ఇంకను 5 సం॥ మించి సర్వీసు ఉంటే 5 సం॥ వెయిటేజి కలుపుతారు.5 సం॥ లోపు సర్వీసు ఉంటే అంతకాలం మాత్రమే సర్వీసు వెయిటేజి కలుపుతారు.దాని ఆధారంగానే పెన్షన్ లెక్కిస్తారు.

*🌹సందేహాలు - సమాధానాలు*

1. Voluntary Retirement (VR) తీసుకోదలిస్తే ఎన్నినెలల ముందు దరఖాస్తు పెట్టుకోవాలి? దరఖాస్తు ఎవరికి చేయాలి? ఏయే పత్రాలు జతపర్చాలి?

Ans: VR తీసుకోదలిస్తే 3 నెలల ముందు నియామకపు అధికారికి నోటీసు (దరఖాస్తు) ఇవ్వాలి. మూడు నెలల లోపు ఇచ్చే నోటీసులను సైతం నియామకపు అధికారి అనుమతించవచ్చు. ఉపాధ్యాయుల విషయంలో మండల పరిధిలోని టీచర్లు MEO ద్వారా, హైస్కూల్ టీచర్లు HM ద్వారా DEO కు ఏ తేదీ నుంచి VR అమల్లోకి రావాలని కోరుకుంటున్నారో స్పష్టంగా తెల్పుతూ నోటీసు ఇవ్వాలి. స్పెసిఫిక్ గా జత చేయాల్సిన పత్రాలేవీ లేవు.

2. VR ఏయే కారణాలపై తీసుకోవచ్చు?

Ans: వ్యక్తిగత, అనారోగ్యం తదితర కారణాలను చూపవచ్చు.

3. ఒక టీచరుకు జనవరి 2026నాటికి 20 ఏళ్ళ సర్వీస్ పూర్తవుతుంది. అక్టోబర్ తర్వాత VR తీసుకుంటే పూర్తి పెన్షన్ వస్తుందా?

Ans: 20 ఏళ్ళ నెట్ క్వాలిఫయింగ్ సర్వీస్ పూర్తి చేస్తే VR కి ఎలిజిబిలిటీ వస్తుందికానీ, పూర్తి పెన్షన్ రాదు.

4. ఇరవై ఏళ్ళ సర్వీస్ పూర్తి చేశాక VR తీసుకోదలిస్తే... వెయిటేజీ ఎన్ని సంవత్సరాలు Add చేస్తారు?

Ans: క్వాలిఫయింగ్ సర్వీస్ కు.... సూపరాన్యుయేషన్ (58/60 ఏళ్ళు) కి గల తేడాను వెయిటేజీగా Add చేస్తారు. అయితే... దీని గరిష్ట పరిమితి ఐదేళ్లు.

5. Loss of Pay, Long Leave (medical grounds) లో ఉండి VR కి దరఖాస్తు చేయవచ్చా?

Ans: Yes.

6. Medical Leave లో ఉండి, స్కూల్లో జాయిన్ అయ్యాకే VR కి అప్లై చేయాలా? సెలవులో ఉండి VR తీసుకోవడం ప్రయోజనమా?

Ans: సెలవులో ఉండి VR తీసుకుంటే కమ్యూటేడ్ లీవ్ పెట్టుకోరాదు. స్కూల్లో జూయిన్ అయి VR తీసుకుంటే కమ్యూటేడ్ లీవ్ పెట్టుకొని సెలవు కాలానికి పూర్తి వేతనం పొందే అవకాశం ఉంటుంది.

7. మే, 2026 నుంచి VR తీసుకుంటే కొత్త PRC వర్తిస్తుందా?

Ans: 12 వ PRC.... ఫస్ట్ జనవరి, 2022 నుంచి అమల్లో వుంది. వస్తుందనే నమ్మకమూ నాకుంది. అయితే... నోషనలా? మానిటరీ బెనిఫిట్ ఉంటుందా? అనే విషయాన్ని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం!

8. VR తీసుకున్న తర్వాత GI కంటిన్యూ చేయవచ్చా? GI అమౌంట్ ఎంత వస్తుంది?

Ans: VR తవ్వాత గ్రూప్ ఇన్సూరెన్సు కంటిన్యూ అయ్యే అవకాశంలేదు. ప్రభుత్వం ఏటేటా విడుదల చేసే టేబుల్ ప్రకారం అమౌంట్ వస్తుంది.

9. చివరగా ఒక ప్రశ్న. 20 ఏళ్ళ నుంచి 28 ఏళ్ళ సర్వీస్ మధ్య VR తీసుకుంటే పెన్షన్ ఎంతెంత వస్తుంది?

Ans: వెయిటేజీతో కలుపుకొని 33 ఏళ్ళ సర్వీస్ పూర్తిచేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్ అయితే.... చివరి Basic Pay లో 50 % పెన్షన్ గా నిర్ధారించబడుతుంది. అలా కాకుండా VR తీసుకుంటే....

🌹నెట్ క్వాలిఫయింగ్ సర్వీస్ > పెన్షన్

20>37.87% (చివరి మూలవేతనంలో)

21>39.4%

22>40.9%

23>42.4%

24>43.93%

25>45.45%

26>46.97%

27>48.48%

28>50%

(ఈ టేబుల్ 58 ఏళ్ళ వయస్సు నిండి ఉద్యోగ విరమణ చేసే వారికీ వర్తిస్తుంది.

3 days ago | [YT] | 1

S&BR Media

*📚✍️SBI లో ఖాతా ఉన్నవారికి బిగ్ షాక్‌!*

_SBI: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల లావాదేవీల ఛార్జీలలో మార్పులు చేసింది. మీకు కూడా ఎస్‌బీఐలో ఖాతా ఉన్నట్లయితే ఇది మీకు అవసరమైన వార్త._

_ఐఎంపీఎస్ (Immediate Payment Service) ద్వారా చేసే ఆన్‌లైన్ లావాదేవీలపై సర్వీస్ ఛార్జీలు విధిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. దీనివల్ల చాలా మంది వినియోగదారుల రోజువారీ బ్యాంకింగ్ లావాదేవీలపై ప్రభావం పడవచ్చు. అయితే ఈ ఛార్జీలు కేవలం 25,000 రూపాయల కంటే ఎక్కువ నగదు బదిలీ చేసే లావాదేవీలపై మాత్రమే వర్తిస్తాయి. చిన్న మొత్తంలో చేసే డిజిటల్ పేమెంట్స్ ఎప్పటిలాగే ఉచితంగా ఉంటాయి._

* _*SBI కొత్త IMPS ఛార్జీలు ఎంత?*_

_ఇప్పటివరకు ఎస్‌బీఐ ఖాతా నుండి ఆన్‌లైన్‌లో IMPS ద్వారా నగదు పంపితే ఎటువంటి ఛార్జీలు ఉండేవి కావు. కానీ కొత్త నిబంధన ప్రకారం 25,000 కంటే ఎక్కువ మొత్తాన్ని బదిలీ చేస్తే సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. లావాదేవీ మొత్తం పెరిగే కొద్దీ ఛార్జీ కూడా మారుతుంది._

* _*25,000 నుండి 1 లక్ష రూపాయలు: 2 రూపాయలు + GST*_

* _*1 లక్ష నుండి 2 లక్షల రూపాయలు: 6 రూపాయలు + GST*_

* _*2 లక్షల నుండి 5 లక్షల రూపాయలు: 10 రూపాయలు + GST*_

*అంటే మీరు పంపే నగదు పెరిగే కొద్దీ ఖర్చు కూడా పెరుగుతుంది. అయితే ఈ ఛార్జీలు చాలా స్వల్పంగానే ఉన్నాయి. ఎస్‌బీఐ ఈ కొత్త ఛార్జీలను 15 ఫిబ్రవరి 2026 నుండి అమలు చేయనుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లేదా YONO యాప్ ద్వారా 25,000 రూపాయల వరకు పంపితే ఎలాంటి ఛార్జీలు ఉండవు.*

* _*ఎవరికి మినహాయింపు లభిస్తుంది?*_

*బ్యాంక్ బ్రాంచ్ నుండి నేరుగా చేసే IMPS లావాదేవీల ఛార్జీలలో ఎస్‌బీఐ ఎలాంటి మార్పు చేయలేదు. బ్రాంచ్ ద్వారా చేసే లావాదేవీలకు 2 రూపాయల నుండి 20 రూపాయల వరకు (+GST) ఛార్జీ ఉంటుంది. అలాగే కొన్ని ప్రత్యేక కేటగిరీ ఖాతాలకు ఈ కొత్త ఫీజుల నుండి మినహాయింపు లభిస్తుంది. వీటిలో DSP, PMSP, ICSP, CGSP, PSP, RSP ఖాతాలతో పాటు శౌర్య ఫ్యామిలీ పెన్షన్ అకౌంట్, SBI రిస్తే ఫ్యామిలీ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లు ఉన్నారు.*

* _*ATM- ADWM ఛార్జీలు కూడా పెంపు.!*_

*ఎస్‌బీఐ సవరించిన ATM, ADWM ఛార్జీలు 1 డిసెంబర్ 2025 నుండే అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం.. ఇతర బ్యాంకుల ATMల నుండి ఉచిత పరిమితి కంటే ఎక్కువసార్లు డబ్బు విత్‌డ్రా చేస్తే 23 రూపాయలు + GST ఛార్జీ పడుతుంది. శాలరీ అకౌంట్ హోల్డర్లకు నెలకు 10 ఉచిత లావాదేవీలు యథాతథంగా అందుతాయి. కరెంట్ అకౌంట్ హోల్డర్లకు అన్ని ATM లావాదేవీలపై ఛార్జీలు పెంచారు. అయితే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) అకౌంట్, ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ హోల్డర్లు లేదా కిసాన్ క్రెడిట్ కార్డ్ ఖాతాదారులకు ఈ పెంచిన ఛార్జీల నుండి మినహాయింపు ఇచ్చారు.*

3 days ago | [YT] | 0

S&BR Media

SBI శాలరీ ప్యాకేజ్ అకౌంట్ రకాలు:*

- ఉద్యోగి జీతం రూ.2 లక్షల దాటితే రోడియం కేటగిరీలో శాలరీ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
- జీతం రూ.1 లక్ష- రూ.2 లక్షల వరకు ఉంటే ప్లాటినం అకౌంట్ ప్రారంభించొచ్చు.
- జీతం రూ.50,000-రూ.లక్ష వరకు ఉంటే డైమండ్ కేటగిరీ కిందకు వస్తారు.
- జీతం రూ.25,000-రూ.50,000 వరకు ఉంటే గోల్డ్ విభాగంలో ఖాతా ప్రారంభించొచ్చు.
- జీతం రూ.10,000-రూ.25,000 వరకు ఉంటే సిల్వర్ కేటగిరీలో అకౌంట్ తీసుకోవచ్చు.
- ఈ కేటగిరీలను బట్టి, బ్యాంక్ అందించే ప్రయోజనాల్లో కొన్ని తేడాలు ఉంటాయి. ప్రతి ప్రయోజనాన్ని రూపాయి ఖర్చు లేకుండా అందుకోవచ్చు.

*SBI శాలరీ అకౌంట్ ప్రయోజనాలు:*

- ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఖాతాలో ఒక్క రూపాయి బ్యాలెన్స్ లేకపోయినా పెనాల్టీ ఉండదు.
- మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ ఛార్జీలు లేవు.
- మీ అకౌంట్ కోసం ఫ్యాన్సీ నంబర్ తీసుకోవచ్చు.
- ఆటో స్వీప్ ఫెసిలిటీ ఉంటుంది. ఇది ఐచ్ఛికం. మీ అకౌంట్లో మీ అవసరానికి మించి డబ్బు ఉంటే, ఈ ఆప్షన్ ఎంచుకున్నప్పుడు, మిగిలిన డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్లోకి వెళుతుంది. మీకు అవసరమైనప్పుడు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఆ - డబ్బును వెనక్కుతీసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నన్ని రోజులకు మీకు వడ్డీ లభిస్తుంది.
- సాధారణ కస్టమర్ల కంటే ప్రత్యేకమైన ప్రయోజనాలతో ఉచిత డెబిట్ కార్డ్ వస్తుంది.
- భారతదేశంలోని SBI లేదా ఇతర బ్యాంకుల ATMల్లో ఎన్నిసార్లయినా డబ్బు తీసుకోవచ్చు, ఛార్జీలు వర్తించవు.
- శాలరీ కేటగిరీని బట్టి బ్యాంక్ నుంచి ఇంటర్నేషనల్ రోడియం/ప్లాటినం/డైమండ్/గోల్డ్/సిల్వర్ డెబిట్ కార్డ్ తీసుకోవచ్చు. ఇది ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్. విదేశాలకు వెళ్లినప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు. విదేశాల్లో ఏటీఎంలోకి వెళ్లినప్పుడు మీ ఖాతాలోని రూపాయలు ఆటోమేటిక్గా ఆ దేశపు కరెన్సీలోకి మారి, ఆ కరెన్సీ ఏటీఎం నుంచి వస్తుంది.
- క్రెడిట్ కార్డ్ మీద కూడా ప్రత్యేక బెనిఫిట్స్ అందుతాయి.
- డిమాండ్ డ్రాఫ్ట్ (DD) ఛార్జీల నుంచి 100% మినహాయింపు ఉంటుంది. ఒక నెలలో ఎన్ని డీడీలయినా తీసుకోవచ్చు.
- నెలకు 25 చెక్ లీవ్స్ వరకు తీసుకోవచ్చు, దీనికి కూడా ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.
- ఆన్లైన్ RTGS / NEFT ఛార్జీల నుంచి మినహాయింపు.
- మిగిలినవారి కంటే తక్కువ వడ్డీ రేట్లకు వ్యక్తిగత రుణాలు (SBI Personal Loan), కారు లోన్ (SBI Car Loan), గృహ రుణాలు (SBI Home Loan) అందుబాటులో ఉంటాయి.
- ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం ఉంటుంది. జీతం రావడం ఆలస్యమైన సందర్భాల్లో దీనిని ఉపయోగించుకోవచ్చు. ప్లాటినం కేటగిరీలో ఉన్న ఉద్యోగులు రూ.2 లక్షలు వరకు తీసుకోవచ్చు. డైమండ్ కేటగిరీలో ఉన్నవాళ్లు గరిష్టంగా రూ.1.50 లక్షలు, గోల్డ్ విభాగంలోని వ్యక్తులు రూ.75,000 వరకు ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు. సిల్వర్ కేటగిరీ వాళ్లకు ఈ సౌకర్యం లేదు.
- వార్షిక లాకర్ అద్దె ఛార్జీలపై రాయితీ కూడా లభిస్తుంది. ప్లాటినం వాళ్లకు ఏడాదికి 25% డిస్కౌంట్, డైమండ్ వాళ్లకు 15% డిస్కౌంట్ ఉంటుంది.
- OTT, ఫుడ్ అగ్రిగేటర్స్ (జొమాటో, స్విగ్గీ వంటివి) సబ్స్క్రిప్షన్లను కూడా కొన్నాళ్ల పాటు ఉచితంగా అందుకోవచ్చు.
- మూవీ టిక్కెట్ల బుకింగ్ సమయంలో డిస్కౌంట్స్ లభిస్తాయి.
- స్పా, జిమ్, గోల్ఫ్ క్లబ్ వంటి వాటిల్లోకి కాప్లిమెంటరీ విజిట్స్ లభిస్తాయి.
- శాలరీ కేటగిరీని బట్టి, మీ డెబిట్ కార్డ్ ద్వారా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంజ్ల్లోకి ఉచిత ప్రవేశం లభిస్తుంది.

*కోటి రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్*

శాలరీ అకౌంట్ హోల్డర్కు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, ప్రీమియం డబ్బును బ్యాంక్ కడుతుంది. ఏదైనా ప్రమాదంలో ఖాతాదారు మరణిస్తే బ్యాంక్ నుంచి 30 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రూపంలో లభిస్తాయి. అదనంగా, డెబిట్ కార్డ్ మీద కూడా బీమా ఉంటుంది. డెబిట్ కార్డ్ నుంచి కవరేజ్ రూపంలో మరో రూ.10 లక్షల వరకు వస్తాయి. మొత్తంగా కలిపి రూ.40 లక్షల వరకు ఆ కుటుంబానికి అందుతాయి. క్లెయిమ్ చేసుకున్న 15 రోజులలోపు డబ్బులు వస్తాయి. ప్రమాదం వల్ల శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ.30 లక్షలు బ్యాంక్ నుంచి అందుతాయి. చాలామందికి ఈ విషయం తెలీక క్లెయిమ్ చేయడం లేదు.

శాలరీ అకౌంట్ హోల్డర్కు కోటి రూపాయల వరకు ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. అన్ని కేటగిరీల వాళ్లకు ఈ కవరేజ్ ఉంటుంది. దీనికి అదనంగా, ATM కార్డ్ మీద కూడా ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. కార్డ్ రకాన్ని బట్టి వచ్చే కవరేజ్ మొత్తం మారుతుంది.

*SBI అందించే వివిధ రకాల శాలరీ ఖాతా ప్యాకేజ్లు ఏమిటి?*

సెంట్రల్ గవర్నమెంట్ శాలరీస్ ప్యాకేజ్ (CGSP)
స్టేట్ గవర్నమెంట్ శాలరీస్ ప్యాకేజ్ (SGSP)
రైల్వే శాలరీ ప్యాకేజ్ (RSP)
డిఫెన్స్ శాలరీ ప్యాకేజ్ (DSP)
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ శాలరీ ప్యాకేజ్ (CAPSP)
పోలీస్ శాలరీస్ ప్యాకేజ్ (PSP)
ఇండియన్ కోస్ట్ గార్డ్ శాలరీ ప్యాకేజ్ (ICGSP)
కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ (CSP)
ప్రారంభ శాలరీ ప్యాకేజ్ ఖాతా (SUSP)

5 days ago | [YT] | 0

S&BR Media

👉Phone pe, Gpay తదితర UPI ల ద్వారా PF విత్‌డ్రా!

👉ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) చందాదారులు తమ ఈపీఎఫ్‌ను యూపీఐ పేమెంట్‌ గేట్‌వే ద్వారా నేరుగా తమ బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకునే అవకాశం ఏప్రిల్‌ నాటికి అందుబాటులోకి వస్తుంది.

👉ఈపీఎఫ్‌లో కొంత నిష్పత్తిలో సొమ్మును మినహాయించి, అత్యధిక సొమ్ము ను చందాదారులకు అందుబాటులో ఉంచేందుకు, ఆ సొమ్మును యూపీఐ విధానంలో తమ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయడానికి వీలు కల్పించే ప్రాజెక్టును కార్మిక మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేస్తున్నది.

6 days ago | [YT] | 0

S&BR Media

6 days ago | [YT] | 2

S&BR Media

విజయవాడ

*ఎపి ఎన్జీజిఒ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్*

ఎపి ఎన్జీఒ సంఘం కాల పరిమితి ఈనెలతో పూర్తి చేసుకుంది

గెజిటెడ్ అధికారులు కు కూడా మెంబర్ షిప్ అవకాశం కల్పించారు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సభ్యత్వం తీసుకున్నారు

పండుగ వాతావరణం లో మెంబర్ షిప్ పూర్తి చేశారు

206 తాలూకా ల్లో సహకారం అందించిన అధికారులు , ఉద్యోగులు కు ధన్యవాదాలు

27 జిల్లా శాఖలకు సంబంధించిన ఎన్నికల ను కూడా పూర్తి చేశాం

నేడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో అన్ని‌జిల్లాల అధ్యక్ష, కార్యదర్శి లు‌ పాల్గొన్నారు

ఈ‌ కమిటీ కి ఆఖరి ఎగ్జిక్యూటివ్ సమావేశం ఇది

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి, ఎన్నికల అధికారిని నియమించాలని నిర్ణయించాం

నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు

మూడేళ్ల‌కాల‌ పరిమితి కోసం ఎన్నికలు జరుగుతాయి

75 యేళ్ల ఏపి ఎన్జీఓ అసోసియేషన్ గా వేడుకలు చేయనున్నాం

14 సార్లు సమ్మె నోటీసులు ఇచ్చి సమ్మెకు వెళ్లిన చరిత్ర ఉంది

ఉద్యోగుల పీఆర్సీ , డి.ఎ ల కోసం మా ఎపి ఎన్జీఒ సంఘం పని చేసింది

సంఘం రద్దు చేయడం, సామాజిక సమస్యలు పై ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది

ఆంధ్రా ఉద్యమం సమయంలో ప్రజలకు అండగా నిలిచిన సంఘం ఎపి ఎన్జీఒ అసోసియేషన్

రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న బేదాభిప్రాయాలు తొలగింపులో ఈ సంఘం కీలకంగా పని చేసింది

ఇటువంటి సంఘం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల రోజుల పాటు ఉత్సవాలు రాష్ట్రం మొత్తం జరుపుతాం

ప్రాంరంభం, ముగింపు ఉత్సవాలకు ప్రముఖులు అతిధులుగా హాజరవుతారు

ఎపి ఎన్జీఒ సంఘం ఉద్యోగుల పక్షాన నిలబడిన వైనాన్ని వివరిస్తాం

64 రోజులు సమ్మె చేసి , పోలీసులు కాల్పులను ఎదుర్కొన్నాం

తిరుపతి లో ఇద్దరు వీర మరణం‌ పొందిన చరిత్ర ను నేటి తరానికి తెలియ చెబుతాం

ఎందరో గొప్ప వ్యక్తులు ఎపి ఎన్జీఒ అసోసియేషన్ లో‌ కీలకంగా పని చేశారు

పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం, గ్రామ వార్డు ఉద్యోగుల ప్రమోషన్స్, పని చేయని హెల్త్ కార్డు లు,

మాట విన్నపం ద్వారా సిఎం వేసిన హెల్త్ కమిటి, తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులర్ చేయడం వంటి అంశాలను ఈ నెల రోజుల సమావేశాల్లో చర్చిస్తాం

ఉద్యోగుల సమస్యలు పై పెద్ద ఎత్తున చర్చ జరపుతాం

రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు, అధికారులు అతిధులుగా వస్తున్నారు

ఎపి ఎన్జీఒ అసోసియేషన్ కన్నా ముందు పుట్టిన సంఘం ఒక్కటి కూడా లేదు

నేడు పది లక్షల మంది ఉద్యోగుల ను లీడ్ చేస్తూ ముందుకు సాగుతున్న సంస్థ ఎపి ఎన్జీఒ సంఘం

ప్రజాస్వామ్య బద్దంగా మా సంఘం ఎన్నికలు‌ జరుగుతాయి

ఉద్యోగుల సర్వీస్ కమీషన్, రూల్స్ విషయంలో అందరి‌ కళ్లు ఎపి ఎన్జీఒ సంఘం వైపున చూస్తాయి

హ్యాండ్ బుక్ ఆఫ్ సర్వీసెస్ ను నిబంధనలు తో ముద్రించి అందరికీ అంద చేస్తాం

అనేక అంశాల కు సంబంధించి ప్రత్యేక‌ కమిటీ లు వేసుకుని పని చేస్తున్నాం

మేము ఏ ఉద్యమం చేసినా, సభలు పెట్టినా ఉద్యోగులు తరలి వచ్చి అండగా నిలిచారు

జాతీయ మహా సభలకు ఎపి ఎన్జీఒ నుంచి 55 మంది వెళుతున్నారు

అన్ని‌ కార్యక్రమాలు ను‌ విజయవంతం చేసేలా పనిచేయాలని నేటి అసోసియేషన్ కార్యవర్గ సమావేశం లో తీర్మానించాం

ఎపి‌ జేఎసి ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తాం

13 వేల‌కోట్లు బకాయిలు ప్రభుత్వం మాకు చెల్లించాలి

హెల్త్ కమిటీ విషయంలో ఉన్నతాధికారులు తో అధ్యక్షుడు గా నన్ను‌ కలిపి కమిటీ వేశారు



ప్రభుత్వం కూడా న్యాయమైన హక్కుల ను‌ పరిష్కరించాలి

ఆర్ధిక పరమైన అంశాలు ... ఆర్ధకేతర అంశాలను త్వరితగతిన పరిష్కరించాలి

ఉద్యోగుల హెల్త్ కార్డు సమస్య పిబ్రవరి లో పరిష్కారం అవుతుంది

ఆరు యేళ్లుగా ఉన్న సమస్యలను ఒక్కొక్కటి గా పరిష్కరిస్తున్నాం

ఉద్యోగుల ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదు

అవసరమైతే ప్రభుత్వం నిర్ణయాలు కు వ్యతిరేకంగా పోరాటం కూడా చేస్తాం

1 week ago | [YT] | 3

S&BR Media

ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్...

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్, పాత పెన్షన్ పథకం (OPS)కు సమానమైన ప్రయోజనాలు అందించేలా “తమిళనాడు అస్యూర్డ్ పెన్షన్ స్కీమ్ (TAPS)” అనే కొత్త పెన్షన్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
TAPS యొక్క ముఖ్య లక్షణాలు ఇవి:
ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు, చివరిగా పొందిన నెల జీతంలో 50% కు సమానమైన హామీ పెన్షన్ అందుతుంది.
ఉద్యోగులు తమ జీతంలో 10% ను విరాళంగా చెల్లిస్తారు. హామీ పెన్షన్ అందించడానికి అవసరమైన అదనపు ఆర్థిక భారం మొత్తాన్ని తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది.
పెన్షనర్లకు, సేవలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే, ప్రతి ఆరు నెలలకు ఒకసారి డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు వర్తిస్తుంది.
పెన్షనర్ మరణించిన సందర్భంలో, చివరిగా పొందిన పెన్షన్‌లో 60% ను కుటుంబ పెన్షన్‌గా నామినేట్ చేసిన కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు.
పదవీ విరమణ సమయంలో లేదా సేవలో ఉండగానే మరణించినప్పుడు, సేవా కాలాన్ని ఆధారంగా చేసుకుని రూ. 25 లక్షల వరకు గ్రాట్యుటీ చెల్లించబడుతుంది.
TAPS అమలుతో, పెన్షన్‌కు అర్హత కలిగే సేవా కాలం పూర్తిచేయకుండా పదవీ విరమణ చేసే ఉద్యోగులకూ కనీస పెన్షన్ హామీ కల్పించబడుతుంది.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) కింద సేవలో చేరి, TAPS అమలుకు ముందు పెన్షన్ లేకుండా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రత్యేక కారుణ్య పెన్షన్ అందించబడుతుంది.
పెన్షన్ నిధికి రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి రూ. 13,000 కోట్ల అదనపు విరాళం చెల్లిస్తుంది.
అదనంగా, రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ. 11,000 కోట్లను పెన్షన్ నిధికి చెల్లిస్తుంది; జీత సవరణలకు అనుగుణంగా ఈ మొత్తం ప్రతి ఏడాది పెరుగుతుంది.
ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల సంక్షేమాన్ని కాపాడేందుకు TAPS అమలుకు సంబంధించిన మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది.
ఈ పథకం గత 20 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల డిమాండ్‌ను నెరవేర్చుతూ, వారికి మరియు వారి కుటుంబాలకు పెన్షన్ భద్రత, ఆర్థిక స్థిరత్వం అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

2 weeks ago | [YT] | 1

S&BR Media

*PRC కమిషన్ ఏర్పాటు చేయాలి, 30% మధ్యంతర భృతి ఇవ్వాలి.*
*గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి కోరిన - PRTU AP నాయకులు...*

*ముఖ్య మంత్రి గారి చేతుల మీదుగా PRTU డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ*

PRTU AP 2026 డైరీ ని, క్యాలెండర్ ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిచే ఆవిష్కరించిన *డాక్టర్ గాదె శ్రీనివాసులునాయుడు ఎమ్మెల్సీ, పి ఆర్ టి యు ఏపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మిట్టా క్రి ష్ణయ్య, పి ఆర్ టి యు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఏ.ఎం. గిరిప్రసాద్.*
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారితో
* నూతన జిల్లాల ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చినందున ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఏర్పాటుకు త్వరలోనే ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎంతో కాలంగా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న ఉమ్మడి సర్వీసు రూల్స్ ని తీసుకురావాలని
* పిఆర్సి కమిటీ చైర్మన్ ని వెంటనే నియమించి 30% IR ఇవ్వాలని,
* అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవు బకాయిలను వెంటనే చెల్లించాలని కోరడమైనది
👉🏻 *ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు.*

2 weeks ago | [YT] | 1

S&BR Media

కామ్రేడ్స్!
ఈ రోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం నిర్వహించింది. సమావేశంలో ఉద్యోగుల జీతాల చెల్లింపు, ఇతర ప్రయోజనాలకి సంబంధించి SBIతో ప్రభుత్వం MOU చేసుకుంటున్నట్లు ప్రకటించారు. MOU ద్వారా ఉద్యోగులకు బ్యాంకులు ఇచ్చే ప్రయోజనాలు గురించి వివరించడం జరిగింది. ప్రతీ సంవత్సరం ఉద్యోగి కొంత ప్రీమియం చెల్లించాలి. అప్పుడు జీతాల అకౌంట్ కలిగిన బ్యాంకే ఉద్యోగులకు, పెన్షనర్లకు వివిధ లోన్లు, ఇతర ప్రయోజనాలతో బాటు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వర్తింపజేస్తుంది.  ప్రమాదాల వల్ల ఉద్యోగి చనిపోయినా, అంగవైకల్యం పొందినా కోటి రూపాయల వరకు, పెన్షనర్లకు 70 సం  నిండేంత వరకు 30 లక్షలు వరకు ఇన్సూరెన్సు కవరేజ్ వర్తిస్తుందని తెలిపారు. ఒక్క SBI మాత్రమే కాక AXIS, IOB తదితర బ్యాంకులతో కూడా MOU కుదుర్చుకుంటామని, ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలపై త్వరలో ఒక కరపత్రం రూపొందిస్తూ పూర్తి వివరాలు ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుంది

2 weeks ago | [YT] | 2