Vamsi Budget Traveller

na peru vamsi krishna nenu ekkuvaga travelling chestunta anduke na peruthone chl petta. nenu ekkuvaga temples Natural places alage chinna chinna waterfalls cheruvulu,dams and villages videos ekkuvaga peduthunta. natural ga akkada vunnadi teesi upload chesta anthe


Vamsi Budget Traveller

అందరికీ నమస్కారం నెల్లూరు జిల్లాలోని నర్రవాడ గ్రామంలో వెలసిన శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు అందులో భాగంగా ప్రస్తుతం వెంగమాంబ తల్లి తిరునాళ్ళ మహోత్సవాలు ఈ నెల 15 నుండి 19 వరకు జరుగుతున్నవి. 15 - 6 - 2025 నుండి 19-6-2025 వరకు. ఎవరు అయినా వెళ్లి అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవాలు చూడాలనుకుంటే వెళ్లి రండి. నర్రవాడ శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి ఆలయానికి సంబంధించి పూర్తి వివరాలుతో నేను కొన్ని వీడియోస్ చేశాను వాటికి సంబంధించిన వీడియో లింక్ ఇక్కడ ఇస్తున్నా వెళ్లేవారు ఒకసారి ఈ వీడియో చూస్తే అన్ని వివరాలు తెలుస్తాయి. నర్రవాడ గ్రామం - దుత్తలూరు మండలం - నెల్లూరు జిల్లా. https://youtu.be/GKhkepb2CdA

6 months ago (edited) | [YT] | 71

Vamsi Budget Traveller

Happy Birthday To You Mohammad Tammudu. ఈరోజు మైదుకూరులో ఉంటున్న మొహమ్మద్ తమ్ముడు పుట్టినరోజు సందర్భంగా మనందరి తరపున శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. నేను ఎప్పుడు మైదుకూరు వెళ్లినా అన్నా అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ వుంటూ చాలా అభిమానం చూపెట్టే మా తమ్ముడు ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ ఉండాలని కోరుకుంటున్న.

7 months ago | [YT] | 41

Vamsi Budget Traveller

అందరికీ నమస్కారం ఒక చిన్న సమాచారాన్ని మీకు తెలియచేద్దాం అని ఈ పోస్ట్ పెడుతున్నా. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ క్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లిఖార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవారి ఆలయంలో నేటినుంచి అంటే మే 17 నుండి 28 వరకు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఎవరు అయినా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిరండి మరిన్ని వివరాలకు ఇక్కడ పూర్తి వీడియో లింక్ ఇస్తున్నా దానిలో జొన్నవాడ ఆలయం కి ఎలా వెళ్ళాలి, వసతి సౌకర్యాలు అన్ని కూడా తెలియచేసా వీడియో లింక్:- https://youtu.be/LsSX2NcXqh4

7 months ago | [YT] | 24

Vamsi Budget Traveller

ఈ పోస్ట్ ద్వారా ఒక చిన్న సమాచారాన్ని మీకు అందిస్తున్నా జగద్గురువు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆరాధన ఉత్సవాలు అత్యంత వైభవంగా బ్రహ్మంగారి మఠంలో ఈనెల 4 వ తారీఖు నుండి 9 వ తారీఖు వరకు నిర్వహిస్తున్నారు 7, 8 తారీఖు లలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి ఎవరు అయినా బ్రహ్మంగారి మఠం వెళ్ళాలి అనుకుంటే వెళ్తారు అని ఈ పోస్ట్ ద్వారా సమాచారం అందిస్తున్నా బ్రహ్మంగారి మఠం కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియచేస్తూ ఒక వీడియో మన చానెల్ లో ఉంది మఠం కి వెళ్ళాలి అనుకునే వారికి ఈ వీడియో ఉపయోగపడొచ్చు. గమనిక : ఆరాధన కార్యక్రమంలో వేలాదిగా లేదా లక్ష మంది భక్తులు పోటెత్తుతారు కావున మఠం వారు కల్పించే సదుపాయాలు సరిపోకపోవచ్చు కాస్త చూసుకుని సర్దుకుని స్వామివారి కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మనవి చేసుకుంటున్న. 2. Rtc వారు మైదుకూరు, బద్వేల్, పోరుమామిళ్ల, కడప, గిద్దలూరు, ప్రొద్దుటూరు, మార్కాపురం తదితర ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులను నడుపుతారు. పూర్తి వీడియో లింక్ :-https://youtu.be/wXZ6haCk1v4

8 months ago | [YT] | 83

Vamsi Budget Traveller

జై శ్రీరామ్. అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. శ్రీ రాములవారి ఆలయాలు మనదేశంలో ప్రతి గ్రామంలో ఉంటాయి వాటిలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నవి చాలా వున్నాయి ముఖ్యంగా మన తెలుగు నేలమీద ఒంటిమిట్ట, భద్రాచలం, రామతీర్థం లాంటి ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన ఆలయాలు ఉన్నాయి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ఆంద్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఒంటిమిట్ట గ్రామంలో జాతీయ రహదారి పక్కనే విశాలమైన ప్రాంగణంలో ఉంటుంది, ఇక్కడ ముఖ్యమైన విశేషం ఏమిటంటే శ్రీ రామచంద్రుల వారి కళ్యాణం నవమి వెళ్ళాక వచ్చే పౌర్ణమి రోజున చేస్తారు, స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించడానికి ప్రత్యేకంగా విశాలమైన ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు అద్భుతమైన కళ్యాణ వేదిక నిర్మించారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఎన్నో విశేషాల సమ్మేళనాలతో కూడిన ఈ ఒంటిమిట్ట క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారి అయినా దర్శించుకోవాలి ఒంటిమిట్ట ఆలయానికి సంబంధించి పూర్తి వివరాలుతో చేసిన వీడియో లింక్ :- https://youtu.be/ICYzPCwFNp4

9 months ago | [YT] | 36

Vamsi Budget Traveller

అందరికీ నమస్కారం NH 167B జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ప్రకాశం జిల్లాలోని పామూరు వద్ద నిర్మించిన బైపాస్ పూర్తిగా అందుబాటులోకి వచ్చింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియచేసా దీనికి సంబంధించిన వీడియో లింక్ :- https://youtu.be/iVs2LrF_4vs

9 months ago | [YT] | 51

Vamsi Budget Traveller

అందరికీ నమస్కారం ఈరోజు పుష్యమాస అమావాస్య. అవధూత భగవాన్ శ్రీ కాశినాయన గారు జన్మించిన రోజు, కాశినాయన గారి స్వగ్రామమైన నెల్లూరు జిల్లాలోని సీతారామపురం మండలంలో ఉన్న బెడుసుపల్లి గ్రామంలో ఈరోజు అత్యంత వైభవంగా శ్రీ కాశినాయన గారి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎవ్వరూ కూడా ఆకలితో బాధపడకూడదు అని ఎన్నో ఆశ్రమాలు నెలకొల్పి వాటిలో నిరంతరం అన్నదానం చేస్తూ లక్షలాదిమంది ఆకలి తీరుస్తున్న శ్రీ కాశినాయన గారు భైతికంగా మన మధ్య లేకపోయినా వారిని స్మరించుకుంటూ వీలున్నంతవరకు వారి అడుగు జాడల్లో నడుద్దాం. శ్రీ కాశినాయన గారి స్వగ్రామమైన బెడుసుపల్లి గురించి అలాగే నాయన గారి గురించి కొన్ని వివరాలతో పూర్తి వీడియో మన ఛానల్ లో ఉంది వీడియో లింక్ :- https://youtu.be/k2QbNth2oR8

11 months ago | [YT] | 30

Vamsi Budget Traveller

ఓం నమో లక్ష్మీ నరసింహస్వామియే నమః . అందరికీ నమస్కారం మన ఛానెల్ లో 5 లక్షల వ్యూస్ దాటిన మరో వీడియో పెంచలకోన మన ఛానెల్ ని ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం వర్షాలు బాగా కురవడంతో ఈ పెంచలకోన అత్యద్భుతంగా ఉంది మరియు ఇక్కడ ఉన్న జలపాతం కూడా బాగానే ప్రవహిస్తుంది కాబట్టి ఎవరు అయినా వెళ్లాలి అనుకుంటే వీలు చూసుకుని త్వరగా వెళ్ళండి. ఇది నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియచేసా ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే నాకు కామెంట్ చేస్తే తెలియచేస్తాను వీడియో లింక్ :- https://youtu.be/fylrdrCU6qY

1 year ago | [YT] | 19

Vamsi Budget Traveller

ఈ నెల 22 నుండి 27 వరకు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి మనవరాలు అయిన జగన్మాత శ్రీ ఈశ్వరీ దేవి అమ్మవారి ఆరాధనోత్సవాలు అత్యంత వైభవంగా బ్రహ్మంగారి మఠం లో ఉన్న ఈశ్వరీ దేవి గారి మఠంలో 22-12-2024 నుండి 27-12-2024 వరకు నిర్వహిస్తున్నారు ఎవరు అయినా వెళ్ళాలి అనుకునే వారు వెళ్ళిరండి మరిన్ని వివరాలకు వీడియో లింక్ :- https://youtu.be/wXZ6haCk1v4

1 year ago | [YT] | 37

Vamsi Budget Traveller

అవధూత శ్రీ కాశినాయన గారి ఆరాధనోత్సవాలు 2024 డిసెంబరు 14,15 వ తేదీలలో కడప జిల్లాలోని జ్యోతి క్షేత్రంలో నిర్వహిస్తున్నారు ఎవరు అయినా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. కాశినాయన గారి జ్యోతి క్షేత్రం కి సంబంధించిన వివరాలు తో చేసిన వీడియో లింక్ ఇక్కడ ఇస్తున్నా ఈ వీడియో చూస్తే మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే నాకు ఒక కామెంట్ చెయ్యండి. వీడియో లింక్ :- https://youtu.be/TIURdGusVKE

1 year ago | [YT] | 25