Hi friends subscribe to my YouTube channel#,life motivation 📷📸 video # old songs


my self Siri

పట్టుదల – కారుణ్యం – మానవత్వం

పశ్చిమ బెంగాల్‌లోని పరగణా జిల్లాకు చెందిన రవీంద్రనాథ్ అనే వ్యక్తి, తన 15 మంది మిత్రులతో కలిసి బంగాళాఖాతంలోని హల్దియా వద్ద చేపలు పట్టేందుకు బయల్దేరాడు.

ఆ సమయంలో అకస్మాత్తుగా సముద్రం తన అలల దిశను మార్చుకుంది. ఓ పెద్ద తుఫాన్ చుట్టేసింది. ఆ అలల తాకిడికి తట్టుకోలేక వారి పడవ తలకిందులైంది. మిగిలినవారు అందరూ అలల తాకిడికి ఎక్కడెక్కడికో కొట్టుకుపోయారు. చివరికి రవీంద్రనాథ్ ఒక్కడే మిగిలిపోయాడు.

ఒకవైపు తుఫాను, మరోవైపు ఒంటరితనంతో గుండె చిక్కబట్టుకున్నా, రవీంద్రనాథ్ భయపడలేదు. వృత్తిరీత్యా చేపలు పట్టే వ్యక్తిగా నీటితో అతనికి పరిచయం ఎక్కువ. ఆయన తన ప్రయత్నాన్ని వదల్లేదు. ఈదడం ప్రారంభించాడు.

పైకి ఆకాశం, కింద సముద్రం – గంటలు కాదు, రోజులు గడిచిపోయాయి. తిండి లేదు. తాగడానికి నీరు లేదు. బతకాలనే ఆకాంక్ష ఒక్కటే అతనికి బలం ఇచ్చింది. వర్షం వచ్చినప్పుడు వర్షపు నీటితో గొంతు తడుపుకోవడమే ఒక్కటే ఆశ.

చావు దరిచేరినప్పటికీ, అతని ధైర్యమే అతన్ని నిలబెట్టింది.

ఐదవ రోజు – "ఎంవి జవాద్" అనే బంగ్లాదేశ్ నౌక దూరంగా కనిపించింది. నౌక కెప్టెన్ దూరంగా ఎవరో చేతులు ఊపుతున్నట్టు గమనించాడు. జాగ్రత్తగా చూస్తే, ఒక వ్యక్తి ఈత కొడుతూ వస్తున్నట్టు కనిపించింది.

ఆ కెప్టెన్ వెంటనే ఒక లైఫ్ జాకెట్ విసిరాడు. కానీ రవీంద్రనాథ్ దాన్ని పట్టుకోలేకపోయాడు. అయినా కెప్టెన్ తన ప్రయత్నాన్ని వదలలేదు. అక్కడ సరిహద్దులు, మతాలు, కులాలు ఏమి గుర్తుకు రాలేదు – మానవత్వమే ముందుకు నడిపింది.

కొంత దూరంలో మళ్లీ రవీంద్రనాథ్ కనపడాడు. ఈసారి కెప్టెన్ మరోసారి లైఫ్ జాకెట్ విసిరాడు. రవీంద్రనాథ్ దాన్ని పట్టుకొని నౌకను చేరగలిగాడు.

అతన్ని క్రేన్ సహాయంతో మెల్లగా నౌకలోకి చేర్చారు. అప్పటికే అతను బాగా అలసిపోయి ఉన్నాడు. నౌకలోకి వచ్చిన వెంటనే నావికులు అందరూ ఆనందంతో గట్టిగా అరవడం ప్రారంభించారు. ఒక్క మనిషిని కాపాడగలిగామని కాదు – మానవత్వాన్ని కాపాడగలిగామని భావించారు.

ఇది కేవలం ఒక మనిషి జీవితాన్ని కాపాడడం మాత్రమే కాదు – మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం.

ఒక మనిషి పట్టుదల, మరో మనిషి కారుణ్యం ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తాయని ఈ ఘటన నిరూపించింది.
ఈ వీడియోను ఆ నౌకలోని ఒక నావికుడు చిత్రీకరించి ప్రపంచానికి తెలియజేశాడు.

5 months ago | [YT] | 3