Mana Amaravati 360° Updates

మన అమరావతి… మన గర్వం! 🇮🇳✨
ఈ ఛానెల్‌లో అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల 🏙️ తాజా వార్తలు 📰, రియల్ ఎస్టేట్ హాట్ అప్‌డేట్స్ 🏡, కొత్త ప్లాట్లు 🏞️, ఇండ్లు 🏠, రెంటల్ ఇళ్ళు 📦 మరియు అభివృద్ధి పనులపై 🔨🌆 ప్రత్యక్ష సమాచారం అందించబడుతుంది.

ప్రతి రోజు కొత్త కొత్త అప్డేట్స్ 📢, ప్రత్యేక విశ్లేషణలు 🔍, అభివృద్ధి పనుల తాలూకు నిజమైన కవరేజ్ 🎥, అలాగే మన అమరావతి భవిష్యత్ ఎలా ఉండబోతోందో 🌟 తెలుసుకోండి.

👉 మీరు ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నారా? 📄
👉 రెంటల్ హౌస్ వెతుకుతునారా? 🏘️
👉 రాజధాని అభివృద్ధిపై ఆసక్తి ఉందా? 📈

అయితే… ఈ ఛానెల్ మీకోసం! 💯

ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి ✅, బెల్ ఐకాన్ నొక్కండి 🔔 — మన రాజధాని అప్‌డేట్స్ మీ మొబైల్‌లోకి 📲 వెంటనే!

మన అమరావతిని మనమే అభివృద్ధి చేద్దాం! 🌿🏙️



Mana Amaravati 360° Updates

🚍 ప్రజారాజధానిలో కాలుష్యరహిత రవాణా ప్రారంభం! 🌿

మన అమరావతిలో మరో అద్భుతమైన అడుగు ముందుకి! 💚
మంగళగిరి డిపోకు 50 ఎలక్ట్రిక్ బస్సులు వచ్చాయి⚡
ఇకపై రాజధాని ప్రాంతంలో పర్యావరణహిత రవాణా అందుబాటులోకి! 🌱

✅ కాలుష్యం తగ్గింపు
✅ ఆధునిక సౌకర్యాలు
✅ ప్రజలకు సురక్షితమైన ప్రయాణం

👉 ఇది అమరావతి అభివృద్ధికి కొత్త మైలురాయి!
#manaamarvati360updates
#Amaravati #ElectricBuses #GreenCity #PrajaRajadhani #CleanTransport #APCRDA

1 month ago | [YT] | 6

Mana Amaravati 360° Updates

అమరావతిలో APCRDA కొత్త భవనం ప్రారంభం – 13 అక్టోబర్ 2025
అమరావతి నగరంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA) యొక్క నూతన భవనం 2025 అక్టోబర్ 13న ఘనంగా ప్రారంభమైంది. ఈ భవనం ఆధునిక సదుపాయాలతో, స్మార్ట్ సిటీ కాన్సెప్ట్‌కి అనుగుణంగా నిర్మించబడింది. రాష్ట్ర అభివృద్ధి దిశగా ఇది ఒక కొత్త మైలురాయిగా నిలవనుంది.

👉 మరిన్ని అమరావతి అప్‌డేట్స్ కోసం మా చానెల్ “మనా అమరావతి 360° Updates” ను సబ్‌స్క్రైబ్ చేయండి.
#APCRDA #Amaravati #AmaravatiUpdates #ManaAmaravati360 #APCapital #AndhraPradeshDevelopment #CRDA #AmaravatiNews #AmaravatiBuildings #AmaravatiOpening #TeluguNews

2 months ago | [YT] | 5

Mana Amaravati 360° Updates

విశాఖపట్నంలో భారీగా పెట్టుబడులు – ఐటీ, డేటా సెంటర్ రంగాల్లో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో ముందుకు తీసుకెళ్లే దిశగా విశాఖపట్నం కీలకంగా మారుతోంది. గత ప్రభుత్వ కాలంలో పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయినప్పటికీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని తిరిగి రాష్ట్రానికి ఆకర్షించడంతో పాటు కొత్త పెట్టుబడులను కూడ తెచ్చేందుకు అడుగులు వేస్తోంది.

ఈ క్రమంలో ఒకే రోజు విశాఖలో ఐదు ప్రముఖ కంపెనీలకు పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతులు లభించాయి. ఈ సంస్థలు కలిపి దాదాపు 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నాయి.

మధురవాడ ఐటీ సెజ్‌లో సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్ కు ఎకరా రూ. కోటి చొప్పున 3.6 ఎకరాలు కేటాయించారు. ఈ సంస్థ 550 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు పరదేశిపాలెంలో ఎకరా రూ. 50 లక్షల ధరతో 25 ఎకరాలకు ప్రాథమిక ఆమోదం లభించింది. మొత్తం 15,266 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ డేటా సెంటర్ రూపుదిద్దుకోనుంది. దీనివల్ల 600 మందికి ఉపాధి లభించనుంది.

సత్వ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు మధురవాడలో ఐటీ, రిటైల్, రెసిడెన్షియల్, డేటా సెంటర్లు వంటి విభాగాల కోసం ఎకరా రూ. కోటిన్నర ధరతో 30 ఎకరాలు కేటాయించారు. ఈ సంస్థ 1,500 కోట్ల రూపాయల పెట్టుబడితో 25,000 మందికి ఉపాధి కల్పించనుంది.

ANSR గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు విశాఖ ఐటీ సెజ్‌లో రెండు ప్రదేశాల్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సిటీ స్థాపన కోసం ఎకరా రూ. 99 పైసల ధరతో 10.29 ఎకరాలు కేటాయించారు. సంస్థ పెట్టబోయే 1,000 కోట్ల పెట్టుబడితో 10,000 మందికి ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయి.

4 months ago | [YT] | 4

Mana Amaravati 360° Updates

మూడేళ్లలో అమరావతి తొలి దశ నిర్మాణం పూర్తి – మరో 34,964 ఎకరాల భూసమీకరణకు అనుమతి

సీఆర్డీఏ (CRDA) 50వ అధికారి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అమరావతి అభివృద్ధికి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రెండవ దశ అభివృద్ధికి 13 గ్రామాల పరిధిలో 34,964 ఎకరాల భూమిని సమీకరించేందుకు ఆమోదం లభించింది.

ఈ భూముల్లో

పట్టాభూమి – 26,369.5 ఎకరాలు

ప్రభుత్వ భూమి – 5,207.42 ఎకరాలు

మిగిలినవి – ఎసైన్డ్ భూములు, ఇతర కేటగిరీలు.


ఈ భూసేకరణ కోసం 16 ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 16 మంది డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లతో కూడిన బృందాలు నియమించనున్నారు.


---

విశిష్ట ప్రాజెక్టులకు భూసేకరణ

ఈ భూముల్లో ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేటాయింపులు చేయనున్నారు:

5,000 ఎకరాలు – అంతర్జాతీయ విమానాశ్రయం

2,500 ఎకరాలు – అంతర్జాతీయ క్రీడా నగరం

2,500 ఎకరాలు – స్మార్ట్ ఇండస్ట్రీస్


ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించగా, రైతులు భూసమర్పణకు అంగీకారం తెలిపారు. గతంలో అమలు చేసిన భూసమీకరణ ప్యాకేజీనే ఈ మలివిడతకూ వర్తించనుంది. మొదటగా 20,494 ఎకరాల భూమిని సమీకరించేందుకు సీఆర్డీఏ ఆమోదమిచ్చిందని మంత్రి నారాయణ తెలిపారు.


---

పీపీపీ ద్వారా అభివృద్ధి ప్రాజెక్టులు

రాజధానిలో 58 ఎకరాల్లో పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానంలో నివాస మరియు మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుల కోసం టెండర్లు పిలవడానికి కూడా భేటీలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


---

సంస్థలకు భూకేటాయింపులు – కేంద్రంతో చర్చలు

రాజధానిలో కొత్తగా 7 సంస్థలకు 32.40 ఎకరాలు భూమి కేటాయించారు. 2014-19 మధ్యAlready భూములు కేటాయించిన 6 సంస్థలకు స్వల్ప సవరణలతో కేటాయింపులు కొనసాగించనున్నారు.

అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధానిలో అన్ని ప్రాజెక్టులు నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పనులలో ఆలస్యం జరిగితే సంబంధిత సంస్థలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని చెప్పారు.

5 months ago | [YT] | 6

Mana Amaravati 360° Updates

అమరావతిలో భూ కేటాయింపులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతిలో అభివృద్ధి చర్యలకు సంబంధించి ప్రభుత్వం భూ కేటాయింపులపై కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు వివిధ సంస్థలకు భూమి కేటాయింపు జరిగిందని అధికారికంగా ప్రకటించారు.

ఈ క్రమంలో, బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (BITS) కు 70 ఎకరాల భూమిని కేటాయించారు. అలాగే, ఐటీ రంగంలో వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని, అమరావతిలో ఐటీ టవర్ నిర్మాణం కోసం ఎల్ అండ్ టీ సంస్థకు 10 ఎకరాలను కేటాయించారు.

ఆరోగ్య రంగంలో మెరుగైన సేవలను అందించేందుకు, ఆస్పత్రి, మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ (ESIC) కోసం 25 ఎకరాల భూమిని కేటాయించారు. అంతేగాక, హడ్కో హ్యాబిటాట్ సెంటర్ ఏర్పాటుకు 8 ఎకరాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు, గతంలో భూముల కోసం దరఖాస్తు చేసిన 13 సంస్థలకు కేటాయింపులను రద్దు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే, భవనాల నిర్మాణం కోసం భూములు అభ్యర్థించిన 16 సంస్థలకు, కొత్తగా స్థలాల మార్పులతో భూములను కేటాయించారు. మైస్ హబ్ కోసం కేటాయించిన 42 ఎకరాల భూమిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవే కాకుండా, అమరావతిలో ప్రభుత్వ రంగ సంస్థ IRCTC బడ్జెట్ హోటల్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను మంత్రివర్గ ఉపసంఘం సమీక్షించి, తదుపరి చర్యల కోసం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రభుత్వం భూములు పొందిన సంస్థలకు నిర్దేశిత గడువు విధించింది.

ఈ నిర్ణయాలపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారికంగా జీవో జారీ చేసినట్లు సమాచారం.

9 months ago | [YT] | 25

Mana Amaravati 360° Updates

రెండు రోజుల్లో ముహూర్తం ఖరారు అట్టహాసంగా ప్రారంభించనున్న ప్రభుత్వం రూ.40 వేల కోట్ల పనులకు టెండర్లు ఖరారు.


రాజధానికి మంచి రోజులొచ్చాయి. గత ఐదేళ్లుగా నిలిచిన నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. దీనికి ఒకటి, రెండు రోజుల్లో ముహూర్తం ఖరారు చేయనున్నారు. ఈనెల 12 నుంచి 15లోపు పనులు ప్రారంభించనున్నారు. కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

9 months ago | [YT] | 4