హలో నమస్తే 🙏🙏హాయ్ 👋 మా ఊరు బాపట్ల జిల్లా చిన్నగంజాం.. నాకు భగవంతుడు అంటే భక్తి 🙏🙏 పిల్లలు ప్రకృతి అంటే చాలా ఇష్టం మా ఊరిలో పురాతన శ్రీ సీతారామస్వామి ఆలయం అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి దయచేసి అందరూ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ప్రార్థిస్తున్నాను 🙏🌹


Jai Sriram

శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏🙏🌹🌹🚩🚩
ఈరోజు అనగా 3.1.2026 శనివారం ఆరుద్ర నక్షత్రం శివ ముక్కోటి శివ ముక్కోటి మరియు ఆరుద్ర నక్షత్రానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాము

ముందుగా శివ ముక్కోటి అంటే ఏమిటో తెలుసుకుందాము
హిందూ సాంప్రదాయ ప్రకారం మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు శివ ముక్కోటి అని పిలుస్తారు వైకుంఠ ఏకాదశిని హిందువులు ఎలా జరుపుకుంటారు ఆ మహాదేవ దేవుడైన శివుని కి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రోజును శివ ముక్కోటి గా జరుపుకుంటారు..

ఆరుద్ర అంటే ఏమిటి తెలుసుకుందాము
ఆరుద్ర అనేది జ్యోతిష్య శాస్త్ర ప్రకారము 27 నక్షత్రాలలో 5వ నక్షత్రాన్ని ఆర్ద్ర /ఆరుద్ర నక్షత్రంగా చెప్పబడింది ఈ నక్షత్రం మహాదేవ దేవుడు శివుడి నక్షత్రంగా చెప్పబడింది ఆరుద్ర అంటే తడి అనియు దయతో కూడినది అని అర్థం. ఆ మహాదేవ దేవుడు ఈ నక్షత్రం రోజునే ఆవిర్భవించాడని భక్తులు విశ్వసిస్తారు

శివ ముక్కోటి ఈ పవిత్రమైన రోజు ఆ మహాదేవ దేవుడిని దర్శించుకుంటే ముక్కోటి దేవతల దర్శనం చేసుకున్నంత ఫలితం అని పురాణాలలో చెప్పబడింది

తమిళనాడులోని చిదంబరం వంటి క్షేత్రంలో ఆ మహాశివుడికి నటరాజ రూపం లో ఉన్న శివుడు ఆనంద తాండవం చేసిన రోజు ఇదే అందుకే దీనిని ఆరుద్ర దర్శనం అని కూడా అంటారు

శివుడు అనంతమైన జ్యోతిర్లింగంగా ఉద్భవించిన రోజున కూడా దీనిని భావిస్తారు

ఈ ఏడాది 3.1.2026 సంవత్సరం శివాలయాలను భక్తులు దర్శించుకోవడానికి ప్రత్యేక పూజలు చేయించుకోవడానికి ఈరోజు ఆరుద్ర నక్షత్రం శివ ముక్కోటి చాలా శ్రేష్టమైనది ఈరోజు మహా దేవదేవుడికి అభిషేకం చేసి ఆ పవిత్ర జలాన్ని స్వీకరిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి
హర హర హర హర మహాదేవ్ 🙏🙏🌹🌹🚩🚩

1 week ago (edited) | [YT] | 0

Jai Sriram

ఆంజనేయ స్వామి వారికి సంవత్సరంలో మూడు ముఖ్యమైన పండుగలు హిందువులు నిర్వహిస్తారు
(1) చైత్ర పౌర్ణమి నాడు హనుమాన్ విజయోత్సవం
(2) వైశాఖ బహుళ దశమినాడు హనుమజ్జయంతి
(3)మార్గశిర శుద్ధ త్రయోదశి రోజు (అనగా డిసెంబర్ 3/12/2025వ తేదీ ఈరోజు )
సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడైన హనుమంతుని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన వ్రతాన్ని ఆచరించడం మనకు శ్రేయస్కరం. మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున హనుమంతుని ఆరాధిస్తే స్వామి వారి అనుగ్రహం లభిస్తుందని ఆపదలు గ్రహ బాధలు రోగ పీడలు శత్రు బాధలు తొలగుతాయి. సకల సంపదలు సుఖశాంతులతో తులతూగుతారు
వనవాసం లో ఉన్న కాలంలో సాక్షాత్తు శ్రీ రామచంద్రుడు సుగ్రీవాదులతో తో కలసి పంపా తీరాన హనుమద్ వ్రతం ఆచరించి ఆ తరువాత లంకపై వానరసేనతో కలసి దండెత్తి రావణ సంహారం చేయగలిగారు. అర్జునుని జెండాపై పర్యవేక్షకుడు అయి హనుమంతుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి ఎన్నో ఆపదల నుంచి గట్టెక్కించి విజయాన్ని చేకూర్చాడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు రాజ్యం దక్కింది
🎋🌲🙏 హనుమత్ స్తోత్రం
మనోజవం మారుత తుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీ రామ దూతం శిరసా నమామి
🙏 బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం మరో గతా
అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్
పై రెండు శ్లోకములు హనుమంతుని స్మరించిన మాత్రానే హనుమంతుడు ఎప్పుడు రక్ష గా ఉంటాడు
మరి ముఖ్యంగా చిన్న పిల్లలకు ఈ రెండు శ్లోకములు నేర్పటం వారి చేత రోజు చదివించటం ఎంతో శ్రేయోదాయకం
జై హనుమాన్ 🙏🙏🌹🌹🌲🎋🍌🍌

1 month ago | [YT] | 4

Jai Sriram

అందరికీ నమస్కారం 🙏🙏 తిరుపతి లో జరిగిన SSF (సమరసత సేవా సమితి) సమావేశంలో 60 మంది మఠాధిపతులు తో సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తూ 2025 నాటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ ఇవే మా హార్దిక శుభాకాంక్షలు 🎉💐
దీనిలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు 🙏🙏

1 month ago (edited) | [YT] | 0

Jai Sriram

మహాభారతం భీష్మ పర్వం 25 వ అధ్యాయం మొదలు 42 వ అధ్యాయం వరకు18 అధ్యాయాలు భగవద్గీతగా చెప్పబడింది
ఒక అధ్యాయాన్ని ఒక యోగం అంటారు. 6 యోగాలను కలిపి ఒక షట్క మంటారు.1 నుండి ఆరు అధ్యాయాలను కర్మ షట్క మనియు 7 నుంచి 12 వరకు భక్తి షట్క మని 13 నుండి 18 వరకు గల అధ్యాయాలను జ్ఞాన షట్కమని అంటారు
ఒక్క భగవద్గీత చదివితే చాలు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి గీతోపదేశం ఎందుకు చేయవలసి వచ్చిందో రెండవ అధ్యాయం లోనే మనకి స్పష్టం చేశాడు మనకు కూడా ఆ విషయం స్పష్టమవుతుంది..
"క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యకోత్తిష్ట పరంతప"
క్షుద్రమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని వీడమని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని హెచ్చరించడం జరిగింది ఈ హృదయమే అన్ని ఆలోచనలకు రాగద్వేషాలకు కేంద్రం బుద్ధి స్థితిలో ఆలోచన ఉంటుంది తర్కం పనిచేస్తుంది హృదయం దగ్గరికి వచ్చేసరికి భావోద్వేగాలు ఆశా పాశాలు మాయ మొహాలు అడుగు ముందుకు వేయకుండా సంకెళ్లు వేస్తాయి. అందుకే హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టమని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని హెచ్చరించి తర్వాతనే గీత బోధ ప్రారంభించాడు.
మహాభారతంలో భగవద్గీత ఒక భాగమైనా కూడా భగవద్గీతకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక్క భగవద్గీత చదివితే ఎన్నో పురాణ ఇతిహాసాలకు సమానం ఒక్క భగవద్గీత చదివితే చాలు జీవిత పరమార్ధం తెలుస్తుంది జై శ్రీకృష్ణ
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🌹🌹

1 month ago (edited) | [YT] | 0

Jai Sriram

జై శ్రీరామ్ 🙏 🙏 🌹 🌹 🚩 🚩
పోలి స్వర్గం కథ ఇది అందరికీ తెలిసినదే పోలి అనే ఒక ఇంటి ఆడపడుచు కార్తీకమాసం నెల రోజులు ఆమె భగవంతుడు దగ్గర ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా దీపారాధన చేయడం వలన స్వర్గం నుండి
దేవతలు వచ్చి ఆమెను స్వర్గానికి స్వయంగా తీసుకువెళ్లారు.. అంతేకానీ పోలీ స్వర్గానికి మనం పంపడం లేదు.. పోలీ స్వర్గం రోజున దగ్గరలో నది/ కాలువ /వద్దకు వెళ్లి అరటి దొప్పల లో దీపాలు విడుస్తారు.. దగ్గరలో అలా లేని వాళ్ళు వారి వారి ఇళ్లలోనే వెడల్పాటి గిన్నె లేక బేసిన్ లో నీరు పోసి అరటి దొప్పల లో షదీపాలను విడవటం సాంప్రదాయం..అది అనాదిగా వస్తున్నది.. ఈ సాంప్రదాయం ఆచార వ్యవహారాలు వారి వారి ప్రాంతాలను బట్టి ఉండవచ్చు ఓం నమశ్శివాయ హర హర హర మహాదేవ శంభో శంకర శ్రీ మాత్రే నమః 🙏🙏🌹🌹🚩🚩

1 month ago (edited) | [YT] | 1

Jai Sriram

రాములోరి కల్యాణంలో సహపంక్తి భోజనాలు

9 months ago | [YT] | 0

Jai Sriram

జైశ్రీరామ్ 🙏🙏🌹🌹 నాలుగు మంచి మాటలు విందాం ఆచరించడానికి మన ప్రయత్నం అవసరం ఏదైనా ప్రయత్న పూర్వకంగా జరిగితేనే
అనుభవంలోకి వస్తుంది

9 months ago (edited) | [YT] | 0

Jai Sriram

జై శ్రీమన్నారాయణ 🙏🙏🌹🌹శ్రీ విశ్వ వసు నామ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా చిన్నగంజాం గ్రామంలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి అభిషేకం ప్రతి సంవత్సరం కన్నుల పండుగ వాతావరణం లో జరుగుతుంది.. సుగంధ ద్రవ్యాల తో శ్రీ స్వామివారికి దేవేరులు కు జరిగే అభిషేకం దృశ్యం వీక్షించడానికి రెండు కళ్ళు సరిపోవేమో అనిపిస్తుంది

9 months ago | [YT] | 1

Jai Sriram

SSF ( సమరసత సేవ ఫౌండేషన్) ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమి రోజున రాత్రి 7 గంటలకు అన్ని దేవాలయాల్లో తర బేధం లేకుండా సామూహిక హారతులు ఇవ్వటం జరుగుతున్నది.. ఆ సందర్భంగా ఈ రోజు పౌర్ణమి శుక్రవారం రాత్రి 7 గంటలకు మహిళలందరూ కలిసి బాపట్ల జిల్లాలో సామూహికంగా దేవాలయాల్లో హారతి ఇవ్వటం
జరిగినది జైశ్రీరామ్ 🙏🙏🌹🌹

10 months ago | [YT] | 1