అందరికీ నమస్కారం. . .
చానల్ లో పోస్ట్ చేసే సమాచారం అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. . .
వీడియోలకు సంబంధించిన మరింత సమాచారాన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అందిస్తున్నాను.గమనించగలరు అలానే మీకు ఇంకేమైనా వీడియోలకు సంబంధించి సందేహాలు ఉంటే కామెంట్ box లో కొంచం వివరంగా అడగగలరు.
🙏🙏🙏 జై శ్రీ రామ్🙏🙏🙏
please like 👍 share comment and subscribe 🔔


Vaayu Putra

పౌష పౌర్ణమి - 2026 జనవరి 03

1. శనివారం, ఆర్ద్ర నక్షత్రం, పౌర్ణమితిధి, శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు.

2. ఈ రోజున శివుడు మిగతా దేవతలతో కలిసి ఆకాశం ద్వారా ఉత్తర ద్వార దర్శనం ఇస్తారని నమ్మకం,

3. తెలిసి తెలియక చేసిన పాపాలనుతొలగించుకుని, సంపదలను వృద్ధి చేసుకునేందుకు మార్గాలను సుగమం చేసుకునే శక్తివంతమైన రోజు.

4. సత్యనారాయణ స్వామి పూజకు అనుకూలమైనరోజు.

5. శివునికి పాలు నీరుతో అభిషేకం చేయాలి.

6. ప్రదోషకాలంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి లను పూజించాలి.

7. శనివారం కావడంతో శని బాధలు తొలగడానికి నవగ్రహాలను పూజించాలి.

8. చంద్రునికి అర్ఘ్యం సమర్పించి" ఓం సోమాయ నమః " మంత్రాన్ని చదువుకోవాలి,

6 days ago | [YT] | 788

Vaayu Putra

ముక్కోటి ఏకాదశి : 2025 డిసెంబర్ 30
వికుంఠం' అనే పదానికి 'విష్ణులోకం' అనే అర్థాన్ని చెబుతాయి నిఘంటువులు. ఆ విష్ణులోకంలో ఉండేవాడు కాబట్టి- శ్రీమన్నారాయణుడికి ‘వైకుంఠుడు' అనే పేరు స్థిరపడింది. నిజానికి వికుంఠం అనేది అత్యున్నత ఆధ్యాత్మిక సాధనకు ఫలితంగా లభించే లోకోత్తర అనుభూతి. వికుంఠుడైన మనిషిలోని దైవత్వానికి స్థావరమే-వైకుంఠం. కుంఠుడు అనే మాటకు మూర్ఖుడని అర్థం. చెడు పట్ల విశేషంగా ఆకర్షితులై, లోకంలో దురాచారాలకు పాల్పడేవారంతా - కుంఠులే! రాక్షమ అంశ మితిమీరినప్పుడు మానవుడు దానవుడు అవుతాడు. మురాసురుడికి అనుచరుడవుతాడు. ఆ మురాసురుణ్ని తుదముట్టించడానికి మనిషిలో ఆవిర్భవించే దైవశక్తికి సంకేతమే- ఏకాదశి!

మహావిష్ణువు దివ్యసంకల్పంలోంచి రాక్షస సంహారం నిమిత్తం ఆవిర్భవించిన స్త్రీ శక్తి స్వరూపాన్ని ఏకాదశిగా సంభావించాయి పురాణాలు. ధ్యాన, ఉపవాస, ఉపాసనాది ఆధ్యాత్మిక సాధనల ద్వారా లోపలి కుంఠుణ్ని సమూలంగా నిర్మూలించిన నాడు హృదయ కమలంలో దైవాంశ విచ్చుకుంటుంది. ఆపరమాద్భుత స్థితికి వికుంఠం అని పేరు. కుంఠుణ్ని సంహరించిన ప్రతి సాధకుడూ వికుంఠుడే. సిద్ధి పొందడం ద్వారా వికుంఠుడికి దక్కేది వైకుంఠం! అందుకే 'వికుంఠ' అనే పుణ్యస్త్రీకి జన్మించడం వల్ల శ్రీహరి వైకుంఠుడయ్యాడంది అమరకోశం.

సాధకుడికి సిద్ధిని అందించే గొప్ప తిథి - ఏకాదశి. అది పదకొండో తిథి. అంటే మనిషిని లోబర్చుకుని ఒక ఆట ఆడించే పది ఇంద్రియాల ప్రభావ తీవ్రతను నియంత్రిస్తుందని అర్థం. అలా ఏకాదశి నియమాలను ఏకాగ్రతతో, శ్రద్ధగా పాటించి, సిద్ధి పొందిన వైఖానసుడి కథను పురాణాలు వివరించాయి. తద్వారా ఆయన తన తండ్రికి స్వర్గాన్ని ప్రసాదించాడని చెప్పాయి. అలా స్వర్గసుఖాలకు కారణమయ్యే ధనుర్మాసంలోని ఏకాదశికి- సౌఖ్య'ద' ఏకాదశి అని, మోక్షప్రాప్తికి దోహదపడుతోందన్న అర్థంలో- 'మోక్ష ఏకాదశి' అనీ ప్రసిద్ధి ఏర్పడింది.
దక్షిణాదిలో వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా వ్యవహరిస్తారు. దేవతల సంఖ్య మూడు కోట్లని, ముప్పది మూడు కోట్లని లెక్కలున్నాయి. నిజానికి కోటి అనేది సంఖ్యాశాస్త్ర సంకేతం కాదు. ఏకాదశ రుద్రులు(11), ద్వాదశ ఆదిత్యులు (12), అష్టవసువులు (8), ఇద్దరు అశ్వినీ దేవతలను కలిపి ఆ సంఖ్య ముప్పది మూడు అంది వేదం. సృష్టి నిర్వహణకు వారందరూ బాధ్యులే. వారినే ముక్కోటి దేవతలుగా పురాణాలు అభివర్ణించాయి. వారంతా ఒక్కటై మహావిష్ణువును సేవించడానికి తరలివచ్చే తిథిని ముక్కోటి ఏకాదశి అన్నాయి. వారికోసం ప్రత్యేకంగా తెరచుకునే ఉత్తర ద్వారం... స్వర్గ ద్వారం. అందుకే అది స్వర్గ ద్వార ఏకాదశి అయింది. మనిషికి జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే మూడు అవస్థలుంటాయి. వాటి అంచుకు 'కోటి' అని పేరు. ఆ అంచులు దాటించి జీవుడికి జీవన్ముక్తిని అనుగ్రహిస్తుందనే విశ్వాసంతో మనవారు దాన్ని ముక్కోటి ఏకాదశి అన్నారు. ఆనాడు ముక్కోటి దేవతలతోపాటు తామూ ఉత్తర ద్వారదర్శనం చేయాలని భక్తులు కోరుకుంటారు...
youtube.com/shorts/_3lWELgXPP...

1 week ago (edited) | [YT] | 622

Vaayu Putra

5.పాశురము

మాయనై మన్ను, వడమదురై మైన్దనై తూయ పెరునీర్ యమునై త్తురైవనై ఆయర్ కులత్తినిల్ తోన్రుమ్ మణి విళక్కై త్తాయైక్కుడల్ విళక్కమ్ శెద్ద దామోదరనై తూయోమాయ్ వన్దునామ్ తూమలర్ తూవిత్తాళుదు వాయినాల్ పాడి, మనత్తినాల్ శిల్టిక్క పోయపిళ్ళైయుమ్ ప్పుగుదరువా నిన్రనవుమ్ తీయినిల్ తూశాగుం శెప్పేలో రెమ్బావాయ్
భావము: మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణములను, చేష్టలను కలవాడు శ్రీకృష్ణుడు. అతడు ఉత్తర మధురకు నిర్వాహకునిగ జన్మించాడు. భాగత్సంబంధము ఎడతెగనట్టి మధురకు మధురకు ప్రభువే. యమునా నదీతీరమందున్న గొల్ల కులమున జన్మించి, ఆ గొల్లకులాన్ని ప్రకాశింపజేసినవాడు. గొల్లకుల మాణిక్య దీపము తల్లి యశోదా గర్భమును కాంతివంతమొనర్చిన దామోదారుడు. వ్రతకారణముగా శ్రీకృష్ణుని చేరి, మనము ఇతరములైన కోరికలేవీ కోరక, పవిత్రమైన మనస్సులతో స్వామికి పూలనర్పించి, నమస్కరించి, నోరార అతని కల్యాణ గుణములను సంకీర్తన చేసి, ధ్యానించిన సంచిత పాపములను, ఇక ఆగామి పాపములను తప్పించుకొనవచ్చును. అతని గుణకీర్తనం చేయటం వలన పాపములన్ని అగ్నిలో పడిన దూదివలె భస్మమై పోయేవే! కావున స్వామియొక్క తిరునామములను అనుసందించుడు.

2 weeks ago | [YT] | 551

Vaayu Putra

4.పాశురము

ఆళిమళైక్కణ్ణా ! ఒన్రు నీకై కరవేల్ ఆళియుళ్ పుక్కు ముగున్దు కొడార్తేరి ఊళిముదల్వ నురువమ్పోల్ మెయికరుత్తు పాళియందోళుడై పర్పనాబన్ కైయిల్ ఆళిపోళ్ మిన్ని, వలమ్బురి పోల్ నిన్రదిరిన్దు తాళాదే శార్ జ్జముదైత్త శరమళైపోల్ వాళవులగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్ మార్గళి నీరాడ మగిళిన్దేలో రెమ్బావాయ్||
భావము: ఓ పర్జన్య దైవమా! వర్షమును కురిపించుటలో లోభత్వమును జూపకుము. నీవు సముద్రములోని నీటి నంతను కడుపు నిండుగ త్రాగుము, అటుపిదప నీవు పైకెగసి, సృష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలె నీ శరీరమునకును ఆ నలుపురంగు నద్దుకొనుము. స్వామి కుడి చేతియందున్న సుదర్శన చక్రము వలె మెరయుము. ఎడమ చేతిలోని పాంచజన్య శంఖమువలె గంభీరముగా గర్జించుము. స్వామి సారంగమను ధనుస్సు నుండి వెడలే అవిరళ శరాలుగ వర్షధారలను కురిపించుము. మేమందరము యీ వర్ష ధారలలో స్నానమాడెదము. లోకము సుఖించునట్లు వర్షించుము మా వ్రతమును నిరాటంకముగ జేసికొనుటకై యిక ఏ మాత్రమూ ఆలసింపక వెంటనే వర్షింపుము స్వామీ!

2 weeks ago | [YT] | 564

Vaayu Putra

మార్గశిర శుక్ర అమావాస్య

2025 డిసెంబర్ 19

అమావాస్య తిథి డిసెంబర్ 19న తెల్లవారుజామున 4: 58 గంటలకు ప్రారంభమై.. మరుసటి రోజు అంటే డిసెంబర్ 20, శనివారం ఉదయం 7:11గంటల వరకు ఉంటుంది.

సూర్యోదయం తిథి ప్రకారం అమావాస్యను డిసెంబర్ 19న జరుపుకుంటారు.
1. మహాలక్ష్మి దేవి కి అత్యంత ప్రీతికరమైన విశిస్టమైన రోజు.

2.పితృకార్యాలకు అత్యంత శక్తివంతమైన రోజు.

3. లక్ష్మీ పూజ, విష్ణు పూజ కు మంచి రోజు.

4. లక్ష్మీ గాయత్రి మంత్రం, విష్ణు సహస్రనామం, పితృ స్తోత్రం చదువుకోవాలి.

5.ఈ రోజున ఆహారం, దుస్తులు, నువ్వులు దానం చేయడం చాలా శుభప్రదం.

6. అప్పులు, ఆర్ధికసమస్యలు ఉన్నవారు మహాలక్ష్మీ పూజ ను చేయడం ఉత్తమం.
మార్గశిర శుక్ర అమావాస్య -ఏ రాశి వారు ఏ దానం చేయాలి,

:

EX : వేరుశనగ, కిడ్నీ బీన్స్, రాగులు, బెల్లం.

వృషభం: పాలు, పెరుగు, జున్ను, వెన్న సంబంధిత వస్తువులు.

మిధునం : పచ్చని కూరగాయలు, పచ్చని పండ్లు, పెసర్లు .

కర్కాటక రాశి: గోధుమ పిండి, శుద్ధి చేసిన పిండి, ఉప్పు, బియ్యం, చక్కెర.

సింహ రాశి : ఎర్ర కంది పప్పు, ఎర్ర మిరపకాయలు, రాగులు, గోధుమలు .
కన్య: గోశాలకు నిధులు, పెసలు, క్యాప్సికమ్స్.

తుల రాశి : ఉప్పు, గోధుమ పిండి, శుద్ధి చేసిన పిండి, తెల్లటి వస్త్రాలు .

వృశ్చికం : రాగులు, చిలగడదుంపలు, ఎర్ర కాయధాన్యాలు, మిల్లెట్స్.

ధనుస్సు: పండిన అరటిపండ్లు, పండిన బొప్పాయిలు, శనగపిండి, పసుపు రంగు దుస్తులు."

మకరం : నల్ల నువ్వులు, అవిసె గింజలు, నల్లఆవాలు

కుంభ రాశి : తోలు పాదరక్షలు, నల్ల దుప్పట్లు, నల్లటి వస్త్రాలను .

మీనం: శనగ పప్పు, మొక్కజొన్న, వేయించిన శనగ పిండి, పండిన అరటిపండ్లు.

3 weeks ago | [YT] | 59

Vaayu Putra

3. పాశురం
ఓంగి యులగళంద ఉత్తమన్ పేర్ పాడి,
నాంగళ్ నం పావైక్కుచ్చాట్రి నీరాడినాల్,
తీంగిన్ఱి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్‍దు,
ఓంగు పెరుం శెన్నెలూడు కయలుగళ,
పూంగువళైప్పోదిల్ ప్పొఱివండు కణ్పడుప్ప,
తేంగాదే పుక్కిరుందు శీర్త ములైపట్రి వాంగ,
క్కుడం నిఱైక్కుం వళ్ళల్ పెరుం పశుక్కళ్,
నీంగాద శెల్వం నిఱైందేలోరెంబావాయ్ ॥ 3 ॥

3 weeks ago | [YT] | 470

Vaayu Putra

2వ పాశురం
వైయత్తు వాళ్’వీర్‍గాళ్ నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయ త్తుయిన్ఱ పరమ నడిపాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళు’తోం మలరిట్టు నాం ముడియోం
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చెన్ఱోదోం
ఐయముం పిచ్చైయుమాందనైయుం కైకాట్టి,
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోరెమ్బావాయ్..
భావము : భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవతులారా! మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యముల వినుడు. శ్రీ మన్నారాయణుని పాదారవిందాలకు కీర్తిస్తాము. అతనితో కల్గిన విశ్లేష సమయాన ఇతరములైన ఎట్టి భోగ్య విషయాలను తలచము. పాలను త్రాగము. కన్నుల కాటుక నుంచము. నేతిని భుజింపము. సిగలో పూలను దాల్చము. అనగా శాస్త్ర విరుద్దములైన ఎట్టి పనులను చేయము. ఒకరిపై చాడీలను చెప్పము. సత్పాత్రదానము చేతము. సన్యాసులకును, బ్రహ్మచారులకును సత్పత్రదానము చేతుము. ఇంకను ఉజ్జీవించు మార్గములేవైన యున్న వాని నెరిగి సంతోషముతో నాచరింతుము. ఇట్లు యీ ధనుర్మాస కాలమంతయు కొనసాగింతుము. ఇదియే మన వ్రతము.

3 weeks ago | [YT] | 405

Vaayu Putra

ధనుర్మాసం నెలరోజులు ధనుర్మాస వ్రతం ఆచరించి ఈ పాశురాలను చదివితే విష్ణు అనుగ్రహం, గోదాదేవి అనుగ్రహంతో అనుకూలమైన జీవిత భాగస్వామి ,ఆర్థిక, ఆధ్యాత్మిక అభివృద్ధి జరుగుతుంది.

మొదటి పాశురం (తిరుప్పావై 1):
మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్
కాళ్ కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్
కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱై దరువాన్ పారోర్ పుగళ
శీర్ మల్గు శీర్ నమ్బై పావైకొల్లావో తో||

అర్థం:
"ఓ అందమైన బాలికలారా, మార్గశిర మాసంలో పౌర్ణమి వచ్చిన ఈ మంచి రోజున, స్నానం చేయడానికి బయలుదేరండి, రండి!".
"మాయాపురిలో (గోకులంలో) సంపదలైన నందగోపుని కుమారుడు, కరుణతో కూడిన కళ్ళుగల, కారుమబ్బుల వంటి శరీరం, ఎర్రని కళ్ళు, చంద్రుని వంటి ముఖం కలవాడు, నారాయణుడు మనకు పారై (భగవత్ సేవ) ఇవ్వగలడు."
"మనమందరం కలిసి నారాయణుని కీర్తిస్తూ, ఆయనను ప్రార్థిద్దాం."
ఈ పాశురం ధనుర్మాస వ్రతంలో మొదటి రోజును సూచిస్తుంది, మరియు దీనితోనే గోదాదేవి భక్తులను వ్రతంలో పాల్గొనమని ఆహ్వానిస్తుంది. ‪@VaayuPutra-c7c‬

3 weeks ago | [YT] | 451

Vaayu Putra

10-12-2025 | మార్గశిర బహుళ షష్ఠి + ఆశ్లేష నక్షత్ర మహా యోగం+బుధవారం

ఈ రోజు సంతాన ప్రాప్తి, వివాహ సమస్యలు, రాహు-కేతు, కాలసర్ప, కుజదోష నివారణకు అత్యంత శుభదినం.

బుధవారం – విష్ణువారి రోజు షష్ఠి - సుబ్రహ్మణ్య స్వామి తిథి ఆశ్లేష నక్షత్రం - ఆదిశేషునికి సంబంధించిన నక్షత్రం

సమీప శివాలయంలో జంట నాగులకు పాలతో లేదా పంచామృతంతో అభిషేకం చేయండి.
“ఓం శ్రీ శరవణ భవాయ నమః” 108 సార్లు జపించండి

సుబ్రహ్మణ్య అష్టకం, విష్ణు సహస్రనామం పఠిస్తే దోషాలు నశిస్తాయి

సంతాన, వివాహ, శాంతి లాభిస్తాయి

జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామిఏనమః 🙏🙏🙏

4 weeks ago | [YT] | 373