Description
Welcome to the official J6tv News YouTube channel.
Interested in global news with an impartial perspective? Want to see behind-the-scenes clips and footage directly from the front-line? Our YouTube channel has all this and more, bringing you specially selected clips from the world's most trusted news source.
Tune into j6TV News for 24 hour news on TV. Check out J6TV News on mobile and download our app for iPhone, Android and Kindle Fire.
j6TV News is Telugu News YouTube Channel Across Telangana and AP Telugu News Gives Covering Political News, Sports News, Entertainment News, Comedy Telugu Web series, Tollywood News, Film News, Movie Promotions, Telugu YouTube Channel 24/7
The official J6TV News YouTube channel is operated by J6MEDIABROADCASTING PVT Ltd

#j6tvnews #j6_tv #j6tvnewschannel



J6tvnews

నిజామాబాద్
* ఆర్మూర్ నందికొండ మండలం అయిలాపురం గ్రామంలో ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు,ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి,స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఈరావత్రి అనిల్,వినయ్ రెడ్డి,తదితరులు

టీపీసీసీ చీఫ్ పాయింట్స్

* ఇచ్చిన హామీల్లో మెజార్టీ పూర్తి చేశాం

* సన్నం బియ్యం మొదలుకొని ఉచిత బస్సు పథకం వరకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని


* కేసీఆర్ ఇబ్బడి ముబ్బడిగా అప్పుల పాలు చేశారు

* రాజకీయాలు ఎన్నికల వరకే

* ఆర్మూర్ ఎమ్మెల్యే బీజేపీ అయిన అభివృద్ధి కి ప్రాధాన్యం ఇస్తున్నాం

* ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు

* అభివృద్ధి కోసం ఒక్క మెట్టు దిగాల్సి వస్తుంది

* ఆర్టీసీ డిపో, ఆర్ అండ్ బి గెస్ట్ గురించి చర్చిస్తాం

* పీసీసీగా నిజామాబాద్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించా

* ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కళాశాల తీసుకొచ్చాం

* లింభాద్రి గుట్ట పై టూరిజం గెస్ట్ హౌస్ కోసం 4 కోట్ల రూపాయలు మంజూరు

* 380 కోట్ల రూపాయలతో టెంపుల్ కారిడార్ రోడ్డు

* సెకండ్ ఫేజ్ లో నిజామాబాద్ కి ఎయిర్ పోర్ట్ వస్తుందని భావిస్తున్నా

* జిల్లా అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కృషి చేద్దాం

1 month ago | [YT] | 0

J6tvnews

గ్రామగ్రామాన పండగలా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

హుస్నాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ లో మహిళలకు ప్రత్యేక యూనిట్లు పెట్టుకోవటానికి అవకాశాలు కల్పిస్తాం

గౌరవెల్లి ప్రాజెక్ట్ పై సుప్రీం కోర్టు కేసు తొలగింది ..హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్య శ్యామలం చేస్తాం

శిల్పారామం లాగ హుస్నాబాద్ అమరవీరుల స్థూపం వద్ద 10 ఎకరాల్లో మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేస్తాం - మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రజా పాలన ప్రభుత్వం కోటి మంది మహిళలకి అందిస్తున్న సారే లు గ్రామగ్రామాన పండగ వాతావరణంలో పంపిణీ జరుగుతుంది. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో కోహెడ, చిగురు మామిడి, సైదాపూర్, ఎల్కతుర్తి భీమదేవరపల్లి,అక్కన్నపేట, హుస్నాబాద్ మండల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో ఆడపడుచులకు బొట్టు పెట్టీ ప్రభుత్వం అందిస్తున్న సారే ను సోదరుడి లాగ అందించారు. గతంలో ఇచ్చిన చీరల కన్నా ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న ఇందిరా మహిళా శక్తి చీరలు చాలా బాగున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉక్కు మహిళా ఇందిరా గాంధీ జయంతి నుండి మహిళలకు మహిళా సంఘాల చేత 18 సంవత్సరాల పైబడిన ప్రతి మహిళకు ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టీ సారే (చీర) అందిస్తున్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని గౌరవెల్లి ప్రాజెక్ట్ కు సుప్రీం కోర్టు లో ఉన్న కేసు అడ్డంకులు తొలగాయని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కాలువల భూసేకరణకు రైతులు మద్దతు తెలపాలని త్వరలోని కాలువల తవ్వకాలు ప్రారంభించి హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్య శ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. హుస్నాబాద్ అమరవీరుల స్థూపం వద్ద శిల్పారామం మాదిరి 10 ఎకరాల్లో మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేసి అన్ని రకాల వస్తువులు అమ్ముకోవచ్చన్నారు.మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందనీ .10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం లో ఒక్క కొత్త రేషన్ కార్డు రాలేదనీ, దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదనీ విమర్శించారు.ప్రజా పాలన ప్రభుత్వంలో నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశామని, సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ,500 కి గ్యాస్ అందిస్తున్నామని ,తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్లాలన్న ఆర్టిసిల్ మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మహిళలకు మహిళా క్యాంటీన్ లు సోలార్ పవర్ ప్లాంట్, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, అగ్రికల్చర్ , సేరికల్చర్ ,హార్టికల్చర్ లలో ఉపాధి అవకాశాలు కల్పిస్తుందనీ మంత్రి పేర్కొన్నారు. హుస్నాబాద్ లోని ఏడు మండలాలు ఏడు మెడికల్ కాలేజీల ద్వారా దత్తత ఇచ్చి మెడికల్ క్యాంపులు పెడుతున్నామన్నారు. ఎంఎన్ జి
,బసవతారకం కాన్సర్ హాస్పిటల్ ద్వారా కాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లు చేస్తామని ,కరీంనగర్ లయన్స్ క్లబ్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. హుస్నాబాద్ ను ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా మార్చమని ప్రతి గ్రామగ్రామాన స్టీల్ బ్యాంక్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మహిళలు తమ పిల్లలకు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వం చేసిన ఇంటింట సర్వే లో ఉన్నత చదువులు చదివిన కుటుంబాలు మాత్రమే ఉన్నత స్థాయిలో ఉన్నాయన్నారు. నియోజకవర్గంలో మొదటి దశలో మంజూరు అయిన 3500 ఇందిరమ్మ ఇళ్లు వేగంగా పూర్తవుతున్నాయని త్వరలో మరో 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని హామీ ఇచ్చారు.అన్ని మండలాల్లో మండల సమైక్య లకు , గ్రామ సమైక్య లకు స్థలాలు సేకరించి భవనాల కోసం నిధులు కేటాయిస్తామని తెలిపారు. ప్రతి మహిళకు ఒక సోదరుడు లాగ మీ అందరికీ అండగా ఉంటామనీ భవిష్యత్ లో మహిళలు ఆర్థికంగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో సిద్దిపేట ,కరీంనగర్, హనుమకొండ కలెక్టర్లు హైమవతి , పమేలా సత్పతి, స్నేహ శబరిష్, అడిషనల్ కలెక్టర్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు,ఇతర ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు.

1 month ago | [YT] | 0

J6tvnews

యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సచివాలయంలో అందజేశాను. పవనన్నతో పాటు, ఇతర మంత్రులకు కూడా పుస్తకాన్ని అందజేశాను. నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాదయాత్ర సఫలీకృతమైందని పవనన్న అన్నారు. ఆనాటి అనుభవాలను కళ్ళకి కట్టినట్లుగా పుస్తక రూపంలో తీసుకురావడాన్ని ప్రశంసించారు. ఈ రోజుకి అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయిందని, గత ప్రభుత్వ పాలన పీడకలను ఇప్పటికి జనం మర్చిపోలేదన్నారు. యువగళం పాదయాత్ర నాటి అనుభవాలను ఈ సందర్భంగా పవనన్నతో పంచుకున్నాను.

7 months ago | [YT] | 2

J6tvnews

యువతకు 20లక్షల ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులతో ఉండవల్లి నివాసంలో చర్చించాను. ఐదేళ్లలో సాధించలేని పెట్టుబడులు 11నెలల్లోనే సాధించాం. ఇప్పటివరకు రూ.9.20 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు, 8.5 లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఎన్ టిసిపి, బిపిసిఎల్, రిలయన్స్, టాటా పవర్ వంటి సంస్థలకు పరిశ్రమల వారీగా ఈడిబిలో ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ (పిఎంయు)లను ఏర్పాటుచేసి, పరిశ్రమ స్థాపించేవరకు నిరంతరం పర్యవేక్షించాలని సూచించాను. బీచ్ టూరిజం అభివృద్ధిపై దృష్టిసారించాలని కోరాను. పెట్టుబడుల ఆకర్షణతో పాటు ఆయా ప్రాజెక్టుల ప్రారంభానికి వేగవంతంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశాను.

7 months ago | [YT] | 0

J6tvnews

గాంధీ భవన్‌లో వరంగల్ పార్లమెంట్ సమీక్ష సమావేశం

* టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన సమావేశం

* ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ గారు

* పాల్గొన్న సీఎం సలహాదారు వేంపల్లి నరేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు

* పార్టీ నిర్మాణం, ప్రభుత్వ పథకాల ప్రచారంపై విశ్లేషణ

టీపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాయింట్స్

* కమిటీల ఆలస్యం వల్ల కార్యకర్తల్లో నైరాశ్యం చెందిన మాట వాస్తవం – త్వరలోనే అర్హతల ప్రకారం పదవులు

* 17 నెలల పాలనలో ఎమ్మెల్యేలు తమ పనితీరును బేరీజు వేసుకోవలసిన అవసరం ఉంది

* రాబోయే స్థానిక ఎన్నికల ఫలితాలు ఎమ్మెల్యేలపై ప్రభావం ఉండే అవకాశం

* మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ ఇంచార్జ్‌గా రావడం మనందరి అదృష్టం

* చురుకైన నాయకుల్ని పీసీసీ అబ్జర్వర్లతో గుర్తించి తగిన ప్రాధాన్యం

* ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత నేతలు, కార్యకర్తలపై ఉంది

* కార్యకర్తలు – నాయకులు ప్రజలతో అనుసంధానంగా పని చేయాలి

* పార్టీకి ప్రభుత్వానికి నాయకులు వారధిగా పనిచేయాలి

* సీనియర్, జూనియర్ల సమన్వయంతో పని చేయాలి

* కులసర్వే, ఎస్సీ వర్గీకరణ, సన్న బియ్యం, భూ భారతి పట్ల ప్రజల్లో మంచి స్పందన

* దేశాన్ని ఆశ్చర్యపరిచే విధంగా పథకాల అమలు

* స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

7 months ago | [YT] | 1

J6tvnews

సింగరేణి సంస్థ చరిత్రలో మొదటిసారి బయటి రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభించడం అభినందనీయమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. దాదాపు 130 ఏళ్లుగా తవ్వకాలు సాగిస్తూ రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న తెలంగాణ సింగరేణి రాష్ట్రం బయట ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకులో తవ్వకాలు ప్రారంభించి భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేసిందని పేర్కొన్నారు.

🔅ఒడిశాలోని అంగుల్ జిల్లాలో సింగరేణి సంస్థ తనకు కేటాయించిన బొగ్గు గనులకు అన్ని అనుమతులు సాధించి అందులో తవ్వకాలు ప్రారంభించడం శుభ పరిణామంగా ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. ఇది తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే సందర్భమని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు సింగరేణి సంస్థకు అభినందనలు తెలియజేశారు.

9 months ago | [YT] | 1

J6tvnews

అత్యుత్తమ పనితీరుతో తెలంగాణ పోలీసు శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు యావత్ పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపారు. 'ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025' ప్రకారం, కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాలలో పోలీసింగ్ విషయంలో తెలంగాణ పోలీసు శాఖ మొదటి స్థానంలో నిలిచింది. టాటా ట్రస్ట్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్ వంటి ప్రఖ్యాత సంస్థలు రూపొందించిన ఈ నివేదికలో తెలంగాణకు గొప్ప గుర్తింపు దక్కడం రాష్ట్ర పోలీసుల కృషికి దక్కిన గౌరవమని, ఈ ఘనత రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి గారు అన్నారు.

శాంతిభద్రతలు కాపాడడం, నేరాలను నియంత్రించడం, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసుల నమోదులో పారదర్శకత చూపడం ద్వారా తెలంగాణ పోలీసులు రాష్ట్రంలో శాంతి, న్యాయం నిలబెట్టడంలో విజయవంతమయ్యారని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.

రాజీలేని కర్తవ్య నిర్వహణతో పోలీసులు ప్రజల్లో నమ్మకాన్ని పెంచారని, ప్రజా పాలనలో ఈ విజయం పోలీసు శాఖ సమిష్టి కృషి ఫలితమని ముఖ్యమంత్రి గారు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి విజయాలను తెలంగాణ పోలీసులు సాధించాలని ఆయన ఆకాంక్షించారు

9 months ago | [YT] | 0

J6tvnews

* పది ఏళ్లలో సాధ్యం కాని గ్రూప్ 1, group2 ఉద్యోగాలు భర్తీ కాంగ్రెస్ ప్రభుత్వం లో సాధ్యం అయిందని అన్నారు..

•• BRS హయాంలో లీకేజీ ల తో నిరుద్యోగులు భయం తో పరీక్ష లకు దూరం అయ్యారని అన్నారు•

•• దేశంలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు అత్యంత పారదర్శకంగా నిర్వహించిన చరిత్ర అన్నారు..

•• ప్రజా పాలన్లో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను వారధులుగా నూతన అభ్యర్థుల పై ఉందని అన్నారు..

•• కాంగ్రెస్ ప్రజా పాలన్లో 54 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత అన్నారు.

•• రానున్న తెలంగాణ లో నిరుద్యోగ అభ్యర్థులకు మరిన్ని ఉద్యోగాల భర్తీ ఉంటుందని అన్నారు..

••• గ్రూప్ 1 రద్దుకు BRS కుట్ర చేసిందని న్యాయం నిరుద్యోగుల వైపు ఉందని రుజువు అయిందని అన్నారు..

•• కేటీఆర్ సుప్రీం కోర్ట్ లో 60 లక్షలు ఖర్చు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్న..

••• కాంగ్రెస్ ప్రభుత్వం నికి రాష్ట ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతచాటాలని నిరుద్యోగ యువతకు పిలుపు నిస్తున్న..

••• నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు..

10 months ago | [YT] | 0

J6tvnews

నూతన ఎమ్మెల్సీ అభ్యర్థులు అద్దంకి దయాకర్

10 months ago | [YT] | 0

J6tvnews

* రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ఆరె కటిక మహసభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

10 months ago | [YT] | 2