FILMY KABURLU Filmy Gossips News entertains the audience with entertaining trolls and memes shortcut reels only FILMY KABURLU (ఫిల్మీ కబుర్లు న్యూస్ వినోదాత్మక ట్రోల్స్ మరియు మీమ్స్ షార్ట్‌కట్ రీల్స్‌తో మాత్రమే ప్రేక్షకులను అలరిస్తుంది.)
PLEASE DO SUBSCRIBE MY CHANNNEL LIKE, SHARE AND COMMENT
THANK YOU 🙏
Filmy Kaburlu
How many people watch this Movie "KINGDOM" of FREEDOM rate of this movie 🍿 review out of 10***
5 months ago | [YT] | 0
View 0 replies
Filmy Kaburlu
2 years ago | [YT] | 1
View 0 replies
Filmy Kaburlu
యువ రచయిత, కవి, నటుడు,
దర్శకుడు హుమాయున్ సంఘీర్ కు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు!
🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
ముల్కనూరు సాహితీ పీఠం, నమస్తే తెలంగాణ నిర్వహించిన కథా పోటీలలో తను రాసిన ' ఇబ్లిస్ ' కథకు ప్రథమ బహుమతి పొందినందుకు కూడా హుమాయున్ సంఘీర్ కు హృదయపూర్వక అభినందనలు !
......
హుమాయున్ సంఘీర్ స్వస్థలం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం గోపాల్‌పేట్. పో ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. రచయితగా, నటుడిగా, దర్శకుడిగా చిత్రసీమలో రాణిస్తున్నారు. కొన్ని సినిమాలకు రచనా సహకారం అందించారు. దర్శకత్వ విభాగంలోనూ పలు సినిమాలు, సీరియళ్లు, లఘు చిత్రాలు, వెబ్ సిరీస్‌లకు పనిచేశారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘కోలాటం’ డాక్యుమెంటరీ చేశారు. 2006లో ఆంధ్రభూమి పత్రికలో ‘ఎటుపాయె’ కవిత మొదటిసారిగా అచ్చయింది. అప్పటినుంచి అక్షరం వేలు పట్టుకొని నడుస్తున్నారు. తను చూసిన జీవితాలను కథలుగా మలుస్తున్నారు. ఈ క్రమంలో 35 కథలు, అనేక కవితలు, వ్యాసాలు రాశారు. 2008లో ఈయన రాసిన మొదటి కథ ‘శ్రేయోభిలాషి’.. చెన్నై నుంచి వచ్చే ‘స్వప్న’ మాస పత్రికలో ప్రచురితమైంది. త్వరలోనే ‘కామునికంత’ పేరుతో కథా సంపుటిని తీసుకువస్తున్నారు. ‘చిత్రసీమలో పూర్తిస్థాయి దర్శకుడిగా రాణించడమే నా కల. ఇందుకోసం కథలు సిద్ధం చేసుకున్నా’ అని చెబుతున్నారు.
......
హుమాయున్ సంఘీర్ కు ముల్కనూరు సాహితీ పీఠం, నమస్తే తెలంగాణ నిర్వహించిన కథా పోటీలలో తను రాసిన ' ఇబ్లిస్ ' కథకు ప్రథమ బహుమతి
(₹ 50,000) లభించింది.
......
గతం లోనూ నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లోనూ "కాముని కంత"
రూ.2 వేల బహుమతి సాధించించారు.
......
' ఇబ్లిస్ ' కథ....ఒకప్పుడు స్వర్గంలో దేవదూతగా ఉంటూ తన అహంభావానికి అక్కడ నుంచి బహిష్కరించబడి సైతాన్ గా భూమి మీదకు వచ్చిన వాడే ఇబ్లిస్. బైబిల్ లో లూసిఫర్ లాగా. కథ ఎపుడెప్పుడు చదవాలని ఉత్సుకత కలిగించే కథాఅంశం.
🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
2 years ago | [YT] | 0
View 0 replies
Filmy Kaburlu
*బలగం*
మానవ సంబందాలను ఆవీష్కరించిన సినిమా.. తెలంగాణ పల్లెల్లో ప్రతీ గడపల్లో ఉండే నిజమైన సంఘటనలను కల్లకు కట్టేలా చూపించిన సినిమా..
బ్రతికున్నప్పుడు బందం విలువ తెలియదు..ముసలోళ్ళయ్యాక గంజి నీళ్ళు పొయ్య తీరదు..కానీ ప్రాణం పోయి పిట్టకు పెడ్తే ''డబల్ రొట్టెలు,కారా పొట్లాలు,కాస్లీ స్కాచ్ మందులు,మటను,బోటి,తలకాయ కూరలు... మనిషికి తృప్తి ఈ మటనూ చికెనుల్లో కాదు మానవ సంబందాల్లో అని పెట్టిన పిట్టకు ముట్టకుండా వాళ్ళ కొడుకులు బిడ్డ కలిసాకే పిట్టముట్టిన కొమురయ్య గాద నేడు ప్రతీ పల్లెల్లో పెద్దోళ్ళ గాద..
తోడబుట్టిన బందం ఎన్ని జన్మలెత్తినా దొరకదు..ఒక తల్లికి పుట్టి పిల్లలుగా ఉన్నప్పుడు కలిసి మెలిసి ప్రాణంగా బ్రతికిన అన్నా తమ్ముళ్ళు,అక్కా చెల్లెల్లు పెద్దవాళ్ళై పెళ్ళిల్లు అవగానే చిన్న చిన్న విషయాలకు,ఆస్థి తగాదాలకు ఏండ్లకు ఏండ్లు కోపాలు పెంచుకుని సొంత అన్నదమ్ముల్లే హద్దులు గీసుకుని బ్రతుకుతున్నారు.. బలగం సినిమాలో జస్ట్ "మూలుగు బొక్క " వల్ల వచ్చిన పంచాయతి 20 ఏండ్లు లచ్చవ్వను తన తల్లిగారింటికి దూరం చేసింది..తన చెల్లిపై ప్రేమ ఉన్నా బావపై ఉన్న కోపంతో ప్రేమను అనిచివేసుకుని మనసులే దుఃఖించిన ఐలయ్యలెందరో ఈ సమాజంలో..ఈ సినిమాలో ఒక్కో పాత్ర ఒక అద్బుతం..మానవ సంబందాలు,బందాల విలువలు,కోల్పోయిన జీవితం అద్బుతంగా తెరకెక్కించిన టిల్లు వేణు మరియు చిత్రబృందానికి, భార్యకు భయపడే మొగుడుగా, ఇటు అన్న బందం వీడలేక సతమతమైతూ అద్బుతంగా నటించిన మధు ,అలాగే ""దయగల్ల పెద్ద కొడుకా ఐలన్నా '' అంటూ సినిమా చివర్లో కన్నీల్లు పెట్టించిన మమ దుగ్గొండి కళాకారులకు అభినందనలు,
హీరో ప్రియదర్శి, వరంగల్ బిడ్డ రచ్చ రవి ,కొత్త అమ్మాయి ఐనా బాగా నటించిన ఆ అమ్మాయికి శుభాకాంక్షలు
ఊరు పల్లెటూరు అంటూ బలరామనరసయ్యో అంటూ చావు ఊరేగింపును కూడా పండగల చేసిన మంచి మ్యూజిక్ అందించిన బీమ్స్ కు అభినందనలు..
అక్క చెల్లెల్లకు విలువనియ్యని అన్నలు తమ్ముళ్ళు,బామ్మర్థులను/బావలను చీప్ గా చూసే బావలు/బామ్మర్దులు,బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులను,బందాలను పట్టించుకోనోళ్ళు సినిమా తప్పక చూడండి..చూసాక ఇంటికెల్లి మీ వాళ్ళతో సంతోషంగ గడుపుతరు..
ఇలాంటి మానవ సంబందాలు పెంపొందించే సినిమాలు మల్లీ మల్లీ రావాలి.. కఠినాత్ములను కూడా కన్నీళ్ళను తెప్పించిన సినిమా..🙏
సమీక్ష : పన్నీరు నరేంద్ర . (@filmykaburlu )
2 years ago (edited) | [YT] | 0
View 0 replies
Filmy Kaburlu
#RRR🔥🔥🔥
2 years ago | [YT] | 2
View 0 replies
Filmy Kaburlu
Latest workout still from #maheshbabu
2 years ago | [YT] | 2
View 0 replies
Filmy Kaburlu
Thank you so much for having me on the show @ABCGMA3
I had an amazing time… and a lovely conversation with @sramosABC @DeMarcoReports , Dr. Jennifer Ashton & the entire team ❤️
Thanks to all the fans who were waiting outside with love 🙏🏼❤️ t.co/MLafXugQvV
ramcharan twitter recent post
2 years ago (edited) | [YT] | 0
View 0 replies
Filmy Kaburlu
సహజ/సంగీత తెలుగు సినిమాకి ఊపిరి పోసిన కళా శాస్త్రవేత్త ఇక లేరు 🙏 #KVishwanath #RIP sir
#telugucinema #tollywood #Legend #filmykaburlu
2 years ago | [YT] | 0
View 0 replies
Filmy Kaburlu
నేడు #వంశీ గారి పుట్టినరోజు సందర్భంగా..
“ వంశీ కథారవం “ విందామా!
ఎ.రజాహుస్సేన్ గారి వ్యాసం
(Abdul Rajahussain)
యమునా తీరంలో……….
అలనాటి కృష్ణుని మోహన మురళీ రవం.!
గోదావరి తీరంలో …………...
ఈనాటి వంశీ సమ్మోహన కథా రవం…!
ఆ కృష్ణుని మురళీ రవానికి గోపికలు మురిసి పరవశిస్తే..,
ఈ వంశీ కథా రవానికి పాఠకులు తడిసి ముద్దవుతున్నారు.
తెలుగు కథ పుట్టు పూర్వోత్తరాల్ని పక్కన బెడితే
వంశీ’ కథ మాత్రం 1975 లో గోదారి తీరంలోపుట్టి
ఇప్పటికి నాలుగు పదులు దాటింది.’నల్ల సుశీల’ కధతో మొదలైన వంశీ కథాప్రస్ధానం.'ఆ నాటివాన
చినుకుల్లో ,’తడిసి,’పసలపూడి’ కథలతో పరవ
శించి,ఆ తర్వాత...” ఆకుపచ్చని జ్ఞాపకాలతో " “దిగువ గోదారికి దిగివచ్చింది.
గోదారి అలల గలలు ఎలావుంటాయో? వంశీ
కథలు అలా వుంటాయి.గోదారి నేపథ్యంలో అక్కడియాస,భాష ముఖానికింత పసుపు రాసు
కొని నుదుట బొట్టు పెట్టుకొని,బుగ్గన చుక్కా,
జెళ్ళో గుండు మల్లెల చెండెట్టుకొని, ముక్కున
మెరిసిపోయే ముక్కెరతో సింగారించుకొని అచ్చ తెలుగుఆడపిల్లలా నిండుగా కనిపిస్తాయి.అందు
కే ఆధునిక కథాపర్వంలో వంశీకథలు ప్రత్యేకంగా
కనబడతాయి.
ఇంతకూ..ఎవరీ వంశీ? సినిమాలు చూసేవారికి డైరెక్టర్ వంశీగా తెలిసినా,కథ,నవలా రచయితగా సాహిత్యాభిమానులకు 'వంశీ’ గా చిరపరిచితుడు.
వంశీ పూర్తి పేరు..#నల్లమిల్లి_వంశీ. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో పుట్టి1975 దాకా ఆవూరి
కి 15 మైళ్ల దూరంలోవున్న పసలపూడి గ్రామంలో పెరిగాడు.
తీసినవి ఇరవై అయిదు సినిమాలు.అన్వేషణ,
లేడీస్ టైలర్,మంచుపల్లకి,శ్రీ కనకమహాలక్ష్మీ డాన్స్ ట్రూప్,ఏ ప్రిల్ 1విడుదల. ఔను..వాళ్ళిద్దరూ
ఇష్టపడ్డారు,గోపిగోపిక గోదావరి “సితార”లాంటి మా మంచి సినిమాల దర్శకుడాయన.
వంశీ రాసిన నవలల్లో ‘మహల్లో కోకిల‘అత్యుత్తమ
మైంది.దీన్నే సితార సినిమాగాతీశాడు.శంకరా
భరణం సినిమాకు అనుసరణగా రాసిన నవల కూడా ఉత్తమమైందే.
పసలపూడి కథలతో వంశీ ఇంటిపేరు మారి
పోయి నల్లమిల్లి వంశీ కాస్తా #పసలపూడి_వంశీ అయ్యాడు. తెలుగు కథకు పసలపూడి కథలు గోదారి అందాల్ని పులిమాయి.
వంశీ బహుముఖ ప్రజ్ఞావంతుడు.సినిమా దర్శకుడిగా,కథ,మాటలు,స్క్రీన్ ప్లే రచయిత
గానేగాక సంగీత దర్శకుడిగా, గాయకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నాడు.
సాహిత్యవేత్తగా రాసిన కథలు, నవలలు,ఫీచ
ర్లు ఇప్పటికే రసికజనామోదం పొందాయి.
వంశీ కవిత్వం రాయలేదుగానీ ఆయన కథలనిండా కవిత్వమే కనబడుతుంది.గోదారి
అందాల వర్ణనల్లో,వెన్నెల,వర్షం,పచ్చని చెట్లు,
కొండకోనల ప్రస్తావనల్లో వంశీలోని భావుకత
ఏ కవి భావుకత కంటే తక్కువకాదు.
వంశీ ..కథలెందుకు చదవాలి?
అవునూ... వంశీ కథలెందుకు చదవాలి?
ఏమిటో ఆయన కథల గొప్ప?
మామూలు భోజనానికీ విందుభోజనానికిీ
మధ్య ఎంత తేడావుందో….చాలామంది కథలకూ...వంశీ కథలకూ మధ్య అంత తేడావుంది.నలుపూ తెలుపూ సినిమాకూ
రంగుల సినిమాకూ మధ్య ఎంత ఎడం
వుందో…సాదాసీదా కథలకూ వంశీ కథలకూ మధ్య అంతే ఎడం వుంది.
అన్నింటికంటే మించి ' నేటివిటీ..' గోదావరి ప్రాంత జనజీవన విధానం,భాషలోఆప్రాంత జనుల శ్వాస లాంటి యాస వంశీ కథలకు
వన్నె తెచ్చింది.గోదారి తీరంలో ఎలాగైతే కొబ్బరి తోటలూ,మామిడి తోపులూ,పచ్చని పంట
పొలాలు కనిపిస్తాయో...వంశీ కథల్లో కూడా పంటకాలువలు,కాలువలు,రామచిలుకలు,
ఏటిగట్లు,పడవలు,లంకలు,లంకతోటలూ కనులపండగ్గా కనిపిస్తాయి.
కథలు అందరూ రాస్తారు.కానీ మంచి కథలు కొందరే రాస్తారు.అలాంటి వారిలో ' వంశీ..'
ముందువరసలో వుంటాడు.కథ రాయడానికి రచయితకు ఒక్క భాషే కాదు..దమ్మూ, నిజా
యితీ వుండాలి.అధారిటీ,అనుభవం,తగినంత స్పందనా వుండాలి.ఇవన్నీ వంశీ లో గంపగుత్త
గా కనిపిస్తాయి.వంశీ కథల్ని చదువుతుంటే..
మనం కూడా గోదావరి తీరంలో విహరించినట్లే వుంటుంది.ఆ ప్రాంత ప్రజల జీవన విధానం,
వారివృత్తులు,ప్రవృత్తులు,ఆచారాలూ,....
అలవాట్లూ...అక్కడి వంటలు,పిండివంటలూ... ఒకటేమిటి...గోదారమ్మ కడుపులో దాచుకున్న నాగరికత,సంస్కృతులతో పాఠకులు తడిసి ముద్దవ్వాల్సిందే.ఆగోదారమ్మ తల్లి ఒళ్లో సేద
తీరాల్సిందే.
వంశీ కథ.!బాపు బొమ్మ …!
అన్నట్లు వంశీ కథకు బాపు బొమ్మ మరో అలం
కారం.బాపూ గారు వంశీ కథలకు వేసినన్ని రంగులబొమ్మలు మరొకరికి వేయలేదు..వంశీ కథలపట్ల వారి మురిపెం అలాంటిది మరి! వంశీ అంటేబాపూరమణలకు అదోరకమైనప్రేమ.వంశీ కథలకు నిలువెల్లా మురిసి ముచ్చటపడి బాపు
గారు గీసినవంశీ చిత్ర రేఖకు రమణ గారు....
ఓచిన్ని లేఖనుకూర్చి అభిమాన వర్షం ఎలా... కురిపించారో చూడండి.
*”వంశీ!
మధుర కథల కంచీ
మధుర భావాల విపంచీ
కధా సుధా విరించీ
నీ కలాన్ని తేనె తెలుగులో ముంచి
రచించీ వినిపించిన
“మా పసలపూడి కథలు”చదివీ
చదివి చదివి చదివీ
అదిరిపోయి
హడలి పోయి
ఆనందించి
పులకించీ
మళ్లీ మళ్లీ తలంచి తరించీ
ఉక్కిరి బిక్కిరై
మక్కువ మిక్కిలై
ఆ కథలగురించి
ఏమి చెప్పినా ఎంతచెప్పినా
మిక్కిలీ తక్కువై
చెప్ప లేక
ఈ చిన్ని లేఖ
. ఈ చిత్ర రేఖ”
పసలపూడి కథల గురించీ ఇంత చెప్పినా…..,
బాపూరమణలకు తృప్తి కలగలేదు.అందుకే...
“పలుకునైనా కాకపోతిని
పసలపూడి కథలలో
కలమునైనా కాకపోతిని
ఆ కధలు కురిసిన సుధలకు”...అంటూ మురిపెంతో తెగబాధ పడిపోయారు.
వంశీ కథలు చదవడానికి ఇంతకంటే గొప్ప సర్టిఫికెట్ అవసరమా?
వంశీ కథ షడ్రషోపేత విందు భోజనం!
ఆరగించాల్సిందేకానీ………...
ముందుగా రుచి అడక్కూడదు.!!
వంశీ కథ గోదారి పై వీచే చల్లని గాలి
అనుభవించాల్సిందే కానీ………….
ఆరా తీయకూడదు.!!
వంశీ కథ మురళీ గానరవం
వినాల్సిందే కానీ…………
చెవులు మూసుకో కూడదు!!
వంశీ కథ సుమధుర కావ్యం
ఆస్వాదించాల్సిందే కానీ…..
ఆనుపానులడక్కూడదు.!!
చివరాఖరుకు చెప్పొచ్చేదేమంటే…
వంశీ కథ చదవడం ఓ ప్రివిలేజ్!!!!
వంశీ కథ 'తలుచుకుంటేనే తన్మయత్వం’
వంశీ గారికి ఆరు పదులు ఎప్పుడో ...
దాటాయిఅయినా ఆయన నేటికీ కుర్రాడే...
వంశీ కథలు చదివినవారికి,చదువుతున్న వారికి
ఆయనంటే ఏమిటో తెలిసిన వారికి ' వంశీ ' ...
ఎప్పూడూ నవ వసంతుడే. కథామృతం తాగుతున్న వారికి వయసుతో పనేముంది?
"ఇంకా ఏవో కొన్ని గుర్తొస్తున్నాయి " కానీ..
మరోసారి చెబుతాను.!!
ఈ పుట్టినరోజు సందర్భంగా... హృదయపూర్వక శుభాకాంక్షలు !! 💐💐💐
3 years ago | [YT] | 0
View 0 replies
Filmy Kaburlu
పూర్తి ప్రవాహంలో #PushpaTheRule రచనలు ❤
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ బి, సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ #అవిగోవారికర్, పోస్టర్ డిజైనర్ #ట్యూనీజాన్ మరియు టీమ్ మొత్తం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
3 years ago | [YT] | 1
View 0 replies
Load more