V7 FOCUS - Telugu


V7 FOCUS Telugu Live is a 24/7 Telugu news & Entertainment channel in Andhra Pradesh and Telangana run by Akhaya Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.

Enjoy and stay connected with us!!
For all top and best news stories happening all around you

SUBSCRIBE: youtube.com/@V7_FOCUS?si=8KBIGc_3Ox1shr_P
► Like us on Facebook:
► Circle us on Instagram: instagram.com/v7_focus?igshid=NjIwNzIyMDk2Mg==
► Follow us on Twitter: twitter.com/V7_focus?t=PRTPSP4liqe3qEShhXrCSQ&…





V7 FOCUS - Telugu

||ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో మొంథా తుఫాను ప్రభావం|#v7focustelugu||
https://youtu.be/3Z_6rb9BaIs?si=Mcrxv...
• గత మూడు రోజులుగా నిరంతర వర్షాలు కురుస్తున్నప్పటికీ, ముందస్తు చర్యలతో ప్రాణనష్టం, ఆస్తి నష్టం లేకుండా నియంత్రణ
• ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం 24×7 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందజేత
• ప్రమాద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అవసరమైన సదుపాయాలు కల్పింపు
• అత్యవసర సేవలను నిరంతరంగా సమీక్షిస్తున్న తహసిల్దార్ ప్రమద్వర
• ప్రజల భద్రత కోసం క్షణక్షణం పరిస్థితిని పర్యవేక్షిస్తున్న పరిపాలన యంత్రాంగం

2 months ago | [YT] | 0

V7 FOCUS - Telugu

మీ నిర్లక్ష్యం విలువ ఒక నిండు ప్రాణం..
||ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి 11 కేవీ తీగలు తగిలి తీవ్ర గాయాలు|మర్లపాడులో ధర్నా|న్యాయం కోసం పోరాటం||#v7focustelugu |
https://youtu.be/NBTCDfCCX-w?si=wwgaI...

పట్టించుకోని యాజమాన్యం..!

దిద్దుపూడి విద్యుత్ ప్రమాదం – ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ప్రాణం కోసం కుటుంబం పోరాటం.
సత్తుపల్లి, అక్టోబర్ 22:

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని చిదిమేసింది.

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం దిద్దుపూడి గ్రామంలో జరిగిన విద్యుత్ ప్రమాదం స్థానికులను విషాదంలో ముంచేసింది.
గ్రామానికి చెందిన జుంజునూరి వెంకటేశ్వరరావు, విద్యుత్ శాఖలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తుండగా డ్యూటీ మధ్యలో 11 కెవి తీగలు తగిలి తీవ్ర గాయాలకు గురయ్యాడు. డ్యూటీ సమయంలోనే జరిగిన ఈ ప్రమాదం — యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనమని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అసలెంజరిగింది..?
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం దిద్దుపూడి గ్రామంలో చోటుచేసుకున్న విద్యుత్ ప్రమాదం గ్రామంలో విషాదాన్ని మిగిల్చింది. గ్రామానికి చెందిన జుంజునూరి వెంకటేశ్వరరావు, విద్యుత్ శాఖలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు.

అక్టోబర్ 10న భూషణం అనే రైతు పొలంలో ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ సరఫరా ఆగిపోయిందని ఫిర్యాదు చేయడంతో, వెంకటేశ్వరరావు కందుకూరు పరిధిలో గల సబ్‌స్టేషన్‌ నుండి లైన్ క్లియరెన్స్ (ఎల్‌సీ) తీసుకుని మరమ్మతు పనులు దిద్దుపూడి గ్రామంలో ప్రారంభించాడు. అయితే పనులు కొనసాగుతున్న సమయంలోనే ఉద్దేశపూర్వకంగానే విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో, 11 కెవి తీగలు తగిలి తీవ్ర గాయాలతో పడిపోయిన వెంకటేశ్వరరావును కుటుంబ సభ్యులు హుటాహుటిన ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతరం హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదంలో రెండు చేతులు తీవ్రంగా దెబ్బతినడంతో ఒక చేయి భాగాన్ని తొలగించాల్సి వచ్చింది. గుండె సమస్య తలెత్తడంతో హార్ట్ సర్జరీ కూడా అవసరమని వైద్యులు తెలిపారు. మొత్తం చికిత్స ఖర్చు సుమారు ₹27 లక్షలు అవుతుందని వైద్యులు అంచనా వేశారు.

వెంకటేశ్వరరావు తండ్రి మాట్లాడుతూ :
“నా కొడుకు డ్యూటీ చేస్తున్నపుడు షాక్ తగిలి ఇలా అయ్యాడు. ఇప్పుడు రెండు చేతులు కాలిపోయాయి, ఒక చేయి తీసేయాల్సి వచ్చింది. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా విద్యుత్ శాఖలో ఎవ్వరూ ఆసుపత్రికి రాలేదు. నా కొడుకు ప్రాణానికి విలువ లేదా?” అని బోరున విలపించారు.

వెంకటేశ్వరరావు అన్న జుంజునూరి రఘు (ఆర్మీ సైనికుడు) మాట్లాడుతూ :
“నేను దేశ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నా. ఇంట్లో మా తమ్ముడు కుటుంబాన్ని చూసుకుంటాడనుకున్నా. కానీ ఈ రోజు వాడే ఇలా అవుతాడని ఊహించలేదు. యాజమాన్యం లైన్ క్లియరెన్స్ ఇచ్చి పనులు చేస్తున్న వ్యక్తిపై విద్యుత్ సరఫరా ఎలా అయ్యింది ?
ఇది ప్రమాదం కాదు — ఉద్దేశ్యపూర్వకంగా, కక్షతో, ఒక ప్రణాళికతో చేసిన పనే!” అని కన్నీటి పర్యంతమయ్యాడు.
“మాకు న్యాయం చేయండి.మా తమ్ముడిని బ్రతికించండి,” అని రఘు వేడుకున్నారు.

గ్రామ ప్రజలు మాట్లాడుతూ —
“విద్యుత్ శాఖ యాజమాన్యం ఉద్దేశ్యపూర్వకంగా చేసిన పని వల్ల ఒక పేద కుటుంబం నాశనమైంది. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా అధికారులు స్పందించకపోవడం మనసు కలిచివేస్తోంది. ప్రభుత్వం ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందించాలి,” అని కోరారు.
ప్రస్తుతం జుంజునూరి వెంకటేశ్వరరావు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కుటుంబం వైద్య ఖర్చుల భారంతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది.

కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రజలు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మర్లపాడులో నిట్టనడిరోడ్డుపై ధర్నాకు దిగారు.

“ఏడీ, లైన్మెన్ గంధం వెంకటేశ్వరరావు, ఆపరేటర్ మాధవరెడ్డి — వీరు వెంకటేశ్వరరావు ఎల్‌సీ తీసుకుని పని చేస్తున్న సమయంలో ఫోన్ కాంటాక్ట్‌లో ఉన్నారా లేదా? అనే విషయంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి,” అని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

3 months ago | [YT] | 3

V7 FOCUS - Telugu

#V7_focus : కోలికపోగు సర్వేశ్వరరావు అనే నేను..!

•నాడు ప్రభుత్వ హాస్టల్స్ లో అవస్థలు పడుతూ విద్యాభ్యాసం!

 • విద్యార్థి దశ నుండే పోరాటాన్ని అలవర్చుకున్న కొలికపోగు!

• విద్యార్థి,యువజన,సామాజిక,కార్మిక రంగాలలో కీలక            పదవులు చేసి వన్నె తెచ్చిన యువ ప్రజా నేత!

• దళిత యువ కార్యకర్తకు పట్టం కట్టిన సీపీఎం! 


సత్తుపల్లి,అక్టోబర్,28, #V7_focus న్యూస్: మండల పరిధిలోని కాకర్లపల్లి గ్రామ దళితవాడలో కొలికపోగు కోటేశ్వరరావు,చిట్టెమ్మ దంపతులకు వెనుకబడిన సామాజికవర్గంలో జన్మించి,అవమానాలు ఎదుర్కొని,కడు పేద కుటుంబంలో కాలే కడుపులుతో 

పస్తులుంటూ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో(హాస్టళ్ళలో) అవస్థలు పడుతూ బాల్యం నుండి సుఖం అంటే ఏమిటో తెలియకుండా 

పట్టుదలతో కార్యదీక్షతో విద్యనభ్యసించిన నేటి తరం డియర్ కామ్రేడ్ కొలికపోగు సర్వేశ్వరరావు సత్తుపల్లి పట్టణంలో ప్రభుత్వ కళాశాలలో ఎస్.ఎఫ్. ఐ.విద్యార్థి సంఘంలో పని చేసి విప్లవ భావాలకు ఆకర్షితులై సమ సమాజ నిర్మాణానికి కంకణం కట్టుకొని 2002 నుండి సీపీఎం అనుబంధ సంఘాలైన ఎస్.ఎఫ్.ఐ.విద్యార్థి సంఘంలో పట్టణ కమిటి నేత నుండి రాష్ట్ర కమిటి సభ్యుడుగా ఎదిగి ఎన్నో విద్యార్థి పోరాటాలలో కీలక పాత్ర పోషించి తనదైన ముద్ర వేసుకొని డి.వై.ఎఫ్.ఐ.యువజన సంఘంలో జిల్లా స్థాయి నేతగా ఆశ్లీల చిత్రాలపై,నిరుద్యోగ యువత సమస్యలపై అలుపెరగని పోరాటాలు నిర్వహించారు.అనంతరం సామాజిక ఉద్యమాలకు,అసమానత,అంటరాని తనం నిర్మూలన కోసం రథసారథిగా నిలిచిన కె.వి. పి.ఎస్. ఉద్యమ నిర్మాణంలో నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించిన నేపథ్యం కలిగి పిన్న వయస్సులోనే వామపక్ష సాహిత్యాన్ని అలవర్చుకున్నాడు.అక్టోబర్ 27 న సత్తుపల్లి పట్టణంలో జరిగిన సీపీఎం పట్టణ మహాసభలో సీపీఎం రాష్ట్ర,జిల్లా నేతల సమక్షంలో సీపీఎం పట్టణ కార్యదర్శి గా దళిత యువ కార్యకర్త అయిన కొలికపోగు సర్వేశ్వరరావు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.దళితులకు,యువకులకు అధిక ప్రాధాన్యతను కల్పిస్తూ,పట్టం గడుతూ సీపీఎం తనదైన శైలిలో నూతన మార్పులతో దుసుకెళ్ళుతుంది.ఎన్నికైన సర్వేశ్వరరావు కు పలు ప్రజా సంఘాల నేతలు,వామపక్ష పార్టీల నేతలు,దళిత ఉద్యోగ సంఘాల నేతలు,విద్యార్థి,యువజన,కార్మిక సంఘాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు.కొలికపోగు మీడియాతో మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని విశ్వాసాన్ని కాపాడుకుంటూ మార్క్సిస్టు కోణంలో ప్రజా పోరాటాలు నిర్వహించే దానికి శ్రమిస్థానని తెలిపారు.

1 year ago | [YT] | 5

V7 FOCUS - Telugu

#V7_focus :

డీఎస్సీ ఫలితాల్లో మెరిసిన పేదింటి యువకుడు


•డీఎస్సీ ఫలితాల్లో ఉపాధ్య ఉద్యోగానికి పర్సా.వేంకట కృష్ణ ఎంపిక

దమ్మపేట ,అక్టోబర్ 9: 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  దమ్మపేట మండలం 

డీఎస్సీలో పేదింటి యువకుడు ఉపాధ్యాయ వృత్తి కి ఎంపికయ్యాడు. రిజిస్ట్రేషన్ నెం: TR202406375172

హాల్ టికెట్ నం: 244952166772 ఎస్ జి టీ ర్యాంక్ 345 తో 51.93 స్కోరుతో అక్కినేపల్లి పంచాయితీకి చెందిన యువకుడు ఓ మెరుపు మెరిశాడు.దమ్మపేట మండలం రంగువారిగూడెం గ్రామానికి చెందిన పర్సా.వేంకట కృష్ణ తండ్రి అప్పారావు,తల్లి నిర్మల కూలికి వెళ్తే గాని ఇల్లుగడవని పరిస్థితి. తన కుటుంబ పరిస్థితి తెలుకొని ఇంటిదగ్గర వుండి ఉదయం పనికి వెళ్తూ రాత్రుళ్ళు చదువుకుంటూ ఖష్టపడ్డాడు. నాకు ఉద్యోగం వస్తుందా అనికూడా వూహించని వెంకట కృష్ణ నీ ఉపాధ్యాయ వుద్యోగం వరిచింది. పర్సా వెంకట కృష్ణ  ఉపాధ్యాయ  ఉద్యోగానికి ఎంపికయ్యాడు.తెలుగు పండిత్ విభాగంలో స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)చేజిక్కించుకున్నాడు. దమ్మపేట మండలలో రంగువారిగూడెం  గ్రామానికి చెందిన యువకుడు పర్సా.వెంకటకృష్ణ ఈ ఉద్యోగానికి ఎంపిక కావడంతో..గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరక్షరాస్యులైన తల్లితండ్రులు అప్పారావు,నిర్మల  దంపతులు తమ కుమారుడిని ప్రయోజకుడిగా చేయాలన్న సంకల్పంతో ఉన్నత చదువులు చదివించారు.తన అన్నయ్య ప్రోత్సాహంతో ఇంటి దగ్గరే ప్రణాళిక బద్ధంగా చదవటంతో మంచి ఫలితాన్ని సాధించగలిగాడు. ఇంటిదగ్గరే వుండి ఉదయం నుండి సాయంత్రం వరకు పనికి వెళ్లి ఇంటికొచ్చి  పట్టుదల,అంకుటిత దీక్షను సడలకుండా లక్ష్యంతో రేయింబవళ్ళు కష్టపడి ఉద్యోగాన్ని సాధించించాడు.దీంతో గ్రామస్తులు, బంధువులు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
www.facebook.com/61561818582579/posts/pfbid0h1HFpY…

1 year ago (edited) | [YT] | 0

V7 FOCUS - Telugu

#V7_focus :జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్న ఆధార్ పార్టీ చైర్మన్ కేశవ్ గౌడ్.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఆధార్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ కంటే కేశవ్ గౌడ్ ఆ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం, భద్రాచలం, పినపాక, అశ్వరావుపేట, ఇల్లెందు తదితర నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులని కలుసుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలోనే ఉన్నందునా నాయకులు, పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళేలా పనిచేయాలని హితబోధ చేస్తున్నారు. జిల్లాలో పార్టీ అభ్యర్థులు గెలిపే ధ్యేయంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, వారు అనుసరిస్తున్న తీరును ప్రజల్లోకి ఎండగట్టి పార్టీ బలోపేతం లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆధార్ పార్టీ చాప కిందనీరులా విస్తరిస్తుందని, గెలుపు గుర్రాల కోసం ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా సీట్లు గెలుస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.

1 year ago | [YT] | 1

V7 FOCUS - Telugu

#v7_focus 

:సత్తుపల్లి ఉద్యోగుల సమస్యలపై డైరెక్టర్ ( పి . పి ) కి వినతి పత్రం

 -బ్రాంచ్ సెక్రటరీ తీగల క్రాంతికుమార్

సత్తుపల్లి జే.వి.ఆర్ ఓసి , కిష్టారం ఓసి , జె.వి.ఆర్ - సి.హెచ్.పి , జె.వి.ఆర్ డిస్పెన్సరీ లలో పని చేసే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మరియు పి.వి.ఎన్  ( సింగరేణి ) కాలనీ మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్ ఆదేశాల మేరకు ఐ.ఎన్.టి.యు.సి ఆధ్వర్యంలో

వెంకటేశ్వర రెడ్డి , డైరెక్టర్ ( ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ ) కి యూనియన్ నాయకులు వినతి పత్రం అందజేశారు.  ముఖ్యంగా సత్తుపల్లి నుండి సుమారు పన్నెండు మిలియన్ టన్నుల ( 12.4 ) బొగ్గు ఉత్పత్తి మరియు రవాణా చేస్తున్న  ఉద్యోగుల సంక్షేమం మరియు పలు సమస్యల పరిష్కారానికై వెంటనే జి.ఎం కార్యాలయం ప్రారంభించాలి. జే.వి.ఆర్ ఓసి , జే.వి.ఆర్ సి.హెచ్.పి , కిష్టారం ఓసి ఉద్యోగులకు ఇన్సెంటివ్ ఇచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలి. సత్తుపల్లి సింగరేణిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 3500 మంది ఉద్యోగుల కుటుంబాలు మరియు భూనిర్వాసితుల కుటుంబాల ఆరోగ్యం విషయమై జే.వి.ఆర్ డిస్పెన్సరీని అన్ని వసతులతో ఏరియా హాస్పిటల్ గా ఆధునికరించాలి. ఉద్యోగులు నివసించే పి.వి.ఎన్ కాలనీ ప్రారంభించి సుమారు మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కమ్యూనిటీ హాల్ , ఓపెన్ జిమ్ , వాకింగ్ ట్రాక్ , సూపర్ బజార్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి.

కాలనీ నుండి ఉద్యోగులు డ్యూటీ కి వెళ్లే రోడ్డు మార్గం ప్రక్కన స్మశాన వాటిక కు ప్రహారీ గోడ ఏర్పాటు చేయుటకు తగు చర్యలు తీసుకోవాలి. పి.వి.ఎన్ కాలనీ సత్తుపల్లి పట్టణానికి శివారులో ఉండటం వలన భద్రతా నిమిత్తం సెక్యూరిటీ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలి.సత్తుపల్లి లో వై - జంక్షన్ వద్ద తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున వై - జంక్షన్ నుండి జే.వి.ఆర్ ఓపెన్ కాస్ట్ వరకు సెంట్రల్ లైటింగ్ తో కూడిన డబుల్ రోడ్డు వేపించుటకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పై సమస్యలపై సానుకూలంగా స్పందించి తొందరలో పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు పంపిస్తామని డైరెక్టర్ ( పి అండ్ పి )  హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఐ.ఎన్.టి.యు.సి బ్రాంచ్ జాయింట్ సెక్రెటరీ నాగ ప్రకాష్ , బాలాజీ ( ఫిట్ సెక్రటరీ , కిష్టారం ఓసి ) , రామారావు ( ఫిట్ సెక్రటరీ , జె. వి. ఆర్ ఓ. సి ) , నాగేశ్వరరావు ( ఫిట్ సెక్రటరీ , జె. వి.ఆర్ - సి.హెచ.పి ) , నాయకులు అశ్వక్ , ఆర్.శ్రీనాథ్ , రామచందర్ , గోపీనాథ్ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

www.facebook.com/61561818582579/posts/pfbid0y729qG…

1 year ago | [YT] | 2

V7 FOCUS - Telugu

#V7_focus :

తెలంగాణ ,వ్యాప్తంగా సెప్టెంబర్ 10 నుండి 17 వరకు వారోత్సవాలు


భూములు పంచింది కమ్యూనిస్టులు త్యాగాలు చేసింది కమ్యూనిస్టులు చరిత్రను వక్రీకరిస్తున్న  బిజెపి


సిపి ఎం సత్తుపల్లి పట్టణ మరియు మండల కమిటీ ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి ఐలమ్మకు ఘన నివాళి అర్పించారు తెలంగాణ ,వ్యాప్తంగా 

సెప్టెంబర్ 10 నుండి 17 వరకు 

వారోత్సవాలు  కార్యక్రమాలు జరుగుతున్నది. అందులో భాగంగా  శ్రీనివాస్ అధ్యక్షతన  

అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు సిపిఎంజిల్లా కమిటీ సభ్యులుజాజిరి శ్రీనివాసరావులు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగసాయుధపోరాటంలో ప్రాణాలను కమ్యూనిస్టులు బలిదానం చేసి తెలంగాణ 
ప్రాంతంలో జాగిర్దారులు భూస్వాముల వద్ద ఉన్న 
లక్షల భూములు గుంజి పేదలకు పంచడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రాంతంలో 4,000 మంది ప్రాణాలను బలిదానం చేసినారు. సాయుధ

 పోరాటం వెట్టిసాకిరి కి దోపిడీకివ్యతిరేకంగా జరిగిన పోరాటం పోరాటంలో తెలంగాణ ప్రజలను అన్ని వర్గాల దోపిడికి పీడనకు 

పీడనకు గురైనారు కానీ పోరాటంతో సంబంధం లేదు బిజెపి పార్టీ సాయుధ పోరాటాన్ని వక్రీకరించే దుర్మార్గమైన పద్ధతికి వడిగట్టిందన్నారు .సాయుధ పోరాటం హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నారు సాయిధ పోరాటం లో అనేకమంది ముస్లింస్ కూడా పోరాటంలో నైజాంకు వ్యతిరేకంగా పోరాడి అమరులైనారన్నారు 

సాయుధపోరాట ఫలితంగానే 

దేశంలో భూ సంస్కరణల చట్టం వచ్చిందన్నారు. కావునచరిత్రను వక్రీకరిస్తున్న బిజెపి తప్పుడు పద్ధతులను ప్రజలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొలికపోగు సర్వేశ్వరరావు, ఐద్వా మండల కార్యదర్శి జాజిరి జ్యోతి, సీనియర్ నాయకులు బాల బుచ్చయ్య, మోరంపూడి వెంకట్రావు, మోరంపూడి వెంకటేశ్వరావు, శ్రీనివాసరావు,సనందన్ రావు, కృష్ణ, ఎలగం రాములు, సైదా ,వలి బాబు, కోటేశ్వరావు, రాము, లక్ష్మీనారాయణ, చంద్రం, నబి, నాగుల్ మీరా, జానీ, మరియు తదితరులు పాల్గొన్నారు

1 year ago | [YT] | 4

V7 FOCUS - Telugu

#V7_focus :


సమస్య మీదే పరిష్కారం నాది 

-పొంగులేటి


• ఆదరించారు అన్ని  నేనౌతా ,

సమస్యను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా,

నేను మీలో ఒకడిని 

-పొంగులేటి

 •  పాస్ బుక్ ఉన్న లేకున్నా రైతుల కి నష్టపరిహారం అందేలా చేస్తాం 

 • కష్టకాలంలో నిర్వాసితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే జారేకి మరియు  నియోజకవర్గ నాయకులు జూపల్లికి పొంగులేటి ప్రశంస

• నిపుణులు పర్యవేక్షణ లో  త్వరిత గతిన ప్రాజెక్ట్ పూర్తి మరమ్మత్తులు చేస్తామని హామీ - పొంగులేటి

•  నీటిపారుదల శాఖలో అవినీతికి మరియు  నిర్లక్ష్యానికి కారకులైన  వారిని ఉపేక్షించేది లేదు -పొంగులేటి 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,జులై 22:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం లో తుఫాను ప్రభావానికి గురైన  మండలం లోని పెద్ద వాగు ప్రాజెక్ట్ వల్ల మరియు తుఫాను ప్రభావానికి పూర్తిగా దెబ్బతిన్న   తెలంగాణలోని రెండు గ్రామాలు వరద ప్రభావానికి గురి అవ్వగా దెబ్బతిన్న ప్రాంతాన్ని  గృహ నిర్మాణ శాఖ మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాజెక్ట్ ఆయకట్టు ప్రాంతాన్ని ఈరోజు స్వయంగా జిల్లా కలెక్టర్ జీతీష్ వి పాటిల్ మరియు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్  మరియు ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రాజెక్ట్ ఏరియా ని సందర్శించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ 

రైతులకు నేను ఉన్న అని భరోసా కల్పించారు.

దెబ్బతిన్న గుమ్మడిపల్లి గ్రామం మరియు కొత్తూరు గ్రామంలో సందర్శించి బాధితులకి అండగా నిలిచి ధైర్యాన్ని నింపారు.

నష్ట నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది.

నిర్వాసితులందరికీ తగు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు.

త్వరలోనే ఇండ్ల మంజూరు కార్యక్రమం జరుగుతుందని ఈ ప్రాంతానికి రావాల్సిన గృహాలకన్నా ఎక్కువ గృహాలను మంజూరు చేస్తానని తెలియపరిచారు. సమస్యను  ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అందరికీ సమన్యాయం చేస్తానని మాట ఇచ్చారు. కొత్తూరు గ్రామంలో ఇటీవల విద్యుత్ ఘాతానికి గురై వ్యక్తి మరణించగా బాధిత కుటుంబాన్ని  పరామర్శించారు.

వారికి అండగా ఉంటానని తెలియపరిచారు. పాస్ పుస్తకం ఉన్నా లేకపోయినా రైతులకు నష్ట పరిహారం అందేల చేస్తానని హామీ ఇచ్చారు.

రైతులకు విత్తనాలను ఉచితంగా ఇస్తామని తెలియజేశారు. చనిపోయిన పశువులకు కూడా లెక్క కట్టి నష్టపరిహారం అందేలా చేస్తానని  తెలియజేశారు.ఇంటిని కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తాను అని తెలిపారు.ఈ కార్యక్రమం లో మంత్రివర్యులు పొంగులేటితో పాటు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే, అశ్వారావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జూపల్లి రమేష్ బాబు, అశ్వరావుపేట మండల యువజన నాయకులు ప్రమోద్ బాబు,అశ్వారావుపేట కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ తుమ్మ రాంబాబు,అశ్వారావుపేట మండలం తాసిల్దార్ మరియు రెవిన్యూ సిబ్బంది,నండ్రు రమేష్, రెమళ్ళ కేదర్ నాథ్,మిండా హరి బాబు, అల్లాడి రామారావు, తగరం ముత్తయ్య,చందా సతీష్,ఆకుల శ్రీను, నాగేంద్ర, జక్కుల చిన్ని,నార్లపాటి అశోక్, మధుర నవీన్,వెంకట్ రెడ్డి, తిరుపతి,కేదాసి మంగరాజు,అల్లాడి నాగరాజు,పార్టీ ముఖ్య కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,పోలీస్ సిబ్బంది మరియు మీడియా మిత్రులు పాల్గొన్నారు.


V7 FOCUS Channel is The Popular Telugu News Channel Across Telangana and Andhra Pradesh. Telugu Live News Gives 24 Hours Live News Covering Political News, Sports News, Entertainment News, Facebook Live Events, Comedy and Tollywood Movie Promotions, Free Telugu News Channel, V7 FOCUS NEWS


#mla #v7iik

#Mlaramayi

#mattadayanad

#mattaragamayi

#GayatriRavi

 #BandiparthasaradhiReddy

#vaddirajuravichandra

 #naama #NamaNageswaraRao

#KandalaUpenderReddy

#paleruMLA

#PawanKalyan

 #Chiranjeevi 

#ElectionVictory 

#JanaSena 

#FamilyReunion 

#TeluguNews 

#v7focus

#jeevanreddy 

#congress 

#telangananews 

#telanganapolitics

 #paleru

#kusumanchi #ponguletiSrinivasReddy

#TammineniKrishnaiah

#TammineniVeerabadram

#tamminenikrishnaiah

#tammineni

#kandalaupendereddy

#BRSparty

#Kcrforindia

#Cmkcr 

#ktr

#kandalaupenderreddy

#paleruMla 

#KUR 

#Trsforpaleru

#kurForpaleru

#deshkinethakcr

#palairmlaupenderreddy

#palairmla

#kandalaupenderreddjjj

#palairelections

#elections2023 

#palairelections2023

#electionsinpalair

#KCR #harishrao

#thanneruharishrao

#missionkakateeya

#KaleshwaramProject

#troubleshooter 

#financeminister

#healthminister

#telangana

1 year ago | [YT] | 4

V7 FOCUS - Telugu

#V7_focus #అశ్వారావుపేట, జులై 19:
బాధితులకు అండగా ఉంటాం..!
-ఎమ్మెల్యే జారే


• వరద సహాయక చెర్యల్లో ఎమ్మెల్యే జారే బిజీ 
• జిల్లా కలెక్టర్ జీతీష్ వి పాటిల్ మరియు ఎస్పీ రోహిత్ రాజ్ తో కలసి ప్రాజెక్ట్ ఏరియా పరిశీలనలో తోడ్పాటు
 • మండల నాయకులతో కలసి సహాయక చెర్యలు
• బాధితులకి అండగా ప్రభుత్వం ద్రుష్టి కి తీసుకు వెళ్లి న్యాయం చేస్తాననీ హామీ 
• అన్నదాన శిభిరం ఏర్పాటు చేసి స్వయంగా వడ్డీంచిన ఎమ్మెల్యే జారే 
• రోడ్డు పునరుద్దరణ పనులు చేపించి ట్రాఫిక్ క్లియర్ చేపించిన ఎమ్మెల్యే 
• పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమాన్వయం తో ప్రమాదం తప్పించినందున అభినందనల వెల్లువ 
• పేట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు రమేష్ బాబు చొరవ తో స్థానిక మరియు నారాయణపురం చుట్టు ప్రక్కల కాంగ్రెస్ నాయకుల సహకారం 
• వరద సహాయక చెర్యల్లో నారాయపురం మరియు గుమ్మడవల్లి ప్రాజెక్ట్ నాయకుల సహకారం మరువలేనిది ఎమ్మెల్యే జారే 


అశ్వారావుపేట, జులై 19:

అశ్వారావుపేట మండలం లో తుఫాన్ ప్రభావం ఎక్కువ ఉండటం తో పాటు వరద ఉదృతి కి పెద్ద వాగు ఆయకట్టు తెగడంతో ప్రాజెక్ట్ చుట్టూ ప్రక్కల గ్రామాల్లో భయాందోళనలు ఆలముకున్నాయీ,ఎటు చుసిన పంట పొలాలు ఇసుక మీటలు వేసాయీ, కొన్ని జంతుజాలాలు వరద ఉదృతికి కొట్టుకు పోయాయి, రహదారులు జల మయం అయ్యాయి, కరెంటు ఎప్పుడు వస్తుందో తెలీని పరిస్థితి, ఓ ప్రక్క మంచి నీటి కొరత అటువంటి సమయం లో  అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే స్థానికంగా అందుబాటులో ఉండి ఆగిపోయిన మరియు దెబ్బతిన్న రవణా వ్యవస్థనీ పునరుద్దరణ , అదేవిధంగా తుఫాను ప్రభావానికి దెబ్బతిన్న కరెంటు స్తంభాలను విద్యుత్ శాఖ వారితో మాట్లాడి అప్పటికప్పుడు దెబ్బతిన్న కరెంటు స్తంభాలు స్థానంలో కొత్తవాటిని వేసి కరెంటు పునరుద్దరరించేందుకు  తగిన ఏర్పాటు చేశారు.
నిర్వాసితులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి స్వయంగా ఆయనే వారికి  వడ్డించారు.
ప్రభుత్వంతో మాట్లాడి నిర్వాసితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు 
ఈరోజు ప్రాజెక్ట్ పరిశీలనకు వచ్చిన జిల్లా కలెక్టర్ జీతీష్ వి పాటిల్ కి మరియు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కి మరియు జాయింట్ కలెక్టర్ కి పూర్తి వివరాలు దగ్గరుండి వివరించి చూపించారు.
అదేవిధంగా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తో ఎన్.డి.ఆర్.ఎఫ్ దళలను సమన్వయపరుస్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా వారి  సహకారంతో వరదలు చిక్కుకున్న ప్రజలను కాపాడడంతో పాటు సహకారం అందించడం వల్ల సర్వత్ర ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి . అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వారికి తగిన  సలహాలు సూచనలు చేస్తూ ముందుండి నడిపించడంలో  సఫలీకృతం అయ్యారు.
 ఎమ్మెల్యే జారే దీనికి అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్  సీనియర్ నాయకులు రమేష్ బాబు సహకారంతో నారాయణపురం మరియు చుట్టుపక్కల గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు మరియు నాయకులు, చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజల సహకారంతో వరద సహాయక కార్యక్రమాలను వేగంగా నిర్వర్తించారు.ఈ కార్యక్రమలలో ఎమ్మెల్యే జారే తో పాటు అశ్వారావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు జూపల్లి రమేష్ బాబు, కాంగ్రెస్ యువజన నాయకులు జూపల్లి ప్రమోద్ బాబు, అశ్వారావుపేట మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ తుమ్మ రాంబాబు,అశ్వారావుపేట మండల తాసిల్దార్,నారాయణపురం డీసీసీబీ చైర్మన్ నిమ్మల పుల్లారావు, నండ్రు రమేష్, అశ్వారావుపేట డీసీసీబీ చైర్మన్ చిన్నం శెట్టి సత్యనారాయణ, మిండా హరి బాబు,సూరపనేని ఫణి, ఆకుల శీను, పసుపులేటి నరి, నాగేంద్ర,నవీన్ మధుర,జక్కుల చిన్ని,వివిధ గ్రామాల కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు వివిధ గ్రామాల గ్రామస్తులు,ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారు.
V7 FOCUS Telugu Live is a 24/7 Telugu news & Entertainment channel in Andhra Pradesh and Telangana run by Akhaya Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
V7 FOCUS Channel is The Popular Telugu News Channel Across Telangana and Andhra Pradesh. Telugu Live News Gives 24 Hours Live News Covering Political News, Sports News, Entertainment News, Facebook Live Events, Comedy and Tollywood Movie Promotions, Free Telugu News Channel, V7 FOCUS NEWS

#YuvaGalamNavaSakam
#iTDPforTDP
#YuvaGalamPadayatra
#LokeshPadayatra
#NaraLokesh
#PawanKalyan
#NaraChandrababuNaidu #NandamuriBalakrishna
#NaraLokeshForPeople
#YuvaGalamLokesh #AndhraPradesh
#Telangana #v7_focus #khammam news
#bhadradri #mlajare #ponguleti #cmrevanthreddy
#ponguleti #batti #breakingnews

1 year ago | [YT] | 4

V7 FOCUS - Telugu

https://youtu.be/EEWHNzdwRzA?si=nxBBq...

#V7focus Pawan Kalyan: చిరంజీవి ఇంటికి 'తమ్ముడు'... 'అన్నయ్య'కు పాదాభివందనం చేసిన పవన్ కల్యాణ్.. 

06-06-2024 Thu 18:06 | Both States

Pawan Kalyan touches Chiranjeevi feet

ADVERTISEMENT

ఎన్డీయే సమావేశంలో పాల్గొని హైదరాబాద్ వచ్చిన పవన్ కల్యాణ్

చిరంజీవి నివాసానికి వెళ్లిన జనసేనాని

పూలవర్షంతో స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు

జనసేనానిని ఆలింగనం చేసుకున్న రామ్ చరణ్, సురేఖ, వరుణ్ తేజ్

తమ్ముడిని ఆప్యాయంగా కౌగిలించుకున్న చిరు

తల్లి, వదినలకు కూడా పాదాభివందనం చేసిన పవన్ 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అన్నయ్య చిరంజీవిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఢిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశానికి హాజరయ్యారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన జనసేనాని గురువారం మధ్యాహ్నం అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఈ విజయోత్సవంలో పాల్గొనేందుకు చిరంజీవి కుటుంబ సభ్యులు అందరూ ఆయన నివాసానికి చేరుకున్నారు.

చిరంజీవికి పాదాభివందనం చేసిన జనసేనాని

పవన్ కల్యాణ్‌ కు పూల వర్షంతో కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, వదిన సురేఖ తదితరులు ఆయనను ఆలింగనం చేసుకున్నారు. పవన్ కల్యాణ్ దంపతులకు తల్లి, వదిన హారతితో స్వాగతం పలికారు. జనసేనాని ఇంట్లోకి వెళ్లీ వెళ్లగానే తన అన్నయ్య చిరంజీవికు పాదాభివందనం చేశారు. తమ్ముడిని అప్యాయంగా పైకి లేపిన చిరంజీవి ఆలింగనం చేసుకున్నారు. ఈ సమయంలో నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో అక్కడున్న వారంతా ఒకింత భావోద్వేగంతో కూడిన ఆనందంతో నిండిపోయారు. 'డియర్ కల్యాణ్ బాబు' అంటూ కేక్‌ను కట్ చేశారు. పవన్ కల్యాణ్ ఆ తర్వాత తన తల్లి, వదిన పాదాలకు కూడా నమస్కరించారు.

1 year ago (edited) | [YT] | 3