Please Like, Share and Subscribe our Channel.


@Kavsvlogs

1 week ago | [YT] | 1

@Kavsvlogs

తిరుప్పావై 22,వ పాశురాం...!!


🌹తిరుప్పావై  22వ పాసురము🌹

🌿గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మ వద్దకు చేరి మేల్కొనమని వెనుకటి పాశురములో ప్రార్ధించారు. వేరొక గతిలేక నీకే చెందినవారమని చెప్పారు.

🌸ఈ పాశురములో తమ ను మెల్లమెల్లగా కనువిచ్చి చూడవలసిందిగా అర్ధించుచున్నారు .

        🌷22,వ పాశురాం :🌷

🌹అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన పంగమాయ్ వందు నిన్ పళ్ళికట్టిల్ కీర
శంగమ్ ఇరుప్పార్ పోల్ వందు తలై ప్పెయ్-దోమ్
కింగిణివాయ్ చ్చేయ్ద తామరై ప్పూప్పోలే
శెంగణ్ శిఱుచ్చిఱిదే యెమ్మేల్ విరయావో
తింగళుమ్ ఆదిత్తియనుమ్ ఎరుందాఱ్పోల్
అంగణ్ ఇరండుం కొండు ఎంగళ్మేల్ నోక్కుదియేల్
ఎంగళ్మేల్ శాపం ఇరింద్-ఏలోర్ ఎమ్బావాయ్ ....💐🦜🙏

🙏ఆండాళ్ తిరువడిగలే శరణం..🙏
     🙏  జై శ్రీమన్నారాయణ...🙏

           🌷అర్ధము :🌷

🌿సుందరము విశాలమగు మహా పృధ్వీ మండలము నంటాను ఏలిన రాజులు తమకంటే గొప్పవారు లేరనేది అహంకారమును వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులు గుంపులు చేరి ఉన్నట్లు ,

🌸 మేమును అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము. చిరుగంట ముఖమువలె విదియున్న తామరపువ్వులు వలె వాత్సల్యముచే ఎర్రగా నున్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరించుము.

🌿సూర్య చంద్రులిరువురు ఒక్క సారి ఆకాశమున ఉదయించునట్లు ఉండేది నీ రెండు నేత్రములతో మావైపు కటాక్షిమ్చితివా! మేము అనుభావిమ్చియే తీరాలి అనే శాపాము వంటి కర్మ మమ్ములను వీడి పోవును...

ఆండాళ్ తిరువడిగలే శరణం..

జై శ్రీమన్నారాయణ..🙏

1 week ago | [YT] | 8

@Kavsvlogs

ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది ...


1. గణనాయకాష్టకం - అన్ని విజయాలకు.

2. శివాష్టకం - శివ అనుగ్రహం..

3. ఆదిత్యహృదయం - ఆరోగ్యం , ఉద్యోగం...

4. శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది...

5. అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి....

6. కాలభైరవ అష్టకం - ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం...

7. దుర్గష్టోత్తర శతనామం - భయహరం..

8. విశ్వనాథ అష్టకం - విద్య విజయం..

9. సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం..

10. హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ...

11. విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి...

12. శివ అష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి...

13. భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి...

14. శివషడక్షరి స్తోత్రం - చేయకూడని పాప నాశనం...

15. లక్ష్మీనరసింహ స్తోత్రం - ఆపదలో సహాయం , పీడ నాశనం.

16. కృష్ణ అష్టకం - కోటి జన్మపాప నాశనం..

17. ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత..

18. శ్రీ రామరక్ష స్తోత్రం - హనుమాన్ కటాక్షం..

19. లలిత పంచరత్నం - స్త్రీ కీర్తి..

20. శ్యామాల దండకం - వాక్శుద్ధి..

21. త్రిపుర సుందరి స్తోత్రం - సర్వజ్ఞాన ప్రాప్తి..

22. శివ తాండవ స్తోత్రం - రథ గజ తురంగ ప్రాప్తి...

23. శని స్తోత్రం - శని పీడ నివారణ...

24. మహిషాసుర మర్ధిని స్తోత్రం - శత్రు నాశనం..

25. అంగారక ఋణ విమోచన స్తోత్రం - ఋణ బాధకి...

26. కార్యవీర్యార్జున స్తోత్రం - నష్ట ద్రవ్యలాభం..

27. కనకధార స్తోత్రం - కనకధారయే...

28. శ్రీ సూక్తం - ధన లాభం..

29. సూర్య కవచం - సామ్రాజ్య సిద్ది..

30. సుదర్శన మంత్రం - శత్రు నాశనం...

31. విష్ణు సహస్ర నామ స్తోత్రం - ఆశ్వమేధయాగ ఫలం...

32. రుద్రకవచం - అఖండ ఐశ్వర్య ప్రాప్తి..

33. దక్షిణ కాళీ - శని బాధలు , ఈతిబాధలు...

34. భువనేశ్వరి కవచం - మనశ్శాంతి , మానసిక బాధలకు..

35. వారాహి స్తోత్రం - పిశాచ పీడ నివారణకు...

36. దత్త స్తోత్రం - పిశాచ పీడ నివారణకు..

37. లలిత సహస్రనామం - సర్వార్థ సిద్దికి...

*నిత్యము భగవన్నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశిస్తాయి..*

1 week ago | [YT] | 0

@Kavsvlogs

మనము రోజుకు కనీసం ఒక్కసారైనా విష్ణు సహస్ర నామ పారాయణం చేదం....!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

🌿ఫలితం మీకే స్పష్టంగా తెలుస్తుంది
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ

🌸విష్ణు సహస్ర నామ స్తోత్రము పారాయణ చేసిన అశ్వ మేధ యాగం చేసినంత పుణ్యం కలుగును

🌿ఆయురారోగ్యము కలుగును, పాపములు తొలగును.
స్తోత్రము లో ప్రతి నామము అద్భుతం
మన నిత్య జీవితంలో ని అన్నీ సమస్యల కు పరిష్కరాలు ఇందులో వున్నాయి.

🌸సర్వ కార్య సిద్హి కి(27 వ శ్లోకం)
కళ్యాణ ప్రాప్తి కి (32 వ శ్లోకం)
ఉద్యోగ ప్రాప్తి కి (42 వ శ్లోకం)
దారిద్ర్య నాశనం కొరకు మరియు ధన ప్రాప్తికి ( 46 వ శ్లోకం)
ఐశ్వర్య ప్రాప్తి కి (65 వ శ్లోకం)
విద్యా ప్రాప్తి కి (80 వ శ్లోకం)
సంతాన ప్రాప్తి కి (90 వ శ్లోకం)
సర్వ రోగ నివారణకు (103 వ శ్లోకం)
పాపములు నశించుటకు (106 వ శ్లోకం)
సుఖ ప్రసవము నకు (107 వ శ్లోకం)

🌿విష్ణు సహస్ర నామము మొత్తం చదివిన తదుపరి మీకు ఇందులో కావలసిన శ్లోకం 108 సార్లు పఠించవలెను..

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

1 week ago | [YT] | 0

@Kavsvlogs

తిరుప్పావై 20,వ పాశుర‌ము...!!


🌹ముప్పత్తు మూవర్ అమరర్క్కు మున్ శెన్ఱు
కప్పం తవిర్క్కుం కలియే ! తుయిల్ ఏరాయ్
శెప్పం ఉడైయాయ్ ! తిఱలుడైయాయ్ శేత్తార్క్కు
వెప్పం కొడుక్కుం విమలా !  తుయిల్ ఎరాయ్
శెప్పన్న మెల్ - ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్
నప్పినై నంగాయ్ ! తిరువే ! తుయిలెరాయ్
ఉక్కముం తట్టొళియుం తందు ఉన్ - మణాళనై
ఇప్పోదే ఎమ్మై నీరాట్టు - ఏలోర్ ఎంబావాయ్...🌿🌸🦜

🌷తాత్పర్యము:-🌷

🌿ముప్పది మూడురకములైన దేవజాతుల వారికిన్ని ఆపదలు సంభవించుటకు ముందుగనే వెళ్ళి, వారి వారి వణుకుడు భయాన్ని తొలగించు బలాఢ్యుడా!

🌸నిదురలేవయ్యా! ఋజుస్వభావము నాశ్రితరక్షణయందు కలవాడా! గొప్ప సామర్థ్యము కలవాడా! శత్రువులకు భీతిని దుఃఖమును కలిగించు దోషదూరుడా! నిర్మలుడా! నిదురలేవవయ్యా!

🌿బంగరు భరిణ అనదగి భర్తృవిశ్లేష సహించలేని మృదుత్వముగల వక్షోజసంపదకల ఎఱ్ఱని అధరోష్ఠము కలదానా!

🌸నీళాదేవీ! ఓ పరిపూర్ణులారా! శ్రీకృష్ణానుభవఐశ్వర్యము కలదానా! మేల్కోవమ్మా! విసనికఱ్ఱను, కంచుఅద్దమును, నీ భర్తయగు శ్రీకృష్ణుని కూడా మాకొసగి, వెనువెంటనే మమ్ము స్నానమాడింపుమమ్మా!...

అని అంటుంది ఆండాళ్ ఈ 20,వ పాశురాం లో..

🙏ఆండాళ్ తిరువడిగలే శరణం🙏
     

1 week ago | [YT] | 0

@Kavsvlogs

తిరుప్పావై 19,వ పాశుర‌ము...!!

🌹 19,వ పాశురాం..

🌸ముందు పాశురములో పొడుగు జుట్టు గల నీలాదేవి ని మేల్కొల్పి . 
ఈ రోజు నీలాదేవిని మేలుకొలిపినా
ఈ పాశురములో శ్రీ కృష్ణుని,నీలాదేవిని కూడా మేలుకోల్పవలసినది గా అర్ధించుచున్నారు. 

🌸మీరులేచి వారితో మాటాలాడమని కోరుకొని నీలాదేవిని అర్ధిస్తున్నారు కాసేపు అయినా మాతో మాటాడనీ అంటున్నారు.

🌸మరి ఎలా అన్నది తెలుసుకుందాం.   నీలాదేవిని కీర్తిస్తున్నవారు ఈ పాశురములో అమ్మవారిని దర్శించ వచ్చునని పెద్దలు అంటారు

🌷పాశురము ..🌷


🎻🌹కుత్తు విళక్కెరియ కోట్టుక్కాల్ కట్టిల్మేల్
మెత్తెన్ఱ పంచ శయనత్తిన్ మేల్ ఏఱి
కొత్తలర్ పూంగురల్ నప్పిన్నై కొంగైమేల్
వైత్తు క్కిడంద మలర్ మార్బా! వాయ్ తిఱవాయ్
మైత్తడంకణ్ణినాయ్! నీ ఉన్-మణాళనై
ఎత్తనై పోదుం తుయిలెర ఒట్టాయ్ కాణ్
ఎత్తనై యేలుం పిరివాత్తగిల్లాయాల్
తత్తువమన్ఱు తగవ్-ఏలోర్ ఎంబావాయ్..🌸🦜🌿


🌷 అర్ధము  : 🌷

🌿ఒక గుత్తి దీపములు చుట్టును వేలుగుచుండగా , ఏనుగు దంతము లతో చేయబడిన కోళ్ళు గల మంచముపై నున్న, చల్లదనము, మెత్తదనము,

🌸తెల్లదనము,ఎత్తు , వెడల్పు కలిగిన పాన్పులపై ఎక్కి , గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు తలలో ముడుచుకోనిన కేశ పాశము గల నీలాదేవి యొక్క స్థనములపై తన శరీరమును ఆనుకొని పరుండి విశాలమైన వక్షస్థలము గల శ్రీ కృష్ణా నోరు తెరచి మాట్లాడు .

🌿కాటుక పెట్టికోనిన విశాలమైన కన్నులు కల ఓ నీలాదేవి ! నీవు నీ ప్రియుని ఎంతసేపు లేవనీవు?ఇంత మాత్రపు ఎడబాటుకుడా ఓర్వ లేకుండుట నీ స్వరుపమునకు,
నీ స్వభావమునకు తగదు..

1 week ago | [YT] | 0

@Kavsvlogs

తిరుప్పావై 18 వ పాశుర‌ము...!!



ఉందు మదకళిత్తన్ - ఓడాద తోళ్ వలియన్
నంద గోపాలన్ మరుమగళే ! నప్పిన్నాయ్ !

కందం కమరుం కురలి కడై తిఱవాయ్ వంద్
ఎంగుం కోరి అరైత్తన కాణ్ మాదవి*
ప్పందల్ మేల్ పల్గాల్ కుయిల్ ఇనంగళ్ కూవిన కాణ్*
పందార్ విరలి ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ
శెందామరై క్కైయాల్  శీరార్ వళై ఒలిప్ప
వందు తిఱవాయ్ మగిరింద్ - ఏలోర్ ఎంబావాయ్*...🌸🌿🦜


🌹 అర్ధ‌ము : 🌹

🌿మ‌ద‌మును స్ర‌వి౦చే ఏనుగులు గ‌ల‌వాడు ఏనుగుల‌ను తోయ‌గ‌ల‌ బ‌ల‌ము క‌ల‌వాడు ఎదురులేని భుజ‌బ‌ల‌ము క‌ల‌వాడు అయిన‌ నoద‌గోపాలుని కోడ‌లా!

🌸మoచి సువాస‌న‌ గ‌లిగిన‌ కేశ‌ములు గ‌ల‌ న‌ప్పిన్న‌ పీరాట్టీ (నీళాదేవి)
అ౦త‌టా కోళ్ళు కూస్తున్నాయి
జాజి ప౦దరి మీది కోకిల‌ల గు౦పులు మేల్కొని కూస్తున్నాయి. బ౦తిని చేతిలో ప‌ట్టుకున్న‌ ఓ అమ్మా నీ భ‌ర్త‌యైన‌ శ్రీక‌ృష్ణుని నామముల‌ను పాడుట‌కు వ‌చ్చేము.

🌿సoప‌ద‌ క‌లిగిన‌ ఎఱ్ఱ‌తామ‌ర‌ల‌వ౦టి చేతుల‌తో, నీ చేతి గాజులు ధ్వ‌ని౦చున‌ట్లు వ‌చ్చి త‌లుపు తీయుమా!....🌸🌿🦜


🌸ఇది విశేష‌మైన‌ పాశుర‌ము ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హ‌ము ఈ పాశురానుస౦ధాన‌ము
ద్వారా ల‌భిస్తు౦ద‌ని పెద్ద‌ల‌ నిర్ణ‌య‌ము

🌿భ‌గ‌వ‌ద్రామానుజులు నిత్య౦ తిరుప్పావై*
అనుస౦ధాన‌ము చేస్తూ భిక్షాట‌న‌ చేసేవారు
ఒక‌ నాడు వారు భిక్షాట‌న‌ చేస్తూ మ‌హాపూర్ణుల‌ గ‌ృహ‌ము వ‌ద్ద‌కు వ‌చ్చి

🌸ఉన్దు మ‌ద‌గ‌ళిత్త‌ పాశుర‌మును *ల్తాదాత్మ‌య‌ముతో అనుస౦దిస్తు౦డ‌గా
మ‌హాపూర్ణుల‌ కుమార్తె త‌లుపు తెర‌చి
భిక్ష‌ స‌మ‌ర్పి౦చ‌టానికి విచ్చేయ‌గా
రామానుజులు అ వ‌చ్చిన‌ది మ‌హాల‌క్ష్మిగా (నీళాదేవి) భావిoచి పాద‌న‌మ‌స్కార‌ము చేసేర‌ట‌.

🌿అoదుక‌నే వారిని తిరుప్పావై
జీయ‌ర్ గా అనాటి పెద్ద‌లు సoభోధిoచారు...

ఆండాళ్ తిరువడిగలే శరణం...

1 week ago | [YT] | 0

@Kavsvlogs

ఆదివారం & రాత్రిపూట ఉసిరికాయ ఎందుకు తినవద్దంటారో తెలుసా..!!!


🌸పూర్వం ఇళ్ళలో అందరూ కలిసి భోజనం చేసే సమయంలో భోజనంలోకి ఉసిరియాక పచ్చడి అడిగితే ఆదివారం తినకూడదు అనే వారు.

🌿ఎందుకు తినకూడదు అంటే అది అంతే అనే వారు., ఉసిరికాయ పేరు కూడా మాట్లాడనిచ్చే వారు కాదు.

🌸వారికి కూడా వివరం తెలియకపోయిన సరే తమ తల్లి తండ్రుల నుంచి వస్తున్న నియమాలని పాటించేవారు. కానీ ప్రస్తుతం కొందమంది మాత్రమే ఈ నియమాన్ని పాటిస్తున్నారు.

🌿అయితే ఆదివారం ఎందుకు ఉసిరి తినకూడదో అనే సందేహం మాత్రం చాలామంది మెదడుని తొలిచే ప్రశ్న. అందుకే ఆ నియమం లో దాగివున్న అర్ధాన్ని మీ ముందు ఉంచుతున్నాం.

🌸ఆదివారం రోజు, రాత్రి సమయంలో ఉసిరి ఎందుకు తాకకూడదు అంటే.. ఉసిరికాయలో పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది.
ఇది ప్రేగులలో ఉండే ఆమ్లాన్ని పెంచుతుంది. దాంతో రాత్రి సమయంలో తిన్న అన్నం సరిగా జీర్ణం కాదు.,

🌿అజీర్తి చేయడం వలన గుండె మంటగా ఉండటం జరుగుతుంది. అంతేకాదు ఉసిరి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అందులో ఉండే శక్తి రాత్రి పూట మనల్ని నిద్రపోకుండా చేస్తుంది.

🌸అంతేకాదు రక్త ప్రసరణ వేగంగా ఉండటంతో రాత్రి సమయంలో నిద్ర కూడా సరిగా పట్టక ఇబ్బందులు పడతాము అందుకే రాత్రి సమయంలో ఉసిరిని తినకూడదు అంటారు.

🌿ఉసిరి కాయకి ప్రత్యేకమైన గుణం ఏమిటంటే ఇందులో సూర్య శక్తి దాగి ఉంటుంది. సూర్యుడు రోజైన ఆదివారం నాడు ఉసిరికి మరింత బలం చేకూరుతుంది. అందుకే ఆదివారం నాడు ఉసిరిని కూడా దూరం పెడుతారు.

🌿(ఏకాదశి ఉపవాసం ఉండి మరుసటి రోజు అదే ఫలాని తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.....) ఇది సైన్స్ తో కూడిన దివ్య రహస్యం. ఇక శాస్త్ర ప్రమాణం కూడా చూడండ

🌷శ్లో. భానువారేదివారాత్రం సప్తమ్యాంచతథాదివా, ధాత్రీఫలంనరస్స్యా ద్యహ్యలక్ష్మీకోభవేత్సదా | వీర్యహానిర్యశోహానిః ప్రజ్ఞాహానిస్తథైవచ  భవేద్యస్మాత్తతోరాత్రౌ ధాత్రీంయత్నేనవర్జయేత్ ||

🌸ఆదివారం నాడు రాత్రింబగళ్ళు సప్తమినాడు పగటిపూట ఉసిరిక పచ్చడిని తిన్నచో అలక్ష్మీకుడగును కనుక నిషేధము.

🌿పైశ్లోకం ప్రకారం వీర్యహాని, యశోహాని, ప్రజ్ఞాహాని కూడా పొందుతారు, నిషిద్ధ దినాలలో ఉసిరిక తింటే...

1 week ago | [YT] | 0