Lakshmi panchangam

The calendar is read everyday
ప్రతిరోజు పంచాంగం చూసి చెప్పడం జరుగుతుంది ముందు రోజు ఉ.9:00 గంటలకు చెబుతాము అంటే రేపటి పంచాంగం ఈరోజు చెప్పడం జరుగుతుంది.

పండుగలు వాటి ప్రత్యేకతలు చెప్పడం జరుగుతుంది
నా పేరు లక్ష్మి గృహిణి ని

The calendar reads daily
Every day, the almanac is recited at 9:00 a.m. on the previous day, which means that tomorrow's almanac will be recited today.

Festivals are said to be special
My name is Lakshmi and I am house wife


Lakshmi panchangam

Please saport me friends
ఏదైనా తప్పు చెప్తే మీరు చెప్పండి మీరు నా గురువుగా భావించి naa తప్పుని సరిదిద్దుకుంటాను 🙏🙏
subscribe this channel
https://youtu.be/g5o2PVcfnF4?si=ihcPl...

1 day ago | [YT] | 1

Lakshmi panchangam

ఇది సాధారణ జననం కాదు.శ్రీ దత్తాత్రేయ అవతార రహస్యం//Sri Dattatreya Birth Story Telugu Trimurti avathar 👇👇
https://youtu.be/g5o2PVcfnF4?si=ihcPl...

1 day ago | [YT] | 2

Lakshmi panchangam

🔔 *స్ఫూర్తి* 🔔

నేటి వివేకానందుని జయంతి సందర్భంగా...

*●స్వామి వివేకానందుని స్పూర్తి వచనాలు●*

*◆మందలో ఉండకు ..వందలో ఉండటానికి ప్రయత్నించు.*
◆ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు.
◆కెరటం నాకు ఆదర్శం .. లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు.
◆ప్రతి మనిషికీ వ్యక్తిత్వం ఊన్నట్లే, ప్రతి దేశానికీ, జాతికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని పరిరక్షించుకోవాలి. అలా చేయనినాడు ఆ జాతి నశించిపోతుంది.
◆ఏ పనీ అల్పం కాదు. ఇష్టమైన పని లభిస్తే పరమ మూర్ఖుడు కూడా చేయగలడు. అన్ని పనులూ తనకిష్టంగా మలచుకొనేవాడే తెలివైనవాడు.
◆ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
◆కళింకిత హృదయులకు ఆధ్యాత్మిక వికాసం ఉండదు.
◆తెలివైన వారి తమ పని తామే సాధించుకోవాలి.
◆దేవునిపై నమ్మకం లేనివాడు కాదు, ఆత్మవిశ్వాసం లేనివాడే నా దృష్టిలో నాస్తికుడు.
◆జీవితం పోరాటాల,భ్రమల పరంపర.జీవిత అంతరార్ధం సుఖపడడంలో లేదు, అనుభవాల ద్వారా నేర్చుకోవడంలోనే ఇమిడి ఉంది
◆దైవభక్తి గురుభక్తిలపై అచంచల విశ్వాసం నీలో ఉన్నంత వరకూ నేకెవరూ అపకారం చేయలేరు.
◆పదిమంది యువకుల్ని నాకివ్వండి. ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను.
◆పిరికితనం మనిషిని నిర్వీర్యుడ్ని చేస్తుంది, ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది.
◆విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. అతని వికాసానికి, నడవడికకు అది ఎంతో తోడ్పడుతుంది. మనుషులను తేజోమయులను చేస్తుంది
ప్రకృతిని పరిశీలించడం ద్వారా నిజమైన విద్య లభిస్తుంది.
◆ప్రతి మనిషికీ వ్యక్తిత్వం ఊన్నట్లే, ప్రతి దేశానికీ, జాతికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని పరిరక్షించుకోవాలి. అలా చేయనినాడు ఆ జాతి నశించిపోతుంది.
◆నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించేవాణ్ని చూసి ఓటమి భయపడుతుంది.
◆మనం హీనులమని భావించుకుంటే నిజంగానే హీనులమైపోతాం.
◆మీ కంటె ఎక్కువ తెలివి, బలం, సత్యం, జ్ఞానం ఇంకొకరికి ఉంటే కోపించి చిందులు తొక్కడం అవివేకం.
◆విశ్వాసమే బలము, బలహీనతయే మరణము.
◆వేదకాలానికి తరలిపోండి.
◆సమాన భావం ఉన్న స్నేహమే కలకాలం నిలబడుతుంది.
◆సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు.
◆విశ్రాంతిగా కూర్చుని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాములే అని వేచిచూడకూడదు. వెంటనే ప్రారంభించాలి.
◆తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు. కాని వివేకి ప్రతి పనినీ తనకు నచ్చే రీతిలో మలుచుకుంటాడు. ఏ పని అల్పమైనది కాదు.
◆విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినపుడే దానికి విలువ. అనంత విజ్ఞానం సంపాదించినా అది నలుగురికీ పంచకపోతే నిష్ప్రయోజనం.
◆ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే... ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది.
◆జననం-మరణం, మంచి-చెడు, జ్ఞానం-అజ్ఞానం, వీటి మిశ్రమాన్నే మాయ అంటారు. ఈ వలలో అనంత కాలం ఆనందం కోరుకుంటూ చరించవచ్చు.
◆జీవితం పోరాటాల,భ్రమల పరంపర.జీవిత అంతరార్ధం సుఖపడడంలో లేదు, అనుభవాల ద్వారా నేర్చుకోవడంలోనే ఇమిడి ఉంది.
◆విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. అతని వికాసానికి, నడవడికకు అది ఎంతో తోడ్పడుతుంది. మనుషులను తేజోమయులను చేస్తుంది.
◆టన్ను శాస్త్రజ్ఞానం కన్నా ఔన్స్ అనుభవం గొప్పది.
డబ్బులో శక్తి లేదు. కానీ మంచితనంలో, పవిత్రతలో శక్తి ఉంటుంది.
◆చెలిమిని మించిన కలిమి లేదు, సంతృప్తిని మించిన బలిమి లేదు.
◆విద్య బాల్యానికి మాత్రమే పరిమితం కాదు. నాకున్న కొద్ది శక్తితో ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి.
◆విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినపుడే దానికి విలువ. అనంత విజ్ఞానం సంపాదించినా అది నలుగురికీ పంచకపోతే నిష్ప్రయోజనం.
◆మిణుగురు పురుగు ఉన్న కాస్త వెలుతురును, లోకానికి పంచాలని చూస్తుంది. కాబట్టి మనలో ఏ కొద్ది విజ్ఞానం ఉన్నా అది ఇతరులకు పంచినపుడే ప్రయోజనం,సార్ధకత.
◆అనాలోచితంగా తొందరపడి ఏ పని చేయరాదు. చిత్తశుద్ది, పట్టుదల, ఓర్పు ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకం. కానీ ప్రేమ ఈ మూడింటి కన్నా ఆవశ్యకం.
◆స్వార్ధం లేకుండా ఉండడమే అన్ని నీతులలోకి గొప్పనీతి. స్వార్ధంతో నిండిన ప్రతి పని గమ్యాన్ని చేరడానికి అంతరాయం కలిగిస్తుంది.
◆సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు. మంచితనం మాత్రం అభిమానాన్ని,దీవెనలను తీసుకువస్తుంది.
◆నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించేవాణ్ని చూసి ఓటమి భయపడుతుంది.
◆భిన్నత్వంలో ఏకత్వాన్ని అన్వేషించడమే విజ్ఞానం.
◆మనిషికి వెలుగునిచ్చి మనోవికాసానికి తోడ్పడేది విద్య.
◆మానవునికి అహంకారం తగదు,ఈ దుర్గుణాన్ని విడిచి వినయమనే సుగుణ సంపదను పెంచుకోవడం మేలు కలిగిస్తుంది. వినయం మనిషికి భూషణం వంటిది.
◆సహాయం అందుతుందనీ భావించేవారు మాత్రమే పని చేయ గలరు, ప్రత్యక్షంగా వారు కార్యరంగంలో ఉన్నారు గనుక.
◆దూరదృష్టితో ఆలోచించే ప్రతి వ్యక్తీ తప్పకుండా అపార్ధం చేసుకోబడతాడు.
◆ఇతరులపై ఆనుకొనిన వ్యక్తీ సత్యమనే భగవంతున్ని సేవిం లేడు.
◆పాశ్చాత్య దేశాల అద్భుతమైన జాతీయ జీవిత కట్టడాలు శీలం అనే పటిష్టమైన స్తంభాలను ఆధారం చేసుకొని నిర్మితమైనాయి.
◆నాగరికత అనే వ్యాధి ఉన్నంతవరకు పేదరికం తాండవించి తీరుతుంది. అందుకే సహాయం అవసరమై ఉంది.
◆పాశ్చాత్య ప్రపంచం ధన పిశాచాల నిరంకుశత్వానికి గురియై మూలుగుతుంది. ప్రాచ్య ప్రపంచం పురోహితుల నిరంకుశత్వంతో ఆర్తనాదం చేస్తుంది.
◆ప్రతి వ్యక్తీ దేశము మహత్వం పొందగలిగితే మూడు విషయాలు ఆవస్యకములై ఉన్నాయి.
1.సజ్జనత్వపు శక్తి గురించిన ధృడ విశ్వాసం
2.అసూయ,అనుమానాల రాహిత్యం
3.సజ్జనులుగా మెలగాలనీ,మంచి చేయాలని ప్రయత్నించే యావన్మందికి సహాయపడడం.
◆మనం బయటికిపోయి మన అనుభవాలు ఇతరుల అనుభవాలతో పోల్చి చూసుకొనక పోవడం, మన చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించకుండా ఉండడం, మన బుద్ది భ్రష్టమై పోవడానికి గొప్ప కారణం.
◆ఇతర దేశాలలో ప్రగల్భలాడేవారు చాలా మంది ఉన్నారు.కాని మతానుష్ఠాన పరులైనవారు, ఆధ్యాత్మికతను తమ జీవితాల్లో చాటి చూపిన వారిని ఇక్కడే, ఈ దేశంలో మాత్రమే చూడవచ్చు.
◆అపజయాలను లక్ష్య పెట్టకండి,అవి వాటిల్లడం సహజం, అవి జీవితానికి అందం చేకూరుస్తారు

◆అపజయాలచే నిరుత్సాహం చెందకండి. ఆదర్శాన్ని చేగొని వేయిసార్లు ప్రయత్నించండి. వేయి సార్లు ఓటమి చవిచూస్తే కూడా ఇంకోసారి ప్రయత్నించండి.
◆బలహీనతకు పరిష్కారం దానిని గురించి చింతన చెందడం కానే కాదు. బలాన్ని గురించి ఆలోచించడమే. అందుకు ప్రతిక్రియ మనుష్యులలో నిబిడీ కృతమైవున్న బలాన్ని గూర్చి వారికి బోధించండి.
◆ఆత్మవిశ్వాసాన్ని గూర్చి నేర్చి దానిని ఆచరణలో చూపించి ఉంటే, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న అనర్ధాలు,దుఃఖాలు దాదాపు మటుమాయమై పోయేవి.
◆మానవ చరిత్రనంతటినీ పరికిస్తే, ఘనకార్యాలు చేసిన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నింటికన్నా ఎక్కువగా సామర్ధ్యాన్ని ఇచ్చిన మూలశక్తి వారి ఆత్మ విశ్వాసమే అని తెలుస్తుంది. తాము ఘనులమనే విస్వాసంతో వారు జన్మించారు, ఘనులే అయ్యారు.
◆ఒక మనిషికి మరొక మనిషికీ మధ్య గల తారతమ్యం ఆత్మవిశ్వాసం ఉండడం, ఆత్మ విశ్వాసం లేకపోవడం, అనే భేదం వలన కలుగుతుందని మనం గుర్తించవచ్చు.
◆సంకల్పనశక్తి తక్కిన శక్తులన్నిటికన్నా బలవత్తరమైనది. అది సాక్షాత్తు భగవంతుని వద్ద నుండి వచ్చేది కాబట్టి దాని ముందు తక్కినదంతా వీగిపోవలసిందే.నిర్మలం,బలిష్ఠం అయిన సంకల్పం సర్వశక్తివంతమైనవి.
◆ఆత్మవిశ్వాసపరులైన కొందరు వ్యక్తుల చరిత్ర ప్రపంచ చరిత్ర. ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని బహిర్గతం చేస్తుంది.
◆స్వార్ధరాహిత్యమే విశేష లాభదాయకం. కాని దానిని అలవరచుకొనే ఓర్పు జనానికి లేదు.
◆ఇతరులకు మేలు చేయాలనే నిరంతర ప్రయత్నంచే మనలను మనం మరచి పోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలా మనలను మనము మరచిపోవడమే జీవితంలో గొప్ప గుణపాఠం.
◆అవివేకంతో మనిషి తనను తాను ఆనందమయుణ్ణిగా చేసుకోగలనని భావిస్తాడు.కాని అనేక సంవత్సరాలు కొట్టూమిట్టాడి స్వార్ధపరతను చంపుకోవడమే నిజమైన సౌఖ్యమని తన సౌఖ్యం తన చేతిలో ఉన్నదేగాని ఇతరుల చేతుల్లో లేదని గ్రహిస్తాడు.
◆జీవితమంతా ఇవ్వడమే అని తెలుసుకో. ప్రకృతే బలవంతముగా నీ చేత త్యాగం చేయిస్తుంది. కనుక ఇష్టపూర్వకంగానే ఇచ్చివేయి.
◆ఏది స్వార్ధపరమో అదే అవినీతి, స్వార్ధరహితమైనదేదో అదే నీతి.
◆పవిత్రంగా ఉంటూ ఇతరులకి మేలుచేడమే పూజలన్నింటి సారం.
దుస్థితిలో ఉన్నవారి కోసం పరితపించి సహాయానికై ఎదురు చూస్తే,అది వచ్చే తీరుతుంది.
◆ఈ జీవితం క్షణికమైనది,లోకంలోని ఆడంబరాలు క్షణ భంగురాలు.కాని ఇతరుల నిమిత్తం జీవించే వారు మాత్రమే శాశ్వతంగా జీవిస్తారు. తక్కినవారు జీవచ్ఛవాలు.
◆నాయనా! ప్రేమ ఎన్నటికి అపజయం పొందదు;నేడో,రేపో లేదా యుగాల తదనంతరమో సత్యం జయించే తీరుతుంది.ప్రేమ విజయాన్ని సాధిస్తుంది.
◆నా సోదరులారా! మనం పేదలం,అనామకులం.కాని అత్యున్నత స్థితిలోని వారికి సదా అవే పరికరాలైనాయి.
◆అసత్యం కన్నా సత్యం అనంత రెట్లు బరువైనది,మంచితనం కూడా అంతే.
◆ఈ ప్రపంచం ఒక పెద్ద గారడీశాల. మన మిచ్చటికి రావాడం మనల్ని బలిష్ఠులుగా చేసుకోవడానికే.
whatsapp.com/channel/0029Vb6sSG16GcGCb38f4Y27
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

1 day ago | [YT] | 6

Lakshmi panchangam

https://youtu.be/BfQn25FQ48Y
ఈ జన్మ ఎందుకు అపూర్వం?“This human life is a gift — use it to rise, not to fall

Human birth is not ordinary — it is a rare and divine opportunity among countless lives
please subscribe thischannel🙏

1 week ago | [YT] | 12

Lakshmi panchangam

https://youtu.be/maIntuL5hnM?si=TfYGB...
భోగి పండ్లు ఎందుకు ఇస్తారు? వెనుక ఉన్న అర్థం ఇదే!
బలి భూమికి వచ్చే రోజు | పురాణాలలో భోగి విశిష్టత
ఆధునికత పేరుతో కాలుష్యం?
భోగి వెనుక ఉన్న శాస్త్రీయత తెలుసా!
Please subscribe my channel 🔔

1 week ago | [YT] | 12

Lakshmi panchangam

అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు🙏
https://youtu.be/E7_32rimmcw

2 weeks ago | [YT] | 13

Lakshmi panchangam

Please subscribe my channel 🙏

youtube.com/@voiceSailakshmi

2 weeks ago (edited) | [YT] | 8

Lakshmi panchangam

youtube.com/@voiceSailakshmi

అందరికి నమస్కారం 🙏 నన్ను ఎంతగానో ఆదరిస్తున్నందుకు ధన్యవాదములు 🙏నేను మీ మీద నమ్మకంతో ఇంకో అడుగు ముందుకు వేస్తూ మీకు కేవలం ప్రతిరోజు పంచాంగమే కాకుండా ఆధ్యాత్మికపరమైన, ప్రోత్సాహవంతమైన, భక్తి పరమైన ఎన్నో కథలను కనువిందు చేసే చిత్రాలతో చిత్రీకరించిన వీడియోలతో మరో YouTubechannel voice of sai Lakshmi గా మీ ముందుకు వచ్చేసాను మీ ఆదరణ కొత్తగా వచ్చే channel లో videos కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదములు🙏🥰

2 weeks ago | [YT] | 5

Lakshmi panchangam

మార్గశిర మాసం ఆఖరి లక్ష్మి వారం 🙏🙏🙏
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే 🙏🙏

2 weeks ago | [YT] | 27