My Name is Vamsi ... I am a Hindu... I believe in my Hindu religion ...
I am proud to say that I am an orthodox Hindu (Sanatana Hindu) A Sanātana Hindu is a Hindu who follows the teachings of Sanātana Dharma, which is often referred to as Hinduism
DevotionalNews #DevotionalNews #Tirumala #Tirupati #TTD #God
Please share God's videos to our Hindus
I Am Sanātana Hindu
*శ్రీ కార్యసిద్ధి వినాయక సంకల్ప దీక్ష:*
దీక్షా విధానం: ఈ దీక్షను 9 మంగళవారాలు కాని, 11 మంగళవారాలు కాని, 21 మంగళవారాలు కాని చేయాలి. 9 మంగళవారాలు చేయువారు 9 ప్రదక్షణాలు, 11 మంగళవారాలు చేయువారు 11 ప్రదక్షణాలు, 21 మంగళవారాలు చేయువారు 21 ప్రదక్షణాలు చేయాలి.
ప్రారంభం చేయువిధానం:
మొదటి వారం మాత్రమే ఒక నిండు కొబ్బరికాయ (పీచు తీయనిది), ఒక కొబ్బరికాయ ( పీచు తీసినది) రెండు తీసుకుని ప్రదక్షణాలు చేసి అర్చన కాని, సంకల్పం కాని చేయించుకుని దీక్షను ప్రారంభించాలి. తర్వాత ఆ రెండు కొబ్బరికాయలను దేవస్థానం నందు ఇస్తే మీకు ఒక కొట్టిన కొబ్బరికాయను 🥥 ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రెండవ వారము నుండి కేవలం పీచు తీయని నిండు కొబ్బరికాయతో ప్రదక్షణం చేసిన తర్వాత అర్చన చేయించుకుని నిండు కొబ్బరికాయను దేవస్థానం నందు ఇస్తే మీకు ఒక కొట్టిన కొబ్బరికాయను 🥥 ఇవ్వడం జరుగుతుంది. ఇలా 9 మంగళవారాలు కాని, 11 మంగళవారాలు కాని, 21 మంగళవారాలు కాని చేయాలి. వారాలు ముగిసిన తర్వాత 10వ మంగళవారము కాని, 12వ మంగళవారం కాని, 22వ మంగళవారం కాని శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారికి అభిషేకం చేయించి దీక్ష విరమించాలి. ఒక వేళ దీక్షా సమయంలో అసౌకర్యం కలిగితే మీకు తెలిసినవారి ద్వారా కాని, బంధుమిత్రులు ద్వారా కాని నిండు కొబ్బరికాయను పంపించి అర్చన చేయించుకోవచ్చు. ఒక కుటుంబములో ఎంత మంది ఉంటే అందరూ విడివిడిగా ఒకేసారి కొబ్బరికాయలు ఇవ్వవలసిన అవసరం లేదు. అందరూ కలసి ఒకటే కొబ్బరికాయను ఇవ్వవచ్చు.
2 months ago | [YT] | 3
View 0 replies
I Am Sanātana Hindu
తిరుమల బ్రహ్మోత్సవాలలో భాగంగా దీపాల అలంకరణ
3 months ago | [YT] | 2
View 0 replies
I Am Sanātana Hindu
Om Namo Venkatesaya
18-09-2025
Total pilgrims : 68,095
Tonsures : 23,932
Hundi kanukalu : 3.70 CR
Waiting Compartments...Out side line at Sila thoranam.
Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens)... 15-20H
Tq
4 months ago | [YT] | 1
View 0 replies
I Am Sanātana Hindu
*శ్రీవారి బ్రహ్మోత్సవాలపై సమీక్ష*
*నిర్దేశిత సమయంలోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు ఈవో ఆదేశం*
తిరుమల, 2025 జూలై 10: తిరుమలలో సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేది వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ప్రణాళికలు రూపొందించి నిర్దేశిత సమయంలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి విభాగాధిపతులను ఆదేశించారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై తిరుమలలోని అన్నమయ్య భవన్ లో గురువారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టబోయే ఏర్పాట్లపై విభాగాల వారీగా సమీక్షించి పలు సూచనలు చేశారు.
*సమావేశంలోని ముఖ్యాంశాలు*
• 16-09-2025 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
• 23-09-2025 శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
• 24-09-2025 ధ్వజారోహణం.
• 28-09-2025 గరుడ వాహనం.
• 01-10-2025 రథోత్సవం.
• 02-10-2025 చక్రస్నానం.
• ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు.
• బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.
• వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలు కూడా రద్దు.
• విజిలెన్స్, పోలీసు విభాగాల సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, రోడ్ మ్యాప్ లు, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశం.
• భక్తులకు దర్శన క్యూలైన్లు, మాడ వీధుల్లోని గ్యాలరీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో విరివిగా అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశం.
• భక్తుల అవసరాలకనుగుణంగా ఇంజనీరింగ్ పనులు చేపట్టాలని ఆదేశం.
• గ్యాలరీల్లో భక్తులకు సమస్యలు తలెత్తకుండా మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు అదనపు సిబ్బందిని తీసుకోవాలని ఆదేశం.
• భక్తులను ఆకట్టుకునే విధంగా విద్యుత్ అలంకరణలు, ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆదేశం.
• శ్రీవారి సేవకులుగా యువతీ, యువకులను ఆహ్వానించి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆదేశం.
• 27-09-2025 రాత్రి 9 నుండి 29-09-2025 ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతి నిరాకరణ.
• భక్తుల రద్దీకి తగినవిధంగా లడ్డూలు నిల్వ ఉంచుకోవాలని ఆదేశం.
ఈ కార్యక్రమంలో డీఎఫ్వో శ్రీ ఫణి కుమార్ నాయుడు, ట్రాన్స్ పోర్ట్ జీఎం శ్రీ శేషారెడ్డి, సీపీఆర్వో డాక్టర్ టి.రవి, డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ భాస్కర్, శ్రీ రాజేంద్ర, శ్రీ సోమన్నారాయణ, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, టీటీడీ ఆల్ ప్రాజెక్ట్స్ ఆఫీసర్ శ్రీ రాజగోపాల్, ఈఈలు శ్రీ సుబ్రహ్మణ్యం, వేణు గోపాల్, డిఈ శ్రీ చంద్ర శేఖర్, అశ్వినీ ఆసుపత్రి సివిల్ సర్జన్ శ్రీమతి కుసుమ కుమారి, ఎస్వీబీసీ ఓఎస్డీ శ్రీ పద్మావతి, వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ జీ.ఎల్.ఎన్. శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
6 months ago | [YT] | 0
View 0 replies
I Am Sanātana Hindu
*శ్రీవాణి భక్తుల ఆరోపణలపై వివరణ*
తిరుమల, 2025 జూలై 03: గురువారం ఉదయం శ్రీవారి ఆలయం ముందు శ్రీవాణి దర్శనాలకు వచ్చిన నలుగురు భక్తులు మీడియాతో మాట్లాడుతూ శ్రీవాణి టికెట్ల జారీలో ఆలస్యమవుతోందని, మంచి గదులు కేటాయించడం లేదని ఆరోపించడం జరిగింది.
ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకు తిరుమలలో శ్రీవాణి టికెట్లు జారీ చేయడం జరుగుతోంది. అంతకంటే ఒక గంట ముందు వస్తే మాత్రమే భక్తులను కౌంటర్ వద్దకు అనుమతించడం జరుగుతోంది. అయితే సదరు భక్తులు వేకువఝామున 3.30 గంటలకు వచ్చి నిరీక్షించి, టికెట్ల కేటాయింపులో జాప్యం జరిగిందని, ఎటువంటి అన్నపానీయ సౌకర్యాలను టీటీడీ కేటాయించలేదని ఆరోపించడం సరికాదు. సాధారణంగా శ్రీవాణి టికెట్ కౌంటర్ తెరిచే సమయానికి ముందు నుండి టీ, కాఫీ, పాలు, మజ్జిగ నిరంతరం సరఫరా చేయడం జరుగుతుంది. (ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఇక్కడ జతపరచడం జరిగింది)
సాధారణంగా గురు, శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు లేకపోవడంతో అధిక సంఖ్యలో భక్తులు శ్రీవాణి దర్శనాల కొరకు వస్తుంటారు. ముందు వచ్చినవారికి ముందు అనే ప్రాతిపదికలో పరిమిత సంఖ్యలో ఉండే శ్రీవాణి టికెట్లను టీటీడీ ప్రతిరోజూ (మరుసటి రోజు శ్రీవారి దర్శనం కొరకు) కేటాయిస్తుంది.
సాధారణంగా తిరుమలలో వసతి గదులను పెద్ద మొత్తంలో సాధారణ భక్తులకు కేటాయించడం జరుగుతుంది. శ్రీవాణి భక్తులు సాధారణంగా తిరుపతి నుంచే వసతి తీసుకుని దర్శనానికి వెళ్లడం జరుగుతుంది. కానీ కొంతమంది తిరుమలలో డిమాండ్ చేస్తే అందుబాటులో ఉన్నవి మాత్రమే కేటాయించడం జరుగుతుంది.
అయితే టీబీసీ లో గదులు పొందిన భక్తులు గదులు పరిశుభ్రంగా లేవని, బొద్దింకలు ఉన్నాయని ఆరోపించడం జరిగింది.
భక్తుల ఆరోపణలు తమ దృష్టికి రాగానే టీటీడీ తిరుమలలోని సదరు భక్తులకు కేటాయించిన టీబీసీ గదుల్లోని పారిశుద్ధ్యంపై తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో గదులన్నీ పరిశుభ్రంగానే ఉన్నాయి. ఎక్కడ గాని అపరిశుభ్రత లేదా బొద్దింకలు లేవు.
తిరుమలలోని వసతి గదులు, మరుగుదొడ్లను, కంపార్ట్మెంట్లు, దర్శన క్యూలైన్లు, రోడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు టీటీడీ ఆరోగ్య విభాగం (పారిశుద్ధ్యం) ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది 24×7 విశేషంగా కృషి చేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్విరామంగా పని చేస్తుంటారు.
వాస్తవాలు ఇలా ఉండగా సదరు భక్తులు టీటీడీపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేయడం ఆక్షేపణీయం.
గతంలో ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం మేరకు టీటీడీపై అసత్య ఆరోపణలు చేస్తూ సంస్థ ప్రతిష్టను దిగజార్చే వారిపై టీటీడీ చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిస్తోంది.
ఈ సందర్భంగా తిరుమలలో ఉండే రద్దీని, పరిమిత సంఖ్యలోని వసతి గదులను దృష్టిలో పెట్టుకుని భక్తులు కూడా సంయమనంతో టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
6 months ago | [YT] | 1
View 0 replies
I Am Sanātana Hindu
Jatkas for Hindus
6 months ago (edited) | [YT] | 1
View 0 replies
I Am Sanātana Hindu
🙏🙏
6 months ago | [YT] | 2
View 0 replies
I Am Sanātana Hindu
#tirumala
6 months ago | [YT] | 2
View 0 replies
I Am Sanātana Hindu
#tirumala #devotional
6 months ago | [YT] | 6
View 0 replies
I Am Sanātana Hindu
#tirumala
6 months ago | [YT] | 2
View 0 replies
Load more