Telugu News TV is a news channel in youtube channel started for telugu language people will cover in telugu states like Andhrapradesh and Telangana. The national news will be covered at the same time. We are promising that we will publish and telecast the real news only and strictly avoided the hype news & fake news. We will not support any news content which will may effect to the any kind of Indian society.
We ware strict in build the nation with all of dignity in positive way.
Telugu News TV
ఆంధ్రప్రదేశ్ లో నూతనపార్టి ఆవిష్కరణ | గ్రామీణ వైద్యుల జాతీయపార్టి | డాక్టర్ #కొండిశెట్టి #సురేష్ బాబు
#సినిమా #దర్శకులు #పసుపులేటి #వెంకటరమణ
#pasupuleti #Venkataramana #cinedirector
#appolitics
#appoliticalnews
#newpoliticalparty
#grameenavaidhyulaparty
#newpolitics
#drkondisettysureshbabu
#telugunewstv
@TeluguNewsTV-s2k
#siffa #newcinemas
#politicalupdates
4 weeks ago (edited) | [YT] | 1
View 0 replies
Telugu News TV
ఆంధ్రప్రదేశ్ లో నూతనపార్టి ఆవిష్కరణ | గ్రామీణ వైద్యుల జాతీయపార్టి | డాక్టర్ కొండిశెట్టి సురేష్ బాబు
#appolitics
#appoliticalnews
#newpoliticalparty
#grameenavaidhyulaparty
#newpolitics
#drkondisettysureshbabu
#telugunewstv
@TeluguNewsTV-s2k
#siffa #newcinemas
#politicalupdates
4 weeks ago | [YT] | 1
View 0 replies
Telugu News TV
Today chilly market price #chilly
4 weeks ago | [YT] | 1
View 0 replies
Telugu News TV
అధికారుల పని తీరుపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి
ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం
• త్వరలో అందుబాటులోకి ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’
• పైలెట్ ప్రాజెక్టుగా అడవి తల్లి బాటకు అనుసంధానం
• సాస్కీ నిధులతో పల్లె పండగ 2.0
• క్షేత్ర స్థాయి పర్యటనలతో జల్ జీవన్ మిషన్, స్వమిత్వ పనుల పరిశీలన
• స్వచ్ఛ జలం.. గుంతలు లేని రోడ్ల నిర్మాణానికి ప్రధమ ప్రాధాన్యం
• పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి పారుదల శాఖల అధికారులతో సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలన్నదే తన ముందున్న ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెల్లడించారు. తన ప్రతి అడుగూ ఆ దిశగానే ఉంటాయని తెలిపారు. జల్ జీవన్ మిషన్, పల్లె పండగ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పక్కాగా పాటించాలని స్పష్టం చేశారు. పల్లె రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో త్వరలో సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించబోతున్నట్టు తెలిపారు. ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’ ద్వారా గ్రామీణ రోడ్ల పూర్తి సమాచారాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునే సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. సాస్కీ నిధుల సాయంతో పల్లె పండగ 2.0ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పల్లె పండగ 2.0, అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వమిత్ర పథకాలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి పారుదల శాఖ, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిధులు అందుబాటులో ఉన్నా పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అడవి తల్లిబాట, జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా తక్షణం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రతి పనిని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసేలా ఈ ప్రణాళికలు ఉండాలన్నారు. ఈ మేరకు యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సాస్కి నిధులకు అనుమతుల స్టేటస్ గురించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రివర్యులు ప్రశ్నించారు.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు సూత్రప్రాయంగా ఆమోదించారని, ఆర్థిక శాఖ నుంచి సమ్మతి రావాల్సి ఉందన్నారు. ఈ అంశంపై తక్షణం ఆర్థిక శాఖతో చర్చించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ”రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామీణ రహదారులన్నింటినీ జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టంకు అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలి. మనం ప్రయాణం చేసే మార్గంలో రోడ్డు ఉందా? లేదా? ఉంటే ఎలా ఉంది? అనే వివరాలు ప్రజల చేతిలో అందుబాటులో ఉండే వ్యవస్థను తీసుకురావాలి. అసలు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని రహదారులు ఉన్నాయి? అవి ఎలా ఉన్నాయి? అనే వివరాలు కూడా ప్రతి ఒక్కరికీ తెలియాలి. కొత్త రహదారి నిర్మిస్తే అందుకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటలోకి రావాలి.
క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని, రహదారులను మెరుగుపరచుకునేలా ఈ సాంకేతికత ఉండాలి. ఈ విధంగా జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టంను త్వరితగతిన అభివృద్ధి చేయండి. అధునాతన సాంకేతికత సాయంతో ఆ విధమైన వ్యవస్థకు రూపకల్పన చేయండి. 48 గంటల్లో అందుకు సంబంధించి ఒక స్పష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం కావాలి. ఒక వర్కింగ్ గ్రూప్ రూపొందించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందులో పొందుపరచాలి. ఈ అంశంలో అర్టీజీఎస్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలి. అడవి తల్లి బాటను పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంచుకుని ఈ సిస్టంకు అనుసంధానించండి. తద్వారా ఎప్పటికప్పుడు గిరిజన గ్రామాల్లో పనుల పరోగతిని పరిశీలించే అవకాశం కలుగుతుంది. ఏ పని చేసినా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి అన్నదే మా ఉద్దేశం.
• అడవి తల్లిబాట పట్ల అలసత్వం వద్దు
గిరిజన గ్రామాల్లో చేపట్టిన అడవి తల్లిబాట పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి కనబడడం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పక్కా ప్రణాళికతో అన్నింటినీ అధిగమించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం జన్మన్ పథకం కింద వచ్చే నిధులతోపాటు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం సాయం మొత్తం కలిపి రూ.1,158 కోట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 761 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 662 రహదారులు నిర్మించాలన్న సంకల్పంతో పనులు ప్రారంభించాం. అడవి తల్లిబాట పనులను వేగవంతం చేయండి. ఎక్కడైనా అటవీ శాఖతోగాని, ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తక్షణం పరిష్కరించుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోండి. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయికి వెళ్లి పనుల పురోగతిని పరిశీలించాలి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఏదైనా సమస్య ఉంటే దాన్ని తక్షణం పరిష్కరించి పనులు ముందుకు తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలి.
• పల్లె పండగ 2.0ని పట్టాలెక్కిద్దాం
పల్లె పండగ 2.0 కోసం సాస్కీ నిధులు వినియోగించుకోవడంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన నిధులు విడుదలయ్యేలా కృషి చేయాలి. తక్షణం పల్లె పండగ 2.0ని పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు చేయాలి. రూ.2,123 కోట్ల సాస్కీ నిధులతో పల్లెల్లో 4007 కిలోమీటర్ల మేర రహదారులు, గోకులాలు, మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలి
• త్వరలో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై దృష్టి
పల్లెల్లో ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలన్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో జల్ జీవన్ మినష్ పనులు ముందుకు తీసుకువెళ్తున్నాం. ప్రస్తుతం చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో నాణ్యతా ప్రమాణాలు పక్కాగా అమలు చేయాలి. నీటి నాణ్యత పక్కగా ఉండాలి. అదే అందరి ప్రధమ బాధ్యత కావాలి. నవంబర్ మూడో వారం నుంచి జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై దృష్టి సారించాలని నిర్ణయించాం. 17వ తేదీ తర్వాత క్షేత్ర స్థాయిలో పర్యటించి జల్ జీవన్ మిషన్ పనుల్లో పురోగతి, ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్న నీటి సరఫరా వ్యవస్థల వద్ద నీటి నాణ్యతను స్వయంగా పరిశీలన చేస్తాను. గ్రామీణ ప్రజలకు అందించే మౌలిక వసతుల్లో రోడ్లు, తాగు నీటికే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం.
• మార్చినాటికి కోటి మందికి స్వమిత్వ యాజమాన్య హక్కు పత్రాలు
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పించే స్వమిత్వ పథకం ద్వారా వచ్చే మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి ప్రాపర్టీ కార్డులు అందజేసే విధంగా ముందుకు వెళ్లాలి. స్వమిత్వ మొదటి విడత కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 613 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి 5.18 లక్షల మందికి యాజమాన్య పత్రాలు అందించేందుకు సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. రెండో విడత మరో 5,847 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేసి ఈ నెలాఖరుకి మరో 45.66 లక్షల మందికి వారి యాజమాన్య హక్కు పత్రాలు సిద్ధం చేస్తాం. డిసెంబర్ నుంచి మూడో విడత ప్రారంభించి మిగిలిన గ్రామాల్లో సర్వే పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు నిర్ధేశించాం. అందుకోసం సర్వే విభాగం గ్రామ సర్వేయర్ల సేవలను పంచాయతీరాజ్ శాఖకు కేటాయించే ఏర్పాటు చేయాలి. పంచాయతీరాజ్ శాఖ, సర్వే శాఖతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు స్వమిత్వ సర్వేను నిరంతరం పర్యవేక్షించాలి. క్షేత్ర స్థాయి పర్యటనల్లో భాగంగా స్వమిత్వ పథకం కింద నిర్వహిస్తున్న సర్వేలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రజల అభిప్రాయం సేకరిస్తాం. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీ సర్వే, గత ముఖ్యమంత్రి ఫోటోతో కూడిన పాసు పుస్తకాల కారణంగా ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. మన ప్రభుత్వంలో అలాంటి తప్పులకు తావుండదు. రీ సర్వే తర్వాత ఎవరి భూములు వారికి అప్పగిస్తూ ప్రాపర్టీ కార్డులు ఇస్తాం. రాజ ముద్రతో కూడిన కార్డులు అందిస్తాం. ఈ ప్రాపర్టీ కార్డులు వచ్చిన తర్వాత ఆయా స్థలాలు అమ్ముకునేందుకు, ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం వినియోగించుకునేందుకు అవకాశం లభిస్తుంద"న్నారు.
ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ శ్రీ కృష్ణ తేజ, సర్వే విభాగం కార్యదర్శి శ్రీ కూర్మనాథ్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన చీఫ్ ఇంజినీర్ శ్రీ బాలూ నాయక్, శ్రీమతి గాయత్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
2 months ago | [YT] | 1
View 0 replies
Telugu News TV
బెంగళూరు నివాసంలో శ్రీ వైయస్ జగన్ గారి దంపతుల దీపావళి సంబరాలు విజువల్స్
2 months ago | [YT] | 1
View 0 replies
Telugu News TV
మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు కి రాష్ట్ర బడ్జెట్ గురించి అవగాహన లేకుండా పోయిందా?
చంద్రబాబు 2019లో దిగిపోయేనాటికి రాష్ట్ర ఖజానాలో రూ.100 కోట్లు మాత్రమే ఉన్నాయి. అయినా వైయస్ జగన్ గారు సాకులు చెప్పకుండా హామీలను నెరవేర్చారు
కానీ.. చంద్రబాబు ప్రజల్ని మోసం చేయాలనే ఉద్దేశంతోనే తప్పుడు వాగ్దానాలు ఇచ్చి.. ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తున్నాడు
-ఆర్కే రోజా గారు, మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి #rkroja #rojaselvamani #jaganthegreat
#CBNFailedCM
#SadistChandraBabu
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
4 months ago | [YT] | 1
View 0 replies
Telugu News TV
వక్ఫ్ బై యూజర్ ద్వారా పేపర్లు లేకపోతే ఎన్నో ఏళ్లుగా ఉంటున్న దర్గా, మసీద్‌లను తొలగించేస్తారు. వక్ఫ్ అథారిటీ కలెక్టర్లకు ఇస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్టు వినే అధికారులు మాకేం న్యాయం చేస్తారు?
వక్ఫ్ బోర్డులో ఇతర మతస్తులు ఉండేలా చట్టం తేవడం దారుణం. వక్ఫ్ ట్రిబ్యునల్‌ను కూడా వీక్ చేసేలా బిల్లును తెచ్చారు.
ఇతర మతస్తులు కూడా వక్ఫ్‌కి దానాలు ఇస్తారు. ఈ బిల్లు ద్వారా అవి రాకుండా చేస్తున్నారు.
-హఫీజ్ ఖాన్ గారు, మాజీ ఎమ్మెల్యే
#YSRCPStandsForMuslimRights
#YSRCPForAll
9 months ago | [YT] | 0
View 0 replies
Telugu News TV
అకాల వర్షాలతో అనంతపురం, సత్యసాయి, కడప, ప్రకాశం జిల్లాల్లో ఉద్యాన రైతులు బాగా నష్టపోయారు. వారిని ఆదుకునే దిశగా చంద్రబాబుగారి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. హెక్టారుకు రూ.35,000 మేర సబ్సిడీ అందజేయడంతోపాటు సమీకృత ఉద్యానవన పంటల ప్రోత్సాహం కింద మొక్కలు తిరిగి వేసుకునేందుకు అదనంగా హెక్టారుకు రూ.75 వేలు అందజేయడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ ఉంటే వారికి అదనంగా చెల్లింపులు ఉంటాయి.
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
9 months ago | [YT] | 2
View 0 replies
Telugu News TV
నేనేదో కాల్ డేటా తీసుకున్నానని విడదల రజిని ఆరోపించారు. నాకు ఆ అవసరం లేదు. మహిళలంటే నాకు గౌరవం. 45 ఏళ్లుగా విజ్ఞాన్ విద్యాసంస్థలు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతంలో మాకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదు.
స్టోన్ క్రషర్ వారిపై కేసు పెట్టించింది, లంచాలు డిమాండ్ చేసింది మీరేనని ఐపీఎస్ ఆఫీసర్ జాషువా గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అనవసరంగా నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. ఇప్పుడు వాస్తవాలు, నిజాలు బయట పెడతాను. మీతో మాట్లాడించినవారు, మీరు సిద్ధంగా ఉండండి.
- లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ
#YCPScams
#AndhraPradesh
9 months ago | [YT] | 1
View 0 replies
Telugu News TV
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్న గారు ఎన్టీఆర్ నటించిన "దాన వీర శూర కర్ణ" సినిమాలోని సూపర్ హిట్ డైలాగ్ చెప్పి, అలరించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమ రాజు గారు.
#ChandrababuNaidu
#AndhraPradesh
@TeluguNewsTV-s2k #subscribe
9 months ago | [YT] | 1
View 0 replies
Load more