హిందూ ధర్మం వర్ధిల్లాలి Hindu Dharmam Vardhillali

హైందవ మిత్రులందరికీ నమస్కారం,

ఈ ఛానల్ ను క్రియేట్ చేయటానికి గల ప్రధానమైనటువంటి కారణం, హిందూ ధర్మానికి సంబందించిన సమాచారాన్ని అందరికి చేరేల చేయాలి అని. అంతే కాదు ఇందులో పొందుపరచే వీడియో లను వర్గీకరించి క్లుప్తంగా చెప్పాలంటే,

- పంచాంగం, జ్యోతిష్యం, వాస్తు, ప్రశ్న మరియు న్యూమరాలజీ, వంటి వాటికీ సంబందించినవి.
- దేవుని భక్తి శ్లోకాలు, వాటి ఉచ్చారణ, భజన పాటలు.
- దేవాలయాలు వాటి ప్రాముఖ్యత మరియు వాటిని సందర్శించే విధానం.
- వివిధ దోషాలు మరియు వాటికీ మంత్ర,యంత్ర, తంత్ర రూపాలలో పరిష్కారాలు.
- సన్మార్గంలో నడిపించే భక్తి కథలు.
- పురాణాలూ, మహాకావ్యాలు వంటివి యధా తధంగా అందించటం (ఎలాంటి వ్యక్తిగత అభిప్రాయాలూ జోడించకుండా).
- హిందువుల పండుగలు, వాటి విశిష్టతలు, ఆ రోజు చేయవలసిన కార్యక్రమాలు, వాటి విధివిధానాలు, అలా చేయటం వళ్ళ వచ్చే ఫలితాలు.

ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలు ఇక్కడ పొందుపరచటానికి సిద్దం చేసాం. త్వరలోనే ఇవన్నీ ఇక్కడ ప్రచురిస్తాము. ఇందులో తెలుపబడే ఏ విషయాలు ప్రకటనల ద్వారా డబ్బుని అర్జించటానికో లేక వేరే కారణం చేతనో కల్పితాలు, అసత్యాలు చెప్పటం జరుగదు. జై హింద్.


హిందూ ధర్మం వర్ధిల్లాలి Hindu Dharmam Vardhillali

_*రేపటి నుండి శ్రావణ మాసం ప్రారంభం*_
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం , సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు పండితులు. అంత గొప్ప పవిత్రమాసం ప్రారంభమైంది.

అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు , విశిష్ట పండుగలు రానున్నాయి.
సనాతన ధర్మంలో (హిందూ) చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది ఎంతో పవిత్రత కలిగినటువంటింది శ్రావణమాసం. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది.

వర్ష రుతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు , శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవేరి(భార్య) మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు , వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం , అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి.

*శివారాధనకు ఎంతో విశిష్టత*

శ్రావణమాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవదారాధనలో శివ , కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవకార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు , బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్ర వచనం.

సోమవారాల్లో శివుడి ప్రీత్యార్థాం ఈ వ్రతాన్ని (ఉపవాసదీక్షను) చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగినవారు పూర్తిగా , అలా సాధ్యంకానీ పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి.

వీటికి తోడు శ్రావణ శుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ ఒక్కోరోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేద శాస్త్రలు చెబుతున్నాయి. ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందంటున్నారు పండితులు.

*మంగళ గౌరీ వ్రతం*

శ్రావణ మాసంలో అన్ని మంగళవారల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ , మంగళగౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. ఈ వ్రతాన్ని గురించి నారధుడు సావిత్రికి , శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లి అయిన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి.

*వరలక్ష్మీ వ్రతం*

శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీ దేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం ఈ శ్లోకాని పటించాలి.

*శ్లోకం : బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం*

*పుత్ర పౌత్రాభివృద్ధించ దేహిమే రమే*
అని పటిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి. అలాగే మంత్రాలను పటిస్తూనే ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చి ఆశ్వీరాదాలు తీసుకోవాలి. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం , మంగళ్య బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి..

*శ్రవణ మాసంలోని విశిష్టతలు*
శుక్ల ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణునువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది.

*శుక్ల పక్ష పౌర్ణమి:*
శ్రావణపౌర్ణమి , రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర , సోదరీ సంబంధానికి సూచికగా రక్షబంధనం జరుపుకుంటున్నాం. అంతే కాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవిత్రధారణ , వేదభ్యాసాన్ని ప్రారంభం చేస్తారు.

కృష్ణపాడ్యమి , హయగ్రీవ జయంతి , కృష్ణపక్ష విదియ , రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య రోజులు వచ్చేవి శ్రావణమాసంలోనే. కృష్ణాష్టమి , పొలాల అమావాస్య , గోవులను పూజించడం వంటివి సైతం ఈ నెలలో రావడం ప్రత్యేకత. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు , పూజలు , వ్రతాలు , నియమాలు , తూచ తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. శ్రావణమాసం వచ్చిందంటే, పిల్లలనుండి పెద్దల వరకు ఆనందించని వారుండరు. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మికానందాన్ని కూర్చేది శ్రావణం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీ శోభతో నిండి, ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి.

ఆధ్యాత్మిక దృష్టితో చూచినప్పుడు వర్షర్తువు అనగా శ్రావణ, భాద్రపద మాసముల కాలం, వేదాధ్యయన కాలంగా చెప్పబడినది. అసలు 'శ్రావణ'మనే ఈ మాస నామమునందే వేదకాలమనే అర్ధం ఉన్నది. శ్రవణమనగా "వినుట"అని అర్థం. వేదము గ్రంధమువలె పఠనం చేసేది కాదు. విని నేర్వదగినది. దీనిని వినిపించేవాడు గురువు. విని నేర్చుకొనే వారు శిష్యుడు. ఈ వేదమునకే 'స్వాధ్యాయ'మనేది మరో నామం.

వేదాధ్యయనం చేసే వానికి మోహం తొలగి, బ్రహ్మ స్వరూపం ద్యోతకమవుతుందని రామాయణమందు చెప్పబడినది. దీనిని బట్టి శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగమునందే చెప్పబడినట్లు తెలుస్తున్నది.

స్త్రీలకూ వేదపఠనంతో సమానమైన లలితా సహస్రనామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు, మోహమును తొలగించి, సౌభాగ్యము నిచ్చేవి. అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళ గౌరీ వ్రతమును ఐదు సంవత్సరాల పాటు నిర్వర్తిస్తారు.

పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. పూర్ణిమనాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి, వారితో సోదర ప్రేమను పంచుకొంటూ, ఈ ఆనందానికి సంకేతంగా వారినుండి బహుమతులను పొండి హృదయ పూర్వకంగా ఆనందిస్తారు. "గృహిణీ గృహముచ్యతే" అని చెప్పినందున, గృహిణులు ఆనందంగా ఉంటే ఆ గృహంలోని వారందరూ ఆనందంగానే ఉంటారు. శ్రావణం ఈ విధంగా సంతోషాన్ని కలిగించేదవుతున్నది.

ఈ మాసంలోనే బహుళ అష్టమినాడు శ్రీకృష్ణుడవతరించిన రోజు. కనుక కృష్ణాష్టమీ వ్రతాచరణం ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. శ్రావణ పూర్ణిమనాడు, బ్రహ్మచారులు గాని, గృహస్థులు గాని, శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన సిద్ధికి నూతన యజ్ఞోపవీత ధారణ అనాదిగా ఆచారంగా వస్తున్నది.

ఇక కర్షకులు మెరుపులతో, గర్జనలతో కూడిన మేఘాలు వర్షధారలతో దేశమును చల్ల పరచునపుడు కృష్యాది కార్యములు నిర్విఘ్నంగా సాగగలవని, తమ మనోరథాలు నెరవేరబోతున్నాయని ఆనందిస్తారు. ఈ విధంగా శ్రావణ మాసం సర్వులకూ ఆనందాన్నిస్తుంది.

#Sravanamasa #lakshmidevi #varalakshmi #vratham #laxmi #devi

2 years ago | [YT] | 2,287

హిందూ ధర్మం వర్ధిల్లాలి Hindu Dharmam Vardhillali

_*పూరీ జగన్నాథ ఆలయం ఒక్కసారి దర్శించారో మీ జన్మ ధన్యం*_
✨✨✨✨✨✨✨✨✨✨✨

పూరీ ఒరిస్సా రాష్ట్రంలో భారతదేశంలో తూర్పు వైపు బంగాళాఖాత తీరంలో ఉన్నది. ఇది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిమీ దూరంలో ఉంది. పూరి నగరం చాలా ప్రాముఖ్యం కలిగి ఉన్నది. జగన్నాథ ఆలయాన్ని జగన్నాథ్ పూరీ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో ప్రజలు హిందూ మత తీర్ధయాత్రను పూరీను సందర్శించినప్పుడు మాత్రమే యాత్ర పూర్తి అయినదని భావిస్తారు. జగన్నాథ ఆలయం భారతదేశంలో ఉన్న దేవాలయాలల్లో ప్రముఖమైనది. ఇక్కడ రాధా , దుర్గ , లక్ష్మి , పార్వతి , సతి , మరియు కృష్ణ తో శక్తి నిలయాలు ఉన్నాయి. జగన్నాథుని యొక్క పవిత్ర భూమిగా భావిస్తారు. ప్రస్తుతం ఉన్న పూరీని ఒకప్పుడు పురుషోత్తమ పురి , పురుషోత్తమ క్షేత్ర , పురుషోత్తమ ధర్మ , నీలాచల , నీలాద్రి , శ్రీక్షేత్ర , శంఖక్షేత్ర వంటి అనేక పేర్లతో పిలేచేవారు.
మన భారతదేశంలో ఎన్నో ప్రాముఖ్యం , విశిష్టత , అద్భుతం కలిగిన దేవాలయాలు ఎన్నో వున్నాయి. అలాంటి దేవాలయాలు జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించాలని అంటుంటారు. అలాంటి మహా అద్భుత ఆలయాలలో ఎంతో ప్రసిద్ధిచెందిన పూరీ జగన్నాథ్ ఆలయం.
ఈశాన్య భారతదేశంలోని ఒడిషాలోని ఈ పూరీజగన్నాథ్ ఆలయం వుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం చేసే రథయాత్ర ఎంతో ప్రఖ్యాతమైనది. ప్రపంచ ప్రసిద్ధిచెందింది. ఈ ఆలయాన్ని 1078 సంలో పూరీలో నిర్మించారు.
ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్ళకుకట్టినట్లు చూపించే గోడలు , స్థంభాలు ఈ ఆలయానికి మరింత శోభను తీస్కోస్తాయి. అన్ని ఆలయాలలో వున్నట్లే గోపురం , దేవతలు , గంటలు , ప్రసాదం అన్నీ వున్నా ప్రతీదానికీ ఒక విశిష్టత వుంది ఇక్కడ. ఇంకా ఎన్నో అద్భుతాలు ఈ ఆలయానికున్నాయి. బహుశా అవి ప్రపంచంలో ఇంకెక్కడా వుండవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం

*గోపురం*

ప్రతి ఆలయంలో గోపురం నీడని మనం చూడొచ్చు గానీ ఈ పూరీ జగన్నాథ ఆలయంలో గోపురం నీడ కన్పించదు. పగలైనా రాత్రైనా అస్సలు కన్పించదు. ఇది దేవుడి కోరిక అంటారు కొందరు. ఆలయ గొప్పదనమని మరికొందరు అంటారు.

*రెపరెపలాడే జెండా*

ఈ ఆలయగోపురానికి పైనకట్టిన జెండాకి ఒక ప్రత్యేకతవుంది. అన్ని జెండాలలో గాలి ఎటువైపు వస్తే అటు వైపు ఎగురుతుంటాయి.కానీ ఇక్కడ గాలికి వ్యతిరేకదిశలో రెపరెపలాడుతుంటుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఆ జెండాను తరచుగా ఆలయప్రత్యేక పూజారులు మారుస్తుంటారు. ఒక వేళ మార్చడం మరిచిపోతే ఆలయాన్ని దాదాపు 18సంలు మూసివేయాలని భావిస్తారు.

*పూరీ జగన్నాధుడి రధయాత్ర*

ఈ ఆలయ ప్రత్యేకతలో రధయాత్ర ఎంతో ముఖ్యమైనది. ఈ రధయాత్రలో కూడా కొన్ని ప్రత్యేకతలు వున్నాయి. రధయాత్రకు ముందు పూరీ రాజు బంగారు చీపురుతో రథాల ముందు వూడ్చి తాళ్ళను లాగటంతో రధయాత్ర ప్రారంభమౌతుంది.

పూరీ వీధుల్లో శ్రీకృష్ణ , బలరాముల విగ్రహాలను వూరేగిస్తారు. రధం సుమారు 45 అడుగుల ఎత్తు , 35 అడుగులు వెడల్పు వుంటుంది. ఈ రధానికి సుమారు 16 చక్రాలుంటాయి. పూరీ జగన్నాధ రెండు రధాలు లాగుతారు.

మొదటి రధం దేవుళ్ళను రధం వరకు తీసుకెళుతుంది. ఆ తరవాత 3 చెక్క పడవళ్ళలో దేవతలు నది దాటాలి. అక్కడి నుంచి మరో రధం దేవుళ్ళను గుండీచ ఆలయానికి తీసుకెళుతుంది.

*రధయాత్రలోని విశిష్టత*

ప్రతీ ఏడాది జరిగే ఈ రధయాత్రలో ఒక విశిష్టత జరుగుతుంది. గుండీచ ఆలయానికి వూరేగింపు చేరుకోగానే రథం దానంతట అదే ఆగిపోతుంది. ఇది ఆలయంలో ఒక విశిష్టత. సాయంత్రం 6 గంటల తర్వాత ఆలయతలుపులు మూసేస్తారు.

*సుదర్శన చక్రం*

పూరీలో అత్యంత ప్రసిద్ధిచెందిన జగన్నాధ ఆలయం చాలా ఎత్తైనదిమీరు పూరీలో ఎక్కడ నిలబడినా గోపురం వైపు ఉన్న సుదర్శన చక్రాన్ని చూసినా అది మీ వైపు తిరిగినట్టుమిమ్మల్ని చూస్తున్నట్టు కనిపించటం ఇక్కడి ప్రత్యేకత.

*సముద్రపు అలలు*

సాధారణంగా తీర ప్రాంతాలలో గాలి సముద్రపు వైపు నుంచి భూమి వైపుకి వుంటుంది. సాయంత్రపు పూట గాలి నేలవైపు నుంచి సముద్రం వైపుకు వీస్తుంది. కానీ పూరీలో అంతా విభిన్నం.

దీనికి వ్యతిరేకంగా గాలి వీస్తుండటం ఇక్కడి ప్రత్యేకత. పూరీ జగన్నాధ ఆలయం పైన పక్షులుగానీ , విమానాలు గానీ అస్సలు వుండవు. అది ఎందుకు అనేది ఇప్పటికీ ఎవ్వరికీ అంతు చిక్కటం లేదు.

సాధారణంగా మనం సముద్రతీరాన ఆలయానికి వెళ్ళినప్పుడు మనం బయటవున్నంతసేపు సముద్రపు అలలు , వాటి శాభ్దాలు మనకు వినిపిస్తాయి. లోపలికి వెళ్ళినాకూడా ఆ శాభ్దాలు స్పష్టంగా వినిపిస్తాయి.

కానీ ఈ పూరీ జగన్నాధ ఆలయంలో అలా వుండదు. సింహద్వారం గుండా ఆలయంలో ప్రవేశిస్తూ ఒక్క అడుగు గుడి లోపలికి పెట్టగానే సముద్రంలో నుంచి వచ్చే శబ్దం ఏ మాత్రం వినిపించదు. కానీ ఎప్పుడైతే బయటకు అడుగు పెడతారో వెంటనే చాలా క్లియర్ గా వినపడుతుంది.

అయితే సాయంత్రం పూట ఈ రహస్యాన్ని అంత శ్రద్ధగా గమనించలేరు. దీనికి కారణం కూడా వుంది. ఇద్దరు దేవుళ్ళ సోదరి సుభద్రా దేవి ఆలయం లోపల ప్రశాంతత కావాలని కోరటం వల్ల ఇలా జరుగుతుందని ఆలయ పూజారులు చెప్తారు.

అంతేకానీ దీని వెనక ఎలాంటి సైంటిఫిక్ రీజన్స్ లేవని వివరిస్తారు కూడా. ఈ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారుచేసినవి. ఇక్కడ శ్రీకృష్ణుడు , సుభద్ర , బలరామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు.

*రథయాత్ర*

ప్రతి సంవత్సరం పర్యాటకులు అధిక సంఖ్యలో రథయాత్ర లేదా రథం ఫెస్టివల్ సమయంలో సందర్శిస్తారు. పండుగ సమయంలో దేవతలైన జగన్నాథ్ , బలభద్ర మరియు సుభద్రల విగ్రహాలను బాగా అలంకరించిన రథాల్లో ఉంచి గుండిచ ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చి తిరిగి జగన్నాథ ఆలయానికి తీసుకువస్తారు.

ఈ ఉత్సవము సాధారణంగా జూలై నెలలో జరుగుతుంది. ఈ ఉత్సవము పూరీ పర్యాటక క్యాలెండర్ లో అత్యంత ముఖ్యమైన ఆకర్షణగా చెప్పవచ్చు.

*ప్రత్యేకత*

ఇక్కడ దేవునికి సమర్పించే ప్రసాదం. పూరీ జగన్నాధ ఆలయంలో 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఈ ప్రసాదాలు కేవలం ఆలయ వంటశాలలో మట్టికుండలో మాత్రమే తయారు చేస్తారు. ఈ ప్రసాదాలు చేసి దేవుడికి సమర్పించే ముందు వరకు ఎలాంటి రుచి , వాసన వుండదు.

ఎప్పుడైతే దేవుడికి సమర్పిస్తారో వెంటనే ఘుమఘుమలతో పాటు రుచి కూడా వుంటుంది. మరొక ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక సంవత్సరం వరకు పాడవకుండా వుంటుందట. ఈ ప్రసాదాన్ని దాదాపు 2000మంది దగ్గర నుంచి 2 లక్షల వరకు భక్తులకు ఇవ్వొచ్చు.

ఇంకా దేవుడికి పెట్టె నైవేద్యం 7 మట్టి కుండలలో ఒకదాని పైన ఒకటి పెట్టి వండుతారు.సాధారణంగా మంట పైన వున్న కుండలోని ఆహారం మొదటగా వుడుకుతుంది. కానీ ఇక్కడ ఏడవకుండలోని ఆహారం వుడికిన తర్వాత చివరగా వున్న కుండలోని ఆహారం వుడుకుతుంది.
అదే ఇక్కడి ప్రసాదం , నైవేద్యం యొక్క ప్రత్యేకత. ఇన్ని విశేషాలు , అద్భుతాలు కలిగిన పూరీ జగన్నాథ్ ఆలయాన్ని ప్రతీ ఏడాది లక్షలమంది భక్తులు సందర్శిస్తారు. మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా ఈ అద్భుతాన్ని చూసి తరించండి. తప్పకుండా పూరీ జగన్నాధఆలయాన్ని దర్శించండి.

*పూరీ మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు*

పర్యాటకులకు పురీలో సందర్శించటానికి అనేక ఆలయాలు ఉన్నాయి. హిందువులకు పూరీ భారతదేశంలో ఉన్న ఏడు అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటిగా ఉన్నది. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత
జగన్నాథ ఆలయమే కాక చక్ర తీర్థా ఆలయం , ముసిమ ఆలయం , సునర గౌరంగ్ ఆలయం , శ్రీ లోక్నాథ్ ఆలయం , శ్రీ గుండిచ ఆలయం , అలర్నాథ్ ఆలయం మరియు బలిహర్ చండి ఆలయం మొదలైనవి హిందువులకు ముఖ్యమైన ప్రార్థనా ప్రదేశాలుఉన్నాయి.

మరోక ప్రత్యేకతగోవర్ధన మఠం వంటి మఠాలు దైవిక ఉపశమనం అందిస్తున్నాయి. బేడి హనుమాన్ టెంపుల్ కి సంబంధించిన స్థానిక పురాణము కలిగి ఉంది. పూరీ బీచ్ మరొక ముఖ్యమైన పర్యాటక ఆకర్షణ కేంద్రంగా ఉంది.

వార్షిక పూరీ బీచ్ ఫెస్టివల్ పూరీ పర్యాటకంలో ఆకర్షణగా ఉంటుంది. ఈ బీచ్ ను హిందువులు పవిత్రమైనదిగా భావిస్తారు. అంతేకాక ఈ బీచ్ సుందరమైన వీక్షణ నిజంగా మంత్రముగ్ధుణ్ణి చేస్తుంది.

ఉదయిస్తున్న సూర్యుడి చూడటం లేదా అస్తమిస్తున్న సూర్యుడి చూడటంతో తీర్థయాత్ర ముగుస్తుంది అనుకుంటున్నారా ? కానేకాదు పర్యాటకులు బలిఘి బీచ్ వద్ద కోణార్క్ సముద్ర డ్రైవ్ చేయవచ్చు. పూరీ మతసంబంధ ఆసక్తికరమైన మరొక ప్రదేశం హిందూ మత శ్మశానం స్వర్గాద్వర్ ఉంది.

పూరీ నుండి 14 కిమీ దూరంలో భారతదేశం యొక్క సాంస్కృతిక రాజధాని రఘురజ్పూర్ ఉన్నది. ఒరిస్సాలో అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన షాఖిగోపాల్ పూరీ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

నీటి ప్రేమికులు లేదా సర్ఫింగ్ ఆస్వాదించే వారికి మరొక అద్భుతమైన ఆకర్షణ కేవలం పూరీ నుండి 50 కిమీ దూరంలో సాత్పదా వద్ద ఉంది. పూరీ నుండి సాత్పదా చేరుకోవటానికి అనేక బస్సులు మరియు టాక్సీలు అందుబాటులో ఉంటాయి.

*పూరీ సందర్శించడానికి ఉత్తమ సమయం*

ఈ ప్రదేశాన్ని దర్శించడానికి ఉత్తమ సమయం జూన్ నెల నుండి మార్చి వరకు ఉంటుంది.🙏🙏🙏🙏🙏🙏🚩🕉️

Forwarded Message

2 years ago | [YT] | 3,139

హిందూ ధర్మం వర్ధిల్లాలి Hindu Dharmam Vardhillali

రేపు *నిర్జల ఏకాదశి*

ధర్మరాజు ఒకరోజు 'నిర్జల ఏకాదశి' గురించి తెలియజేయాల్సిందిగా వ్యాస మహర్షిని కోరాడు. వ్యాసుడు.. 'జేష్ఠ మాసంలోని రెండు పక్షాలలోని ఏకాదశినాడు భోజనం చేయకు, ద్వాదశినాడు స్నానాదికాలు పూర్తిచేసి బ్రాహ్మణ సంతర్పణ చేసి భోజనం చేయమ'ని చెబుతుండగానే ఈ విషయం వినిన భీముడు 'మా తల్లి కుంతి, అన్న ధర్మరాజు, ద్రౌపది, అర్జునుడు, నకుల, సహదేవులంతా కూడా ఏకాదశి నాడు ఉపవాసం చేస్తారు.

కానీ నేను మాత్రం ఆకలికి తాళలేక సంవత్సరానికొకమారే ఉపవాసం చేస్తాను. నాకు ఏ వత్రంతో స్వర్గలోక ప్రాప్తి కల్గుతుందో అటువంటి ఏకాదశిని గురించి ఉపదేశించమని ' కోరుతాడు.

వ్యాసులవారు 'ఓ! భీమసేనా! జేష్ఠమాసంలో సూర్యుడు వృషభ రాశి నుండి మిథునరాశిలోకొస్తాడు అప్పుడు శుక్ల పక్షంలోని ఏకాదశి నాడు కేవలం ఆచమనం తప్ప ఇక ఎటువంటి నీటిని (నిర్జల) తాగకుండా ఉండు. తాగావో వ్రత భంగమవుతుంది.

ఏకాదశి సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు నీటిని త్యాగం చేసి ద్వాదశినాడు స్నానాదికాలు పూర్తిచేసి, బ్రాహ్మణులకు నీటితోపాటు సువర్ణదానం చెయ్యి. తర్వాత జితేంద్రియులైన బ్రాహ్మణులతో కలసి భోజనం చెయ్యి. శ్రీమహావిష్ణువు నాతో 'ఏ మానవుడు నన్ను తలచి ఏకాదశి వ్రతం చేస్తారో వారు పాపాల నుండి విముక్తులవుతారు' అని తెలియజేశాడు.

ఏకాదశి వ్రతం చేసిన వారికి స్వర్గం ప్రాప్తిస్తుంది. ఏకాదశి రోజు ఎవరైతే నీటిని కూడా తాగకుండా వుంటారో వారికి ఒక్కొక్క ఏకాదశికి కోటి సువర్ణ ముద్రలు దానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. నిర్జల ఏకాదశినాడు చేసిన స్నానం దానం, జపం, హోమం, మొదలైనవన్నీ అక్షయమవుతాయని పండితులు అంటున్నారు.

'నిర్జల ఏకాదశి' ని విధి పూర్వకంగా చేసినవారు వైష్ణవపదమును పొందుతారు. నిర్జల ఏకాదశి నాడు అన్నం, వస్త్రం, గోవు, జలం, మంచం, కమండలం, గొడుగు దానం చేయాలి అని వ్యాసుల వారు భీమసేనునికి చెప్పారు.

2 years ago | [YT] | 10,112

హిందూ ధర్మం వర్ధిల్లాలి Hindu Dharmam Vardhillali

కేరళ రాష్ట్రంలోని 'త్రిస్సూర్' లో జరిగిన 'పూరం ఉత్సవం'. లక్షల మంది భక్తులు పాల్గొన్న అద్భుతమైన దృశ్యం : ఈ ఉత్సవాలు అనేక సంవత్సరాలుగా సాంప్రదాయబద్దంగా కొనసాగుతున్నాయి. ఆధ్యాత్మిక విషయాలు తెలియచేసే మన channel ను ప్రతీ ఒక్కరూ Subscribe చేసి ప్రోత్సహించగలరు. శుభం.

#kerala #trissur #puram #thrissure #festival #elephants

2 years ago (edited) | [YT] | 3,654

హిందూ ధర్మం వర్ధిల్లాలి Hindu Dharmam Vardhillali

భక్తుల దర్శనార్థం కెధర్నాధ్ ఆలయం నేడు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ జగద్గురు రావల్ భీమ శంకర్ గారిచే తెరువబడింది. మీలో ఎంత మంది ఇప్పటి వరకూ ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు? ఇంకా ఎంతమందికి వెళ్లాలీ అనే కోరిక ఉంది ? క్రింది కామెంట్లలో చెప్పండి. జై భోలేనాథ్.

2 years ago | [YT] | 4,573